నా అసలు కథ :: నా పేరు “ యుగాది “ కాని.... పలకడం చేతకాక పిలుస్తూ ఉంటారు నన్ను “ ఉగాది “ అని సంవత్సరమంతా ఒకే పనిలో మునిగిపోతాను ఒక పని ముగిసాకే ఇంకో కొత్త పని మొదలు పెడతాను ప్రతి ఏట చైత్ర శుద్ధ పాడ్యమినాడు మా ఊరెలతాను పోతూ పోతూ నా ప్రాణస్నేహితుడు “ఎండాకాలాన్ని” కుడా వెంటబెట్టుకుని మరీ వెళతాను అంతే కాదు , ప్రతి సంవత్సరం ఓ ప్రత్యేక అతిధి ని కుడా తీసుకు వెళతాను మా రాక కోసం మా ఉరుంతా ఎదురు చూస్తుంది అడుగు పెట్టగానే ఆప్యాయంగా పలకరిస్తుంది నా రాకను మా ఊరు మొదటి దినంగా పరిగనిస్తుంది మా రాకను చూసి మామిడి పూతలు నవ్వుతు ఉంటాయి ... కాయలు ఏడుస్తూ రాలిపోతూ ఉంటాయి . “ వసంతానికి ” నేనేంటే చెప్పలేని ప్రేమ .... అందుకే , అదెప్పుడూ... నేనోచ్చినప్పుడే మా ఉరోస్తుంది నా స్నేహితుడు “ ఎండాకాలాన్ని “ చూస్తూనే ఊరంతా భయపడిపోతుంది వాడి రోగాల నుంచి జాగ్రత్త పడటానికి ఊరు ఊరంతా “ పచ్చడి “ తయారీలో మునిగిపోతుంది . అందుకే పలు మార్లు చెప్తూ ఉంటా .. వాడి ధాటిని అదుపు చేసే ఆ ఉన్న కొన్ని చెట్ల నైనా కాపాడుకోమని . సంతోషమనే తీపిని పంచె బెల్లాన్ని , దుఖం అనే చేదు వేపతో కలిపి దానికి చింతపండు లాంటి నేర్పుని జోడించి , మామిడి లాంటి సహనాన్ని కలిపి తయారు చేసిన పచ్చడిని సేవిస్తూ ..... సంతోషం , దుఖం , ఓర్పు , సహనం లాంటిదే “ ఉగాది పచ్చడి “ అనీ , ఇది ప్రతి మనిషి జీవితంలో నేర్చుకునే ఓ పాఠం లాంటిది అని వారికి వారే ఉపదేశించుకుంటారు ...... అలా ఆ రోజంతా ...... అన్నల అభిప్రాయాలు వింటూ వదినల చేతి వంటకాలు తింటూ సాయంత్రం గుళ్ళో శాస్త్రి గారు చెప్పే పంచాంగం విని .... లాభమెంతా నష్టమెంతా అనే వ్యాపారపు లెక్కల్లో మునిగిపోయి మనుషుల మధ్య దురాన్ని పెంచుకుంటున్న ఈ అమాయకులను చూసి , బాధ పడాలో జాలి పడాలో అర్ధం కాక , ఇక సెలవని చెప్పి .... మా తమ్ముడు “ మర్నాడు “ రాకముందే మళ్ళి నా సొంత గూటికి వలస పక్షిలా బయలుదేరుతుంటాను కాని ఈ మొండినా కొడుకు “ ఎండాకాలం “ మాత్రం చస్తే రాడు .... వాడి బావమరది “ వర్షాకాలం “ వచ్చి తన్నే దాక ఆ ఊల్లోనే తిష్ట వేసుక్కూర్చుంటాడు . అలా మా ఉరిని , మా వాళ్ళని , సంవత్సరానికి ఓ సారి కలిసి వస్తుంటాను , కష్ట సుఖాలని పలకరిస్తుంటాను . భయం నిన్ను వెంటాడినా , ధైర్యం తో ముందుకి వెళ్లాలని , అందులో దాగి ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తూ , తీపి రోజులను ఆస్వాదించాలనే ఆశతో బ్రతుకుతూ , సరికొత్త ఆశయంతో ముందుకెల్లాలని కలిసిన వారందరికీ సలహా ఇస్తుంటాను అందుకే , వారికి ఈ “ ఉగాది “ అంటే చాల “ ఇష్టం “ మరియు “ గౌరవం “ కుడా ....... ఈ సారి మా ఉరు వెళ్ళేటప్పుడు .... ప్రత్యేక అతిధి గా “ జయ నామ “ సంవత్సారాన్ని వెంటబెట్టుకు వెళ్తున్నా , వాడి మాట వింటేనే ప్రపంచాన్ని గెలిచినంతగా ఆనందపడిపోతారు ....ఇంక వాడిని నేరుగా చూసారంటే చాల సంతోషిస్తారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను , మీ అందరికి “ నా ఉగాది శుభాకాంక్షలు “ kAlluRi
by Rajender Kalluri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSP7WA
Posted by Katta
by Rajender Kalluri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSP7WA
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి