పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Saidulu Inala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Saidulu Inala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జూన్ 2014, శుక్రవారం

Saidulu Inala కవిత

సైదులు ఐనాల //ఆత్మ విశ్వాసపు ఐకాన్// మీ ఆత్మవిశ్వాసం ముందు శిఖరం చిన్నబోయింది మీ సాహసంతో జతకట్టిన గడ్డకట్టిన చలిపులి కరిగి పాదలేపనమైంది గుండెలనిండా నింపుకున్న మీలక్ష్యం ముందర సుధీర్ఘ పయనం చిరంజీవి యైనిలిచింది -0- సంకల్పం ఎవరెస్టంతై ఓ విధ్యవతీ దేవి ఓ ప్రెమలతా అగర్వాల్ ఓ అరుణిమా సిన్ హ ఓ మాలావత్ పూర్ణ ఓ ప్రపంచ రికార్డ్ -0- మీ వెన్నుతట్టిన ఆ చేతిస్పర్శ అదురెందుకు బెదురెందుకు మునుముందుకు పదమంది వెన్నుల్లో పాకిన చలి వెన్నుతట్టిన ఆ అధికారి స్పర్శకు నిప్పును రగిల్చింది ఆహారంలో ఆహార్యాలో ఆలోచనలో శంకరన్ స్పర్శ -0- కష్టాలకెదురొడ్డి మ్రుత్యువుతో సహవాసం జారినకొద్దీ ఎక్కడం అణచిన కొద్దీ ఎదగడం అందనంతెత్తులో తలెత్తుకు బతకడం 2-11-18 ఇచ్చిన ఫలం 13-11 -0- సబ్ ప్లాన్ సగర్వంగా సన్మానించుకుంటుందిప్పుడు పాకాల తండా తనబిడ్డను చూసి ఆకాశం పట్టనంత ఆనందంలో తడిసి ముద్దవుతుంది చర్ల చూపులన్నీ మీ విజయాన్ని కలవరించాయి అందిపుచ్చుకున్న సంక్షేమ ఫలం విధ్యావ్యవస్థకు కొత్తచూపునిచ్చింది -0- ఆకలినేర్పిన కసి అందివచ్చిన అవకాశం వెన్నుతట్టిన గురుకులం కోట్ల గుండెల ఆత్మస్థైర్యం "నరత్నం అన్విశ్యతి మ్రుగ్యతే హితత్" మట్టిలో మెరిసిన రత్నాలు సర్కారీ విధ్యకు స్పూర్తినిచ్చిన సాహసయత్రకు ప్రపంచమే పాఠశాలయ్యింది సంక్షేమ గురుకుల విధ్యా ప్రయోగాలకు వెన్నుదన్నై రేపటిరోజు మాదేనంటూ గూడాలనుండి గుడెశలనుండి గుండెలోతులనుండి ఉజ్వలంగా ప్రజ్వరిల్లిన భరతమాత బిడ్డలు నేటి పాఠ్యప్రణాళికల్ని తడిపి అత్యున్నత భవిష్యత్తును మొలిపించాయి -0- కార్యచరణకు ఐకాన్ గా నిలిచిన ఐ.పి.యస్ రేపటి చరిత్రకు పురుడుపోసింది -0- సంకల్పంతో పరవళ్ళుతొక్కిన గురుకులం ఇప్పుడు ప్రపంచ చిత్రపటంపై నిలువెత్తుసంతకమై నిలిచింది -06-06-14 ( ఎవరెస్ట్ అధిరోహించిన గురుకుల చిన్నారులకు స్వాగతం పలుకుతూ ...వారి విజయం సర్కారీ విధ్యావ్యవస్థను సగర్వంగా నిలబెట్టిందని గుర్తుచేసుకుంటూ..........)

by Saidulu Inala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rQQLmb

Posted by Katta

6, మే 2014, మంగళవారం

Saidulu Inala కవిత

// సైదులు ఐనాల // నేను-మా ఇంటెనక చెట్టు సాయంత్రమైతేచాలు ఎంత సొగసరి నాట్యగత్తెవుతుందో.... మా ఇంటెనకచెట్టు జడలువిప్పుకొని మురిపించే హొయలతో నావైపే చూస్తూ అది దానివైపే చూస్తూ నేను ప్రతిరోజూ కొత్తగా... జోకొట్టే అమ్మచేయిలా అప్పుడప్పుడూ నను తాకే దాని మునివేళ్ళు ప్రయాణపు అలసటమరిచి హాయిగా అమ్మ ఒడిలో సేదతీరుతున్నట్టు అతిశీతలత నాలోకిదూరి చేస్తున్న గిలిగింతలు మత్తుగా కనురెప్పల్ని పట్టివేసింది నల్లని ఊపిరేదో ననువిడిచి తెల్లని దూదిపింజలా...అలా..అలా.... ఆవిరైపోవడంలోని రహస్యాల్ని నాచెవిలో చెప్పి మహా ౠషిలా అది ..... పలకపై అక్షరాలుదిద్దే బాలుడిలా నేను.... మెడకుచుట్టుకొని ఇంకెంతసేపూ బయటుంటావ్ మాచిన్నదాని గద్దింపుకు చూద్దునుగదా నా చుట్టూ -28.4.14

by Saidulu Inala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1serC1B

Posted by Katta

28, ఏప్రిల్ 2014, సోమవారం

Saidulu Inala కవిత

// సైదులు ఐనాల // ఆహా... తీరొక్క చెట్టు 1 చెట్టు పచ్చని చెట్టు పచ్చ పచ్చని చెట్టు ఎంత నిగర్వి ఇవ్వడాన్ని ఎంత నేర్పరితనంగా నేర్పుతుందీ నాకూ... 2 ఆహా... తీరొక్క చెట్టు జీవనయానంలో అలసిపోని సొగసరి అవనిపై పూయబడ్డ రంగురంగుల తోట ఈ అడవి 3 ఏమిటీ ఈ మహాద్బుతం చిన్నిపాదాలే మైళ్ళదూరాల్ని చేరుకుంటాయని సూక్ష్మమైన విత్తునుండి మహా వ్రుక్షం మొలిచి చూపిందికదా.... 4 అవును చెట్టు ఒక గురువు ఒక కార్యశీలి ఒక సహనశీలి ఒక సహచరి ఒక సమ్మోహిని ఒక ప్రియసఖి ఒక సహచరి 5 చెట్టు నా సర్వస్వం అసలు నేనే చెట్టును చెట్టే నేను ఎంతకాలమైందీ.... కవితలల్లుతూ ఈ అడవిల... -28.4.14

by Saidulu Inala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QV3lQz

Posted by Katta

15, ఏప్రిల్ 2014, మంగళవారం

Saidulu Inala కవిత

// ఐనాల // జై స్వీరో 1 ఇప్పుడునేను పిచ్చుకగూళ్ళ ఆణల్లో గడ్డిపూస ఆదారాన్ని మాఇంటిగుమ్మం ముందు కట్టే పాలకంకిని గిజిగాని అరుపును కోకిలమ్మ పాటను చిలకమ్మ మాటను 2 ఇప్పుడు నేను వైవిద్యంగా మాట్లాడగల్ను వైవిద్యాన్ని కాపాడనూగలను ప్రక్రుతిపరవశించే పదికోట్ల ప్రాణకోటి చిరునామాను 3 అవును నేనిప్పుడు నేచర్ క్లబ్ మెంబర్ని నిరంతర ప్రవాహిని నిండైన మనసున్నోన్ని ప్రక్రుతిపై ప్రేమపొందినోన్ని

by Saidulu Inala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iPMq8L

Posted by Katta

22, మార్చి 2014, శనివారం

Saidulu Inala కవిత

// ఐనాల // నిప్పురవ్వలు వెలిగించిన గుండెల్లో లక్ష్యాన్ని రగిల్చకుంటే రాయికూడా నిన్నెక్కిరిస్తుంది తెగించి తంతుచేయకుంటే తరాల భానిసబ్రతుకులు నీడలా నిన్నెంటాడుతుంటాయ్ సంస్కారంలేని చదువు చిల్లులుపడ్డ కుండలాంటిది త్యాగంతెల్వని జీవితానిది చిరునామాలేని ఉత్తరం గతే చుక్కానిలేని నావ చీకటినిచీల్చలేని కిరణం అడవిగాసిన వెన్నెలే..... -1- మని షి మత్తులో చిత్తుగా గమ్మత్తుగా గగనమైపోతాడు -2- అత్యాశతొ రేపటిఆశాకిరణం నేలవిడిచి సాముకుసిద్దమైది -3- మహా వ్రుక్షం విత్తు వీసమ తే -4- వసంతానికి కోయిల గొం తునిచ్చింది -5- అమ్మరొమ్ముపట్టి బిడ్డగుక్కఆపింది

by Saidulu Inala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rbiTO1

Posted by Katta

6, సెప్టెంబర్ 2012, గురువారం

సైదులు ఐనాల // పాల బుగ్గల పాప//

పెన్నులో ఇంకు వడిసేదాకా...
రాస్తూ.
రాస్తూ..
రాస్తూ...
అలా..
అలా...
అలా....
'ఏంచెక్కుతున్నావే'
వంటింట్లోంచి అమ్మ గావు కేక
వత్తి పలికుతున్న ఆ మాటలు
బూరబుగ్గలసందుల్లో చిక్కుకొనిమెలితిరుగుతున్నయ్

నవ్వులు

నవ్వులు
నవ్వులు

ఇంకు కోసం

పాప అణ్వేషణ
హ్హమ్మయ్య సిరాబుడ్డి దొరికింది

మలుగుతున్న కాగితాలు

విచ్చుకుంటున్న బొమ్మల ప్రపంచం

స్కూలుకి టైం ఐఇందే

ముడుచుకున్న పాప చేతులు


గల గలా

గల గలా
'తొందరగా స్నానం చేసి హోంవర్క్ చేసుకో'
బెడ్ రూం లో బట్టలు సర్దుతా అమ్మ ఇంకో గావు కేక

బరువుల్ని

భారం గా...
ముందేసుకొని
తలదూర్చింది
ఊహూ..
నాకేంపని ఈ ప్రపంచంతో...?
ఎడం కాలుతో గట్టిగా తన్నింది పాప
గిల గిలా కొట్టుకొని ఓ మూలన నక్కింది భూగోళం
సరే
ఈ ఒక్కసారికి

రాస్తుంది

రాస్తుంది
ఇంకా
ఇంకా
ఇంకా

తనరాతను తాను రాసుకోలేని

మనుషుల గురించి

పుట్టుకల అర్దం తెల్పే

మహా కావ్యం

అహ అహా హా


06-09-2012 

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

సైదులు ఐనాల // నాలో నేను //

బయట వర్షం
ఎప్పుడెప్పుడాని
మాబ్బాయి చూపు
వాడి చూపులో
ముప్పై ఏల్లనాటి
నా బింబం
తలుక్కున మెరిసి నా కళ్ళ లోకి ఒలికింది
ఇప్పుడు నేను నాలుగేళ్ళ పసివాడ్ని
పీజ్ నాన్నేవ్వరూ వద్దనకండి
నే బయటకు పోతా....

- 2/9/2012.

11, ఆగస్టు 2012, శనివారం

సైదులు ఐనాల.||కవిత ||

అక్షరమై మొలుద్దాం
తరగతి
ఆలోచనల
సంఘర్షణా నిలయమయినప్పుడు
భాల్యం

ఓ సున్నిత కుసుమం
మెత్తని ఇనుము
పారే శలయేరు
నిత్య నూతన పరిశోధన
తలుక్ల్కున మెరిసే మెరుపు
మానశికానందపు మనోవిజ్ఞాన దీపిక
కిండర్ గార్డెన్ లో తిరగాడే
ఓ సీతాకో చిలుక
-0-0-0-
తరగతి గది
వస్తు కర్మాగారమయినప్పుడు
బాల్యం
భారమైన భవిశ్యత్ చిత్రం
స్వేచ్చ గా గెంతే
లేగమెడలో గుదిబండ
గడ్డకట్టిన మంచుదిబ్బ
ఓ బ్యాంకు ట్రాన్ జాంక్షన్ కాగితం
అదీ కాక పోతే
ఓ నిపుణుడి చేతిలో తయారయ్యే
మానవబాంబు
-0-0-0-
ప్రియమైన
నా
పంతుల్లారా
తరగతిగది
దేశ భవిశ్యత్తును ప్రసవిస్తుంది
పురిటి నొప్పుల వేదననంతరం
మురిసిపోయే తల్లులమవుదాం
ఈ ప్రపంచం లో
ఎవ్వరూ చేయలేనిది
మనం మాత్రమే చేయగలిగేది
పలకల్ని పట్టుకున్న
చేతుల్ని ప్రేమించడం
ఆ చేతుల్లో
ఒద్దికగా అక్షరమై మొలుద్దాంరండి

'అక్షరం'
వెయ్యిమెదళ్ళకు
పదును..

*11-08-2012