పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, మార్చి 2014, శనివారం

Abd Wahed కవిత

సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ’’ప్రేయసితో సంభాషణ‘‘ అన్నఅర్ధానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. ఐదవ విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఇప్పటికి ఇరవై షేర్లు అయ్యాయి. పదహారవ షేర్గా రాసిన రెండో మత్లాను మళ్ళీ పోస్టు చేస్తున్నాను. మత్లాతో కలిపి చదివితేనే గజల్ అందం. గజల్లో ప్రతి షేర్ దానికదే స్వతంత్రంగా ఉంటుంది, కాబట్టి ఇలా ఒక యాభై లేదా వంద వరకు షేర్లు రాయాలన్నది ఆలోచన. ఈ ప్రయత్నం ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. ప్రతిమాట తేటతెనుగు తీయదనము లాగున్నది ప్రతి శ్వాస సన్నజాజి పూలవనము లాగున్నది తాకినంత పులకరించె తోటలోని పూలన్నీ పూల చెండు లాంటి చేతి లాలిత్యము లాగున్నది మెరుపుతీగ భుజాలపై వాలుతున్న నీలికురులు పూలసజ్జపై తుమ్మెద ఝుంకారము లాగున్నది కనుపాపల తెరలపైన వాలుతున్న నగుమోమూ కనుచూపే గీసుకున్న దియ చిత్రము లాగున్నది నాజూగ్గా పెదవి విరుపు, కవ్వించే కంటినవ్వు ఎడారిలో ఒయాసిస్సు పలకరింపు లాగున్నది కలువరేకు పాదాలను చూపులతో ముద్దాడితె కావ్యకన్య చరణాలకు నమస్సుమము లాగున్నది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iKZcrQ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి