పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Satya NeelaHamsa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Satya NeelaHamsa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జూన్ 2014, శనివారం

Satya NeelaHamsa కవిత

"దరినీరు" ========= 21-06-2014 -సత్య దరినీరూ సెలయేరు రేకలువా పరిమళము తొలిచినుకూ తుదిమినుకు నదిమలుపూ విరివిరుపూ తుమ్మెదలూ మధువనము నీరెండా గోధూళీ పసితనమూ చిరునవ్వు అనుభూతి ఆస్వాదన అబ్బురమూ ఆశ్చర్యము ప్రతిచోటా నాతోపాటే నువ్వూ నాలాగే ... చూస్తున్నట్టు వింటున్నట్టు నేనే నువ్వై స్పందిస్తున్నట్టు... నీ ఉనికిని నా పక్కనే అన్ని చోట్లా పొందుతున్నా... లోలోతున ఇంకా బాగా నాకు నేను అందుతున్నా ... :)

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p2kwzn

Posted by Katta

5, జూన్ 2014, గురువారం

Satya NeelaHamsa కవిత

తీరం తో సంద్రం -సంద్రం తో తీరం : ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ 5-6-2014 --సత్య తీరం తో సంద్రం: ఎన్ని సార్లు నన్ను నేను నిన్నుతాకి పోయినా అసలేమీ తెలియనట్టు జరగనైనా జరగవు అలల కలల తాకిడితో నిన్ను ముంచి వేసినా బండరాతి తీరానివి కరగనైనా కరగవు ఏడిపించకు నన్ను, కదిలించకు నా కోపాన్ని నీపై కైపే నా అలలు లేదంటే ఉప్పెన రూపాన్ని సంద్రం తో తీరం : అలకల అలలై తాకితే తట్టుకుంటాను నేను. కన్నీటి ఉప్పెనై దూకితే కరిగి పోతాను ! తనివితీరా నిన్ను, తట్టుకునే తీరాన్ని. అనుక్షణం నిన్నే చూస్తూ , నీలో కరిగే భారాన్ని !! ---సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j0ex5I

Posted by Katta

9, మే 2014, శుక్రవారం

Satya NeelaHamsa కవిత

ముందు సమయం తీసుకొ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ (09-05-14) -సత్య దగ్గరికి తీసుకొని మనసా,నాకూ నిన్ను ఓదార్చాలనే ఉంది కాని ముందు సమయం తీసుకొ, మనసా! తనివితీరా ఏడ్వు! లేనిది చూపించి నప్పుడే అర్థమయ్యింది ఉన్నదేదో దాస్తున్నావని , పంథం తీరని నీ ప్రపంచంలో ప్రస్తుతానికి ఎదురుగాలి వీస్తున్నదని తప్పించుకొని తురుగుతున్నంతవరకూ నాకూ కూడా నిన్ను వెంబడించాలని లేదు నీకు నువ్వు సమాధాన పడేదాకా నాకూ నిన్ను ప్రశ్నించాలని లేదు అలసిన నీ పాదాల అలసట నాకూ తీర్చాలని ఉంది కానీ ముందు సమయం తీసుకో, మనసా! తనివితీరా పరుగులు తీయ్! నీకు నిన్ను వదలడం కన్నా మించిన సహాయం నేను నీకు ఏం చేయగలను? నీ సంద్రాన ఉప్పునీటి నిల్వలు తవ్వి నేను మాత్రం ఏం చేసుకోను!! తరతతాలనుండీ నీ తాకిడిని ఇలా తట్టుకుంటూనే ఉందీ నా తీరం నీ అలల అలజడులూ , ఉప్పెనల ఉద్వేగాలు సుడులూ సుడిగుండాలూ నాకు తెలియనివేం కావు రెప్పలార్పకుండా మనసా, నిన్ను నీలా చూడాలనుంది కాని ముందు సమయం తీసుకో, మనసా!ఆ ముస్తాబులు కరగనివ్వు! -సత్య :)

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1np72vH

Posted by Katta

23, ఏప్రిల్ 2014, బుధవారం

Satya NeelaHamsa కవిత

" స్త్రీ " ^^^^^^ -సత్య నీకూ కడలికి తేడాలేదు దాని అలలు అర్థమనా అగాధo అర్థం కాదు నీకూ ప్రకృతికి తేడాలేదు పరిణామాలు అర్థమైనా ప్రళయం అర్థం కాదు నీకు పూలకి తేదాలేదు వాడే పరువాలర్థమైనా వీడని పరిమళాలర్థం కాదు నీకూ నింగికి తేడాలేదు అందినట్టే ఉన్నా అంతు మాత్రం అర్థం కాదు నీకు వాగుకి తేడాలేదు వొంపులు అర్థమైనా సుడులర్థం కాదు నీకు నిప్పుకి తేడాలేదు ఆరిపోయిన తరువాత కాని, అస్థిత్వం అర్థం కాదు నీకు నీటికి తేడాలేదు ఏ పాత్రకి ఆరూపం!, అసలు రూపం అర్థం కాదు నీకూ నేలకి తేడాలేదు ఓర్పు అర్థమైనా నిరీక్షణ అర్థం కాదు నీకూ తరువుకి తేడాలేదు ఫలాలర్థమైనా త్యాగమెందుకో అర్థం కాదు నీకూ వర్షానికి తేడాలేదు అవసరం అర్థమైనా ఆగమనమెప్పుడూ అర్థం కాదు నీకూ తుఫానికి తేడాలేదు భీభత్సం అర్థమైనా నిశ్శబ్ధం అర్థం కాదు నీకూ గాలికి తేడాలేదు కనపడకుండా గుండెల్లో ఎలా నిండుతుందో అర్థం కాదు :)

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l0uNaC

Posted by Katta

8, ఏప్రిల్ 2014, మంగళవారం

Satya NeelaHamsa కవిత

సమాలోచన ^^^^^^^^^^^^ -సత్య వాగే నీ వెధవ వాగుడు వింపించాలనే నీ పిచ్చి, నీ ఒంటరితనానికి పరాకాష్ఠ! నీకింకా అర్థం కావట్లేదా? జనాలు పూసుకుంటున్న జండూ బాం తక్కువుందనా? నీ బాధలు కూడా జనాలపై జోరుగా రుద్దు తున్నావు? అంగట్లో ఆత్మాభిమానాలు తక్కువున్నాయనా ? నీ అస్తిత్వాన్ని కూడా అందరికీ గుర్తుచేస్తూ తిరుగుతున్నావు! సహజంగా సరళంగా , సమాలోచన చేసుకోలేని సమాదిలో గడపలేని , నీ సాధుత్వం దేనికని? ఉషోదయాన్ని శీతలఝరాన్ని పరిమళపవన్నాన్ని మర్చిపోయావా ? లేక నువ్వే, గుర్తుచేసుకోవా ? మును ముందుకు సాగిపోయే వాడివి నీవని మరిచిపోయవా? దారిలో కలిసేవారు దరిని చేర్చేవారు వేర్వేరని గుర్తుచేయాలా? అవలోకనం విమర్శ ఉద్ధరణ పదాలు ఆత్మకంటించాలంటే కరడుగట్టిన కరగని అహం అహరహం అడ్డోస్తుందా ? మౌనమిచ్చిన ముత్యాల్ని మాటల మూటళ్లో కట్టి మందిలోజేరి "మంచిగా" అమ్ముతున్నావా ? మధువు దోచి మూటకట్టే తుమ్మెదలాగా సహజంగా బతికి నీపనేదో నువ్‌చేసుక్కొని చావరాదా? లేక చావడంకూడా రాదా? అందరూ వెతికేలా నీ అడుగుజాడలొదలాలని ఆర్భాటంతో అంతుచిక్కని నీ ఆత్రుత దేనికని? స్నేహంగా ఉంటావో, స్నేహంగా కనిపిస్తావో! నీ చిరునవ్వు ముసుగుని ఎవరికి చూపిస్తావో!! నీవు లేని దారుల్లో నిన్నునీవు వెతుకుతున్నావ్! శృతిలేని నీసంగతుల మధ్య సంగీతం రావట్లేదా? జరిగేదిదే, ఎందుకు బెట్టుకు పోతావు ? జనాలతో పెట్టుకోకు కొట్టుకు పోతావు ? -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1enNwqP

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Satya NeelaHamsa కవిత

కలిసి విడదీసాం ^^^^^^^^^ -సత్య మరి, జరిగిందేదో జరిగిపోయింది ఏది ఏమైనా మనమే కలిసి చేసేసాం నేనొక చోటా నువ్వొక పూటా వెరు వేరైనా విడివిడిగా ఒకే చందమామని కలిసి చూసేసాం నా నిరీక్షణ నీ దారి వేరువేరైనా ఒకరి తలపుల్లో ఒకరుగా కలిసి నడిచేసాం నా తలపు నీ మరుపు వేరు వేరైనా ఒకరి మనసుల్లో ఒకరం కలిసి మరిచేసాం నా తెగువా నీ బిడియం వేరువేరైనా ఎడభాటుకి మాత్రం కలిసి అడుగేసాం నా ఆవేదన నీ అలోచన వేరువేరైనా పంచుకున్న కాలాన్ని కలిసి మూసేసాం నా హరివిల్లూ నీ బొమ్మరిల్లూ వేరువేరైనా కలల సౌధాన్ని కసిగా కలిసి కూల్చేసాం నా విరహం నీ తమకం వేరువేరైనా తడబాటులో కన్నీరు కలిసి వదిలేసాం నా విడుపు నీ పట్టు వేరువేరైనా పెనవేసుకున్న కౌగిలి కలిసి విడదీసాం -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pPadJN

Posted by Katta

2, ఏప్రిల్ 2014, బుధవారం

Satya NeelaHamsa కవిత

కలిసి విడదీసాం ^^^^^^^^^ -సత్య మరి, జరిగిందేదో జరిగిపోయింది ఏది ఏమైనా మనమే కలిసి చేసేసాం నేనొక చోటా నువ్వొక పూటా వెరు వేరైనా విడివిడిగా ఒకే చందమామని కలిసి చూసేసాం నా నిరీక్షణ నీ దారి వేరువేరైనా ఒకరి తలపుల్లో ఒకరుగా కలిసి నడిచేసాం నా తలపు నీ మరుపు వేరు వేరైనా ఒకరి మనసుల్లో ఒకరం కలిసి మరిచేసాం నా తెగువా నీ బిడియం వేరువేరైనా ఎడభాటుకి మాత్రం కలిసి అడుగేసాం నా ఆవేదన నీ అలోచన వేరువేరైనా పంచుకున్న కాలాన్ని కలిసి మూసేసాం నా హరివిల్లూ నీ బొమ్మరిల్లూ వేరువేరైనా కలల సౌధాన్ని కసిగా కలిసి కూల్చేసాం నా విరహం నీ తమకం వేరువేరైనా తడబాటులో కన్నీరు కలిసి వదిలేసాం నా విడుపు నీ పట్టు వేరువేరైనా పెనవేసుకున్న కౌగిలి కలిసి విడదీసాం -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pPadJN

Posted by Katta

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Satya NeelaHamsa కవిత

-- అయినా ఆ కళే వేరు.. ^^^^^^^^^^^^^^^^^^^^^^^ -సత్య విధి వధిలేసిన బతుకుల మధ్య గొంతులొ ఎండిన మెతుకుల మధ్య పల్లపు దారుల గతుకుల మధ్య కడుపు కాలితే పుట్టేది కళ, అయినా ఆ ఆకలితీర్చే కళే వేరు... రెప రెప లాడే నెత్తుటి జెండా భుజాన మోసే పథాన సాగి ఎదురు నిలిచిన నిబ్బర గుండెల విప్లవాల తో పుట్టేది కళ, అయినా ఆ ఉద్యమాల కళే వేరు... విజయవికాస కష్ట స్వేధమై సత్యబీజపు నిత్యసేధ్యమై కృషి కార్యాల ఇష్ట సాధనై ప్రతిఘటన నుండి పుట్టేది కళ, అయినా ఆ ప్రగతినిచ్చే కళే వేరు... పెద్దలు పేర్చిన ఫలాల పంట తోడుక నీడగ కదిలే వెంట ధార్మిక జ్ఞాన కర్మలనుండి సంప్రదాయం నుండి పుట్టేది కళ, అయినా ఆ సంస్కరించే కళే వేరు... -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mkPlK9

Posted by Katta

30, మార్చి 2014, ఆదివారం

Satya NeelaHamsa కవిత

-- అయినా ఆ కళే వేరు.. ^^^^^^^^^^^^^^^^^^^^^^^ -సత్య విధి వధిలేసిన బతుకుల మధ్య గొంతులొ ఎండిన మెతుకుల మధ్య పల్లపు దారుల గతుకుల మధ్య కడుపు కాలితే పుట్టేది కళ, అయినా ఆ ఆకలితీర్చే కళే వేరు... రెప రెప లాడే నెత్తుటి జెండా భుజాన మోసే పథాన సాగి ఎదురు నిలిచిన నిబ్బర గుండెల విప్లవాల తో పుట్టేది కళ, అయినా ఆ ఉద్యమాల కళే వేరు... విజయవికాస కష్ట స్వేధమై సత్యబీజపు నిత్యసేధ్యమై కృషి కార్యాల ఇష్ట సాధనై ప్రతిఘటన నుండి పుట్టేది కళ, అయినా ఆ ప్రగతినిచ్చే కళే వేరు... పెద్దలు పేర్చిన ఫలాల పంట తోడుక నీడగ కదిలే వెంట ధార్మిక జ్ఞాన కర్మలనుండి సంప్రదాయం నుండి పుట్టేది కళ, అయినా ఆ సంస్కరించే కళే వేరు... -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mkPlK9

Posted by Katta

7, మార్చి 2014, శుక్రవారం

Satya NeelaHamsa కవిత

నా ఊహలకన్నా అందమైనవేంకావు ^^^^^^^^^^^^^^^^^^^ -సత్య నన్ను మన్నించు! నా గుండెకి కి సరిపోను ప్రేమ లేదు నీదగ్గర నా ఊహలకన్నా అందమైనవేంకావు నీ రంగుల చీరెలు ఇది నా పిచ్చి,నీ మూర్ఖత్వం కాక పోతే, నా ప్రేమ భావాలు నీకు పొగడ్తలు గా వుంటే… నీ అందచందాలనయగారాలు, నీ సిగ్గుబిడియాలసోయగాలు నాకు ప్రేమ గా తోయడమేంటి? నా పరువానికి కి సరిపోను ప్రణయం లేదు నీదగ్గర… నా ఊహలకన్నా అందమైనవేంకావు నీ రంగుల చీరెలు! నువ్వు కూడలిదగ్గర అద్దాల గదిలో అలంకరించుకున్న ఆడ బొమ్మవి లేని చమురుతో వెలిగే దీపానివి కలలకందీ కళ్లకందని రూపానివి నా మనసుకి కి సరిపోను విషయం లేదు నీదగ్గర... నా ఊహలకన్నా అందమైనవేంకావు నీ రంగుల చీరెలు! తీయతీయని ఊసులు వింటూ లోలోన నవ్వుకునే నా భావాలపరిహాసానివి నువ్వు కావలని దగ్గరికొస్తూ లోలోన దూరం చేసే నా ఆశలపరియాచకానివి నువ్వు నా ముద్దులకి కి సరిపోను మురిపెం లేదు నీదగ్గర నా ఊహలకన్నా అందమైనవేంకావు నీ రంగుల చీరెలు నీ తో మొదలైందెమో కాని నీతో ఆగదు సహజమైన ప్రణయసౌందర్యనిత్యాన్వేషణ... నిజమైన ప్రణయం నిజమైన ప్రేమ, వీటికోసమే నా తపన, నిరీక్షణ అయినా నా భావాలకి కి సరిపోను బంధం లేదు నీదగ్గర నా ఊహలకన్నా అందమైనవేంకావు నీ రంగుల చీరెలు అయినా, నా ఊహల కన్నా, అందమైనవేం కావు నీ రంగుల చీరెలు -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f4HVtf

Posted by Katta

22, ఫిబ్రవరి 2014, శనివారం

Satya NeelaHamsa కవిత

పోరుబిడ్డ : ^^^^^^ -సత్య నినదించిన నీ నినాదాలు మా పిడికిలి బిగి పెంచుతున్నై చిందించిన నీ నిధిరాశౄవులు మా నుదుటన తిలకాలై వెలుగుతున్నై నవరాజ్యం నవస్వప్నం నీ కండ్లల్ల జూసుకుంటిమి స్వప్నం సకారమైతే , నువ్ రాజైతవనుకుంటిమి ఈ సంబరాన్నేం చేసుకోము పంచుకోనే నీవులేక సంతోషాల నడుమన హత్తుకునే గుండె లేక కలల పంట ఇంటికొచ్చే పోరు బిడ్డ చూడరా అమ్మ కడుపుడు కోతలని ఇంకనైనా ఆపురా ... నీ వీరత్వం తెలిసినోల్లం అమరత్వం తెల్సుకోలేకపోతిమి ఉద్యమాల నడుమ ... నీ ఉద్వేగాన్నాపలేకపోతిమి ఉద్యమాలనుపయోగించుకున్నోల్లు, ఉద్వేగాలతో ఆడుకున్నోల్లు, ఊడ్చుకొని పోతరు... ఉసురుగొట్టుకు పోతరు మాచేతిలో మాకొచ్చిందీ, నీ త్యాగాలతో తడిసిన కూడు నవ తెలంగాణకి నవ రత్నాలు పొదిగి నీ కల సాకారం చేస్తం చూడు.. -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gU8p0B

Posted by Katta

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Satya NeelaHamsa కవిత

"ఇయ్యాల లేడు సారు" (Prof. Jaya Shankar sir. ) ^^^^^^^^^^^ --సత్య చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! నిదానంగ తెలంగాణ అవసరాన్ని జెప్పినోడు నినాదంగ ఆక్రందన గొంతులని మల్చినోడు అలోచనలన్నింటిని ఆచరణలో జూపినోడు అలుపెరుగని పోరాటమే ఉద్యమంగ జేసినోడు చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! దిక్కుతోచని మాకు దిక్సూచై నిల్చెటోడు ఆటుపోటులన్నీ దాటి అవతలి దిక్కు జేర్చేటోడు ముంచెత్తే అలల నుండి నిజమయ్యే కలల దిక్కు మా నావకు చుక్కానిగ ముందు ఉండి, నడిపెతోడు చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! ఉలిదెబ్బలతోనే రాయి రూపుదిద్దుకుంటది రాపిడితోనే ఇనుముకి జంగు తొలగి పోతది మరి దారిజూపేటోడివి ఇట్ల జెప్పకుండబోతే గుబులు తోని ఈ గుండె ఎట్ల కోలుకుంటది? చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! తెలంగాణకి పెద్దకొడుకువి నీకెమిచ్చుకునేది నా బిడ్డవై పుడుదువుగాని రావో నా పెద్దసారు! అల్లంత దూరాన సూడు తెలంగాణోస్తున్నది సాకారమైతే సూద్దువు గాని రావో నా పెద్దసారు!! చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! --సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NfVH17

Posted by Katta

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Satya NeelaHamsa కవిత

నీడలు కూడా దూరని బంధం ^^^^^^^^^^^^^^^^^^ -సత్య నీకూ నాకూ మధ్య ఈ దారీ వారధులెందుకు? చాలీ చాలని అందీ అందని ఊహలు ఊయలలెందుకు? నాకీ వంతెనా వారదులొద్దు అసలేదారులూ దూరాలొద్దు దారుందంటే నడ్మ దూరమున్నట్టు వారధుందంటే మధ్య అగాధమున్నట్టు అల్లంతదూరాన గోరంత దీపం లాగా మసక రేయిలో మబ్బులరూపు లాగా చిరునవ్వుల తో సరిపుచ్చె నీ పలకరింపులు కూడా నాకొద్దు నీడలు కూడా మధ్యలో దూరని. చావుకూడా-చెరపని-చేరువ నాకు కావాలి -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bPrmMz

Posted by Katta