//ఎలక్షన్నామ ఉగాది// ------------------------ *శ్రీనివాసుగద్దపాటి* ---------------------------------------------------------------------- "జయ"నామ ఉగాది జయహో..ఎన్నికలతో ఎన్నెన్నికలలతో.... ఆశలవసంతాల్ని మోసుకొని ఎగిరొస్తున్నావా...?! మోడువారిన బీడుగుండెల్లో ఆశలచివుర్లు మోలిపిస్తావో....! మునుపటిలాగే ..... వాగ్ధానాలజల్లులు కురిపిస్తావో...! ఎప్పటిలాగే నీకెదురేగి ఆహ్వానం పలుకలేను ఆనందంగా ఆరురుచుల్ని ఆస్వాదించనూలేను అరవైఏండ్ల కలసాకారమౌతున్నవేళ అడుగడుగునా అనుమానాల చిక్కుముడులు పునర్ణిర్మాణమా...! నవనిర్మాణమా..?! అసలు గుడిసేలేని అమాయకజీవులకు అదో మిలియండాలర్ ప్రశ్న రోజుకో పార్టీ.. పూటకోనినాదంతో కొత్త కొత్త ఇజాల్ని భుజానవేసుకొస్తున్న కొత్తబిచ్చగాళ్ళు సరికొత్త తాయిలాలతో ఓటర్ల మెదళ్ళను ఖాయిలాచేస్తున్న మాయలమరాఠీల మాటలగారడీలు ఇన్ని అనుమానాలు ఇంత అయోమయంలో ఎలానిన్ను ఆస్వాదించను ఏమని నిన్ను ఆహ్వనించను ఓ జయనామ ఉగాది నీకు జయహో.... 31.03.2014
by Srinivasu Gaddapati
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mq9AWX
Posted by Katta
by Srinivasu Gaddapati
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mq9AWX
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి