పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, ఏప్రిల్ 2014, ఆదివారం

Venkat Jagadeesh కవిత

ప్రభూ ! ప్రేమలో ఒక మహత్తరమైన దాన్నేదో కలిపావు... ఒక గొప్ప బాధ తో పాటు అంతులేని ఆనందంతో మిళితమై ఉంటుంది అది నువ్వు నన్నిందుకే ఈ లోకానికి పంపావా ? విరిగిన హృదయపు ముక్కలను వెతుక్కుంటూ రోదిస్తున్న నన్ను చూసి పరిహసిస్తున్నావా ? ఎవరికి నా కన్నీటిని ఆపే శక్తి ఉంది ? ఎదైనా చేయగలిగిన నీవు మా మద్య గోడలు నిర్మించావు.... ప్రభూ ! నే గొంతెత్తి పిలుస్తున్నా ! నువ్వు నిర్మించిన ఈ గోడలను పగలగొట్టే శక్తిని ఇవ్వు ! నేను ఏమి కోరాను నిన్ను ? ఒక గొప్ప ఇంద్రధనుస్సును సృష్టించమన్ననా ? దివ్యమైన తారలతో కూడిన అకాశాన్ని ఇవ్వమన్ననా ? నువ్వే కదా ! కోరకుండానే అవన్నీ ఇచ్చావు అన్నింటిని ఇచ్చి , నా హృదయాని జ్వలింప చేసేది ఏదో నా దగ్గర నుండి లాగేసుకున్నావు ! ఏ ?

by Venkat Jagadeesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jCn80T

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || ఆమె, అతని ప్రాణం || ఏదో కావాలని, ఎంతో చెప్పాలని ఉంటుంది కానీ అర్ధవంతమైన పదాలు గుర్తుకు రావు. మనోభావనలను ఆమెకు కనులారా చూపాలని ఉంటుంది. క్షణం క్షణం ఆమెతో గడిపినంతసేపూ ఆ క్షణాలన్నీ అమూల్యమే, కానీ మాటలు రావు. మనసు తత్తరపడుతుంది. ఏమీ చెయ్యలేని స్థితి. అతని అంచనా ..... మనఃస్థితి మాత్రం "ఆమెకు తెలిసేలా ప్రేమించగలుగుతున్నానా!" అనే ఆమె, అతని మనోహరిణి అతనికి అన్నీ .... ఇంకా ఎన్నో అతను జీవిస్తుందే ఆమె కోసమే అన్నంతగా. అతని కోరిక, ఆమె చొరవ, చేరువ .... సమర్పణాభావన ఆ కురుల సుఘంద పరిమళాలు పరిసరాలలో వ్యాపించి తడబాటుకు కారణం కావాలని ఆ మాయలో పడిపోవడంలోని ఆనందం పొందాలని ఎప్పుడైనా ఆమె, ఒక్క మాట .... అంటే వినాలని "నీతో నే ఉంటాను. మన ప్రేమ బలపడేంత సాన్నిహిత్యం వరమిస్తాను" అని, .................... ప్రేమ వాగ్దానం చేసేందుకు .... సిద్దం గా, "ప్రతి రోజూ నిన్ను .... మరింతగా ప్రేమిస్తాను." "నువ్వే నా ప్రాణం .... నీవే నా అన్నీ" "నేను జీవిస్తుందే నీ కోసం!" "నీ ముఖాన ఆ ప్రకాశం, ఆ చైతన్యం ఆ పరిమళం, కాలాంతం వరకూ నా సొంతం కావాలి" అనాలని. 13APR14

by Chandrasekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kMfEwa

Posted by Katta

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే. ఆడి ఆడి అలసిన పోయిన నెమలి ముద్దాడే ఆడ నెమల్ని ముద్దాడే పాడి పాడి మూగపోయిన గొంతును ముద్దాడే కోయిల గొంతును ముద్దాడే... umith kiran Mudhigonda

by ఉమిత్ కిరణ్ ముదిగొండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1if85KO

Posted by Katta

Sky Baaba కవిత

మెలకువ - - - - - పరుపు మెత్తదనం హాయినివ్వడం లేదు పచ్చికను కోల్పోయిన చింత నాది * నువ్వు చదివిన కవితా పాదమే అంతిమమనుకోకు చిత్తులో దాని వెర్షన్స్‌ ఎన్నో ఉన్నాయి * లోకం పల్లమై లాగుతూన్నది సముద్రంలో కలవడం ఇష్టం లేకే వంకలు పోతున్నాను * ఎవరి లెక్కలు వారికున్నాయి లెక్కలు లేనివాడే కదా మహా ఋషి * కొండ చివరాఖర్న కూచొని గొంతెత్తాను గ్రహ శకలాలన్నీ ఊసులు పోతున్నవి * మధువుతో మత్తిల్లి మనసులో గూడుకట్టుకున్న గోసలన్నీ పాడుతున్నాను ఈ రాత్రి ప్రకృతి మౌనంగా దుఃఖిస్తున్నది

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hCs7jT

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || అభౌతిక గీతం ! || నదుల తీరంలో ఏటవాలుగా నీడలు నీడలతో ఆడుతూ అలలు నీ పాదాలను స్పృశిస్తూ యేరు పరవశిస్తూ గులకరాళ్ళు ! ఎన్నీల ను కన్నీళ్ళుగా మారుస్తూ ఆమె ..? ఆ పెదాల జాన పదాలను వింటూ గులాబీలు ! మ౦చెపై కిన్నెరసాని వాయిద్యం కంచె దాటివస్తున్న మలయ మారుతం మంచుపూలచెట్టుకి పూసిన ముత్యాలు మృగాల మానవారణ్యం నుండి విడి వడి ప్రకృతి జీవనామృత వాహినిలో లీనమవ్వాలని నేను !!! ---------------------13 – 04 - 14

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qUQskA

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఎర్ర గులాబీలు విరబూసాయి ఎవరొచ్చారో . . ? *************** నీలాకాశము అలక బూనిందేమో . . కారు మేఘాలు . . ! *************** కన్నీళ్లు ఘనీభవిస్తే మరో హిమాలయం . .! *************** విరిసినది అందాల పాప నవ్వు మరు మల్లియ. .! *************** చిలిపి గాలి బరువెక్కింది సందేశాలు మోస్తూ . . ! *************** మౌనానికి జీవం వస్తే దూకే మాటల ఝరి . . ! *************** మగువ మనసు ప్రతిబింబం విరిసే హరివిల్లు . . ! *************** ఏకాంతం ఏ కాంత తలపుకొచ్చిందో . . ? *************** ముసిరాయి చుట్టూ దోమలూ, ఆలోచనలూ ! *************** భోరున వర్షం ఆకాశం గుండె పగిలిందేమో . . ? *************** గొంగళి పురుగు సీతాకోక చిలుక మనిషి.. మనసు లా *************** ఓ జ్ఞాపకం నీలి నింగిలో నక్షత్రం తళుకులా . . *************** జనం మూగారు మొగ్గ విచ్చిందో పూవు రాలిందో . . ? *************** పాపం పతిత మసి ఎవరు పూసారో ? చందమామకు *************** కమ్మని కల తొలిగే పొగమంచులో నిజమయేలా . . ! నిర్మలారాణి తోట [ తేది: 13.04.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oZQHPr

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ----------- '' నదీ-నేను '' అలల అలజడులతో నువ్వు సాలెగూడులా కల్లోల అల్లికలతో నేను సారుప్యత ఒక్కటే జీవనదివై నువ్వు జీవితమంతా చిక్కుముడుల జీవంతో నేను . పొంగుతుంటావు,పారుతుంటావు అలుపెరుగక అనునిత్యం నువ్వు శోదిస్తాను ,సాధిస్తాను ,రోదిస్తుంటాను గమ్యం ఏమిటో తెలియక నేను . ఎంత స్వచ్చమో నువ్వు ఏ దేహం మీద నువ్వు ప్రవహించినా ఆ చర్మపు వర్ణంలో మిళితమైపోతావు రంగులు మారుస్తూ నేను నా రంగునే కోల్పోతుంటాను . రాళ్ళముళ్ళను మృదువుగా సహిస్తూ సాగిపోతుంటావు నువ్వు గీసుకున్న దారులవెంట ముళ్ళబాటలను తొక్కుకుంటూ ఎదిగిపోతూ.. ఒక్కోసారి దిగుతూ జారిపోతాను పాతాంలోకి . ఒకరోజు నువ్వు ప్రశ్నిస్తావు నేను విశ్రమిస్తే ఏమవుతావని ? కానీ ఆ రోజు వచ్చినా కూడా నా దగ్గరా జలనిధి ఉందంటూ నా కన్నీళ్లను వర్షిస్తాను ! (13-04-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ex9sWr

Posted by Katta

Vijay Lenka కవిత

I love this cover photo of కవి సంగమం, ముఖ్యంగా ధ్యాన ముద్రలో ఉన్న హనుమానులు వారు, thanks to the architect of the group!

by Vijay Lenka



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kLhT2I

Posted by Katta

Kodam Kumar Swamy కవిత

గీడా... నా కొడుకు by kodam kumaraswamy..9848362803. Date.13.04.2014, 5pm ============ నిన్న ఉద్యమ హోరుకు మార్మోగిన వీధులు ఏకమైన జెండాలు ఎన్నికల నగారాకు ఉలిక్కిపడ్డ ఖద్దరు బొమ్మలు ఎవ్వని దారి వానిదే ఊరువాడల్లో బిడ్డల్ని కోల్పోయిన తల్లుల ముందు గుండెకాయ ఎసరు పెట్టి కన్నీరు పెడుతున్న మొసళ్లు చేతిలో చెయి ముసిముసి నవ్వులు విపక్షాలపై కారుకూతలు గొర్రెల చెవిలో తామరపువ్వులు బజార్లో పారతున్న హామీల వరద పాతసీసలో మురిగిన మ్యానిఫెస్టో నోటు జూపి ఓటు దొబ్బిపోయె కొత్త బాటిళ్లో పాతసొల్లు మత్తు నేనెయ్యనే లేదు...గీ డెట్ల పుట్టే తెల్లారె సరికి కేర్‌...కేర్‌...మని పోలింగ్‌ డబ్బ పొక్కలకెల్లి ఊశిపడే వీడా... లీడర్‌ నా కొడుకు శెప్పిన పని చేస్తడన్న నమ్మకం లేకపాయే ఈ లీడర్‌ నా కొడుకు నాకొక్కన్కి పుట్టలేదు గదా? ఎంత మంది ఎస్తె పుట్టినోడో అందుకే ఇచ్చిన మాట మీన నిలవడు... బైరూపుల నా కొడుకును నమ్మకుండ్రి ఒత్తె ఇరగదీయండ్రి...పల్గజీరుండ్రి

by Kodam Kumar Swamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hLcVuU

Posted by Katta

Kodam Kumar Swamy కవిత

గీడా... నా కొడుకు by kodam kumaraswamy..9848362803. Date.13.04.2014, 5pm ============ నిన్న ఉద్యమ హోరుకు మార్మోగిన వీధులు ఏకమైన జెండాలు ఎన్నికల నగారాకు ఉలిక్కిపడ్డ ఖద్దరు బొమ్మలు ఎవ్వని దారి వానిదే ఊరువాడల్లో బిడ్డల్ని కోల్పోయిన తల్లుల ముందు గుండెకాయ ఎసరు పెట్టి కన్నీరు పెడుతున్న మొసళ్లు చేతిలో చెయి ముసిముసి నవ్వులు విపక్షాలపై కారుకూతలు గొర్రెల చెవిలో తామరపువ్వులు బజార్లో పారతున్న హామీల వరద పాతసీసలో మురిగిన మ్యానిఫెస్టో నోటు జూపి ఓటు దొబ్బిపోయె కొత్త బాటిళ్లో పాతసొల్లు మత్తు నేనెయ్యనే లేదు...గీ డెట్ల పుట్టే తెల్లారె సరికి కేర్‌...కేర్‌...మని పోలింగ్‌ డబ్బ పొక్కలకెల్లి ఊశిపడే వీడా... లీడర్‌ నా కొడుకు శెప్పిన పని చేస్తడన్న నమ్మకం లేకపాయే ఈ లీడర్‌ నా కొడుకు నాకొక్కన్కి పుట్టలేదు గదా? ఎంత మంది ఎస్తె పుట్టినోడో అందుకే ఇచ్చిన మాట మీన నిలవడు... బైరూపుల నా కొడుకును నమ్మకుండ్రి ఒత్తె ఇరగదీయండ్రి...పల్గజీరుండ్రి

by Kodam Kumar Swamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jC1bPE

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

భద్రతా చట్రం --------------------- రావెల పురుషోత్తమ రావు ********************************************* బాల్యంలో వివాహబంధం వెన్వెంటనే విడాకుల గంధం అప్పటికీ ఇప్పటికీ అదే నా రాజ[స] ధర్మం. గోధ్రా సంఘటనలు గోరుచుట్టూ రోకటి పోటు కాకపోతే ఈ దేశానికి ప్రధానినినేనే మహిళలంటే నాకు అమిత గౌరవం అందుకే అయోధ్య రాముడికి అన్నిచోట్లా గుళ్ళుకట్టిస్తాను ఆయనే నా అరాధ్య దైవ మనుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తాను. సత్యమేవజయతే ---------------------------- గోవిందుడు అందరివాడేగదా అని నమ్మి అన్ని రకాల బీచుల్లో అమ్మాయిలతో అమిత స్వేచ్చగా తిరిగాను చ దువంట బట్టలేదు గాని అమ్మాయిలనందరినీ ఆసాంతం చదివేసాను. అమ్మ పదవినిచ్చి పదిలంగా ఉండమంటే కిక్కురుమనకుండా కిమ్మిన్నాస్తిగా కూర్చుంటున్నాను. అవివాహితుడినేగాని బ్రహ్మచారిని కాదనే అనుకుంటుంటా- ప్రధానమంత్రిని చేస్తే పిచ్చి వాడిచేతిలో రాయిలా ప్రవర్తిస్తా పాలనను బ్రష్టు పట్టించే దిశగా పయనిస్తూ మీ అందరిపై కస్సి దీర్చుకుంటా--నా పగ సాధిస్తా. సత్యమే జయిస్తుంది truth alone triumphs 13-4-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1goNdNb

Posted by Katta

Kapila Ramkumar కవిత

Subba Rao Mandava నాయకులు చెప్పే మాట సంతలోని వేలం పాట మారుతుంది ప్రతి చోట ఓ సుబ్బారావు

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gnUop0

Posted by Katta

Rajeswararao Konda కవిత

నమస్తే... నేస్తమా..! @ రాజేష్ @ //13-04-14// ఆశ.. ఆశ ప్రతి ఒక్కరికీ ఉండేదే.. కోట్లు సంపాదించిన వాళ్ళకి మరిన్ని కోట్లు సంపాదించాలని సంపాదించిన ఆ కోట్లను ఎలా దాచుకోవాలనే ఆశ..! కష్ట పడే వాళ్ళు మరింత కష్టపడాలని ఆ కష్టంతో వచ్చిన రూపాయితో మరిన్ని రూపాయలు కూడబెట్టాలనే ఆశ...!

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewqnYY

Posted by Katta

Om Prakash కవిత

శిథిలమైన నా హృదయంలో కొలువెందుకు తీరితివో... శిలగా మారి ప్రతిమనంటూ బరువెందుకు పెంచితివో... కలలే మరిచిన కనుపాపకి కలలెందుకు నేర్పితివో... ఆ కలలే కూల్చి, పరిహాసం చేసి కన్నీరెందుకు పంచితివో... గమ్యం తెలియని నా గమనానికి గమ్యంగా ఎందుకు మారితివో... ఆశలు రేపి, దారులు మూసి వెలివేస్తూ ఎందుకు వెళ్ళితివో... వేదనలో నే రగులుతువుంటే నవ్వుతు ఏల వుండితివో... గాయం మాపే దేవతనంటూ మరు గాయంగా ఎందుకు మారితివో... .................................................Oms

by Om Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewqnIG

Posted by Katta

Rajeswararao Konda కవిత

నమస్తే... నేస్తమా..! @ రాజేష్ @ //13-04-14// కష్టం కలిగినప్పుడు చీ ఎందుకీ జీవితం అనిపిస్తుంది.. ఒక్కోసారి...! సంతోషం వచ్చినప్పుడు.. అమ్మో ఈ జీవితం లేకపోతే ఎలా.. అనిపిస్తుంది.. మరోసారి..! ఎందుకు ప్రతిసారీ ఈ ఊగిసలాట ఇదేనా జీవితమంటే కాదు.. కాదు.. సుఖదుఖాల సమాహారం ఆత్మీయ అనురాగాల అనుబంధం వీటి సమ్మేళనమే జీవితం.. అందుకే కష్టమొచ్చినప్పుడు కలత చెందకూడదు.. సంతోషం కల్గినప్పుడు మిడిసిపడకూడదు..

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hKGuws

Posted by Katta

Sri Modugu కవిత

Abhi // Sakura // We are flowers on a tree Doomed to grow, make more and leave To what purpose do we bloom Just to wilt in gloom We show our bright colors in the dark Where no being resides When I see the sakura blossoms in the sky I forget everything, except to wonder why My heart leaps with an unknown joy Beknownst to my puzzled mind All the while lost in my soul The very essence I am…. Date:12/04/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lVrocL

Posted by Katta

Panasakarla Prakash కవిత

"పెళ్ళి కాని చూపులు" ఎవడో వస్తాడు చూస్తాడు వెళ్ళిపోతాడు......... అతని చూపుల్లో ఎ౦గిలి పడిన నేను మరొకడు వచ్చేసరికి పవిత్రనై మళ్ళీ వాడి ము౦దు తల ది౦చుకుని కూర్చోవాల్సి౦దే వాడు కూడా వెళ్ళిపోయాక‌ మరో సారి మనసు పై పొర క౦టిన‌ ఆ చూపుల ఎ౦గిలిని కడుక్కోవడానికి వేడి వేడి కన్నీటిని ఆశ్రయి౦చడ౦ నా ఆడతనానికి ఆనవాయితీ......... గుది బ౦డలా కదలకు౦డా ఒకే చోట కూర్చున్న నాకు వాడి చూపులు సూదులై అక్కడక్కడా గుచ్చుకు౦టున్నప్పుడు ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కోపమో దు:ఖమో తెలీదు కాని ఎర్ర తివాచీపరుచుకున్న‌ నా మొహ౦ మీదను౦చి మరొకడు ఠీవిగానడుచుకు౦టూ నచ్చలేదని వెళ్ళిపోతాడు నేను అ౦ద౦గా లేనని ఒకడు... కట్న౦ సరిపోలేదని ఒకడు ర౦గు తక్కువున్నానని ఒకడు నా మనసుని గాయ పరిచినా నా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయలేక ఒక్కొక్కరూ పరాజయులై వెనుదిరుగుతారు పెళ్ళి చూపులు జరుగుతున్న౦తసేపూ మా ఇల్లు నిశ్శబ్ద‍౦ పరుచుకున్న‌ ఒక గ్ర౦ధాలయ౦ ఆ త౦తు ముగిశాక‌ అదే ఇల్లు ఇప్పుడొక పశువుల స౦త‌ బేర సారాల త౦తు బాహాట౦గానే సాగుతో౦ది నన్నుకని ఇన్నాళ్ళూ పె౦చి౦ది ఒక పశువుని కొని కట్టబెట్టడానికా నాన్నా.......? అని పిలిచి అడగాలను౦ది కానీ ఏ౦ చైను ఎప్పుడో కట్న౦ తెచ్చుకున్న అమ్మ‌ నా ఎదురుగా నిస్సహాయురాలై ను౦చుని చూస్తు౦టే గుమ్మ౦ దాటి గొ౦తు పెగలడ౦లేదు... ఆడదాన్నై పుట్టిన౦దుకు..! పనసకర్ల‌ 13/04/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qSpWYW

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ఎడారి కళ్ళాపి ::::::::::::::::::::­:::::::::::::::: నిన్న రాత్రి కొన్ని కోరికలను వేలాడదీశాను ఆశల కొక్కానికి తుప్పు పట్టి రాలిపోడానికి సిద్దంగా ఉన్న మంచురెక్కలు ఇంకా సరిగ్గా దర్పణం కానీవీనూ పారదర్శకంగా ప్రసరించినవీనూ మూడొందల అరవై డిగ్రీల్లో సదా మనసు భ్రమణం నిశ్చింతల రేవు దాటేశాక ఆరని మోహాల మత్తులో ఈ దేహం ఇంకా జోగుతూనే సంక్లిష్టంగా పరిభ్రమణం చెందక తెప్పరిల్లిన సరంజామా బూజు పట్టి అందవికారంగా వాంతి చేసుకుంటూ మళ్ళా పుడుతూ నేలపై అంగుళపు ధూళి బిర్రుగా కౌగిలించుకున్నకా ఒంటి చీపురుతో అప్పుడప్పుడు ఊడ్చే ప్రయత్నం పింగాణీల్లో హృదయాలను దులుపుకున్నాక ఎడారిలో ఒంటరిగా కళ్ళాపి జల్లుకుంటూ తడియారని తలపుల్లో ఇంకా బ్రతుకీడ్చుకుంటూ ఇక ఇప్పుడు చీకటి పరదా తొలగింది మళ్ళా కొన్ని కోరికలు పుట్టాలి ఈవేళ తిలక్ బొమ్మరాజు 12.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qSi0a5

Posted by Katta

Naresh Kumar కవిత

నరేష్కుమార్//అమ్మ అనసూయకోసం// ఇపుడేం రాసినా ఇదివరకు రాసింట్టే ఉంటోంది చెరిపేయబడ్డ అక్షరం మళ్ళీ చర్మం పై కాలిన మచ్చలా నన్నటిపెట్టుకున్నట్టే ఉంటోంది అమ్మ గురించి రాసిన ప్రతిసారీ నన్నునేను కాన్వాసుపై చిత్రించుకున్నట్టే ఉంటుంది ఒకానొక ప్రాచీన గీతాన్ని మళ్ళీ పాడినట్టే అనిపిస్తోంది ఇపుడెందుకో నేను వొంటరి గదిలో వంట చేసినపుడల్లా ఉప్పెక్కువైందంటూ ఆనాడు అమ్మ ముందు విసిరేసిన కంచం నా మొహాన్నే పడ్డట్టనిపిస్తుంది... "అన్నం తిన్నవా బేటా" అని ఫోన్లోంచి అమ్మచెయ్యి పొట్టనిమిరినప్పుడు కంట్లో కాలుజారిపడ్డ నీటిచుక్క నా మొహాన పడ్డ నిన్నటి సూర్యుడి ఉమ్మిలా అనిపిస్తోంది ఏం రాయనూ అమ్మకి ఏమివ్వనూ? అమ్మకిప్పుడు నేను నాన్ననవటం తప్ప ఇంకేం చేయను..... 13/4/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hw3YKC

Posted by Katta

Babu Koilada కవిత

కొయిలాడ బాబు //ఇంటర్వ్యూ// ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒకానొక వేగం సవాలక్ష ప్రశ్నలు ఎక్స్పీరియన్స్ కౌంట్స్ యువత దృక్కోణం విభిన్న ఆశల సమాహారం అయినా ఇంకా ఎన్నో గజిబిజి బతుకులు గతుకులమయమౌతున్న జీవన గమనం తీరుతెన్నులు రోజు రోజుకు మారకనే మారుతుండెను పల్లెల్లో విరిసిన బాల్యం కొత్త ఆశల కొంగ్రొత్త ఛాయల జీవన మజిలీకై ఎదురుచూపు చదువులు ఏపాటివైతేనేం టాలెంట్ దారే సెపరేటు ఎమ్మెన్సీల్లో హెచ్.ఆర్ రౌండ్ ప్యాకీజీల పరంపర హైరింగ్ తో వృత్తి జీవిత ఆవిర్భావం పోటా పోటీ ..ప్రభుత్వ ఉద్యోగాలు లైఫ్ సెక్యురిటి ..ఒక ప్రహసనం అభిరుచులకు సమయమెక్కడ "మీ హాబీస్ ఏమిటి" టి.వి చూడటం హాబీయా... క్రికెట్ ఆడటం కూడా హాబీయేనా... చేంతాడంత ప్రశ్నలకు సాధారణ సమాధానాలు ప్రొఫైల్ ఎంపిక ఎవరి దయో దాక్షిణ్యమో.. కాలం పని కాలానిదే ఉద్యోగాల దారి సగటు దారే ఇంటర్వ్యూ ఒక వారధి వ్యక్తిత్వ పరీక్ష కాని జీవన్మరణ సమస్య ...కానేకాదు మనసుంటే మార్గాలెన్నో బతకడానికి దారులెన్నో "ఎంట్రిప్రెన్యుర్ల శకం" ఇది విజయీభవ ... 13.04.2014

by Babu Koilada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qRYg6G

Posted by Katta

Kapila Ramkumar కవిత

A Dead Rose O Rose! who dares to name thee? No longer roseate now, nor soft, nor sweet; But pale, and hard, and dry, as stubble-wheat,--- Kept seven years in a drawer---thy titles shame thee. The breeze that used to blow thee Between the hedgerow thorns, and take away An odour up the lane to last all day,--- If breathing now,---unsweetened would forego thee. The sun that used to smite thee, And mix his glory in thy gorgeous urn, Till beam appeared to bloom, and flower to burn,--- If shining now,---with not a hue would light thee. The dew that used to wet thee, And, white first, grow incarnadined, because It lay upon thee where the crimson was,--- If dropping now,---would darken where it met thee. The fly that lit upon thee, To stretch the tendrils of its tiny feet, Along thy leaf's pure edges, after heat,--- If lighting now,---would coldly overrun thee. The bee that once did suck thee, And build thy perfumed ambers up his hive, And swoon in thee for joy, till scarce alive,--- If passing now,---would blindly overlook thee. The heart doth recognise thee, Alone, alone! The heart doth smell thee sweet, Doth view thee fair, doth judge thee most complete,--- Though seeing now those changes that disguise thee. Yes, and the heart doth owe thee More love, dead rose! than to such roses bold As Julia wears at dances, smiling cold!--- Lie still upon this heart---which breaks below thee! Elizabeth Barrett Browning

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hvFwsW

Posted by Katta

Naresh Kumar కవిత

నరేష్కుమార్//అమ్మ అనసూయకోసం// ఇపుడేం రాసినా ఇదివరకు రాసింట్టే ఉంటోంది చెరిపేయబడ్డ అక్షరం మళ్ళీ చర్మం పై కాలిన మచ్చలా నన్నటిపెట్టుకున్నట్టే ఉంటోంది అమ్మ గురించి రాసిన ప్రతిసారీ నన్నునేను కాన్వాసుపై చిత్రించుకున్నట్టే ఉంటుంది ఒకానొక ప్రాచీన గీతాన్ని మళ్ళీ పాడినట్టే అనిపిస్తోంది ఇపుడెందుకో నేను వొంటరి గదిలో వంట చేసినపుడల్లా ఉప్పెక్కువైందంటూ ఆనాడు అమ్మ ముందు విసిరేసిన కంచం నా మొహాన్నే పడ్డట్టనిపిస్తుంది... "అన్నం తిన్నవా బేటా" అని ఫోన్లోంచి అమ్మచెయ్యి పొట్టనిమిరినప్పుడు కంట్లో కాలుజారిపడ్డ నీటిచుక్క నా మొహాన పడ్డ నిన్నటి సూర్యుడి ఉమ్మిలా అనిపిస్తోంది ఏం రాయనూ అమ్మకి ఏమివ్వనూ? అమ్మకిప్పుడు నేను నాన్ననవటం తప్ప ఇంకేం చేయను..... 13/04/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nhOURl

Posted by Katta

Jaya Reddy Boda కవిత

//జయ రెడ్డి బోడ // నీ గెలుపు // సమస్యల ప్రళయం నన్ను చుట్టుముట్టి భాదల ఊభిలొకి మనసు కూరుకు పోయినాక నాకు ఆశల రెక్కలు తొడిగి ఒడ్డున కూర్చొన్న నువ్వు నీ మమతల కొంగు అందించి ఏదో తెలియని ఊహల లోకం లోకి లాగేస్తావు నన్ను నేను కోల్పోయి బాధ్యతలు లేని సోమరితనంలో ముసుగు తన్నినప్పుడు నీ అరుపుల చరుపులతో నన్ను కర్యోన్ముకునిగా మలచుతావు ఆకాశంలో మబ్బుల్లా,నీకు నాకు మధ్య 'మాట పట్టింపు' మొలక మొలిచి, మనసు ముడుచుకున్నప్పుడు కుండ పోత వర్షం చివర నీఒక వెచ్చని సూరిడులా చిరు చిరు చిర్నవ్వులతో,నాలో పేరుకున్న పెంకి తనాన్ని దులిపి,నా 'అహం' ఉనికిని చెరిపేస్తావు సుతి మెత్తని నీ భావుకతలో ముంచి నన్ను నేను కోల్పోయ్యే వెర్రిగా మారుస్తావు పువ్వులా నువ్వు ఉంటూనే నాలో..లోపలి అసహనాల ముళ్ళను నీ సున్నితత్వపు రెమ్మలతో అనిచివేస్తావు ఒంపు సొంపులతో మెలికలు తిరుగు నదివి, నిన్ను ఎదురీద లేని అశక్తున్ని నన్ను చేసి,నీ ప్రవాహ వేగంలో కలుపుకు ప్రయాణం సాగిస్తావు నీదైన నీ నాగస్వరంతో మైమరపించి నాగును నన్ను చేసి ఆడిస్తావు సర్వం నీకన్నా తక్కువను నన్ను చేసి,జయించి ఓటమిలో నన్ను బంధించి ఎప్పుడూ .. నీ గెలుపుతో హృదయ రాణివై ఏలుతునే ఉంటావు .... (13-04-2014)

by Jaya Reddy Boda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gnCHt8

Posted by Katta

Vijay Kumar Svk కవిత

"ప్రవహించే జ్ఞాపకం" తో ఓ పదిపన్నెండు సంవత్సరాల క్రితం తెలుగు కవిత్వ మైదానంలోకి నడిచి వచ్చిన యాకూబ్ ఈనాడు "సరిహద్దు రేఖ" ల్ని గీయాల్సి వచ్చింది. ఆనాటి అతని కవిత్వ తత్వాన్ని గురించి "రమణ మూర్తి " గుర్తించిన వాస్తవమేమిటి? " ఇతని కవిత సగమేమో సన్నని కలిదారి. తతిమ్మా సగం రోడ్డు. సగం పూరి గుడిసె. మిగితా సగం భవంతి. గ్రామీణ నేపథ్యం నుంచి బయలుదేరినట్లుండే కాలి బాటలాంటి కవిత కాస్తా హటాత్తుగా రోడ్డవుతుంది" "వెన్నెల నీడలు" నుండి... "మో"

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gnCENQ

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ నాన్న @ ఆయనెవరో నాకు అమ్మ చెప్పే దాక తెలియదు.కానీ అయన చేతి వెళ్ళు పట్టుకుని ఈ ప్రపంచం లోకి అడుగు పెట్టాను నా లోని శక్తిని ...క్రమ శిక్షణని నాకు పరిచయం చేశాడు. నాకు తెలియని ఈ లోకాన్ని ఆయనే చూపాడు అమ్మ కడుపులో ఎన్ని గింగిరీలు కొట్టినా నాన్న చేయి పట్టుకోగానే.. ప్రపంచాన్ని జయించిన ధైర్యాన్ని నింపాడు. అవును,.అందుకే నాన్నంటే నాకిష్టం. అమ్మ కడుపులో ఉన్నన్నాళ్ళు నాన్న గుండెలోనే నా నివాసం . తరువాత ఆ గుండెలే నాకు మైదానం. అమ్మతో శారీరక విభజన జరిగాకా నాన్న బోజ్జపైన్నే నా విహారం. రక్తాన్ని మాంసంగా చేసిన అమ్మ కంటే ఆ మాంసాన్ని మన్వత్వంగా తీర్చి దిద్దిన నాన్నంటే నాకు బాగా ఇష్టం పెరిగింది.కానీ ఇద్దరు నాకు గొప్పే. ఒకరు ఉచ్చ్వాసం...ఒకరు నిశ్వాసం. ఈ రక్తనాళాల శరీరాకృతికి ప్రాణం అమ్మ ఈ హృదయ స్పందనలకు భావం నాన్న . _ కొత్త అనిల్ కుమార్ 13 / 4 / 2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iFhMic

Posted by Katta

Swatee Sripada కవిత

ఎక్కడి దూరం ? ఎన్ని సముద్రాలూ ఇటూ అటూ అల్లరి బాల్యాలై అలలై దారీ తెన్నూ లేకుండా పరుగులు పెట్టినా ఎన్ని చిక్కటి హరితవనాలు వనాలు ఎక్కడికక్కడ గుబురు పొదలై దిగులు చీకట్ల చేతుల్లో తలవాల్చుకున్నా పెదవులు దాటని పద పరిమళాలు చుట్టూ చుట్టూ అల్లుకున్న నులి వెచ్చని శ్వాస. ఎటు చూసినా రాత్రి ఆకాశం గూటిలో కునికిపాట్లు పడుతున్న చుక్క పసి కూనల ఆవులింతలు మంచు శాలువా కప్పుకు ఒణికే మసక వెన్నెల అయితేనేం గుప్పిళ్ళ కొద్దీ నిద్రను విసిరి కొసరి కొసరి అందించే స్వప్న సీమల అంచులలో అల్లనల్లన తేలివచ్చే మెత్తని పలకరింపు ఒక మౌన ధ్యానం ఒక సర్వాతీత సుందర తపస్సమాధిలో ఒక భావ లహరి విద్యుత్ ప్రవాహమై నా చుట్టూ ఒక ఆయస్కా౦త వలయమై నిర్విరామమై ,నిరంతరమై నిస్సందేహంగా ఇంకెక్కడి దూరం ?

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oXumSK

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 29: 1975 ప్రాంతాల్లో The Hindu పేపరులో మొదటిసారి ఈ కవిత చదివాను. అది ఎంత మనసుకి నచ్చిందంటే, దాన్ని నా డైరీలో రాసుకున్నాను. (Later, I could not trace my diary). అప్పటినుండీ ఇది నా మనసులో నాటుకు పోయింది. అప్పట్లో అంత సాహిత్యవ్యాసంగం లేకపోవడంవల్ల కవి పేరు గుర్తు పెట్టుకోలేదు, కవితశీర్షికా గుర్తులేదు. ఆఫ్రికన్ కవి అని మాత్రం తెలుసు. అందులో "సందర్భానికి తగ్గ ముఖాలు" అన్న విషయం లీలామాత్రంగా గుర్తుంది. నెట్ లో దీన్ని వెతకగా వెతకగా కొన్నాళ్ళక్రిందట దొరికింది. ఎంత ఆనందం వేసిందో. మీకు కూడా నచ్చుతుందనే నా నమ్మకం. గమ్మత్తుగా ఈ మధ్యనే కువైటీ కవయిత్రి ఫతిమా అల్ మతార్ కవిత కూడా 'భిన్నమైన ముఖాలు' గురించే చదివేను. ఈ ఇద్దరు కవులూ మనలోని ఆత్మవంచనాగుణం జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటున్నప్పుడు ఎలా బాధిస్తుందో చాలా గొప్పగా చిత్రించేరు. మళ్ళీవారం ఆ కవిత చూద్దాం. మనకు తెలియకుండానే మనం పరిస్థితులకి ఎలా బానిసలం అయిపోతామో తెలియజేస్తాయి ఈ కవితలు. ఇందులో భాషా, భావనా, శైలీ చాల మంది తర్వాత అనుకరించారు. ఇప్పుడు దీని ఔచిత్యం ఏమిటంటే, ఎన్నికలలో మీ దగ్గరకి ఓటు అభ్యర్థిస్తూ ఎన్నో ముఖాలు వస్తాయి. దేశభక్తులమనీ, సెక్క్యులరిస్టులమనీ, అవినీతి అంతం చేస్తామనీ, అరచేతిలోకి వైకుంఠాన్ని తీసుకువస్తామనీ, అభ్యుదయవాదులమనీ, మీ కులంవాడిమనీ, మీ వాడవాడిననీ, మీ ఊరివాడిననీ, ఒకటేమిటి ఓట్లుదండుకోడానికి ఎన్ని ముఖాలు కావలస్తే అన్ని ముఖాలు సందర్భానికి తగ్గట్టు తగిలించుకుని వస్తారు. ఒక్కసారి వాళ్లలో ఎంత నిజాయితీ ఉందో గమనించండి. మీరుకూడా, వోటువేసేటప్పుడు ఒక్కముఖాన్నే పెట్టుకోండి... మీ వోటు దేశానికి మంచిచేస్తుందా చెయ్యదా అనేది. ఆ వ్యక్తితో మీకుగల ఇతరేతర (ఊహామాత్రపు) సంబంధాలకు విలువ ఇవ్వకండి. మీ పిల్లల్నీ, మీ మనవల్నీ మనసులో తలుచుకుని వాళ్లకి ఎటువంటి భవిష్యత్తు, ఎటువంటి వారసత్వం, ఎటువంటి వాతావరణాన్ని వదలిపోదామనుకున్నారో యోచించి మరీ ఓటు వెయ్యండి.. . అనగా అనగా ఒకప్పుడు ... . ఒరే నాన్నా! ఒకప్పుడు మనుషులు మనసారా నవ్వేవారు, వాళ్ళ కళ్ళలో నవ్వు కనిపించేది; ఇప్పుడు కేవలం పలువరసతోనే నవ్వుతున్నారు. మంచుగడ్డలా ఏ భావమూలేని చూపులు చూస్తూ అంతలోనే నా నీడవెనక ఏముందా అని వెతుకుతూ... ఒకప్పుడు నిజంగా హృదయపూర్వకంగా చేతులు కలిపే వారు; నాన్నా! ఆ రోజులు వెళ్ళిపోయాయిరా. ఇప్పుడు ఒకపక్క అయిష్టంగానే చేతులు కలుపుతూ, మరొక పక్క నా ఖాళీ జేబులో ఏముందా అని తణువుతుంటారు. "ఇది మీ ఇల్లే అనుకొండి" "మరోసారి తీరికచేసుకుని రండి" అని చెప్పి మొహమాటానికి ఒక సారో, రెండు సార్లో వెళితే ఇక మూడోసారి ఉండదు. నాముఖం మీదే భళ్ళున తలుపేసుకుంటారు. అందుకని నేను చాలా విషయాలు నేర్చుకున్నానురా, నాన్నా! సందర్భానికి తగ్గ బట్టలు తొడుక్కుంటున్నట్లు, నేను కూడా ముఖాలు తొడుక్కోడం నేర్చుకున్నాను... ఇంట్లో ఒక ముఖం, ఆఫీసుకొకటీ, వీధికోసం ఇంకొకటీ, గృహస్థుగా మరొకటీ, పార్టీలకొకటీ; వాటితో పాటే, ఫొటోలోని చెదరని నవ్వులా సందర్భానికి తగ్గ నవ్వుని కూడా అతికించుకోడం నేర్చుకున్నా. నేను కూడా నేర్చుకున్నాను... నా దంతాలతో నవ్వడమూ, మనస్కరించకపోయినా చేతులు కలపడమూను. నేను కూడ "పీడవదిలింది" అనుకున్నప్పుడు "సంతోషం, తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం" అనడం; ఏమాత్రం సంతోషం లేకపోయినా, "మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది" అనడం; బాగా విసుగెత్తిపోయినా,"మీతో మాటాడ్డం ఎంతో బాగుంది" అనడం. కానీ, నను నమ్మరా తండ్రీ! నాకు కూడ నీలా ఉన్నప్పుడు నేనెలా ఉండేవాడినో అలాగే ఉండాలని ఉంది. నాకు ఈ బోలుమాటలు మరిచిపోవాలని ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను మనసారా నవ్వడం తిరిగి నేర్చుకోవాలి. నవ్వుతుంటే అద్దంలో నా పళ్ళు పాముకోరల్లా కనిపిస్తున్నాయి. నాన్నా! నాకు ఎలా నవ్వాలో చూపించరా! ఒకప్పుడు, నేను నీలా ఉండే రోజుల్లో ఎలా ముసిముసి నవ్వులు నవ్వేవాడినో అలా నవ్వడం చూపించు. . గాబ్రియేల్ ఒకారా, నైజీరియన్ కవి. . Once Upon a Time . Once upon a time, son, they used to laugh with their hearts and laugh with their eyes: but now they only laugh with their teeth, while their ice-block-cold eyes search behind my shadow. There was a time indeed they used to shake hands with their hearts: but that’s gone, son. Now they shake hands without hearts while their left hands search my empty pockets. ‘Feel at home!’ ‘Come again’: they say, and when I come again and feel at home, once, twice, there will be no thrice... for then I find doors shut on me. So I have learned many things, son. I have learned to wear many faces like dresses – homeface, office-face, street-face, host-face, cocktail-face, with all their conforming smiles like a fixed portrait smile. And I have learned too to laugh with only my teeth and shake hands without my heart. I have also learned to say,’Goodbye’, when I mean ‘Good-riddance’: to say ‘Glad to meet you’, without being glad; and to say ‘It’s been nice talking to you’, after being bored. But believe me, son. I want to be what I used to be when I was like you. I want to unlearn all these muting things. Most of all, I want to relearn how to laugh, for my laugh in the mirror shows only my teeth like a snake’s bare fangs! So show me, son, how to laugh; show me how I used to laugh and smile once upon a time when I was like you. . Gabriel Okara. Nigerian Poet

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1glyEtN

Posted by Katta