పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, జూన్ 2014, మంగళవారం

Chandrasekhar Sgd కవిత

వేసవికాలంలో చెట్లు నీటికి కరువై కన్నీళ్ళను రాల్చడానికి బదులు ఆకుల్ని రాలుస్తూ ఉన్నాయి 24.6.2014

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jbfR69

Posted by Katta

Niharika Laxmi కవిత

( వానసినుకమ్మ) ఆకాశగంగమ్మ కన్నెర్రచేయమాకు రైతన్నల మీద నింగేదో నేల మీద అలిగినట్టుంది వానసినుకమ్మ నింగీ నేలనీ కలుపరావమ్మ ............. ఆషాడం వస్తనే ఉంది ముసురులే లేవమ్మ , రైతన్నరుణాలతో గింజలు ఎరువులు కొని దున్నుకొని సినుకమ్మ నువ్వోస్తవనే ఎదురు చూస్తున్నాడమ్మ, నేలంతా ఎండిపోతున్నది పెద్దమనసు చేసుకొని ఒక్కసారి వచ్చి నేలను తడిపిపోవమ్మ ..... పంటకు తెచ్చిన పురుగులమందులే రైతుకు దిక్కగును సినుకమ్మ నువ్వు రాకుంటే ... సొమ్ములన్నీ పెట్టి కౌలుతీసుకున్న రైతు ఆగమైతడు సినుకమ్మ నేలమీదకి రావమ్మ ! వనదేవతకు జాతరలే చేస్తాము రైతుల కష్టాలే గట్టెక్కితే కరుణించవమ్మ సినుకమ్మ ! ................................... నిహారిక (24-06-2014)

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nywY4o

Posted by Katta

Jabili Jayachandra కవిత

నవ కవితా కమలాలను కవి సంగమ సరోవరంలొ అందంగా అలంకరిస్తిఉన్న కవి యాకూబ్ గారికి వందనాలు

by Jabili Jayachandra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1yI8XiW

Posted by Katta

Pratapreddy Kasula కవిత

బివివి ప్రసాద్ కొత్త కవిత చదవండి http://ift.tt/1nywXxo

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nywXxo

Posted by Katta

Krishna Mani కవిత

దయనీయమైన కాలమాయే దయలేని వరుణుడికి కళ్ళు మూతలాయే ! అందుకే తిరిగి నా బాధను వ్యక్తపరుస్తున్నాను .అడ్మిన్ వారు సహకరించగలరని విన్నపం . సుక్క బొట్టు _________________________కృష్ణ మణి మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! పగిలిన నెర్రలమీద పొక్కిలి పెంకలాయే ఎదురుసూపుల కండ్లళ్ళ నెత్తురు జీరలాయే చెట్లకొమ్మల ఆకలికి ఆకుల అరుపులాయే పసి నవ్వులు మానిన లోకం ముసలిదాయే మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! అడవి జాతర మాని బొందలల్ల నీటిపోరులాయే వలసజీవులకు దిక్కుతోయక పీనుగుల పీకుడాయే సుక్క నీళ్ళకు గద్ద సూపుకు ఎండమావుల నవ్వులాయే బలిసిన దున్నల డొక్కల బొక్కలు బయటికాయే మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! అడవిరాజుల బలముదిగి జింకపిల్లల చెలిమిలాయే నల్లతాసుకు తోవ్వదక్కక కన్నపిల్లలె ఆకలాయే అడుగుజరగని మొసలి కాళ్ళకు గట్టిబురద అడ్డమాయే ఎండగొడుగున గడ్డి ఏర్లకు దూపదీరక తిప్పలాయే మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! కృష్ణ మణి I 15-04-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nywVFO

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను మాత్రం ఇద్దరిని (193 నుండి 211 వరకు)// 193. వెలుగులో పరిశ్రమిస్తున్న పగలు నేనే చీకటిలో విశ్రమిస్తున్న రేయిని నేనే తన చుట్టూ తాను పరిబ్రమిస్తున్న భూమి ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 194. శూన్యంలోకి శాటిలైట్లు పంపిస్తున్న నాగరికుడు నేనే భూమాతని కాలుష్యం చేస్తున్న అనాగరికుడూ నేనే సమతుల్యం లేని పలితం విషతుల్యం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 195. రాత్రి సైతం పూర్తిగ ఉండని విద్యుత్ సరఫరా నేనే పారిశ్రామిక అభివృద్ది చేస్తానంటూ ప్రగల్బాలు పలికేదీ నేనే ఉత్పత్తి మాట మరచేవి ఉత్తుత్తి ఎన్నికల హామీలు ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 196. కడుపు నిండని కళాకారుడు నేనే కీర్తికాంక్ష తరగని దాతనీ నేనే అర్ధాకలి తీర్చేది మృత్యువు ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 197. ఆలోచనలతో పదునెక్కిన మేధావి నేనే ఆవలింతలతో పరుపుదిగని బద్దకస్తుడూ నేనే ఆచరణకు నోచుకోని ఆవిష్కరణల గమ్యం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 198. ఆడబిడ్డలకు ఆంక్షలు పెట్టే సమాజాన్ని నేనే వాడికేం మగాడంటూ వెనకేసుకొచ్చే కుటుంబాన్ని నేనే సభ్యత సంస్కారం మరిచాక మానవుడూ దానవుడూ ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 199. సర్వాంతర్యామికి గుడికట్టిన స్థల పురాణం నేనే సర్వదర్శనానికి వెలపెట్టిన ధర్మకర్తనూ నేనే పేదలకి దర్శనమీయక అభాసుపాలైంది దేవుడొక్కడే నేను మాత్రం ఇద్దరిని. 200. శవాలు దొరికిన చుండూరు దమనకాండ నేనే సాక్షాలు దొరకని న్యాయ పరిశోదన అరణ్యకాండ నేనే దురాగతాన్ని ఎండగట్టలేని దృతరాష్ట్రని నీతి ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 201. ఉద్యమాన్ని ముందుండి నడిపిన సాహిత్యాన్ని నేనే బండబూతులు రాసి కవినన్న కపిని నేనే చరిత్రకి సాక్ష్యం సమకాలీన సాహిత్యం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 202. విద్య వైద్యం ప్రాధమిక హక్కులకి పైకం పెట్టిన ప్రభుత్వం నేనే అన్నీ ఉచితమంటూ మానిఫెస్టో ప్రకటించిన రాజకీయం నేనే నాకింత బిక్షవేసి ఊరిని దోచుకోమన్న ఓటరు ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 203. పట్టెడన్నం బిక్ష వేయని స్వార్ధపరుడు నేనే దేవుడికి ముడుపులు కట్టే బక్తుడిని నేనే మానవుడే మాదవుడని మరిచింది లోభి ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 204. కవిగా నీతిభోదలు చేస్తూ అఃతర్జాలంలో నేనే వక్రబుద్దులతో సమాజంలో మృగాడిగా తిరుగుతూ నేనే దొరకనులే అన్న బ్రమలో ఉండేది దొంగ ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 205. స్వ పరిపాలన నినాదమై నేనే కుటుంబ పాలన నిర్వహిస్తూ నేనే తీరిన కోరిక ముఖ్యమంత్రి పదవి ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 206. ముంపు గ్రామాలు ఆంధ్రావని తేల్చిన కేంద్రప్రభుత్వ ఆర్డినెన్సు నేనే ఆగ్రామల విద్యార్ధులకు బస్పాసులివ్వని తెలంగాణ ప్రభుత్వాన్నీ నేనే ఉద్యమాలు ప్రభుత్వాల నడుమ నిర్బాగ్యులైన నిర్వాసితులంతా ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 207. MRPలకు అమ్మకాలు నెరిపే చిల్లర కొట్టు నేనే discountలు ఆఫర్లు ఇచ్చే బడా బడా మాల్సు నేనే FDIల పుణ్యమాని సగం అమ్ముడుపోయిన భారతావని ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 208. ఎర్రచందనం ఎగుమతిచేసే స్మగ్లరు నేనే హవాలాలో పార్టీఫండు పంపే రాజపోషకుడు నేనే దొరకడెన్నడూ స్మగ్లరు; దొరికేది కూలీ ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 209. విద్యార్ధులకి నీతిపాఠాలు చెప్పే గురువుని నేనే దొంగ సర్టిఫికేట్లతో చదువుకున్న B.E.D విద్యార్ధి నేనే గుణం లేని గురువులు చెప్పే పాఠంలో మిగిలింది వృత్తి ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 210. సంక్రాంతి పండగని దేశ విదేశాల నుంచి వచ్చేది నేనే జూదమే ప్రతిష్ఠగా జీవితాన్ని పందెం కాసేది నేనే పండగనే పందెం చేయగలిగింది భీమవరం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 211. సంక్షేమ పధకాలు మా ఘనతంటూ ప్రకటించే పార్టీ నేనే తలసరి అప్పులు, లోటు బడ్జెట్ల ప్రభుత్వాన్ని నేనే ఎవడబ్బ సొమ్మంటూ ప్రశ్నించలేనిది గొర్రలమంద ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని.......23.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lMS2XZ

Posted by Katta

Gubbala Srinivas కవిత

శ్రీనివాస్ !! రమణీయ విశ్వం !! ------------------ సంధ్యపొద్దు నేలవాలి అరుణవర్ణం అంబరాన్ని పాకింది. కడుపునిండి గువ్వలగుంపు ఇంటిదారి పట్టి నింగికే అందమొసగే. నీలిమబ్బు.. గాలివొడిలో ఊయలూగె చిత్రాలు కనులకే కనువిందు. అలసిన ప్రాణుల అలసట తీర్చుటకై వెన్నెల పరుపుని సిద్దం చేస్తుంది జాబిల్లి. ఊగే తారకలు అక్కున చేరి చక్కిలిగింతలు పెడుతున్నాయి. మనోహరం..సుమనోహరం.. ఈ విశ్వం ! (24-06-14)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nA6JJu

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

గెలవలేక... ఆకర్శణాక్షణాలను అపురూపంగా లెక్కించి ఆనందమంటూ తనువంతా తాకట్టుపెట్టి అక్కరకు రాని అరవిరిసిన అందం కోసం అనవసర తాపత్రయం అదిమిపెట్టగలనా ప్రేమ రుచిలేదని ప్రాయాన్ని పణంగాపెట్టి పరువాలను సెలయేటి ధారలతో చుట్టి పనికిరాని పిరికి దేహానికి పవిత్రతంటూ పసుపురాసి గంధతో పరిమళింపజేయనా వాడిపోనిది వలపని ఆప్యాయతనాశపెట్టి వేడి వయసుకు తీపి కలల గంతలు కట్టి వాంచల వలని చేదించి ఇదే స్వేచ్చంటూ వెర్రిమనసుకుకిదోవ్యాదని మభ్యపెట్టగలనా గుబులుగుండెలో చిగురుటాశల గూడుకట్టి గమ్యం చేరకముందే మెదడుకు గొలుసుకట్టి గాడితప్పాక దిష్టి తగిలి గాలి సోకిందంటూ గెలువలేక విధిరాత ఇదని సర్దిపెట్టుకోగలనా

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v01Ayq

Posted by Katta

Sriramoju Haragopal కవిత

పాఠశాల అమ్మయింది బడి నాకు చిన్నప్పటిసంది నేను బడిలోనే చదువుకునేటప్పుడయినా, చదువుచెప్పేటపుడైనా బడి నాకు తల్లి కథలు చెప్పిచ్చుకునే ఉపేందర్ గాడు. ఏభై ఏండ్ల తర్వాత కలిసిన కబడ్డిగోస్త్ రంగడు గులేరు కొట్ట నేర్పింది, కోతికొమ్మచ్చి ఆడించింది వాడే మట్టమీద బెల్లమైన బాల్నర్సయ్య మనసుకు మాలిమైన క్రిష్ణగాడు ఆటలల్ల సోపతి మజీద్ గాడు బడికి వస్తపోత ఉప్మ,పాలు కడుపుల విషమైనపుడు పానం కాపాడిన చాకలి రాములమ్మ వొదినె కంచుక పుడితే కాపాడిన కుర్మమల్లమ్మ పెద్దమ్మ కష్టాల్ల ధైర్యం జెప్పిన కాపురామయ్య పెదనాయిన ఆకలై ఏడిసినపుడు కారంకూరైన పెదనాయినమ్మ ఎంత వేదాంతో అంత బతుకుతెలిసిన మనిషి బడికి పొయే తొవ్వల అన్ని అరుగులు అమ్మయినయి బిడ్డ బాగున్నవా అని రోజూ పల్కరించినయి, ఏడ్సుకుంట పోతుంటే వూకుంచినయి పాలు మరిపించాలని ముసాంబ్రం తాపిన అమ్మ బాధ యాదికొస్తే బతుకు అమ్మ పాలకుతే సేపులొచ్చిన ఏ అమ్మని జూసినా అమ్మే యాదికొస్తది చిలికిన చల్లమీద పేరుకున్నవెన్ననా అరచేతుల్ల అమ్మే పాలకంకుల జొన్నకాపిళ్ళు, పజ్జొన్నగట్కల పచ్చెన్నముద్ద అమ్మే వానల్ల తడువకుండ అన్నిండ్లు కొప్పెరయినయి ఎండల దూపకు చల్లటినీళ్ళు దోసిళ్లు నింపినయి ఆటల్ల,పాటల్ల వాగుల వూటచెలిమయింది బడి నవ్వుల్ల, ఏడ్పుల్ల గొడుగుపట్టిన మొగులయింది బడి ఎన్నిదుఃఖాలు వొడగట్టింది బడి ఎన్ని బాధలు వొడిపించింది బడి ఆటలు నేర్పి, పాటలు నేర్పి, మాటలు నేర్పి నన్ను బతికించిన జమ్మిచెట్టు బడి పోతున్న పానం పట్టితెచ్చింది బడే బతుకుప్రాణమైంది బడే కాపుదనపు ఇండ్లల్ల పొద్దుపొడిచి బువ్వచుక్కైంది బడి వాగుల వూరిన వూటచెలిమై మనసుదాహం తీర్చింది బడి సందెవాకిలితీసిన వాకిట్ల వేపచెట్టై ముచ్చట్లాడింది బడి రాత్రంత భయం,చీకటి, నిద్రల్ని కప్పి ఒక్కటే దుప్పటై కాపాడింది బడి ఎంతమంది స్నేహాల్నిచ్చింది బడి ఎంతమంది కన్నకష్టాల్ని చూపింది బడి నన్ను దుఃఖంల, నవ్వుల ఒక్కతీర్గ జూసిన మంచి మనసున్న నేస్తం బడి బడి నాకు నా కన్నీళ్ళ తాళపత్రగ్రంథం బడి నాకు నా మరణాంతర వీలునామా బతుకనేర్పింది బడి బతుకు నేర్పింది బడి

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lLUkVM

Posted by Katta

Kamal Lakshman కవిత

కమల్ II సూర్యోదయం II సూర్యోదయం... సూర్యోదయం... సర్వ మానవాళికి ప్రాణమయం శుభోదయం... శుభోదయం శుభ శకునాల ఆశల మయం అరుణోదయం....అరుణోదయం జగతికి వెలుగులనొసగె జ్ఞానోదయం ప్రేమోదయం ... ప్రేమోదయం ఊహల పులకింతల మాయాజాలం నవోదయం ... నవోదయం సరికొత్త ఆలోచనల సమాహారం మరి .... మొదలెడదామా ప్రశాంత చిత్తంతో పరుగులెడదామా వడి వడి గా వేగం తో అవిశ్రాంతంగా... అహరహం .... అలుపెరగక .... 24. 06. 2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nxQfmF

Posted by Katta

Rajaram Thumucharla కవిత

కవి సంగమం -గ్రూప్ కోసం చదివిన కవిత్వ సంపుటి : - "34" సంపుటి పేరు :- "దుఆ"- (ప్రగతిశీల ముస్లిమ్ కవిత్వం) కవిత్వ సంపుటి రాసినది : - "పఠాన్ రసూల్ ఖాన్ " పరిచయం చేస్తున్నది :- "రాజారామ్.టి " మీనార్ నుండి ఎగిరి దొంగ దెబ్బకు క్షతగాత్రమై విలపించే పావురాయి చేసే "దుఆ" నే ఈ రసూల్ ఖాన్ కవిత్వం" "బాబ్రీలో నీవు చేసిన గాయం ఇంకా మాననే లేదు గుజరాత్ లో నీవు నరికిన శరీరం అతకనే లేదు వీలైనప్పుడల్లా నా గాయాలను చిదిమి రాచపుండు చేశావు నా అస్తిత్వానికీ నీ అహంకారంతో దేశ ద్రోహం పులిమావు" (దుఆ) ఎక్కడా విన్నానా స్వరం? ఎవరివా వాక్యాలు?-అని ఆలోచిస్తూ ఈ వాక్యాలు "మీనార్" నుంచి నాకు వినబడ్డాయా లేక ఎక్కడైనా చదివానా అని అనుకుంటూ అక్కడ అడుగుపెట్టాను. ఆ బంగారు ముఖద్వారం ప్రాంగణంలో గాజులుఅమ్మే వాడి (bangle seller) సవ్వడులు స్వాగతం చెప్పిననట్లు అనిపించింది.నిరంతరం కవిత్వమై ప్రవహించే యాకూబ్ దంపతులు,పాత ఙ్ఞాపకాల పరిమళం వెదజల్లగానే గుర్తు పట్టిన కవి దిలావర్, వహ్వ అనిపించేలా ఉర్దూ కవిత్వ నజరానానందిస్తున్న వాహేద్,తన వాదాన్ని ఎవ్వరేమనుకున్నా ధైర్యంగా వినిపించే స్కైబాబ, కవిత్వ నిర్మాణ శిల్పాన్ని కొత్తగా వింగడించి చెప్పే నారాయణ శర్మ యువ కవులు తిలక్,విజయ కుమార్,కృష్ణమణి,అందర్నీ జీరో డిగ్రీ లోకి తీసుకెళ్ళే మోహన్ రుషి ఇలా అందరి మధ్యన వున్నప్పుడు ఒక యువకుడు తన కవిత్వ పుస్తకాలు పంచుతూ నాకు కూడా ఇచ్చాడు.ఎందుకో తెలీదు కాని ఎవర్ని అడగని ప్రశ్న అతన్ని అడిగాను. ఆవ్యక్తి నా ప్రశ్నకు బదులుగా ‘ఆటో మెకానిక్’ ని అన్నాడు.అంతే మనసంతా అతన్ని గురించే ఆలోచించడం మొదలెట్టింది .ఏం చదివాడో తెలీదు కానీ కవిత్వం అతని ఆరో ప్రాణం అని మాత్రం అర్థమయ్యింది నాకు. అసురా,సిధ్దార్థ,సంగిశెట్టి,సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నాళేశ్వరం శంకరం ,జగన్ రెడ్డి, మోహన్ రుషి, యాకూబ్, స్కై బాబ ఇందరి మధ్యలో వున్నా నాలో ఆ వ్యక్తి ఆలోచనే నన్ను ఒంటరి ద్వీపం లోకి నెట్టేసింది.యంత్రాలను మరమ్మత్తు చేసే అతను జీవితాన్ని మరమ్మత్తు చేసే కవిత్వం వైపు మొగ్గడం కొంచెం విస్మయానికి గురిచేసే సందర్భమే అయినా అలాంటి సందర్భాలు అనేకం గుర్తుకొచ్చి ఆ వ్యక్తి కవిత్వంలోకి వెళ్ళిపోయాను. మాటల్ని నిప్పు కణికెల్లా విసిరే శక్తి కల ఈ కవి పేరు పఠాన్ రసూల్ ఖాన్. అతని కవితా సంపుటే "దుఆ" “నేనేం చేయాలో నీ అధికారం చెబుతుంది నేనెలా వుండాలో నీ అజమాయిషి చూపుతుంది స్వతంత్ర దేశంలో వున్నా బానిస బ్రతుకు నాది” ముస్లిమ్ ల అస్తిత్వానికీ పై వాక్యాలు వారిపై ఈ కవి రాసిన శ్వేత పత్రానికీ కవిత్వరూపమేమో అని అనిపించకమానదు. "శత్రువు ఎంత బలమైన వాడైనా సహనంతో ఎదుర్కోవాలని,పగతో రగిలే వాడికి ప్రేమను పంచాలని,దౌర్జన్యం చేసిన వాడికై ‘దుఆ’ చేయమన్న "-ప్రవక్త వాక్యాలను ఈ కవి అక్షరాలనమ్మాడు."ప్రపంచం బాగుండాలి అందులో నా దేశం బాగుండాలి"-అని ఈ కవి అనుకుంటున్నాడు కాబట్టే 'నా లక్ష్యం ప్రేమైక భారతం "-అని అనగలిగాడు.ఈ రసూల్ ఖాన్ గొప్ప కవిత్వం రాశాడని కాదు, రాసిన దాన్ని చిత్తశుధ్దితో రాశాడని,తన వృత్తిని మించిన ప్రవృత్తిని కలిగివున్నాడని ఈ శీర్షికలో పరిచయం చేయాలనిపించింది. ఈ కవికీ ఆశావాద దృక్పథం అధికమేమో?.అందుకే భారతీయ చరిత్రను వక్రీకరించిన వైనాన్ని గుర్తించి "ఇంద్రధనుస్సులో లేని వర్ణంలా చరిత్ర పుటల్లో నన్ను వర్ణించాలనుకున్నావు"-అని అంటూ "నా తనువుకు ఎన్ని గాయాలైనా తలవంచక నిలుస్తాను కొత్త చిగురునై జనిస్తాను"-అని అనగలిగాడు "కొత్తచిగురు"-అనే కవితలో.ఖాదర్ మొహిద్దిన్ 'పుట్టు మచ్చ'లో ఆటలక్కూడా మతం అంటగడుతున్న దేశం దుస్థితిని గురించి కలత చెందితే ఈ కవి "నాకు అంటని వర్ణమేదో ఒంటినిండా పులుముతున్న భావన ప్రతి రాత్రి పీడకలై వేధిస్తుంది నాది కానిదేదో నాలో చూపిస్తూ నీ నీడ కూడా భయపెడుతుంది"-అని వాపోతాడు.భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ముస్లిమ్ ల పాత్ర కూడా గణనీయమైనదే.ఆ విషయాన్ని "నీ స్వేఛ్చా గీతిక వెనుక ప్రవహించిన నెత్తురు నాదే "-అన్న వాక్యాల్లో వ్యక్తం చేసి, అయినా తనను పరాయివాడిగా చూసే నైజాన్ని నిరసిస్తాడు "కొత్త చిగురు"-అనే కవితలో ఆలోచనాత్మకంగా . మతసామరస్యానికీ మంట పెట్టాలని చూసే వాళ్ళని "మౌనంగా చూస్తున్నానని చులకనగా చూడకు మౌనం ముక్కలయితే చరిత్రే లేకుండా పోతావ్"-అని హెచ్చరిస్తాడు."చార్మినార్"-ని భాగ్యనగ కీర్తికిరీటంలో వన్నె తగ్గని కలికి తురాయిగా పోల్చడమే కాదు గతానికీ వర్తమానానికి మధ్య చరిత్ర చెక్కిన శిల్పంగా ఊహా చేస్తాడు.తాము వున్నచోటనే తమను పరాయి వారిగా చిత్రించే చరిత్ర రచన ,విధ్వంస కుట్ర తెలుసుకున్నామని ,తమ మౌనం బద్దలయితే చరిత్ర సాక్ష్యంగా కాటికి పోయిన మతోన్మాద శక్తుల ఉనికిలేని తనాన్ని తెలుసుకోమని మరోమారు గతించిన చరిత్రను గుర్తుచేస్తాడు. తమ సాంస్కృతిక చారిత్రక ఆనవాళ్ళను తుడిచిపెట్టే ప్రయత్నాన్ని కవిత్వం తో ప్రతిఘటిస్తాడు. సామ్రాజ్యవాదం,అగ్రరాజ్య దురహాంకారం,అవసరమనుకున్నప్పుడు ఒకదేశంలో రెండు మతాల మధ్య,రెండు పొరుగు దేశాల మద్య చిచ్చుపెట్టడం ఇవన్నీ ప్రపంచీకరణ దుర్లక్షణ పర్యావసానాలే.ఈ ప్రపంచీకరణ ప్రభావాన్ని కూడా ఈ కవి పసిగట్టినట్టున్నాడు.అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష వేయి తలల నాగుపాము.ఆ పాము పడగలో వర్ధిల్లిన జియోనిజమ్ వారసులు ఇజ్రాయీలు పాలస్తీనా ప్రజలపై జరిపిన దురాగతాలను ఈ కవి వినో చూసో తన అక్షరాయుధాల్ని ఎక్కుపెట్టాడు.పాలస్తీనా లోని గాజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండిస్తూ "గాయాల గాజా"-అనే కవిత రాశాడు. "అవును అక్కడ వెన్నెల హాయిని మంటలు కాజేశాయి లాలి పాడే చోట పాడె మీద ఏడ్చే తల్లుల రోదనలే ఎటు చూసినా ఉన్న చెట్టుకే చీడలు పడుతుంటే కొత్త చిగురులెక్కడ! విరిసే మొగ్గలకు చోటెక్కడ నీ దురాక్రమణ మంటలకు అమాయక ప్రజలను చిరు మొగ్గలను ఆహుతి చేస్తావా! చిరు హృదయాలను చిదిమి చిద్విలాసమా నీచుడా! ఏం... జాతిరా నీది" (గాయాల గాజా) ఇలా రసూల్ ఖాన్ యుధ్దనీతిని కావాలనే వదిలేసి చిన్నపిల్లల్ని,ఆడవాళ్ళని సైతం ఇజ్రాయిల్ మారణకాండలోవాళ్ళను భాగం చేస్తుంటే సహించలేక "ఉగ్రవాది ఇజ్రాయిల్ కు కర్రు కాల్చి వాత పెట్ట"మని కోరడమే కాదు "గాయపడ్డ గాజా కు మందు నివ్వు"-అని సిగ్గుని కోల్పోయి చూస్తున్న మిగిలిన ప్రపంచాన్ని కోరడమే కాదు అలాంటి ప్రపంచంలో తాను ఉన్నందుకు సిగ్గుపడతాడు. బాబ్రీ తప్పటడుగుల్ని తప్పని సర్దుకున్నాగుజరాత్ మారణకాండను అడ్డుకోలేని అప్పటి కేంద్ర అధికార పార్టినీ పరోక్షంగా "'నా గుండెలోని బాధలను నీ"హస్తం" స్పర్శతో మరిచాను"-అని ప్రస్తా విస్తాడు.మాములుగా ఆ పార్టీకే ముస్లిమ్ ఓటు బ్యాంక్ మొగ్గు చూపుతుందనే అభిప్రాయాన్ని కూడా ఈ కవి బలపరుస్తున్నట్టుగా " నీకై ఓటునవ్వడం తప్ప సంతోషం ఎరుగని నాకు"-అనే వాక్యాలు ధృవపరుస్తాయి. "నా రక్త మాంసాలను కూర్చి అన్ని సమకూర్చిన రిక్తహస్తాలు" చూపిన వార్ని కనికరం లేని ప్రశ్నలుగా ఈ కవి గుర్తిస్తాడు. "ఐస్ బాబు ఐస్ బాదం ఐస్ ఆరెంజ్ ఐస్ చల్ల చల్లని ఐస్ రండి బాబు రండి" ఈ మాటలు సైకిల్ వెనుక స్టాండ్ మీద ఒక డబ్బాని ట్యూబ్ లతో జారిపోకుండా కట్టుకొని ఒక చిన్న డబ్బాని తాడుతో తిరిగే చక్రానికి అనుసంధానించి అందర్ని ఆకర్షించే ఒక రకపు శభ్దాన్ని సృష్టిస్తూ పుల్ల ఐస్ అమ్మే ముస్లిమ్ ల ఆకలి తాపం చిత్రించిన కవిత లోనివి. "మంచులా కరిగే కాలం మాపై కక్ష కడితే తల్లిలా ఆదరించిన గ్రీష్మం జీలిగా నా తల నిమిరింది" అని మండే ఎండా కాలం కూడా తమని తనవారిగా తలపోస్తే తోటివారు తమను పరాయి వారుగానే ఆలోచించారనే భావనని ఈ కవి స్ఫురింప చేస్తాడు. ఏదయినా ప్రాణం వున్నదైనా,లేని దయినా అవసరాన్ని బట్టో ఆలోచనను బట్టో చూసే చూపును బట్టో తన రూపాన్ని ఎలా మార్చుకోగలదు?.కానీ పావురం ఆలయంలో వుంటే సామరస్యపు రూపం,చర్చిలో అది శాంతి కపోతం కానీ మసీదు పై వాలగానే మత పావురం.ఇది ఎట్లా సాధ్యం?.వస్తువు వొకటే.కానీ అది చేరిన ప్రదేశం వేరే.అందువల్లే దాని రూపం మసీదు మీద వాల గానే మతంగా మారిందనే ఒక వర్గ ఆలోచనని ఈ కవి ఎత్తిచూపిస్తూ ముస్లిమ్ లపై వున్న వివక్షను అద్దంలోని బింబంగా పావురంతో ప్రతిక్షేపిస్తూ దృశ్యమానం చేస్తాడు. ముస్లిమ్ పావురాళ్ళను బౌద్ద రాబందులు తరిమే దృశ్యం ఎక్కడ చూశామా?-అని మనకు అనుమా నం రావచ్చు.అహింసా పరమోధర్మః అని విశ్వసించే బౌద్ద మతంలో కూడా పరమత సహనం లేని కొందరు మయన్మార్ లో ముస్లిమ్ లపై దాడి చేసిన సన్నివేశం ఇంకా ఎవరు మరచిపోలేదు.ఆ సం ఘటనను రసూల్ ఖాన్ "యా అల్లాహ్"-అనే కవితలో గుర్తుచేస్తాడు. "దీపపు కాంతి లేనిమా ఇళ్ళు నీవు పెట్టిన నిప్పుతో ఊరికే దివిటీలుగా మారాయి చెయ్యేత్తి ప్రార్థిద్దామంటే మా వైపు జాలిగా చూశాయి" ఇలా ఈ కవి మయన్మార్ లో జరిగిన దాడిని ,అక్కడ ముస్లిమ్ ల నిస్సహాయతను ఒక గొప ఊహతో తెలియచేస్తాడు. ముస్లిమ్ పావురాళ్ళను బౌద్ద రాబందులు తరిమే దృశ్యం ఎక్కడ చూశామా?-అని మనకు అనుమా నం రావచ్చు.అహింసా పరమోధర్మః అని విశ్వసించే బౌద్ద మతంలో కూడా పరమత సహనం లేని కొందరు మయన్మార్ లో ముస్లిమ్ లపై దాడి చేసిన సన్నివేశం ఇంకా ఎవరు మరచిపోలేదు.ఆ సం ఘటనను రసూల్ ఖాన్ "యా అల్లాహ్"-అనే కవితలో గుర్తుచేస్తాడు. "దీపపు కాంతి లేనిమా ఇళ్ళు నీవు పెట్టిన నిప్పుతో ఊరికే దివిటీలుగా మారాయి చెయ్యేత్తి ప్రార్థిద్దామంటే మా వైపు జాలిగా చూశాయి" ఇలా ఈ కవి మయన్మార్ లో జరిగిన దాడిని ,అక్కడ ముస్లిమ్ ల నిస్సహాయతను ఒక గొప ఊహతో తెలియచేస్తాడు. "మా సహనమే నీ బలం మా మౌనమే నీ ఆయుధం స్వార్థం అంటని సత్య ప్రియులం కాలుతూ వెలుగు నిచ్చే ప్రమిదలం వెలుగు పూలను వేటాడాలని చూస్తే" కపట నీతి కడిగివేయబడుతుందని,దౌర్జన్యం దహించి వేయబడుతుందని "వెలుగు పూలు "-అనే కవితలో ఒక వేదనతో కూడిన సత్యాన్ని చూపుతాడు. ఈ కవి ఇస్లామ్ లోని కొన్ని ప్రగతిశీలం కానీ అంశాలను సైతం నిర్మొహమాటంగా ఖండిస్తాడు. పూజారి వ్యవస్థ లేని ఇస్లాం లో పూజారుల్లా చెలామణి అవుతున్న అగ్రవర్ణ బీజ మూర్ఖుల్లారా వెలుగును దాచే వారల్లారా దీపం క్రింది నీడల్లారా వెన్నెలను పంచాలి పట్టి ఆప కూడదు శాంతి సందేశం ఇవ్వాలి" అని అనడమే కాదు ఇస్లామ్ అంటే ఇలా చెబుతాడు. ఇస్లామ్ అంటే? మతం కాదు మానవ జీవన విధానం ధార్మిక విఙ్ఞానం బానిస సంకెళ్ళను తెంచిన సమానత్వపు ఆయుధం కాఠిన్యాన్ని కడిగిన కరుణామృత సాగరం హృదయాలను కలిపిన ఆత్మీయ నేస్తం" ఇలా ఇస్లామ్ మౌళిక ధర్మాలను కవిత్వం చేశాడు ఈ కవి రసూల్ ఖాన్. ప్రగశీలం అని అనని బురఖా సాంప్రదాయాన్ని సమర్థించే అంశాలు కూడా ఈ కవి చేతిలో కవిత్వం అవ్వడం అతని ప్రగతి శీలత్వానికీ అడ్డంకేమో? కొన్ని పేలవమైన పంక్తులు ,కవిత్వంగా మారని వాక్యాలు ఈ కవి కవిత్వం రాయాలన్న చిత్త శుధ్ది ముందు ఓడిపోతాయి.ఈ కవి మంచి చదువరి కాగలితే మంచి కవిత్వ సృజన చేయగడు.అతని ముందటి అఫ్సర్,యాకూబ్,దిలావర్,ఖాదర్ మొహిద్దీన్,మహజబీన్,స్కైబాబా,షమీఉల్లా మున్నగు కవులను చదివి అర్థం చేసుకొని కవిత్వం నిర్మిస్తే , కవిత్వ శిల్ప రహస్య నిర్మాణం తెలుసుకోగలిగితే మైనారిటీ ముస్లిమ్ వాద సాహిత్యానికీ మరో ఆణిముత్యం దొరికినట్టే. "తురకోళ్ళకు తెలుగు కవిత్వమా? అని నవ్వే విషపు ముళ్ళ మధ్య విరబూసిన వెలుగు గులాబీ " అయిన పఠాన్ రసూల్ ఖాన్ ని అభినందిస్తూ..వచ్చే మంగళవారం మరో సంపుటితో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T3YLQy

Posted by Katta

Chi Chi కవిత

_స్వాధీనం_ ఇంతవరకేమీ ఆలోచించనట్టు మాటంటే ఏంటో తెలీనట్టు చర్యప్రతిచర్యల అవగాహనా శూన్యమేదో నిత్యం ఆవహించుకుని కారణలేమితో కల్పించుకున్న సముపార్జనకు విడుదలగా పట్టుకుంటే.. పట్టుకునే ఉందది!! దాని పట్టునొదిలి సాగుతున్నదంతా కారణమనుకునే కల్పితంలో ఆలోచనలే మాటలే చర్యప్రతిచర్యలే కార్యాలే అవగాహనగా!! అద్భుతం శూన్యానికి సర్వానికి మధ్య అవగాహనో ఆలోచనో నిలిస్తే చెరిగిపోతోందదే నిత్యంగా అవగాహనో ఆలోచనో.. కల్పితమూ సత్యమై స్వాధీనం మిగులుతూ!!_________(24/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pbPipu

Posted by Katta

Rajeswararao Konda కవిత

జీవితంలో ఏదో సాధించాలని ఏవోవో చదువులు చదివాను నేను చదివిన ఏ చదువూ నాకు కూడు పెట్టలేదు కాని చదువుతో పాటు కొంచెం కొంచెం సంస్కారం నేర్చుకున్నా అదే నాకిప్పుడు కొంచెం కూడు పెడుతోంది నేస్తమా..!

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qFmup0

Posted by Katta

Rajeswararao Konda కవిత

ఏ మన్మధుడు సృష్టించాడో నాకోసం ఈ బంగారాన్ని...! //24.06.14//@ రాజేష్ @

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nyKbsB

Posted by Katta

Sudheer Bathula కవిత

నువ్వెక్కడ ముందు పరిగెడతావో అని నీకంటే ముందు ఆధిక్యం కొద్ది పరిగెత్తే కాలం... తానేక్కదిదాక పరిగేడుతుందో చూద్దాం అని తనకంటే వెనక నిల్చుని అలసత్వం ప్రదర్శించే నువ్వు .. జీవితకాలానికి కొలమానం లేని కాలానికే ఇంత ఆరాటం ఉంటే... కాలానికి ఏమాత్రం తూగని జీవితకాలం నీది... మరి నీకెంత ఉండాలంటావ్ ?????? నీ బతుకును బతికించుకునే ఆరాటం...!!!!! --సుధీర్

by Sudheer Bathula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1yG2cOx

Posted by Katta