పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Jagannadh Velidimalla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jagannadh Velidimalla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జులై 2012, శుక్రవారం

విసురజ కవిత || "ఎద రోదన" ||

ఎద రొదతో సతమతమయ్యెగ మదిలో
మనసులోనున్నది చెలికి చెప్పలేకను
భయంమయ్యేగ నా గుండెలో..
తనతో చెప్పిన పిమ్మట ఏమగునోనని
పలకరింపు పులకరింపుగ పల్లవించున
లేక వికటించున జలదరింపై విసిగించున
మరులుకోల్పు ఊసులన్ని
మల్లెపూలై వికసించున
చిరాకుతో మోము వడిలిపోవున
వాడిపోయిన మందారమల్లే కనిపించున
చాలా ఉత్తరాలు నీకై రాసివుంచిన
అంపడానికి ధైర్యం లేకపోయే
నేరుగ నీ కళ్ళలోకి చూస్తు
హృదిమదిఘోష చెప్పలేనాయే
సఖి నా మౌనగానం తెలుసుకో
నా నిశీధిలోకొచ్చిన ఉషస్సువి నీవు
చెలి నీ మమతలపల్లకి ఎక్కించుకొ
నీ మనసువీధిలో ముత్యాల రంగవల్లి నేనవుతా.
*26-07-2012