13, జులై 2012, శుక్రవారం
కట్టా శ్రీనివాస్॥టప్॥
అనుభవ రాహిత్యపు
నీటి బుడగ
పెటిల్మని పగిలి పోయింది.
అయితే...
అనుభవం వచ్చిందన్న మాట
అయ్యో
నేను అనుభవరహితుడినేనన్న
నిజాన్ని సైతం
మరిచేలా చేసింది.
ఈ పాడు సంఘటన.
*12.7.2012
మెర్సీ మార్గరెట్॥ ఒక సంభాషణాత్మక ప్రయోగం॥
ఆమె : శ్వాస నిశ్వాసల పోటి ...
గెలుపు మాత్రం నాలో దాగిన నీది
అతను : రెండు శ్వాసల సుగంధం ఒకటైతే పోదా ఓటమి గెలుపుల రూపం.. పోదా స్వేదంలో కరిగిన దూరం.. నీది నాది కాని . . నూతన సవ్వడి నిర్వచించే నవ నాడి
ఆమె : స్వేదపు దారులు వెతుకుతు పరిమళా నాస్వదించి మర్చిపోయా ..సమాధానాల వేట ఎలా చేయను అని
అతను : ఉన్నావా నా తలగడలో దాగిపోయవా శ్వాసవై
ఆమె : దాగిపోయి చెవిలో గుస గుస లాడుతున్న వినిపించానా ?
అతను : ఈ వేడి నీ శ్వాస దేనా కరిగిస్తోంది
ఆమె : స్వేదంలో చల్లదనం భయపడుతుంటే దైర్యం చెప్పాలే
అతను: ఊ -మాటలు భలే నేర్చావే ?
ఆమె : సాంగత్య దోషమే కదా.. ఓటమి ఒప్పుకోలు పత్రం పై సంతకం చేయండి
అతను : కలిపిన గోరు ముద్ద తినిపిస్తూ .. చాలు చాలు ఇవ్వాల్టి గెలుపు నీదేలే అని నవ్వు చుక్క సంభాషణకు ...♥
*12/7/2012
Ro Hith || Letter ||
Ma frequently says
when i was 6 years old
i used to draw on walls
on countless number of papers
bills and brother's notebooks.
I used to draw green hills
Where even an ant waits for my order to bite
And a half sun with red crayon
that always questions me- to rise or to set?
A river breathed by hills
a thatched hut on the bank
and an unopened letter on its doorstep.
Even now
The image of hills, half sun
and hut under the palm tree
screen behind my eyelids
And when ever a new letter falls
on the doorstep
A poem forms itself in me.

* 12-07-2012
రియాజ్ || పల్లెవిస్తుపొయింది?! ||
అల్లా చూసొద్దామని
పల్లె పట్నం వెళ్ళింది
ఏదేదో ఊహించుకుంటోంది
తీర చూశాక విస్తుపోయింది!
స్వేచ్చా విహంగాలు
అక్కడక్కడ గోడలమీద కాగితాలపై ముద్రితమై ఉన్నయ్
మరికొన్ని పంజరల వెనుక దర్శనమిస్తున్నాయ్!
పచ్చదనం ఊరికి దూరంగా పారిపోయిఉంది
అంతా కార్బన్-డై-ఆక్సైడ్ కంపు
ఎటుచూసిన పరుగులుతీసే చక్రాలు
లోహాల ఘోష
నిశ్శబ్దాన్ని ఊరికి దూరంగా వెలివేసినట్లు!!
***
మరింత ముందుకెళ్ళింది
ఆకలి భాషలు నడిరోడ్డులో నగ్నంగా గొంతుచించుకు అరుస్తున్నాయ్
కడుపు ఎండిన డొక్కలు స్పష్టంగా దీనంగా అడుక్కుంటున్నాయ్
డొక్కనిండిన పొట్టలు ఆర్ధిక ప్రవాహంలో కొట్టుకుపోయెందుకు సంసిధ్ధంగా ఉన్నాయ్!
తప్పించుకొని మరింత ముందుకెళ్ళింది
యేమైనా అమ్ముకునేందుకు దేనినైనా వ్యాపారంగా చూసే
మార్కెట్ అందులోని జిత్తులమారి ఆకర్షణలను
వింత ఆర్ధిక ధోరణులను చూసి అవ్వాక్కయ్యింది !!
భుజాన బ్యాగులతో వెళుతున్న చిన్న చిన్న యంత్రాలను
తలపించేలా ఉన్న పిల్లలను చూసి ఆశ్చర్యపోయింది !!
ఎక్కడినించో అరువు తెచ్చుకున్న వింత అలవాట్లతో
వికృత ధోరణులతో దేశనిర్మాతలు యువకెరటాలు నిర్వీర్యంగా !!
ఊరికి పెద్దలు శాంతికపోతాలు వృధ్ధాశ్రమాలలో తోసివేయబడ్డారు
మానవత్వం అక్కడక్కడా మూలుగుతూ కనిపిస్తోంది
వ్యాపార దేహాలు నైతికజీవాన్నికోల్పోయిన చిద్రమైన మనసులు
అత్యాధునికత పెరుతో వింత వింత చేష్టలు చేసే మనుషులనూ చూసి పల్లె కాసేపు ఆగిపోయింది?
చివరిగా..
నగర నడిబొడ్డులో నవ్వుతూ ఉన్న మహాత్ముని విగ్రహాన్ని చూసి
నవ్వుకుంటూ పచ్చబస్సు ఎక్కి పారిపోయింది ఆ పల్లె.

జ్యోతిర్మయి మళ్ళ || ఫేస్బుక్..ఫేస్బుక్..||
సరదా సరదా ఫేస్బుక్కు
ఇక్కడెప్పుడైనా వేస్కోవచ్చోలుక్కు
అడిగేయించుకునే కామెంట్లు అనెస్పెక్టెడ్ కామెంట్లు
అదరగొట్టే కామెంట్లు బెదరగొట్టే కామెంట్లు
ఎన్నెన్నో నీపోస్టులకు ఎవరెవరివో దక్కు
మనసులోని మాటలెన్నొ అక్కడే వెళ్ళగక్కు
ఉత్తుత్తి పోస్టింగులు చెత్తచెత్త పోస్టింగులు
పసలేని పోస్టింగులు పనికిమాలిన పోస్టింగులు
పోనీలే పాపం అని కొట్టావా లైకు
అవుతావు మరినీవు అడ్డంగా బుక్కు
ఆలింకులు ఈలింకులు ఎక్కడెక్కడ్నుంచో లింకులు
వెబ్బుల్లోంచి గ్రూపుల్లోంచి బ్లాగుల్లోంచి గూగుల్లోంచి
ఊసుపోలేదని తెరిచావా చిక్కు
కళ్ళుమూసుకోనఖ్ఖర్లేనిదైతే నీ లక్కు
రిక్వెస్టులు యాక్సెప్టులు టాగింగులు షేరింగులు
అప్లోడులు డౌన్లోడులు వెయిటింగులు చాటింగులు
ఎడిక్టు అవకు బాబూ చెప్పనా నీకో ట్రిక్కు
పొదుపుగా వాడుకో పొందేవు లాభాలు పెక్కు

ప్రవీణ కొల్లి || సమాజం ||
సమాజమంటోంది
నేనో సాగర ప్రవాహమని!
నేనన్నాను
నువ్వో దాహం తీర్చని ఉప్పటి ద్రవమని!
నేననుకున్నాను
ఓ పదునైన పాళీ తయారు చేసుకుని
సముద్రాన్ని కలంలో సిరాగా నింపి
కసితీరా రాసెయ్యాలని….
సమాజం నోటితో నవ్వి,
నొసటితో వెక్కిరించింది.
“ఏంటని?” అడిగా
“ఏం రాస్తావేంటి?”, వ్యంగ్యం వుట్టిపడింది
“నీ గురించే రాస్తా…నీలోని మనుషుల గురించే రాస్తా”
పాళీ పదును పెడుతూ చెప్పా!
“మనుషులు నాలోని లవణాలు కాదా?”, హృద్యంగా నిలదీసింది!
హు....ఏ దప్పిక గురించి రాయను?
పదును తేలిన పాళీ గుచ్చుకుంది
చూపుడువేలు స్రవిస్తోంది
చట్రంలో చితికిపోయిన ఎందరో బతుకుల సాక్షిగా
తెల్లకాగితం రంగు మారింది….
( * August 12, 2011 రాసిన కవిత. హనుమంత రావు గారి, సమాజపు పెడ పోకడల మీద కవిత్వం రావాలి అనే పోస్ట్ చూసాకా, ఈ కవిత పోస్ట్ చేస్తున్నాను.)

అఫ్సర్ || నువ్వొచ్చీ రాని ఆరు ఝాముల రాత్రి ||
1
నీతోనా నీలోనా
నాతోనా నాలోనా
మాట్లాడుకుంటూనా
మాట్లాడకుండానా
మాటల్నీ మాటల్లేని క్షణాల్నీ కలిపేసి
ఈ చీకటి కింద రాలిన మల్లెల్లో కుప్పపోసుకుంటూ కూర్చున్నా.
2
వొక రాత్రి తరవాత
కొన్ని పరిమళాల క్రితం నువ్వెళ్ళిపోయావా
వొక నవ్వే నవ్వి వెళ్లిపోయావా
ఆ పరిమళంలో నేనొక పువ్వునై రాత్రంతా విచ్చుకుంటూ కూర్చున్నా.
ఆ నవ్వులో నేనొక చిన్ని తరగనై సుడి తిరుగుతూ వున్నా.
3
చివరి వాక్యం ఏమవుతుందా అని
వింటూ వింటూ వుంటానా
అదే నీ నిష్క్రమణ తరవాత నాలోపల మొదటి వాక్యమై
నన్ను తిరిగి రాస్తూ రాస్తూ ఈ రాత్రిని నా కంటి కింద దీపంలా వెలిగిస్తుంది
వద్దన్నా వచ్చి వెళ్లిపోయే నీ నీడల నిషా పహరాలో
ఈ దీపం వెలిగే గదిలో నిద్రపడుతుందా చెప్పు!
5
నీ నిట్టూర్పులు నా చుట్టూరా గాలి పటాలయి
ఎగిరెగిరి దిక్కులన్నీ చుట్టేసిన బిగి కెరటాలయి
ప్రతి గాలి అలకీ వొక కౌగిలి ఇచ్చేద్దామనుకుంటానా
వాటికీ నీ వయ్యారాలే తెలిసి, విస విసా ఎటో పారిపోతాయి.
దొరకనే దొరకవు కదా, ఎంత దూరమో పరుగెత్తించీ...
నా వొడిలో నువ్వు పేంచ్ పడిపోవే పతంగమా...?
అనుకుంటూ పగటి కలలోకే నా ప్రవాసాలన్నీ.
6
ఇంకేమీ తెలియదు ఎప్పటికీ తెలియదు
ఇది గుబులో దిగులో సుఖమో సంతోషమో!
ఎన్ని భాషలని నేర్చుకోను,
నిన్ను నాలోకి వొంపే ఆ కల కోసం!?
*12-07-2012

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)