పిడికెడు అన్నం, రొట్టిముక్కా... కొన్ని కొడవళ్లని, కొన్ని నాగళ్లని కొన్ని పొలాలని, కొన్ని గ్రామాలని కొన్ని గుడిశెల్ని, కొన్ని మేడల్ని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్కా కడుపులో దాచుకున్నాయి కొన్ని పిడికిళ్లని, కొన్ని నినాదాల్ని కొన్ని పోలింగ్‍బూత్‍లని, కొన్ని తుపాకుల్ని కొన్ని అణుబాంబుల్ని, కొన్ని అడవుల్ని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్కా కడుపులో దాచుకున్నాయి కొంత రక్తాన్ని, కొంత క్రూరత్వాన్ని కొంత ద్వేషాన్ని, కొంత కారుణ్యాన్ని కొంత చీకటిని, కొంత కాంతిని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్కా కడుపులో దాచుకున్నాయి కొన్ని ప్రవాహాల నీటిని కొన్ని కార్చిచ్చుల అగ్నిని కొన్ని శ్వాసల ప్రాణవాయువుల్ని కొన్ని దృశ్యాలని, కొంత నిద్రని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్క కడుపులో దాచుకున్నాయి కొన్ని కలల్ని, కొన్ని కోరికల్ని కొంత సంతోషాన్ని, కొంత దు:ఖాన్ని కొన్ని రోజుల్ని కొన్ని శబ్దాలని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్క కడుపులో దాచుకున్నాయి కొందరు అమ్మల్ని, కొందరు నాన్నల్ని కొందరు పూర్వికుల్ని, కొందరు నరుల్ని కొందరు గ్రామ దేవతల్ని, కొందరు కులదేవతల్ని, కొన్ని వర్షాలని, కొన్ని యజ్ఞాలని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్క కడుపులో దాచుకున్నాయి మరకల్లేని మనసులతో సృష్టికర్త ప్రసాదంగా పిడికెడు అన్నం, చిన్న రొట్టి ముక్కా ఇచ్చినా పుచ్చుకున్నా, కాలం కొమ్మలు చాచి కాలిబాటనిండా పూల వనాల నీడల్ని అనుగ్రహించదా? కాలం చేయెత్తి దీవించి మానవీయ జీవితానికి దివ్యసుగంధాలు అనుగ్రహించదా? - వసీరా
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hnvQ2S
Posted by Katta
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hnvQ2S
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి