మొదటి ప్రపంచ యుద్దం. మొదటి ప్రపంచ యుద్దం. మారణ హోమం. ఈ రెండు పదాలకీ పెద్ద తేడా లేదు అనిపిస్తుంది. ఫ్రాంకో-ప్రశ్శ్యన్ యుద్దం తర్వాత ఇరోపా లోని గొప్ప శక్తులుగా పిలవబడే: ఫ్రాన్స్, జర్మని, రష్యా, ఇంగ్లాండ్, ఆస్ట్రియ-హంగెరి ఒకరినిఒకరు ప్రత్యక్షంగా ఎదుర్కోకుండ ద్వేషించుకోవటం మొదలుపెట్టారు.వాటి చుట్టూ రక్షన వలయాలు లాంటి సంబంధాలు ఎర్పరుచుకుని వారి వలసల(కాలనీల) ఆస్తుల గురించి, పడిపొయిన ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ఎలా పంచుకొవాలి అన్న విషయం గురించి వాదించుకోవటం మొదలెట్టారు. అప్పటికే ఆస్ట్రియా రష్య మద్యలొ గొడవలు ఉండేవి. ఫ్రన్స్-జర్మని మద్యలొ పరస్పర అపనమ్మకాలు ఉండటం. ఫ్రన్శ్ బ్రిటీష్ వాల్లకి చారిత్రాత్మకంగా శత్రువు కావటం. పెరుగుతున్న జర్మన్ సైన్యం చూసి బ్రిటీష్ వాల్లు అప్రమత్తం అవ్వటం అన్ని అవంతకవె జరిగిపొయాయి. ఈ సమయంలో యుద్దం చెసుకొవటానికి ఒక కారనం కొసం ఎదురుచూస్తున్నప్పుడు సెర్బియ కి చందిన ఆర్చుడ్యుక్ ఫ్రాంజ్ ఫెర్డినండ్, సరజివో అన్న ప్రాంతంలో, 1914 వేసవిలో చంపవెయబడ్డాడు. ఆస్ట్రియ సర్బియ పై యుద్దం ప్రకటించింది. దాంతో పాత కొపాలను గుర్తు తెచుకొని ఇరొపా లోని గొప్ప శక్తులన్ని రెండు గా చీలిపొయ్యి, యుద్దాలు ప్రకటించుకున్నాయ్. జపాన్, బల్గేరియ, గ్రీస్, పొర్చ్యుగల్ , యునైటెడ్ స్టేట్స్ మెల్లిగా యుద్దం లొకి అడుగుపెట్టాయి. టెక్నాలజి అభివృద్ది చెందటం, కొత్త ఆయుధాలు కనుగొనటం ఇవన్నీ ఈ యుద్దాన్ని ఒక భయంకర వేదిక పై నిలబెట్టాయి. ఎన్నో రోజులు యుద్దాలు జరగటం తో యుద్దానికి వెల్లిన సైనుకులు వివిధ అంటురోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. విష వాయువు, యుద్ద-టాంకులు, ఆకాశపు యుద్దాలు, విస్ఫొటక పదార్థాలూ మానవ జీవనాన్ని అల్లకల్లోలం చేసాయి. వర్డన్ లో 315,200 ఫ్రెంచు సైనుకులు, 280,000 జర్మన్ సైనుకులు ప్రాణాలు కోల్పోయారు. సొమ్మీ లో బ్రిటీష్, జర్మన్ సైనుకులు కలిపి మొత్తం 800,000 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు సంవత్సరాలు అలుపెరుగకుండా రక్తపు కాలువలు పారాయి. చివరికి తన మాత్రుభూమి లో కుడా విప్లవ శక్తులు నిద్రలేవటం, యుద్దం లో ఎందరో సైనుకులని కోల్పోవటం చేత, ఇంక ఎలాగో ఓడిపోతాం అని అనుకున్న జర్మన్ నాయకులు, లొంగిపోయారు. మొత్తం కోటి మంది ప్రానాలు పొట్టనపెట్టుకున్న ఈ యుద్దం 1918 లో నవంబర్ లో ఒక కొలిక్కి వొచ్చింది. జర్మన్య్, ఆస్ట్రియ-హంగేరి సర్వ నాశనం అయ్యాయి. ఎడ్వర్ద్ థామస్ (1878-1917) వెల్ష్ రచయిత. పందొమ్మిదేల్ల వయసుల తొలి పుస్తకం ప్రచురితమయ్యింది. కాని ముప్పైఆరు సంవత్సరాల వయసు వరకూ రాబర్ట్ ఫ్రాస్ట్ తనను రాయమని ప్రోత్సహించే వరకు అరకొరగా కవిత్వం రాసాడు. గొప్ప కవి గా పేరుతెచ్చుకున్నాడు. 1917, ఈస్టర్ సండే రోజు ఈయనను చంపేసారు. 1920 వరకు థామస్ కవితల పుస్తకం బయటకి రాలేదు. థామస్ ఈ కవితలో, యుద్దం తనవారందరినీ తనకు దూరం చేసి, చావుకు దెగ్గర చేయటం వల్ల కలిగిన బావోద్వేగం గురించి చెప్తాడు. వర్షం నా పై, నా అమానుష గుడిసె పై, నా ఏకాంతం పై వర్హం, అర్ధరాతి వర్షం, కౄర వర్షం నేను చచ్చిపోతాను అని గుర్తుకుచేస్తూ అప్పుడు వర్షాన్ని వినలేను అని, నేను ఈ ఏకాంతంలో పుట్టినప్పటికంటే శుబ్రంగా నన్ను కడిగినందుకు దానికి క్రుతజ్ఞత చెప్పలేను అని, నేను చచ్చిపోతాను అని గుర్తుకుచేస్తూ. ఇక్కడ కుర్చోని ప్రార్థిస్తున్నాను ఇప్పటివరకు నా చేత ప్రేమింపబడిన ఎవ్వరూ నాలా మేలుకోని , చావుకోసం వేచి చూస్తూ , ఒంటరిగా, వర్షాన్ని వింటూ, బాధ తోనో, జాలి తోనో చావూబ్రతుకుల మధ్యలో నిస్సహాయంగా విరిగిపోయిన వేనువుల మధ్య పారే చల్లటి నీరులా, ప్రపంచంలోని అన్ని ప్రేమలు కరిగించేసి కేవలం చావుపై ప్రేమను నాలో నింపిన వానలో తడుస్తూ, ఉండకూడదు అని. ఓ హింసాత్మక తుఫాను, ఇది నిజమేనా ప్రేమ ఎప్పుడు ఖచ్చితంగానే ఉంటుందా, ప్రేమలో ఆశాభంగం ఉండదా? గీయుం అపాలినైర్ (1880-1918) ఫ్రాన్స్ లో పెరిగాడు. అపాలినైర్ తొందరగానే ఒక అభ్యుదయ కలలను కాపాడే పడ్డాడు. "సర్రియలిసం" అన్న పదాన్ని మొట్ట మొదటి సారి వాడిన కవి. 1916 మార్చ్ లో యుద్దంలో గాయాలబారిన పడి అవస్తపడ్డాడు. 1918 లో ఇంఫ్లుఎంజ అంటురోగం రావటంతో కనుమూసాడు. వీడుకోలు ఈ చిట్టి మొక్కలన్నిటినీ సమూహపరిచాను నీకు గుర్తుకుందా, ఆకురాలే కాలం చనిపోయింది ఈ భూమి పై, ఒకరినిఒకరం ఇంక కలుసుకోలేము సమయపు సువాసనా, ఓ చిట్టి మొక్క- నేను మిమ్మల్ని ఎప్పటికీ గుర్తించుకుంటాను. పోస్ట్ కార్డ్ నేను ఈ గుడారం లోంచి రాస్తున్నాను ఎండా కాలపు రోజు నీడ అయ్యే సమయంలో ఉనికి వాదిపోవు ముందు కాల్పులు-ఎదురుకాల్పుల మద్యలో లేత నీలం రంగు ఖగోలంలో అకస్మికంగా పూలు వికసించాయి. గాట్ఫ్రైడ్ బేన్ (1885-1956) జర్మన్ భావప్రకటనవాద కవి (Expressionist). సామ్యవాద వ్యతిరేకి. నాజీలు 1933 పదవిలోకి వొచ్చినప్పుడు చాల సంబరపడ్డాడు. కాని తిరిగి తన తప్పును తెలుసుకొని చాల ప్రాయశ్చిత్తపడ్డాదు. నాజీ ప్రభుత్వం ఈయనపై అపనమ్మకం పెంచుకుంది. 1943 వరకు ఇతని రాతలని బహిష్కరించింది. బ్రెక్ట్ తర్వాత చాల పేరుగాంచిన జర్మన్ కవి, బేన్. 1956 లొ చనిపోయారు. ఆపద తెలుసుకో, నేను కౄరమైన రోజులు గడిపాను, నేను ప్రవహించే సమయాన్ని. రాత్రి నా కనురెప్పలు ఆకాశం-అడవి లా మూసుకుంటాయి, నా ప్రేమకు కొన్ని పదాలే తెలుసు: నీ రక్తంలో ఉన్నది నాకు ఇష్టం. జార్గ్ ట్రక్ల్ (1887-1914) అద్భుతమైన కవి. యుద్దం ముందు రిల్క్ తో సమానమంగా రాసిన కవి. 1914 లో ఆస్ట్రియన్ సైన్యంలో మందుల వ్యాపారి గా పని చేసాడు. గ్రడెక్ లో ఆస్ట్రియ ఓడిపొయ్యినప్పుడు థొంబై మంది గాయపడినవారిని చూసుకోవటానికి అతన్ని నియమించారు. గాయాల నొప్పి తట్టుకోలేక తన కల్ల ముందరే ఆత్మహత్య చేసుకోవటం చూసాడు. ఇవన్నీ చూసి తనే ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించాడు. చివరికి ఆయన్ను పిచ్చీఅస్పత్తిరిలో చేర్పించారు. అక్కడ కుడ కొకైనె ని ఎక్కువ మోతాదుల్లో ఎక్కించుకొని, ప్రాణాలు కోల్పోయాడు. రాత్రితో శ్రుంగారం నక్షత్రాల కుటీరం కింద, ఓ ఒంటరి మనిషి అర్ధరాత్రి నిశబ్ధంలో నడుస్తాడు. కలల నుండి ఒక పిల్లాడు కలతగా నిద్రలేస్తాడు బూడిద రంగు మొహం చంద్రబింబంలో వ్యర్థమవుతున్నప్పుడు. కడ్డీల కిటికీ వెనకాల మతిస్థిమితంలేని మహిల జుట్టు విరబోసుకొని ఏడుస్తోంది. వారి అందమైన ప్రయానాన్ని కొనసాగిస్తూ సరస్సుపై ప్రేమికులు తేలుతుంటారు. మధువు తాగుతూ బలహీనపడుతున్న హంతకుడు నవ్వుతాడు, బాధపడుతున్న వారిని చావు భయపెడ్తుంది. శిలువపై రక్షకుని వేదన ముందు దెబ్బలు తగిలి, నగ్నంగా ఒక సన్యాసిని ప్రార్థిస్తుంది ఒక తల్లి నిద్రలో ప్రేమగా పాటపాడుతుంటే సంతృప్తికరంగా రాత్రిని చూస్తూ బిడ్డ దాన్ని వింటూ ఉంటుంది. వేశ్యగౄహం నుండి నవ్వులు మెల్లిగా ఆగిపోతాయి. కింద, ఒక వీధి లో, పూటకూళ్ల ఇల్లు పక్కన, వీధి దీపం వెలుగులో చనిపోయిన వాల్లు వారి తెల్ల చేతులతో గోడలకు నీషబ్ధ రంగు వేస్తారు. నిద్రపొయ్యే వారు ఇంకా గొణుగుతూనే ఉంటారు గ్రడెక్ (Trakl's last poem) గ్రీష్మ ౠతువు సాయంత్రం,మారణాయుధాలతో అడవులు ధ్వనిస్తాయి, సూర్యుడు బాధతో కిందకు జారిపోతాడు సువర్న పల్లాల పై, నీలం రంగు సరస్సుల పై. రాత్రి చనిపోతున్న వీరులను, వారి విరిగిపోయిన బాధల పాటలనీ దెగ్గరకు తీసుకొని ఓదారుస్తుంది. కోపంతో రగిలిపోతున్న దేవుడు అయిన చల్లటి చంద్రుడు జీవించే మైదానం పై నిషబ్ధంగా సమూహమైతాయ్,ఎర్రటి మేఘాలు. అన్నీ దారులూ చీకటిలో క్రుల్లిపోతాయి. బంగారపు కొమ్మలున్న రాత్రి కింద, ఒక సోదరి నీడ కుంటుకుంటూ వస్తుంది, వీరుల ఆత్మలని, వారి రక్తపు తలలనీ పలకరించటానికి, ఇంకా గ్రీష్మ ౠతువు యొక్క చీకటి వేణువు పాడుతూనే ఉంది. ఓ సగర్వ దుఖమా, ఈ రోజు ఆత్మయొక్క వేది అగ్నికి ఒక కొత్త నొప్పి తెలిసింది- తన మనవల్లు ఇంకా పుట్టలేదని. .
by Si Rafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qersXj
Posted by
Katta