పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Mohan Rishi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mohan Rishi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జూన్ 2014, శనివారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా! // చూసే దృష్టిని బట్టి కాకుండా నిజంగానే కొన్ని మంచి రోజులుంటాయి. దూరాన ఉన్న ఒక మిత్రుడు రింగుమంటాడు. నవ్వించి ఏడ్పిస్తాడు.నిన్నటి అసంతృప్తులెంత అల్పమైనవో తెలియబరుస్తాడు. ఖాళీగా ఉన్న ఎదుటి ఫ్లాట్లో నవదంపతుల జంటొకటి ముసిముసి నవ్వుల్తో దిగుతుంది. వాళ్ళ ఆనందంలోని తునకొకటి నీ మొహాన్ని ప్రేమగా స్పృశిస్తుంది. పార్కులో ఆడుకుంటున్న పిల్లలు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ను చేస్తారు. బోణీ చెయ్యమంటూ ఆకుకూర ఆప్యాయంగా అడుగుతుంది. రోడ్డుమీదకొచ్చిన నీలో ఒక షేరింగ్ ఆటో ఒదిగి కూర్చుంటుంది. కిక్కిరిసిన బస్సులోని స్టాండిగ్ ఒవేషన్ను కిషోర్ కుమార్ సేద తీరుస్తాడు. ఒకానొక ప్రియురాలి జ్ఞాపకం. వొంకర్లు తిరిగిన తీయని మూలుగు. ఇక ఆ నిముషానికి సంతోషం సగం బలం నిజమేననిపించి. బతకాలనిపించి. రేపటి గురించిన బెంగ లేదు, లేదనిపించి. అకేలా చల్నా భీ ఎంతో హాయిగా అనిపించి. నిజంగానే కొన్ని మంచి రోజులుంటాయి. రోజువారీ జీవితాన్నేఒక పరమాద్భుతంగా దర్శింపచేస్తాయి. 14. 6. 2014

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1veM0RC

Posted by Katta

11, జూన్ 2014, బుధవారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // స్మైల్ ప్లీజ్! // ఏ ఒక్కరు మాత్రమే ఎలా నిజమవుతారో ఎన్నటికీ అర్థం కాదు. ఏ సాక్ష్యాలూ సాయానికి రావు. బోధంతా చిరుదీపం వెలిగించమని. వెలుగుతున్న నవ్వులన్నీ హృదయాల్లో పుష్పించినవనీ. అల్లుకున్నవన్నీ అవ్యాజ ప్రేమలతలేననీ. లేదా అలా అనుకొమ్మనీ. నువు అందినదాని గురించి రాస్తావు. నేను అందనిదాన్ని మోస్తాను. అదేపనిగా తలపోస్తాను. ప్రపంచం పేను బెత్తాల్తో బయల్దేర్తుంది. అందమైన లోకమనీ, రంగురంగులుంటాయనీ. చెప్పినా వినని పాపానికి నా మానాన నన్నొదిలేసి. మొహాన ఇంత నల్లని రంగుని పూసి. అక్కడో గీతని గీసి. డేంజర్ జోన్ అని రాసి. గాఢ వాంఛ ఒక్కటే నమ్మదగ్గదై. లోపలి నిజం మాత్రమే రక్షించే బంధువై. ఎద పిండే గానంతో, మది మండే పానంతో, ఈ ఒక్క క్షణాన్నై. తొవ్వని తొలిచీ, తొలిచిన తొవ్వనై. నేను మాత్రమే నేనైన ఒక్క నేనై. ఉండిపోతానిక. నా గుండెలో నేనొక శరణార్థినై. 11. 6. 2014

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q3nZNj

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // ఉఫ్..! // మాటలదేముందీ? పిల్లాడి చేతిలో ఆటబొమ్మలు. ప్రేమగానూ చూసుకోవచ్చు, ఫేడ్మని నేలకేసీ కొట్టొచ్చు. సమయానికి తగు విధాలు. ఎక్కించుకునో, తొక్కేస్తూనో రేపటిలోకి సాగే రథాలు. ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం మాట నాణేనికి రెండు వైపులు. హీరోలు చెప్పినట్టు ఒకవైపే చూడలేకే కష్టాలు. మాయమైపోయిన మాటల గురించి అలమటించడాలు. కత్తి గుండెలో దిగి, చేతిలో విరిగిన డాలు. చాలు. తెప్ప లేదు. తెప్పరిల్లడాల్లేవు. తీరం ముంచేసే కాలంలో నేరారోపణల్లేవు. ఉన్నదల్లా నువ్వే. లేనిదీ నువ్వే! 6. 6. 2014

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nVtSwb

Posted by Katta

21, మే 2014, బుధవారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // రెండుగురం // నాకు నేనుగా కలిసిందీ కాదు. నువ్వు నన్ను పిలిచిందీ కాదు. అకస్మాత్తుగా, అనివార్యంగా. చూళ్ళేదని తప్పించుకోడానికి వీల్లేని ఒక క్షణంలో జరిగిందది. పేలిన మాటలు, జరిగిన గొడవ, తెగిన స్నేహం... ఒక రీల్ లా గిర్రున తిరగడం లాంటిదేదీ సంభవించలేదు. కనీసం నాకైతే. సందిగ్ధంలోనే ఒక అసంకల్పిత ప్రతీకార చర్యలా పలకరించుకోడం. దాన్ని దాటి ముందుకెళ్ళాలో లేదో తెలీని పునరాలోచనలో పడ్డం. మెదడులో ఉక్కపోత. మనసులో యుద్ధం మోత. తప్పుకుపోదామనే నిశ్చయం దిశగా. ఆ అడుగులు నీవా, నావా?! అంతలోనే తడబాటు, ఆలోచనల గ్రహపాటు. జరిగిందేదో జరిగిపోయిందన్న ఒక తేలిక వాతావరణానికి తెర తీస్తే... మరుక్షణం మనమెక్కడ?! మనదైన ఆరామంలో ఉన్నాం. ఆరాంగా ఉన్నాం. గతమంతా ఇప్పుడు కేవలం ఒక 'గ్యాప్'కం గా మిగిలున్నాం! 21.5.2014

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ko9IqQ

Posted by Katta

3, మే 2014, శనివారం

Mohan Rishi కవిత

AS A SONG YOU CAME! How did your song come that night Softly, gently Your palms smearing my heart Fulfilled … Smoothly, enticing As a tune enhancing love An embracing bondage …. As moonlight spread As oxygen …. Why did your song come that night Something that could not be conveyed in words Inability to converse something It was that it came to transmit …. To ignite a lamp in the heart …. To assure that you are always with me ….! Whom else do I have than you To reminisce again and again..! Telugu original : “paatavai vacchaavu” by Mohan Rishi English trans: jagaddhatri

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iMhUvJ

Posted by Katta

1, మే 2014, గురువారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // వేసవి రాత్రి // గ్రిల్స్ గుండా చూస్తుంది జీవితం, నిన్ను. జాలిగా. హేళనగా. భరిస్తుంది నీ మాటల వాంతిని. సహిస్తుంది నీ కలల భ్రాంతిని. చేసే మోసం గమనిస్తుంది నిశ్శబ్దంగా. వేసే వేషం పసికడ్తుంది నిశితంగా. ఏడ్పుకు నవ్వుకుంటుంది బిగ్గరగా. నవ్వునేనాడూ అల్లుకోదు దగ్గరగా. ఒకటే జీవితమని తెల్సీ రెండుగా బతుకుతున్నప్పుడు. రెండవ ప్రపంచంలో ఒంటిగా మిగులుతున్నప్పుడు. తడిని పూడ్చి తన్మయత్వం పొందుతున్నప్పుడు. నువ్వెవడివో తెలిసినా తెలియక, తెలియకా తెలిసి భ్రమిస్తున్నప్పుడు. **** వెనుదిరిగినప్పుడు చప్పుడు చేసిన తలుపుని వింటే, ఇక, అప్పుడు, అదే గ్రిల్స్ గుండా జీవితంలోకి ఎలా చూడాలో తెలుస్తుందనుకుంటాను. 1.5.2014

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SbmJtM

Posted by Katta

12, మార్చి 2014, బుధవారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // కుక్క పిల్లలూ, దేవుడూ చల్లనివారే! // రాస్తాన్నేనొక కుక్క పిల్లను గురించి, ఈ రాత్రి, మిత్రులారా. ఎందుకొచ్చిందో తెలీదు. నా పక్కనే నడవడం మొదలుపెట్టింది. నా భయాలు నాకున్నాయి. నాకు మించిన సమస్యలేవో దానికున్నట్లుగా అడుగు అడుగులోనూ తెలియవచ్చింది. విచిత్రమే. పక్కన నేనున్నానన్న భరోసాతో నడుస్తుందది. నా దారిని గురించిన అంచనాల్తో అటూ, ఇటూ పరుగెడ్తుంది. తనను తాను తిట్టుకుంటూ మళ్ళీ వచ్చి పక్కన చేరుతుంది. తన భాషను నేనూ, నా బాడీ ల్యాంగ్వేజుని తనూ అర్థం చేసుకునే ప్రయత్నం. నాలుగు సర్కిళ్ళను దాటిపోయినా, విడిచిపోదే. నా సర్కిల్లోకొచ్చి కూచున్నిలబడి, నడుస్తూ దీనంగా చూస్తుంది, ఇక నువ్వే నా దిక్కన్నట్లుగా ఉంది. ప్రయాణం బాగానే ఉంది.కానీ ఇల్లు దగ్గర పడింది. గేటు ముందర నేనూ, నా ముందర తనూ. ఇక ఈ విషమ పరీక్షను దాటుడెట్లు? దరిద్రపు అపార్ట్మెంట్ బతుకు, పొమ్మనలేను, రమ్మనలేను. ఈ కరకు అర్ధరాత్రి ఒకర్నొకరం చూసుకుంటూ నిలబడ్డాం. ఎవరన్నా వచ్చి ఈ రెండు కుక్క పిల్లలూ ఒక్కచోట ఉండగలిగే ప్రదేశానికి తీసుకుపోతే బాగుణ్ణు. 12. 3. 2014

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PponGQ

Posted by Katta

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // నేర్చుకోవాలి! // షేరింగ్ ఆటో గుండా ప్రయాణిస్తాం. మరో రోజులోకి. మళ్ళీ ఆ బ్రతుకు అరణ్యంలోకి. మనం అటెండ్ చెయ్యక తప్పని మనుషులలోకి. డెక్ లో పాట. "అమ్మా తెలంగాణమా, ఆకలికేకల గానమా...", నిరంతరాయంగా. ఏండ్లుగా డొక్కలో సుళ్ళు తిరుగుతూ. ఎక్కడెక్కడి యాదిల్లోకి లాగుతూ. అమ్మలు కూర్చున్నారిద్దరు ఎదురుగా. "పవుతు నా తిండి, నా తాగుడు, ఎన్నడన్న పక్కోనికి పైస పెట్టినాడె?!". "ఎవని పాపాన వాడే పోతడక్కా. దావ్ ఖానల పడ్డప్పుడు మనమైతె మందలిచ్చి రావాలెగద?". ప్రేమైకమూర్తులు. సాయిబాబా గుడి దగ్గరి గుంతల్లో ఆటో కిందామీదా అయినప్పుడు, "రోడ్డు సల్లగుండ" అంటూ, కోపంలోనూ నోరు జారని వాళ్ళు. పాఠాలు తెలియనివాళ్ళు. పాటలను మించినవాళ్ళు. ఏమి కావలె, ఇక ఈ సమయానికి, జీవితానికి? పై గుండీ విప్పి, అంగీ వెనక్కి లాగితే, తగిలే చల్లని గాలి చాలు. 25.9.2013 ("జీరో డిగ్రీ" నుండి)

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ohw9BP

Posted by Katta

17, ఫిబ్రవరి 2014, సోమవారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // డ్యుయల్ సిం! // వైరుధ్యాలను పెంచి పోషించినవాడే వైవిధ్యాల గురించి మాట్లాడ్తాడు! విధ్వంసానికి మూలంగా నిల్చినవాడే విలయంపై విలపిస్తాడు! నిలువ నీడ లేకుండా చేసినవాడే నీ జీవనానికై నినదిస్తాడు! పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని పరిహసించినవాడే బ్రాండ్ బాజా బారాత్ అంటూ వూదరగొట్టేస్తాడు! **** సహనానికి ప్రతీకలుగా నిల్చిన మనమే సాగర హారమై పోటెత్తితే... ఆచూకీ దొరకని శవంలా కొట్టుకుపోతాడు వాడు! 26.9.2012 ("జీరో డిగ్రీ" నుండి)

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oElkat

Posted by Katta

15, ఫిబ్రవరి 2014, శనివారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // విజేతలు వాళ్ళు! // అల్కాపురివీధుల్లో ఆకుకూరల్తో ఆప్యాయంగా నవ్వుతూ ఆమె అడిగింది ఒక్కటే: "గంప కిందికి దించాలి సారూ". బేరం సారం మొత్తం తన గెలుపు, నా ఓటమి. అడిగిన ఒక అదనపు కట్టనూ హాయిగా చేతుల్లో పెడ్తూ. లెక్కల్లో తప్పిపోయిన నాకు గుర్తుచేసిమరీ చిల్లరంతా ఇస్తూ నోరారా కోరింది ఒక్కటే: "గంప మల్ల నెత్తి మీద పెట్టాలి సారూ". బరువు నిభాయించుకుంటూ, నాదొక కష్టంగా తలపోస్తూ, తను అన్న మాట కొండలా మోస్తున్నా:"ఏమనుకోవద్దు సారూ. పెద్దవారు". **** అడుగడుగునా ఫిర్యాదులతో అలమటించే జీవితం తల్లీ!... ఒక మూలన ఒదిగి కూర్చున్న కరివేపాకు విలువ చెయ్యదు- 18. 2. 2013 ("జీరో డిగ్రీ" నుండి)

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jjTqNk

Posted by Katta

13, ఫిబ్రవరి 2014, గురువారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // బతికిన మనుషులు! // "మసాలా" అంది ఆమె "ప్లెయిన్" అన్నాడతను "పగలు"- ఆమె "రాత్రి"- అతను "పోవద్దు" "రావొద్దు" ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని అప్పట్నుంచీ వాళ్ళు కలిసి మెలిసి జీవించలేదు! ("జీరో డిగ్రీ" నుండి) 13.7.2012

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iSfvTt

Posted by Katta

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // ఎందుకో తెలీదు..! // బాధ ఉండదని కాదు కానీ, కన్నీళ్ళలోకి ట్రాన్స్ ఫర్ కాదు. వేదన కమ్ముకుంటుంది నిజమే, వెక్కి వెక్కి ఏడవడం కుదరదు. హృదయం ముక్కలవడం తెలుస్తున్నా, విషాద వదనం వీలవదు. కొన్ని చెప్పలేం... కొన్ని ప్రకటించలేం... వర్షించే మేఘం ఆఖరి నిముషంలో పునరాలోచనలో పడడం అవని మీది ప్రేమలేమిగా అభాండం వెయ్యలేం! **** అభియోగాలన్నింటికీ ఆన్సర్ ఇవ్వలేను... అటో, ఇటో నిలబడ్డమే జీవితమని అంటే తీర్మానానికి మద్దతుగా తీన్ మార్ వెయ్యలేను! ప్రేమ లేదని కాదు కానీ, తేపకొకసారి తేమను నిరూపించడం నావల్ల కాదు! 6. 6. 2012 ("జీరో డిగ్రీ" నుండి)

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iUvZtC

Posted by Katta

8, ఫిబ్రవరి 2014, శనివారం

Mohan Rishi కవిత

టాపిక్ ఈజ్ ఓవర్! లేటైనవు తండ్రీ నువ్వు- ఆగిపోవాల్సిన చోట ఆగిపోకుండ ఉర్కాల్సిన కాడ ఉర్కకుండ పైకి పైకే చూడకుండ ఎనక ముందులు సోచాయించకుండ మాటలెంత మోసమైనయో తెల్సుకోకుండ బాటలెంత బట్టెబాజ్ వో సోయి లేకుండ నమ్మకాన్ని మించింది నాశ్నం చేసేది ఇంకోటి లేదని ఎర్క లేకుండ టైముని బట్టి మనిషి మారాలన్న కమస్కం గ్యానం లేకుండ అవుట్ డేటెడ్ సుభాషితాలు చెప్పుకుంట ఎక్స్ పైర్ అయిన గోళీల్ని ఏసుకుంట సిలబస్ చుట్టే శెక్కర్లు కొట్టుకుంట "ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడ్తుంది" అనే ప్లాస్టిక్ మాటలు నమ్ముకుంట... లేటైనవు తండ్రీ నువ్వు..! ***** అమ్మ అయ్య చెప్పంగ, సోపతిగాడు తిట్టంగ ఇష్టం లేకపొయినా కాష్టం తప్పదనుకుంట శినిగిన బట్టలు, తెగిన చెప్పులు, పెరిగిన గడ్డం, మన్ను మన్ను జుట్టు, దెబ్బల కాట్ల కాళ్ళు చేతులు, ఏడుస్తున్న గుండె, వొగిరిస్తున్న కళ్ళు... ఒక్కటిగూడ పట్టిచ్చుకోకుండ లెక్క తేల్చుకుందామని, జనంల కలుద్దామని వచ్చినవుగానీ - లేటైనవు తండ్రీ నువ్వు! 10.12.2012 ("జీరో డిగ్రీ" నుండి)

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MzlH7t

Posted by Katta

6, ఫిబ్రవరి 2014, గురువారం

Mohan Rishi కవిత

ద్వంద్వ సమాసం - దాసరాజు రామారావు శ్రావ్యంగా వినడానికి వీనులు గావాలె అరవై ఏండ్ల కల వలపోతని వినకపోవడానికి బ్రహ్మ చెవుడు గావాలె తెరిపిలేని వీక్షణానందానికి అక్షులు గావాలె తనువుల నంటువెట్టుకుని బతుకుల బుగ్గి చేసుకున్న అమర దృశ్యరూపాలు కనబడకపోవడానికి గుడ్డి కనుగుడ్డొకటి గావాలె తెలుగు తేనియలు చప్పరించడానికి సమైక్యపు లాలాజలంలో ఈదడానికి రుచికరమైన నాలుక గావాలె ఆంబుక్క పెట్టడానికి అడ్డుకునే అడ్డగోలు మాటల కోసం మడత పడ్డ నాలుక కూడా గావాలె హాస రేఖల ప్రదర్శనకు ముఖారవిందం గావాలె ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలినట్టు టీవీలో చూపినపుడు వికృత ప్రకోపాల జేవురింపు మొహం అత్యవసరంగా గావాలె విశ్వాన్ని ప్రేమించగలిగే విశాల సహృదయత గావాలె నోటికొచ్చే బుక్క నెత్తగొట్టడానికి ఎంతకైనా దిగజారే కుత్సిత మనసు గట్టిదే ఖచ్చితంగా గావాలె కుప్పమో కడపకో తప్ప తంగెళ్ళు దాటని కాళ్ళతో సీమ చెట్టుకో, కోస్తా మిర్చికో తప్ప పెట్టుపోతలు జరుపని చేతులతో వెయ్యికాలాల పెత్తనం ఎన్నికల్లేకుండా మాకే గావాలె ప్యూపాదశ నుంచీ సీతాకోకచిలుక అయ్యేవరకూ 1953 అనంగీకార కలివిడి మొదలు 2013 నిరవధిక కన్నారని ఆకాంక్ష వరకూ అడ్డుకొంటూనే వుండాలె అయితే గియితే అన్నీ అన్నీ అన్నీ వున్న హైదరబాద్ మాకే గావాలె విడిస్తే గిడిస్తే మా భీషణ ప్రతిజ్ఞలేం గాను తొడగొట్టిన పౌరుషాలేం గాను తేరగా మేసే మా నోరేం గాను అంచేతా మేమందరం గుడ్క వొదల బొమ్మాళీ నిన్నొదల…!!! (వాకిలి, ఫిబ్రవరి-2014)

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bZlyQO

Posted by Katta

5, ఫిబ్రవరి 2014, బుధవారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // బుర్ బుర్ బుర్ర్ ర్ర్ ర్ర్ ... // బిగిచ్చు, చెవులకి, ఇయర్ ఫోన్లు. ఎక్కు, నిచ్చెన ఏస్కొని, తౌసండ్ సీ సీ బైకుని. ఏలాడదీయి, కళ్ళని, గాగుళ్ళకి. వొత్తిచ్చుకో, ప్లే బటన్ తోటి. ఆశిక్ బనాయా... ఆశిక్ బనాయా... ఆశిక్ బనాయా అప్నే. ఇంగ కిక్ స్టార్ట్ చెయ్యి, లైఫుని. పొయ్యి దుంకు, సేం, మల్లా, ఆ బంగాళాకాతంలనే. సిగ్గులేనోనిలెక్క. హాయిగ. 4. 2. 2014

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bXVcPb

Posted by Katta

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // బుర్ బుర్ బుర్ర్ ర్ర్ ర్ర్ ... // బిగిచ్చు, చెవులకి, ఇయర్ ఫోన్లు. ఎక్కు, నిచ్చెన ఏస్కొని, తౌసండ్ సీ సీ బైకుని. ఏలాడదీయి, కళ్ళని, గాగుళ్ళకి. వొత్తిచ్చుకో, ప్లే బటన్ తోటి. ఆశిక్ బనాయా... ఆశిక్ బనాయా... ఆశిక్ బనాయా అప్నే. ఇంగ కిక్ స్టార్ట్ చెయ్యి, లైఫుని. పొయ్యి దుంకు, సేం, మల్లా, ఆ బంగాళాకాతంలనే. సిగ్గులేనోనిలెక్క. హాయిగ. 4. 2. 2014

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bXVcPb

Posted by Katta

1, ఫిబ్రవరి 2014, శనివారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // జీరో డిగ్రీ! // అతను పెద్దగా ఆశలు పెట్టుకోలేదు కానీ మనుషుల్లో కొద్దిగా ఒరిజినాలిటీ కోసం వెతికాడు- మాటల్లోనూ, చేతల్లోనూ, అడుగుల్లోనూ, అనుకోకుండా ఎదురయ్యే ఒక బిచ్చగాడికి ఔదార్యంతో స్పందించే తీరులోనూ. ప్రేమలోనూ, కోపంలోనూ, రాగంలోనూ, ద్వేషంలోనూ, పాత బస్ స్టాండ్ లో అనేకానేక సంవత్సరాల తర్వాత తారసపడ్డ ప్రియురాల్తో జరిపిన సంభాషణలోనూ. "ఉహూ... లాభం లేదు. అనుకరణ ఆకాశం నుండి అవని దాకా కమ్మేసింది" అంటూ గొణుక్కున్నాడు. పిల్లాడికి పీచుమిఠాయి బండి గంట వినిపించినంత ప్రియంగా తోచేది, ఒకప్పుడు మనుషులు వస్తున్న అలికిడి. తేరిపార చూడ్డం, కొంత వాళ్ళకు తెలిసీ, మరికొంత వాళ్ళకు తెలీకుండా ఫాలో అవడం, ఫాయిదా లేదని తెల్సుకుని మనాదించడం... "ముసుగులే ఎక్కువ లొసుగుల్ని చూపిస్తాయి మేకప్పే మేని వికృత స్వరూపాన్ని పట్టిస్తుంది లేనివి ఉన్నవిగా చూపెట్టే కొద్దీ ఉన్నాయని అనుకుంటున్నవి లేనివిగా తెల్సిపోతుంది" బయటకే అన్నాడు. చుట్టూ ఎవరూ కనిపించలేదు కానీ, అతనికి "చుప్ బే సాలే" అని ఎవరో గట్టిగా కసిరినట్టు వినిపించింది! 17.11.2012

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cENBJg

Posted by Katta

29, సెప్టెంబర్ 2012, శనివారం

మోహన్ రుషి // డ్యుయల్ సిం

వైరుధ్యాలను పెంచి పోషించినవాడే
వైవిధ్యాల గురించి మాట్లాడ్తాడు!

విధ్వంసానికి మూలంగా నిల్చినవాడే
విలయంపై విలపిస్తాడు!

నిలువ నీడ లేకుండా చేసినవాడే
నీ జీవనానికై నినదిస్తాడు!

పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని పరిహసించినవాడే
బ్రాండ్ బాజా బారాత్ అంటూ వూదరగొట్టేస్తాడు!

****

సహనానికి ప్రతీకలుగా నిల్చిన మనమే
సాగర హారమై పోటెత్తితే...
ఆచూకీ దొరకని శవంలా
కొట్టుకుపోతాడు వాడు!

26.9.12

22, సెప్టెంబర్ 2012, శనివారం

మోహన్ రుషి // ఔర్ ఏక్ నక్క! //


గీ ఎక్కిరిచ్చుడు ఇయ్యాల్టిది కాదు
నీతోటే అయిపొయ్యేటిదీ కాదు!

ఎవసాయం తెల్వనోళ్ళై
భాష రానోళ్ళై
బఫూన్లయ్యీ, బక్రా రౌడీలయ్యీ...
ఒకటా, రెండా..?!
నీ బట్టెబాజ్ తనం ల ఏం కాకుండ మిగిల్నం?!

గిప్పుడు కొత్తగ అయ్యిందేం లేదు
నీ జాతిల నువ్వు ఇంకోసారి విలీనమై
ఇర్గబడి నవ్వినవు తప్ప ఇంకొకటి కాదు!

లేని సెజ్జులు తేబడ్తివి
సూడని ఫ్లై ఓవర్లు కట్టబడ్తివి
స్వర్ణమంటివి, హరితమంటివి...
రాష్ట్రమంటె ఇదేనంటివి-
ఎన్నడు లేంది కొత్తగ అధికారిక ఉత్సవాలు ఎందుకని
గా గలీజ్ నోరుతోనె వొర్లబడ్తివి!

ఆరోవేలు సంగతి విన్నం
ఆత్మగౌరవ కథలు చూసినం
మొఖాలు ఎక్కడ పెట్టుకోవల్నో తెల్వక కెర్లినం
పచ్చెలు బాసిన ప్రజాస్వామ్యం సాక్షిగ
ఇప్పుడు బాజాప్త ఒక్కమాట-
యుద్ధం షురువైనంక
బాయిల దుంకుడు కాదు,
నువ్వు గా బంగాళాఖాతం లనే మునగాల్సొస్తది!

20.9.12

15, సెప్టెంబర్ 2012, శనివారం

మోహన్ రుషి //లోపలి బాల్కనీ!//

చెప్పడానికేమీ ఉండదు కొన్నిసార్లు
మాట్లాడ్డానికి అసలే ఉండదు
అకారణ అశాంతి కదా, ఏం చెయ్యలేం-
అస్పష్టమైన అలజడిని భాషలోకి అనువదించలేం!

మనుషులా, మానని గాయాలా,
మర్చిపోలేని ఘటనలా, మననం చేసుకున్న నటనలా?
ఏ ఒక్కదాన్నీ వేలెత్తి చూపలేం
ఏ చీకట్లో కాటు కలిసామో
ఎంతకీ తేల్చుకోలేం!

మోస్తూనే నడుస్తాం
మౌనంగా అరుస్తాం
అనంతమైన ఆలోచనల్లోంచి
అసలెప్పటికైనా బయట పడ్తామా అని భయపడ్తాం!

ఆశల గడ్డిపోచలకోసం
అవని అంతా కలియదిరిగి
దిగులు రాగాలు ఆలపిస్తాం
ఆవలి తీరంపై మోహం తప్ప
జీవితానికి పెద్దగా అర్థం లేదనే
తక్షణ సమాధానాల్ని రక్షణగా నిర్మించుకుంటాం
నిర్లిప్తతలోంచి నిర్లిప్తతలోకి నిశ్శబ్దంగా జారుకుంటాం!

13. 9. 2012