పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Pulipati Guruswamy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pulipati Guruswamy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జూన్ 2014, బుధవారం

Pulipati Guruswamy కవిత

తేనెటీగల తాళం ఒక్కోసారంతే నీకూ నాకూ మధ్య తాళం కప్ప తెరుచుకోదు మొరపెట్టు కోవడానికి ఎవరూ ఉండరు వేరే తలుపులు తెరిచే పని లో నిమగ్నమౌతారు తిరిగి తిరిగి ఆలయం మెట్ల మీద నా పాదం మోపగానే హనుమంతుడు తోకముడుచుకొని నవ్వుతాడు శబ్దాలకు తట్టుకోలేక సాయినాధునికి నిద్రాభంగమవుతుంది ఎవరి కొబ్బరికాయో నాకు ప్రసాదమౌతుంది ఎక్కడో తప్పిపోయిన స్వంతులను వెతుకుతూ వెతుక్కుంటూ మందకొడిగా నడుస్తుంటాను చిన్నప్పటి పైసలు పోగొట్టుకున్న భయము అమ్మమ్మ పొట్టగిన్నె తో తాపిన కుంకుమపువ్వు గోర్జం వాసన ఇప్పుడు వెంట వస్తే బాగుండనిపిస్తది ఎంతకీ తలుపులు తెరవనీయని జీవితమ్మీద వాతలు పెట్టే తాత వెళ్లి పోయాడు పోతూ పోతూ తాళంచేతుల గుత్తి గురించి పొగమాత్రమైనా చెప్పలేదు మనుషుల్ని తెరవటం గురించే ఆలోచించి మదనపడి భంగపడి గీరుకపోయి చివరికి జ్ఞాపక శక్తి మీద బోలెడు ద్రావకం పోసి భుగభుగ నురుగుల దుఃఖం తో కిటికీలు గుండా తొంగి చూసే వాళ్లని కలుసుకోవాలని ధ్యాస తాళం తీసే మంత్రమే తెల్వదు విచిత్రంగా ప్రతిముఖం మీద అదే ఒకటే వాత్సల్యం బాధ పుండు లాంటి రొద అసలీ జీవితపు తాళాలు తెరుచుకునే మార్గమేదైనా ఉందా....? ..... 11-6-2014 ి

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pk59S9

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

Pulipati Guruswamy కవిత

పోడు ప్రేమ // డా.పులిపాటి గురుస్వామి // మనుషులకేం కావాలో ఒక్కోసారి తోచనివ్వనిదేంటో గుర్తించడం చేతకాదు చెయి నిండా పని,కంటి నిండా నిద్ర కడుపుకింత జొన్నగంజి కలిపితె బ్రహ్మాండ మైన బతుకని తోచినపుడు ఎన్నింటిని కూల్చేస్తే అక్కడికి చేరుకోవచ్చో ...! కుదిరేనా అనిపించడం ఆగిపోలేదు ఎదుటి వారికి ఏమున్నయో! తెలిసేదెలా? సంతోషం సగం బలమేనా! బంగారానికి నేనే దిక్కని అనుకునే భారీ దరిద్రం నిత్యం వెక్కి వెక్కి నిద్రపోదు రూపాయల వలల్లోంచి మనుషుల రూపాలు ఎప్పుడో కారిపోయిన సంగతి మరువలేదు పోలిక చూసుకునే బతుకులకి చివరికి శ్వాసించడానికి చందాలు పోగెయ్యాలి ఆవేశాలతో కుతంత్రాలతో ఇంట్లో బాల్యాన్ని బలితీసుకొని కిరాయి కట్టి మరీ బతకలేని తనానికి బానిస చెయ్యటం తప్పనిసరి పెంపకాల భీభత్సం ఏమో! మనుషుల కేం కావాలో ఒక్కోసారి నేర్వలేని తనాన్ని గుర్తించడం చేతకాదు ..... 10-6-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hCK2HY

Posted by Katta

9, జూన్ 2014, సోమవారం

8, జూన్ 2014, ఆదివారం

Pulipati Guruswamy కవిత

దేవులాటకు గుండె అదుపు తప్పి కుంటుతుంది // డా.పులిపాటి గురుస్వామి // సందెన పడంది తాడో, బతుకు బాటో దీపంతకు కూడా ఆవేశం రాదనుకోవటం తప్పైంది కొట్లాట దార్లో పడ్డాక కారణాలు నవ్వుకుంటాయి ఏమిచ్చెనో...ఏంతీసుకునెనో ఇచ్చినోడి నుండి తీసుకుంటోడు తీసుకోకముందే నడిమింతల చెయిపెట్టి నాకేసినోడు అదృష్టాన్ని తడుపుకుంటూ గొళ్ళెం తీసుకుంటడు పుణ్యానికి బలవ్వటమూ అప్పుడప్పుడు కుదురుతుంది శుభకార్యాలను ఇష్టపడ్డ పిశాచాలకు అభిమానులు మర్యాద చేతురు కాలం తిరిగినంత మాత్రాన కసాయుతనం బొబ్బలింకా మానలేదు ఇషమైన తలకాయకు ఇష్టమైన తలపులు పూస్తాయని ఎవరంటారు పాడైన కోరికలు నిండుగా పంచడానికి తయ్యారట ఓర్నాయనో...! సప్పుడు కాకుండ వుంటె కప్పల బుసబుస కూడా వినొచ్చు శానిగ ..... 8-6-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1icvxFK

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Pulipati Guruswamy కవిత

కక్కయ // డా.పులిపాటి గురుస్వామి // నా బరిబత్తల బాల్యం నీకెరికే ముత్యాలమ్మ పండగ నీ చేతిలో చెయ్యేస తిరిగిినపుడు కద సిగమూగింది వాగుల మూటలు మోసిన భుజాలు రెండు ఎప్పుడు చేతులు చాచలేదు ఎంత నమ్ముతవో...మనుషుల నీ వెడల్పు నవ్వు నవ్వి గుండెలకద్దుకొని లక్షిం దేవి పటం దగ్గర దాపెడ్తవ్ పైస మీద పైస పెట్టి పాతనోటుకు కొత్తనోటు అంటకుండ గల్లపెట్టెల పొక్తంగ పడుకోపెట్టినందున పడింది పడినట్టే లేవకుంట లేవైతివి ఎవరిని చెయి చాపనందుకు నీ కోసం చాచిన చేతులు వెక్కి వెక్కి కుబుసం విడుస్తున్నయ్ ఏం పోసినవో పుట్టలనిండ మంచి నీళ్ళు మింగని మాయ చివర తగిలి పులి చీమలు ముసిరినయ్ కాలం మారిందో లేదో వీపు మీద మందు రాయని ఎర్రని గాయం ఏంచెప్పలేదు మోసుకెల్లిన భారం లేదుగాని మోయ లేని భారం ఒంపినందుకు ఒకసారి దెబ్బలాడక తప్పదు రా! కక్కయా... చెరో పెగ్గేసుకొని మనల అవమానించినోల్ల మీద కాసింత కసి నంజుకుందాం ..... 6-6-2014 నా కక్కయ ఈ రోజు విడిచి వెల్లినందుకు ఇది నివాళిగా .....

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rRAugH

Posted by Katta

3, జూన్ 2014, మంగళవారం

Pulipati Guruswamy కవిత

జీవితాలు రచించబడవు // డా.పులిపాటి గురుస్వామి // ఓ కథకి నువ్వెప్పుడూ నాయకుడివే కొన్ని కథల్లో మాత్రం సాధారణ పాత్రధారివి నీ చుట్టూతా నాలుకలు తిరుగుతున్నపుడు ఇరవై నాలుగు గంటల కాలాన్ని సర్దుకోవటం అలవాటౌతుంది కొన్ని సమయాలు చేతకానివి నీ నొసలు మీది చెమటను తీయడానికి కూడా సహకరించవు అన్ని కథలు కొన్ని సందర్భాలందు రాత్రి అందరం కలిసి భోంచేసినట్టు మాట్లాడుకుంటూ గోడును మింగలేవు కింద మీద నువ్వొక్కడివే కానప్పుడు నీ పాత్రకి నైపుణ్యం జోడించడం కుదరనిపని ప్రతి కథ తన ప్రదర్శన మీద అపనమ్మకాన్ని కల్గి ఉండదు కథ మాత్రం ఎప్పటికీ ఆగదు ఇంకో కథలో జాడని విడువగా కాలంతో పాటు చిగురేయటం దాని స్వంత సంబరం. ..... 3-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S35hXe

Posted by Katta

1, జూన్ 2014, ఆదివారం

Pulipati Guruswamy కవిత

కడుపుల పెట్టుకో // డా.పులిపాటి గురుస్వామి // ఏ ప్రశ్నలు లేక ఏ సంశయాలూ లేక గడపటంలో కోలుకోవాలి జాగ్రత్త కోసం ఓ సూచన భూగోళం కాళ్ళ కింద గిర్రున తిరుగుతుంది వెలుతురు అస్తమించక ముందే భయంతో పాటు శవాన్ని కాల్చేయాలి అనేక గోడులన్నిటికి కళ్ళు మొలిచాయి వాటికీ నిరుత్సాహపు ఎదురుచూపు అనివార్యమైనదొకటే తడబడుతూ తట్టుకోవటం ్అందుకై కడుపారా మాట్లాడుకుందాం ద్రవీభవించిన బాధల్ని వార్చుకోవాలిక... అర్ధాంతరంగా సాయంత్రం ఆవహిస్తుందేమో! సూర్యుడు కూడా నిర్దాక్షిణ్యం నటిస్తాడు కొన్నిసార్లు రహస్య కన్నీటి జాడలు కొన్ని వాక్యాలను ఇంకా ఉఛ్ఛరిస్తూనేవున్నాయి విషయాలను హత్తుకొని మనసుని వదిలేసుకున్న అజ్ఞానం వెనక్కి చూసినా ముందు చూసినా పరుచుకునే వుంది సరే! ఇక సమస్త గర్వాలకి...భయాలకు సమస్త ఈసడింపులకి సమాధానమివ్వలేని ఆవేశాలకు సగం కాల్చేసిన అహంకారాలకి వినమ్రంగా పక్కకి తిరిగి ..... 1-6-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mYGeA2

Posted by Katta

29, మే 2014, గురువారం

Pulipati Guruswamy కవిత

2002 లో రాసిన ఒక పద్యం.పాత పుస్తకాల మధ్య నుండి తేలింది . బతుకుమచ్చ // డా .పులిపాటి గురుస్వామి // ఈ రహదారుల మధ్య ఖైదు చేయబడ్డ ఒంటరి వనవాసి నేనే దారులు తెరుచుకునే మంత్రం మరిచిపోయిన బానిసను వెన్నెల్ని తీసుకొని వెలుతురు ఎటు వెళ్ళిందో ... బహుశా నేనే నా బానిస హస్తాల నుండి విముక్తి కలిగించానేమో! నా గుహ లోకి రంజింప వచ్చిన పిచ్చుకను నిలుపలేని బలహీనత కూడా ఒక శాపన కొన్ని జ్ఞాపకాలు తప్ప మరేమీ లేదు. తోతాపురి కండరాల ప్రశ్నలకు జవాబు లేదు అనేక వలయాల నడుమ చతికిల బడ్డ శ్వాస కు దుఃఖం తప్ప మరో తోడు లేదు దైవత్వం కోసం కాదు కాని మనిషిగా మసలుకునే లోపల ఏదీ కాకుండా పోయిన వెలివేయ బడ్డ ఆత్మవికలున్ని ఈ రక్త మానస గాయమిక పూయదు. ..... 29-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pme45c

Posted by Katta

15, మే 2014, గురువారం

Pulipati Guruswamy కవిత

అటు జరుగు // డా.పులిపాటి గురుస్వామి // గొప్ప ప్రారంభము అంతే గొప్ప ముగింపు నడుమ ,అద్భుతమైన కొనసాగింపు ఏ జీవితానికీ సరిపడదు ఒక రోజులో కూడా అంతే ఐతే కావచ్చు పరిమితిదేముంది...మనం గీసిన తాత్కాలికహద్దు చేయినిండా చేరిన అన్నం ముద్ద ఈ ప్రపంచానికంతా ఆసరా కడుపునిండిన సందర్భమే గొప్ప అవకాశము ,అదృష్టమైనది స్పష్టంగా చూడదగిన కళ్ళు కూడా మనకి లేవు కొన్ని జంతువుల వలె. అవికూడా కాలాంతరాన మబ్బులు కమ్మి గుండెకి పడ్డ చిల్లులా మారిపోతాయి దుఃఖపు బొట్లు విడువటం కోసం మనది కాని ప్రాంతాల్లో మన మాట వినని శరీరాల్తో ఏముందనిక్కడ ? దాచిపెట్టితిమా ఏమైనా? ఏరోజుకారోజు... దొలుపుకుంటూ,మలుపుకుంటూ తోటి మనుషుల మధ్య వినయం నటించుకుంటూ... ఓహ్.....ఇక్కడిదాకా వచ్చాక ఎవగింపు కే ఎక్కువ బలం బచ్చలాకు మీది పచ్చ పురుగులు నయం కాకపొతే మరేమిటి? ఒరేయ్ ఆనందుడా! ఉన్నట్టుగా ఉంటూ లేనట్టుగా మసలుకోవటమే జీవించడంలో నేర్పు. ..... 15-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1svR8h4

Posted by Katta

14, మే 2014, బుధవారం

Pulipati Guruswamy కవిత

శకలస్వరం // డా.పులిపాటి గురుస్వామి // ఎప్పటికీ ఏదో ఒక బాధ దానికి రూపం ఉండదు నువ్వనుకుంటున్నట్టు సరిహద్దులు కూడా ఉండవు . నన్ను కాపాడుకోవటం కోసం అది ఆవహించుకు పోతుంది వందశాతం వశీకరణ మంత్రమేదో ఉంది. నేను దాన్ని ప్రేమించినట్టే అది కూడా నన్ను ...... కనికరింపుల కలత దుఃఖాన్ని సాదరంగా చేయి పట్టుకు తీసుకువచ్చి నిలబెడితే... దాని దీనమైన ముఖానికి నవ్వాగదు నాకు..... నాకు నువ్వు కావాలి దుఃఖం కూడా కావాలి . .............. 14-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T2JHnn

Posted by Katta

10, మే 2014, శనివారం

Pulipati Guruswamy కవిత

బతకటమే సాధన // డా.పులిపాటి గురుస్వామి // ఎల్లప్పుడు పరిమితమైన భయంతో ఎట్లా చేరుకుంటావు నువు ఒంటరిగా వస్తే బాగుండు స్వఛ్ఛమైన కపోతకాంతిలా సంచులు మోసుకురావద్దని తెలియక పాతవారు కొత్తవీ దుమ్ము నిండిన క్షణాలవీ ఇప్పటికే బతికిన వాసన నిల్వలవీ వెంటపెట్టుకుంటావు శ్వాసించటానకి ఎవరి సాయం అక్కరలేనట్లే ప్రేమించడం సహజంగానే జరిగిపోవాలి ఏమో...ఈ ప్రపంచమంతా నావైపు నటిస్తుంది నేనొక్కన్నే వాత్సల్యం వైపు దాచుకున్నాను హృదయానికి దగ్గరి దారి తెలుసుకోవటం కోసం మన మధ్య దూరం సాగుతుంది. ..... 10-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oAm9zR

Posted by Katta

5, మే 2014, సోమవారం

Pulipati Guruswamy కవిత

బతుకుతున్న నీడలు // డా.పులిపాటి గురుస్వామి // నిజమే కదా? మనుషుల కంటే మనం ఇంక దేన్నో ప్రేమిస్తున్నాం మొత్తం నాటకమంతా గ''మ్మత్తు''గా నడవటానికి అసూయ నింపిన పాత్ర ఒక్కటి చాలు చిందర వందర వ్యక్తిత్వం పరుచుకోవటానికి పిసరంత ద్వేషం అంటుకుంటే మహా వలలు చాలా పరుచుకున్నాక హృదయానికి శ్వాస దొరకదు ఏ జీవీ భూమ్మీద ఇట్లాంటిది పోల్చుకోవటానికి నిలవదు అన్నీ ఎరికే ప్రకృతి మీదనో పచ్చనాకు మీదనో పూల గుత్తి మీదనో పాల మీగడ మీదనో పోటీకి దిగలేం పక్కనుండి చెయ్యందిచ్చిన వాన్నే వీపు వెనక నుండి విరిచేస్తాం ఎన్ని యుగాలు మారితేనేం ? సౌలభ్యం కోసమే పెనుగులాట ఎన్ని చదువులు పారితేనేం? స్వభావం విడువని ముసుగుబాట కేవలం జీవించటం లో దాగిన ఆనందాన్ని అవతలికి తిప్పి నటిస్తూ జీవిత కథను రక్తి కట్టిస్తున్నాం విషాదమైన విషాదం ఇంతకు మించి లేదేమో! ..... 4-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1igTgn5

Posted by Katta

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Pulipati Guruswamy కవిత

ఇక్కడ ఇలా కూడా సాధ్యపడుతుంది // డా.పులిపాటి గురుస్వామి // ఈ వాన చినుకుల సాయంత్రాన్ని కిటికీ రెక్కల తెరిచి ...లైవ్ గా చూస్తూ లైక్ చేస్తుంటా చినుకులు తగిలిన గాలి హొయలు సున్నితమైన మెత్తని బాధల మీద వాలిపోయాక క్రమంగా ప్రపంచ గాయాల నుండి కోలుకోవటం తేలికైన శ్వాస ద్వారా తెలిసిపోతుంది ఇంకా ,,,మన దేశాల పాలకులనో విదేశీ మనుషులనో ...లేకపోతే వారి కసాయి కదలికలనో నిమ్మళంగా కర కర పకోడీల కింద నములుకుంటూ జ్ఞానాన్ని పదునుచేసుకోవటం సరదా రంగు రంగుల నక్షత్రాలై విచ్చుకొని ఈ మసకవుతున్న సాయంత్రాన్ని కందిపోతున్న చీకటి కిందికి తీసుకుపోయి గొంతువిప్పి... అక్షర కాంతుల మధ్య కాంక్రీట్ వనానికి బతుకు ఆశను తెరవటం ఇష్టం పూల గుండెని నిమురుకుంటూ అగడు తగలకుండా ఆత్మను తడుపుకుంటూ సూర్యుడు విడిచిపోతున్న అందానికి దగ్గరగా జరిగి ఈ నాటిలా ... సాయంత్రానికి సెలవు చెప్పటం అప్పుడప్పుడు సాధ్యమైనా... సార్ధకమే బతుకు. ..... 29-4-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QYynXy

Posted by Katta

27, ఏప్రిల్ 2014, ఆదివారం

Pulipati Guruswamy కవిత

నేను నీ కోసం బతకను // డా.పులిపాటి గురుస్వామి // వేసారిన రోజులు మననుంచి వెళ్ళిపోవు కావాల్సిన నమ్మకం ప్రసరించక పోతే ఒంటరి యాత్రకి దిక్కు తెలియదు అందరూ ఇక్కడ పాత్రధారులే నిమిషాల తేడాతో నిష్క్రమించక తప్పని వారే పరిధులు గీసే వారు తెర మీద కనిపించరు వలయాలు వలయాలుగా మనుషులు పేరుకుపోతారు యుగాలుగా కొంత వెలుగు కొంత చీకటి సంతోషాన్ని ప్రకటిస్తాయని తెలియక అపోహల చుట్టూ తనుకులాట చెరువంతా ఒకేసారి ఈదటం ఏ చేప కీ చేతకాదు బతకటానికిగల అవకాశమే అదృశ్య కానుక దిక్కుల మీదికి విసిరేయక దిగులును జయించడమే బలమైన గెలుపు. రోజూ చిగురించడం తెలిసిన వానికి చీడ ని చెరపట్టటం చాలా తేలిక ..... 27-4-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ipQtg4

Posted by Katta

24, ఏప్రిల్ 2014, గురువారం

Pulipati Guruswamy కవిత

అదనపు వ్యధ // డా.పులిపాటి గురుస్వామి // పోతూ పోతూ మరిచేపోతాం చేతనైనది కూడ చేత చిక్కించుకునే ధ్యాసే వెలగదు పోనీ ఏదైనా మళ్లీ తెప్పించుకునే వీలు కూడా కాకపోవచ్చు మన దాకా చేరవేసే కాలానికి అప్పటికి మన చిరునామా ఖాళీ కనిపించవచ్చు నీకూ నాపని చెప్పలేను నిజానికి నీది నీకు మోపెడంత దించే దిక్కుండదు కలిస్తే మాత్రం కళ్ళను ఊరడించుకుంటూ పాదాలను పవిత్రం చేసుకోవచ్చు. అంతుపట్టని ఆత్మ చేసే మంత్రజాలంలో ఎవరి వంతు ఎంతనేది తెలిసేవీలుందో లేదో... ఏదీ వెంటరాకుండా ఓ ఏర్పాటు ఉన్నాకూడా అన్నీ కూర్చుకుందామనే కోరిక వెంట పరుగే పెద్ద వ్యసనం కొన్ని క్షణాల్ని మాత్రం నిలబెట్టుకోవచ్చు మనకోసం అవి నిత్యం వాడిపోని పరిమళపు సొంపుని పూయడం చేత . ..... 24-4-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ihgGIB

Posted by Katta

23, ఏప్రిల్ 2014, బుధవారం

Pulipati Guruswamy కవిత

అసంకల్పిత రసన // డా.పులిపాటి గురుస్వామి // ఊహలతో కూడిన కలలు కొన్ని నక్షత్రపు ఆశ్చర్యాల్ని వానచినుకుల చలికాంతినీ ధారగా ఆస్వాదించే సమయాన నువ్వు నన్ను అవలీలగా కలిచివేస్తావు ఒక్క వేకువ యవ్వనాన్నీ కూడా నిరాశగా నీ ధ్యాస నుండి వేరుగా తిప్పనూ లేను పనికిమాలిన వ్యసనమని తోచిన ప్రతి కలయికా నా ఆనందపు చలనాల్లో వేడుక చేసుకుంది నిను కలిగిన తలపు నా అణువుల అలల పై పూల ఋతువును వెలిగించెనెందుకో... కళ్ళల్లోంచి కళ్ళల్లోకి ప్రవహించిన నిశ్శబ్ధమూ సౌందర్యంతో నిగనిగ లాడిన సమయాన్ని దాచిన స్థలం తెలుసుకోవటం సుళువే సుళువే తేలికైన బతుకు నీ లే స్పర్శను రెపరెపలతో అల్లుకుంటుంది . ..... 23-4-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNocgU

Posted by Katta

22, ఏప్రిల్ 2014, మంగళవారం

Pulipati Guruswamy కవిత

4 // డా.పులిపాటి గురుస్వామి // సంపదలు సమకూర్చని సత్యం స్వచ్ఛంగా నీ నీడ కిందికి చేరినపుడు ఎవరమో తెలియని చోటు నుండి ప్రయాణం మధ్య లో అలసట ఆవిరౌతుంది కొద్దిసేపు లయకు కాంతి అద్దుకుంటుంది మౌనం మెల్లమెల్లగా గుసగుసపెడుతుంది పెచ్చులుగా రాలిపోయే బంధాల నడుమ వేదనకి చలిచలి పరిమళం కలుస్తుంది వెన్నువెంట సన్నని సౌందర్యపు పిలకలు లేస్తాయి .....మనసు ఓ అద్భుత మర్మాంగం ..... .....

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f08NMY

Posted by Katta

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Pulipati Guruswamy కవిత

3 // డా.పులిపాటి గురుస్వామి // ఆప్పుడప్పుడు నువు లోపలినుండి కనుపాపను తడుముకుంటూ వస్తావు అపుడే గుండె లేని క్షణాలు నిల్చి ప్రపంచాన్ని శూన్యం లోకి ప్రవేశ పెడుతుంది ఖాళీ ఖాళీ దేహం తో ఆత్మకు ఆసరాగా ఏదీ దొరకదు శబ్దాలను చుట్టుకున్న నిశ్శబ్దం నీ లేత స్పర్శ మీద వాలిపోతుంది జీవిస్తున్నట్టు ఓ దాఖలా అక్షరాలు చెమ్మగిల్లుతున్నపుడు. ..... 18-4-2014.

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i2jNUD

Posted by Katta

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

Pulipati Guruswamy కవిత

కలవరింత కలవరింత కలవరింత // డా.పులిపాటి గురుస్వామి // ఎక్కడా దిక్కు తోచని సమయం లో నువ్వు గుర్తుకు వస్తావు. పరిమిత మైన జ్ఞానం నిన్ను పూర్తిగా చేరనివ్వదు. ఒక తడి గుడ్డ చుట్టిన తపన నోరు తెరుచు కుంటుంది చెప్పుకోవడానికి ఎవరున్నారు దుఃఖం తప్ప అదీ ఒక్కోసారి మాట వినక ప్రతి కంటి చివర వేలాడుతూ ...నా లోపలికే చేరుతుంది కలలు కూడా కనికరించని కాడ వల నిండా నేనే వుంటిని సమయానికి కూడా చిక్కనంత చిక్కుకుపోయాం అవునా? ఏ చిరుగు కాడ కప్పి కుట్టు కుందామన్నా సరిపోయేలా లేవు నువ్వు అప్పటికప్పుడు కొన్ని మాగిన వాక్యాల ఉద్రేకం మీద నీ చూపు వాలితే ఇంకేముంది ... అంతా శూన్యం అనిపించటం ఎంతసేపు. ..... 11-4-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd1xx5

Posted by Katta