పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, ఏప్రిల్ 2014, సోమవారం

Mothi Mohanaranga కవిత

..,...మోతి మోహనరంగా...//// స్వేచ్చ.... కోడి కాళ్ళకు తాడు కట్టి,దానా వేసేది బలిచెయ్యడానికే... విహరి0చాలనే కోరికను హరి0చేస్తు0టే విరహం కాకపోతే ఎ0టి బానిస ఎవరు,నువ్వు నేను భూమి ఆకాశాలను దాటలేక బయిటికెళ్ళతే నాటు తుపాకులు ఎక్కడ దాడి చేస్తాయోనని బందిస్తున్నారు అ0తేనా... ప్రమేయం లేకు0డా ప్రపంచం కి0ద బానిసలం పుట్టి0చిన వాళ్ళ దెగ్గర బానిసలమైతే బ్రతుకె0దుకు బ్రతకడానికి భయం నేర్పిస్తు0టే బ్రతికేదె0కు స్వేచ్చలేన్నప్పుడు గాలి నీరు అ0దం వ్వర్ధమే కదా. రక్షణా కవచాలు సిలుమ్ పట్టి రాలిపోయాక మాకు రక్షణ ఎవరు. 28-04-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S2hZq8

Posted by Katta

Ramakanth Vengala కవిత

సామీప్యత-సారూప్యత ------------------------------ ఆశల అంచున నిల్చుని వెక్కిరించే.. అందని స్వప్నం! కాసులు అందక నలిగిన గుండె .. చిందించిన రక్తం !! ఒకటి. .ప్రేమను ప్రేరేపించే అందాల అరుంధతీ నక్షత్రం ! ఇంకోటి. .పేగులు కబళించే ఆకలిమంటల నగ్నత్వం!! కఠిన హృదయాన్ని కాంక్షించే కన్నుల్లో.. మొదటిది ! కటిక దరిద్రుని సిరా ధమనుల్లో .. రెండోది!! ప్రేమను గుర్తించలేని .. నిశ్చల శిల వెంట స్వాప్నికుడు! శ్రమ విలువ వెతుక్కుంటూ .. ప్రశ్నల దారి వెంట కార్మికుడు! ! -రాము 29-4-14

by Ramakanth Vengala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S2i11a

Posted by Katta

Saidulu Inala కవిత

// సైదులు ఐనాల // ఆహా... తీరొక్క చెట్టు 1 చెట్టు పచ్చని చెట్టు పచ్చ పచ్చని చెట్టు ఎంత నిగర్వి ఇవ్వడాన్ని ఎంత నేర్పరితనంగా నేర్పుతుందీ నాకూ... 2 ఆహా... తీరొక్క చెట్టు జీవనయానంలో అలసిపోని సొగసరి అవనిపై పూయబడ్డ రంగురంగుల తోట ఈ అడవి 3 ఏమిటీ ఈ మహాద్బుతం చిన్నిపాదాలే మైళ్ళదూరాల్ని చేరుకుంటాయని సూక్ష్మమైన విత్తునుండి మహా వ్రుక్షం మొలిచి చూపిందికదా.... 4 అవును చెట్టు ఒక గురువు ఒక కార్యశీలి ఒక సహనశీలి ఒక సహచరి ఒక సమ్మోహిని ఒక ప్రియసఖి ఒక సహచరి 5 చెట్టు నా సర్వస్వం అసలు నేనే చెట్టును చెట్టే నేను ఎంతకాలమైందీ.... కవితలల్లుతూ ఈ అడవిల... -28.4.14

by Saidulu Inala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QV3lQz

Posted by Katta

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట-4 ________________ఆర్క్యూబ్ నోట్లనే నాగార్జున సాగరం పన్ను నల్లగొండ వడివడ్తనే ఉంటది మనసు పండ్ల డాక్టర్ మీదికి మల్లుతుంటది చెంద్రవంక వడలి ఎర్రెర్ర చిగురు కొమ్మ విరిగి నొప్పి వేళ్ళలో కింకుతుంటది తీట చెయ్యి అట్టి గుండది పుల్లలు పెడ్తనే ఉంటది గెలికి గెలికి పిన్నీసు ముదిగొండను మళ్ళిస్తది అటీటనా పంటిసందుల గోరిర్కి వాకపల్లిని కళ్ళ జూస్తది ఎక్కన్నించో ఆయేషా హత్యకేసు ఫైలు పేపరొకటి కొట్టుకఛ్ఛి అదే పంటిమీదబడి కొట్టుకుంటది పంటిముఖాన కొట్టుకఛ్ఛిన పాచి చీర్ గర్ల్స్ కు వేదికైద్ది ఎనామిల్ హక్కులు కరిగి కరిగి పల్పు కుహరం బలిమెలైద్ది పంటిచుట్టు పర్తి పుట్టలు లేసి కల్కి కొక్కుల యుగలగీతం చీము పట్టీ డ్రైనేజి పారుతుంటది స్వయం క్రుతమో క్రుతకమో నడుమ సిక్స్త్ సెన్సును ఆగంబట్టిస్తది చూస్తనే ఉంటం దంతెపు వాడల పంతెనలు కూలడం పురుక్కి అదే హాస్యం అంతే అపహాస్యం నొప్పిల నొప్పి పాణం ఒదలకిత్తది ఎవడు జెప్పిండు పల్ల పురుగు బిషా దెంతని లవంగం ఐసుముక్క ఉత్తశమనమే! ఓమబుక్కితే నొప్పి ఓరకు పండది నొప్పని తోమకుండ పంటిమా పన్ను ఒడిసెరసుమతే ! ( ఇంకా ఉంది) * * * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QV3naX

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

జంట నగరాలలోని సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం - డా. ఆచార్య ఫణీంద్ర

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rxgZ7I

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి “అహం” మేమిద్దరం రెండు సముద్రాలమై మేమిద్దరం రెండు ఆకాశాలమై మేమిద్దరం రెండు ప్రపంచాలమై మేమిద్దరం రెండు దృక్పధాలమై ఒకరితో ఒకరం పోటీ పడుతూ ఉంటాం ఇంతకీ మేమిద్దరం ఒక్కరమే కానీ అది తెలుసుకోలేక మాలోంచి మేము జారిపోతూనే ఉంటాం చివరికి ఏమీ కాక శూన్యమై మిగిలిపోతూనే ఉంటాం మేము ఒక్కరమే కానీ ఇద్దరిలానే ఉండిపోతున్నాం ఒకరిలా బ్రతకలేకపోతున్నాం అది మా అహం అదే మాకు సర్గం ఇంకెందుకు మాకు స్వర్గం! 28Apr2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kdgAoc

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/చీకటి పిదప ---------------------------- చీకట్లో నవ్వే నక్షత్రాలు/ కొన్ని కలలు కరగాలి కళ్ళ నిచ్చెనల పైనుండి తలపులన్నీ తపనలుగా మారి జీవించాలి సజీవ సమాధులపై మరోసారి నిర్జీవంగా నడవాలి రెక్కలు విదిల్చిన ఆకాశం/ తడిసి ముద్దవుతున్న ధాత్రి పగటి వెలుతుర్లు పడమరకెళ్ళాక మబ్బుల మాటునుండి తనను బయటపెడుతున్న చందురుడు అలుపెరుగనిరెక్కలు/ కొన్ని పక్షులు మళ్ళీ ఎగరాలి నింగి సరిహద్దులు దాటి పడిలేచే కెరటాలే/ పదే పదే సంద్రంలోనే తలదాచుకుంటూ ఇప్పుడు ఇంకొన్ని కొత్త వస్తువులు కొ(క)నుక్కోవాలి ఏకాకిగానే తిలక్ బొమ్మరాజు 20.04.14 28.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iwj7Mx

Posted by Katta

Harish Babu కవిత

!!నాకక్కరలేదు!!భీమ్!! నాకొచ్చిన తీర్పుపై నువ్వు అమూల్యమైన కన్నీటి చుక్కలు జాలువారిస్తే అవి నాకక్కరలేదు.., నీకు చేతనయితే నా గొంతుకకు నీ గళాన్ని జోడించి ప్రపంచానికి వినబడేలా ఈ నకిలీ ప్రజాస్వామ్య దేశాన్ని ప్రశ్నించు నాకు జరిగిన అన్యాయంపై..., నీకు చేతనయితే జోడి చెప్పులతో ఆ న్యాయమూర్తి దవడలు పగలగొట్టు నిందితులెవరో చెప్పిన దాక.., నీకు చేతనయితే నా గోతి ప్రక్కన పడుకోటానికి సిద్దపడు నాకు న్యాయం జరిగే పోరులో నువ్వు అమరుడవైతే...! అంతేగానీ మిత్రమా..,నా కుటుంబంపై నువ్వు చూపే ప్రేమ అక్కరలేదు.., నా ఇంటికొచ్చి ఎలా జరిగిందో ఆరా తీసే పంచాయతి నాకసలే అక్కరలేదు ఓ న్యాయమూర్తి నువ్విచ్చిన తీర్పుతో నేను ఎక్కెక్కి ఏడుస్తానని అనుకొకు.., నీకు భయపడి పారిపోతానని అనుకొకు..., నేనున్నది సమదిలోనే కావొచ్చు.., కానీ నా పిడికిలి ఏదోక రోజు నీ గొంతును బిగిస్తుంది నాకు జరిగిన ద్రోహం ఇంకెవ్వరికి జరగకుండ.., నిందితులే లేరన్నావ్ మరి నా చావుకి కారణంఎవరు...? నాపై దాడిని కధలు..,కధలుగా ఎలా చెబుతారో ఒకసారి నా పల్లెకెల్లి విచారించు వీలైతే నా తల్లి కన్నీళ్ళు దోచిట్లో పట్టుకొని తాగు అప్పుడైనా నీకు జ్ఞానం కలిగి నాకు అనుకూలంగా తీర్పు ఇస్తావేమో....! — feeling proud.

by Harish Babu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j7RZTW

Posted by Katta

Madhan Kumar Saggam కవిత



by Madhan Kumar Saggam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j7RZTK

Posted by Katta

Madhan Kumar Saggam కవిత



by Madhan Kumar Saggam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mQUIl5

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

వసీరా " పుట్టుక " ని విందాం....28-04-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j7uzhx

Posted by Katta

Sita Ram కవిత

అనగారిన నాఆశలకు చిన్న సైజు రెక్కలను తొడిగి త్రిలోక స్వర్గంలో విహరించు ఒంటరి పక్షి వలె నాజీవిత గమ్యాన్ని నిర్థేశించు దేవత కొరకు వేచిచూస్తున్నా ఉందో!!లేదో ఉంటే కనిపిస్తుందోలేదో!! కనిపించినా పలుకరిస్తుందో లేదో!! ఎందుకు నాకీ ఆవేదన ఏమైంది నాకు నిన్న మొన్నటి వరకూ లేని అలజడి నేడెందుకు పరిగెడుతున్న కాలంతో పాటు నాలో కోరికలు పరిగెట్టడానికి కారణం ఏమైఉంటుంది జలచరంలో విహరించే గానకోకిలల స్వరాలకి మది గతితప్పినదా లేక నాట్యమయూరాలను చూసి నాగుండె స్రుతి తప్పినదా? ఉదయ్!!!! !!!!:-Q28/04/14

by Sita Ram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivx79o

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivaD8B

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || ఇద్దరం ఒక్కటై!...|| ================================= నా మనసును నీ మనసుతో కడిగెయ్యాలని ఉంది స్వచ్చమైన పాల వెన్నెల రాతిరి కోసం నిరీక్షిస్తున్నాను నా దేహాన్ని నీ దేహంతో ఏకం చెయ్యాలని ఉంది అందమైన అర్ధరాత్రి కోసం ఎదురు చూస్తున్నాను అందమైన మనసుకు తాంబూలం వెయ్యాలని ఉంది తమలపాకుల పెదాల కోసం అన్వేషిస్తున్నాను అలజడితో రగిలే హృదయాలను హత్తుకోవాలని ఉంది ఎగిసి పడే అలల ఊసుల కోసం ఒడ్డున ఇసుకనై చూస్తున్నాను ఇద్దరం ఏకాంతంగా ఏకమవ్వాలని ఉంది నక్షత్రాలకు నల్ల మందు రాసేసి చంద్రుడిని మన కౌగిలి దుప్పటిలో దాచేయ్యాలని అమావాస్య నిశీధి కోసం ఎదురు చూస్తున్నాను మొగలిపొదల నడుమ పెనవేసుకున్న పాముల్లా జ్వలించే హృదయాలను జుర్రుకోవాలని ఉంది వర్షించే రసరమ్య నాగులై బుషలు కొట్టాలని ఉంది నిండు పూర్ణిమకోసం ఆరాట పడుతున్నాను అందుకే వెన్నెలైనా ... చీకటైనా .. నీతోనే శాశ్వతం ... మన జీవితం !!! ======================== ఏప్రిల్ 28/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j6PjG8

Posted by Katta

Pratapreddy Kasula కవిత

కవి స్వరం: పూర్ణిమా సిరి కవిత http://ift.tt/1fnLUTX

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fnLUTX

Posted by Katta

Sri Venkatesh కవిత

**శూన్యం** ఆశని ఆర్పేస్తున్న పవనం నడుమొంగిన యవ్వనం మెదడుకి పడిన బెజ్జం చేతి రాత చేస్తున్న నాట్యం ప్రయత్నం పళ్ళు బిగించి చూస్తున్న చోద్యం చచ్చుబడిపోయిన అవయవం చతికిలబడిన ఆశయం ముళ్ళు మోసుకొచ్చిన వసంతం ఆకలిని అవహేళన చేస్తున్న ఆహరం జయాన్ని శాశిస్తున్న అపజయపు విజయం వాంఛలపై నీరుగారిపోతున్న వ్యామోహం ప్రకాశాన్ని స్పృశించలేకపోతున్న స్పర్శ భయం పరలోకపు కాగడలో ఇముడుతున్న ఇహం ఆత్మను అమ్మేసుకుంటున్న పిచ్చి దేహం మన:స్సాక్షి మానభంగంలో మనసుదే సింహ భాగం కష్టానికి తూకమివ్వనంటున్న అదృష్టపు అంగడి అహంకారం అన్ని వెరసి నలుపునే కంటికి చూపిస్తున్న త్రోవ "శూన్యం"!!!! శ్రీ వెంకటేష్ తేది : 28/04/2014

by Sri Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mPROgr

Posted by Katta

Panasakarla Prakash కవిత

పడక్కుర్చీ వయసు పెరుగుతు౦దని నాకేమాత్ర౦ భయ౦లేదు కూర్చు౦ది అనుభవాల సి౦హాసన౦మీదకదా ముఖ౦లో పడ్డ ముడతలు అ౦ద౦గానే ఉన్నాయి ప౦డాక ఎ౦డిన పొల౦లో నేల నెర్రలు తీసినట్టు ఎన్నోసార్లనుకున్నాను అ౦దుకే కాబోలు కదలలేని కాళ్ళూ చేతులూ.. మళ్ళీ నా బాల్యాన్ని నాకిచ్చాయ్ చాన్నాళ్ళ తరవాత‌ అద్ద౦లో చూసుకు౦టే నా పసి మొహ౦ ర౦గుల బోసినవ్వులు చి౦దిస్తో౦ది అరుగుమీద నేను,చేతికర్ర‌ పడక్కుర్చీకానుకుని సాయ౦త్ర౦దాకా చెప్పిన కబుర్లే చెప్పుకు౦టు౦టా౦ అమ్మ పిలిచినట్టు కోడలే పిలుస్తు౦దిప్పుడు మావయ్యా బోజన౦ పెట్టాను ర౦డి తి౦దురుగానని కొడుకుమాత్ర౦ అచ్చ౦ మా నాన్నే ఎప్పుడూ నేను పడుకున్న తరువాతే పాప౦ వాడు ఇ౦టికొచ్చేది నాన్న అన్న౦ తిన్నాడా..? అ౦టూ కోడలిని అడుగుతున్నప్పుడు మా బాగోగుల‌ గురి౦చి అమ్మనారాతీసిన‌ నాన్న గుర్తొస్తాడు ఎవరి పనుల్లో వారు ఇ౦కిపోయాక‌ మాటల‌ తేటనీరై ప్రవహిస్తూ వచ్చి నా ఒ౦టరితనాన్ని అలఓకగా తడిపి రివ్వున ఎగిరిపోతారు మనుమడు మనుమరాలు ఎవ్వరూ లేనప్పుడు ముసలిది మరీ మరీ గుర్తొచ్చి ఏడుపొస్తు౦ది ఏడిస్తే ఎలా....... ఫొటోలో౦చి చూస్తే బు౦గమూతి పెట్టుకోదూ..! అ౦దరూ అనుకు౦టున్నట్టు నేనేమీ చావు గురి౦చి ఎదురు చూడడ౦ లేదు అనుభవాల క౦డువాని భుజ౦మీద వేసుకుని ఠీవిగా ఆహ్వానిస్తున్నా.. వాచ్చేవారు ఎవ్వరినైనా సరే...! పనసకర్ల‌ 28/04/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmDPyY

Posted by Katta

Sasi Bala కవిత

స్వప్నం ...వింత లోకం ..........శశిబాల ---------------------------------------------------- మనసు శరీరం అలసి నిదురించినప్పుడు మన ఆత్మ నిదురలోచూస్తుంది .. మునుపెరుగని లోకాలెన్నో ... వింత వింత అనుభూతులు ఎన్నో ఎన్నడు చూడని తావులు .. ఎప్పుడు చూడని మనుషులు వింత వింత అనుభవాలు ... విచిత్ర సంబంధాలు భువి దిగిన స్వర్గాలు ... దరిచేరే నూతన వ్యక్తులు ఎవరో ...ఏమో ...ఎక్కడో ..ఎప్పుడో ఏమిటీ పరిస్థితి ....భ్రమలో వుండే స్థితి ఎవరు వారు ..? ఎచటి వారు ..? ఎక్కడవీ ఆ ప్రాంతాలు ... ఎప్పటివీ ఆ పరిస్థితులు ... ఏడిపిస్తాయి ..నవ్విస్తాయి ... భయపెడతాయి ...ఓదారుస్తాయి ఒక్కొక్కసారి నిజమేమో అని భ్రమ కాదు కలేగా అన్న వాస్తవం పల్లకిలో వూరేగినట్లు .. వరదల్లో మునిగినట్లు .. ఏదేదో వింత భావనలు ... ఎదలోతుల తెలియని ప్రకంపనలు ఏమిటీ విచిత్రం ..... గత జన్మపు స్మృతి విలాసమా ఈడేరని కోర్కెల సమహారమా ...ఏమో ఇది ఏమో వాస్తవం కాని స్వప్నం ... స్వప్నమని తెలిపే నిజం .. . 28APRIL14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1isF8qx

Posted by Katta

Sri Gajula కవిత

మిత్రులారా! వ్యక్తులను గెలిపించుటకు శక్తులు ఓటమికి కుడా సిద్ధపడటమే నేడు మనం ఎదుర్కుంటున్న అత్యంత దౌర్భాగ్యకరమైన ప్రమాదం సంఘటితం పేరుతో సమాజాన్ని అసంఘటితం పర్చడం అధిపత్య వర్గాల అసలు కుట్ర ఈ కుట్రలను చేదించె నవ శక్తులకు ప్రాణం పోయడమె మన కర్తవ్యం కావాలి గాజుల శ్రీధర్ -28/04/2014

by Sri Gajula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fjRLtJ

Posted by Katta

Annavaram Devender కవిత

ఎవలైతేంది ..... !!- ---------అన్నవరం దేవేందర్ ఆయన ఎవలైతేంది వూరు పక్కన గుట్టలన్నీ గులాబీ జాం లా గుటుక్కు మని మింగడు గదా ! జర జల్లెడ పట్టి సూడు ఆయన ఎవలైతేంది వూరు సుట్టు వాగులల్ల ఇసుకనంతా దేవుకొని పుట్న్నల్లెక్క బుక్కడు గదా ! జర మెరిగాల్లెక్క ఏరు ఆయన ఎవలైతేంది అడవి లోని కలప సంపదనంతా కర కర మింగడు గదా ! జర జాలి ల వడబోయి ఆయన ఎవలైతేంది భూముల్లోని ఖనిజాలను గంప గుత్త పట్టి పండ్లోలె అమ్ముకోడు గదా ! జర పశనతు పట్టు ఆయన ఎవలైతేంది నీ సుట్టు ముట్టు జాగలన్నీ కంపినీలకు కట్టబెట్ట లఫంగి కాడు గదా ! జర వస్త్రగాలం పట్టు ఆయన ఎవలైతేంది వోట్లన్నీ గంప గుత్తగ కమాయించుకొని నెత్తిన కూసోడు గదా ! జర తేజాబుల కడుగు అప్పుడు సోక్కం తెలుస్తది ... --

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmsEq3

Posted by Katta

ఎం.నారాయణ శర్మ కవిత

మళ్లీ... ____________________________ ఒకానొక మహాయుద్ధం తరువాత నేల కళ్లకు వెలుగుపూయడానికి రంగురంగుల సూర్యుళ్లు ఉదయిస్తారు అప్పటిదాకా పాటలోలేని చరణాలన్నీ వేదనని మూసీనదిలా మారుస్తాయి యుద్ధపు నొప్పులువడ్డతల్లి దిగ్భ్రాంతికిలోనవుతుంది ఒకటికిరెండుఖండువలు కప్పుకుని కవచాలను వెంటేసుకుని పురుగులకొత్తపాట లోకంనుంచేతరిమేస్తానన్న కత్తి చిటికెనవేలితో నాలుకని తడుపుకుంటుంది ప్రాణాలు తీసుకున్న మొక్కలు ప్రాణాలుపోసిన పల్లెలు ప్రాణాచారం పడుకున్న గుండెలు ఆక్రందనెక్కడో పగుళ్లువారుతుంది రాత్రికిరాత్రే అమృతాన్నెత్తుకుపోయెందుకు పురుగుల తండ్లాట యుద్దం పూర్తికాలేదు బహుశః ఇక మొదలవుతుంది

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kaJLZ8

Posted by Katta

Rajarshi Rajasekhar Reddy కవిత



by Rajarshi Rajasekhar Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hETMep

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• చివరి సమయం •• పిచ్చితనం ఏంటో తెలియడం కోసమైనా కొన్ని జరగాలీ- ••• సమాంతరం కానిది ఎరుకలోకి- అలను విసిరే సముద్రం హోరు- మబ్బు విడుచు వాన చుక్క బాధ- నడక తడబాటు- మాట వణుకు- కంటి ఉప్పు నీరు రుచి- మనసు రహస్యమై పాడు తీవ్ర దుఖ్ఖ గీతం- కరచాలనం తరువాత చేతి తడి- మనం మనం కాము అను పచ్చి నిజం ఆత్మా యేడుపు- ••• తెలియాలి ఆసన్న సమయమిది- 28/04/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RYNQrK

Posted by Katta