పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Gubbala Srinivas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gubbala Srinivas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జూన్ 2014, మంగళవారం

Gubbala Srinivas కవిత

శ్రీనివాస్ !! రమణీయ విశ్వం !! ------------------ సంధ్యపొద్దు నేలవాలి అరుణవర్ణం అంబరాన్ని పాకింది. కడుపునిండి గువ్వలగుంపు ఇంటిదారి పట్టి నింగికే అందమొసగే. నీలిమబ్బు.. గాలివొడిలో ఊయలూగె చిత్రాలు కనులకే కనువిందు. అలసిన ప్రాణుల అలసట తీర్చుటకై వెన్నెల పరుపుని సిద్దం చేస్తుంది జాబిల్లి. ఊగే తారకలు అక్కున చేరి చక్కిలిగింతలు పెడుతున్నాయి. మనోహరం..సుమనోహరం.. ఈ విశ్వం ! (24-06-14)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nA6JJu

Posted by Katta

19, జూన్ 2014, గురువారం

Gubbala Srinivas కవిత

శ్రీనివాస్ !! వాడంతే !! ---------------- నిన్నేకదా ప్రేమగా పిలిచాడు ఈరోజు నైజం నెత్తురులా కక్కనివ్వు మాటెప్పుడూ ఒకటే అనుకున్నావేమో నాణేనికి బొమ్మా,బోరుసులా రెండు నాలికలు వాడికి. చీకటి గడియ వేసుకుంటే రాతీదేవిలా ఓ కంటికి నువ్వు వెలుగు కళ్ళాపి చెళ్ళున ముఖంపై తాకినప్పుడు రాక్షసిలా మరో కంటికి. నిరాశ,నిస్పృహలు ఆవహించి నిస్సహాయుడిలా నిలబడినప్పుడు ధైర్యాన్నిచ్చే రుక్మిణివి మగతనం మీసంలా మొలిచినప్పుడు కాలికింద నల్లువి. కునుకు తీసే సమయాన కంటికి రెప్పలా..ఇంటికి దీపంలా.. కోపం రగిలిన క్షణాన తూట్లు తూట్లు వొళ్ళంతా రూపం మారేలా పాపానికి ప్రతీకలా. దేహం పులిసిపోయింది.. జీవితం అలిసిపోయింది.. ఊపిరి ఆగిపోయింది.. మరో బలిపశువు కోసం తా(ళి )డు పసుపు పులుముకుంటుంది కసిగా పీకలు కొయ్యటానికి ! 19-06-14

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lGZY7m

Posted by Katta

14, జూన్ 2014, శనివారం

Gubbala Srinivas కవిత

శ్రీనివాస్ !! కాళీసీసా !! ------------- బాల్యాన్ని,యవ్వనాన్ని ఆనందపు అంచుల బయటే బందించి జీవితాన్ని వొంపుకున్న కాళీసీసాను. రోజులు దొర్లిపోయాయి, సంవత్సరాలు గతించిపోయాయి నేనంటూ ఒక్క గడియా గడపక. ఏళ్ళు కాళ్ళకింద ముళ్ళులా చేరుకున్నాయి బంధాలు కళ్ళలో నలకల్లా మెరుగుతున్నాయి అవి వేసే శిక్షను స్వీకరించటం తప్ప ఏం చెయ్యగలను ? ఈ గాజు పరికరంలో తిరుగాడుతున్న కోట్ల వృద్ధకణాలు నిరీక్షిస్తున్నాయి పగిలి మట్టిలో కలిసిపోవటానికి. ఇక విధాతాను వేడుకుంటాను ఏమీలేని ఈ కాళీసీసాను పగులగొట్టి నన్ను సంపూర్ణం చెయ్యమని ! (14-06-14)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vfCAp1

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

Gubbala Srinivas కవిత

శ్రీనివాస్ // గుర్రబ్బండి // గాలిలో విమానమై తేలకపోయినా నేలమీద బస్సులా దూసుకుపోకపోయినా తెల్లారితే చాలు మావూరి జనాన్ని మోసుకుపోయేది. టక్ టక్ మని శబ్దం చేసుకుంటూ ఇంటికొచ్చిన చుట్టాలను అరుగుమీద దింపిపోయేది. మందిని నిండుగా నింపుకొస్తుంటే ఇంటి చూరులనుండి మేము తొంగి తొంగి చూడాల్సిందే. పండగలకి,పబ్బాలకి కొత్త అల్లుళ్ళను మరదళ్ళతో టూరింగ్ టాకీసులకి సరదాలందిస్తూ తోడ్కొనిపోయేది. ఇంట్లోకి కావలసిన పచారీ సరుకులు వొంట్లో నలత చేస్తే ఆసుపత్రికీ ఆత్రంగా మోసుకుపోయేది. కాలం కాటేసిందో ,మనిషి మరిచిపోయాడో కాలగర్భంలో కలిసిపోయింది ఆ అశ్వరధం ! ( పదేళ్ళ క్రితంవరకూ మా ఊరిలో గుర్రబ్బండి తిరిగింది ) 10-06-14

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oa2o67

Posted by Katta

7, జూన్ 2014, శనివారం

Gubbala Srinivas కవిత

శ్రీనివాస్ ll ఆదిశక్తులు మీరు ll -------------- అత్యాచారం..అత్యాచారం.. ఆగదా ఈ కీచకపర్వం ? ఆదిశక్తులై కదంతొక్కితే మీరు అదిరిపడరా కామముష్కరులైన వారు. పట్టిచూడండి ఓ చేతితో మీ గుండెధైర్యం మట్టికొట్టుకుపోరా ఈ మనవ మృగద్వయం సహించినన్నిరోజులు తప్పదు మీకీ నరకం సై అని కాలుదువ్వి చూడండి వీళ్ళ వైనం. తరతరాలు మీమీద ఆదిపత్యం తగదని తేల్చి చెప్పండి ఇది సత్యం నెత్తినెక్కి వారు మొత్తబోతే కత్తిబట్టి ఆ కరము నరకండి ధుర్మార్గుల చరమగీతం పాడటానికి స్వరము స్వరము కలపండి. ఆడదంటే ఆటబొమ్మ కాదని ఆడమంటే ఆడే కీలుబొమ్మ కాదని గళంవిప్పి గొంతుఎత్తి పాడండి గర్జించే గుంటనక్కలపై గండ్రగొడ్డళ్ళు విసరండి. దైవం మీరు..త్యాగం మీరు.. అనురాగం మీరు ప్రతినబూనకండి జన్మించమని మా లోకంలో మన్నించండి పురుషప్రపంచాన్ని ఈ లోకంలో ! 7-6-14

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kGX2fv

Posted by Katta

5, జూన్ 2014, గురువారం

Gubbala Srinivas కవిత

శ్రీనివాస్/దీపంబుడ్డి ------------- వెలుగుశత్రువును సాగనంపుతూ తననితాను వెలిగించుకుంటా ది లోకానికింత కాంతినిస్తూ దీపంబుడ్డి. తాతా,అవ్వల తోడూ నీడ చీకటి కనులకు వెలుగురేఖ ఆ చిన్ని దీపంబుడ్డి. ఎన్ని సంతోషాలను,ఎన్ని దుఖ్హాలను తనలో దాచుకుందో..! కొడిఆరని ఆ చిరుదీపం. తైలం తాగినకొద్దీ నిలువ కాగాడాలా నుంచుంది జనులకు వెలుగు దాహం నింపుతూ. నాన్న సర్కారీ కొలువు పొందటానికి అమ్మ సంసారం తీర్చి దిద్దటానికి దీపం ఋణం తీర్చుకోలేనిది. పొలమెళ్లి వడ్లబస్తాలు తెచ్చినా అలసి వాకిట్లో ఆదమరచి నిద్రించినా కలిసిపోయింది మాలో ఒకరిగా. గాలివీచి తనని ఆర్పిన ప్రతిసారీ వెలిగించే నిప్పుకత్తికి తన మెడను అందిస్తూనేవుంది. నేడు విద్యుత్ దీపాలు వెలిగి దీపాన్ని మూలన పడేసినా మౌనంగా ప్రకాశిస్తూనేవుంది మా ఇంట్లో ! (ఇప్పటికీ మా ఇంట్లో కిరసనాయిల్ దీపం వెలిగించుకుంటాం )#5-6-14#

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mdCCqH

Posted by Katta

31, మే 2014, శనివారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ------------ఓ కాలేయం వ్యధ అవును ప్రతిరోజూ నాకు కాలకూట విషంతో అభిషేకిస్తుంటాడు నా యజమాని రాత్రి,పగలు,సమయం,సందర్భంతో పనిలేదు కావలసింది పతనమయ్యే చిన్నకోరిక మాత్రమే దురద్రుష్టం వెంట తెచ్చుకోవటం కాకపోతే ఏంటి ? వాడితో కలిసి నేను పుట్టటం , వాడి ఇష్టానికి నేను బలి కావటం చావైనా ,పుట్టుకైనా సరే మద్యంతోనే సంబరమట స్వర్గసుఖాలు నిషా మత్తులోనేనట ఒక ఊపిరి పుడుతుంది వీడు సారాసీసా పట్టుకుని వేసే గంతులకు అంతే ఉండదు నన్ను నిండా ముంచేసి "ఉబ్బి"తబ్బిబ్బు చేస్తుంటాడు ఇంట్లో ఓ శవం లేస్తుంది భాదంటాడు సారాతోనే విరుగుదంటాడు నా భాదేంటో మరుస్తాడు పోటీ పడుతుంటాడు పెగ్గులతో , ఫ్రెండ్స్ తో తూలి తూలి పడుతుంటాడు వాడి సరదాకు కోలుకోలేనంతగా కుళ్ళిపోతుంటాను నేను విషానికి మరో విషం కలుపుతుంటాడు చల్లగా ,మెల్లగా కోరుక్కుతింటాది ఆ శీతలపానీయం మింగి మింగి వొరిసిపోతుంటాది కాలేయం ఒక్కోసారి జీవనదిలా తడారనివ్వడు గొంతునూ నన్నూ తడుపుతూనేవుంటాడు గొంతు చించుకుని అరవాలనుకుంటాను కానీ నా గొంతెక్కడ పెగులుతాది ? గొంతునిండా మందుతో నింపేసాడు కదా ! 31-05-2014

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pGK5lD

Posted by Katta

25, మే 2014, ఆదివారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ -------నేను పుట్టాను ఒకానొక గర్భ గదుల గుండెలనుండి అల్పాయుశ్శును నింపుకుని కొన్ని బండరాళ్ల మనుషుల్లోకి నేను పుట్టాను. వెంట తెచ్చుకున్న కొన్ని అనురాగపు ఆనవాళ్ళు బాహ్యలోకంలో అడుగిడగానే ఎండిపోయిన రుధిరపు బిందువులుగా. ప్రసవించక మునుపు నా స్తావరం ఇరుకు అయినా విశాల కలల ప్రపంచం ఇక్కడ అనంతమైన నేల పరుచుకున్నా ప్రేమలు ఉద్భవించని కుగ్రామం. ఒకసారి మనసుని వెతికి చూస్తే చేతికి తగిలాయి ఇంకీ ఇంకని కన్నీటి జ్ఞాపకాలు వడిలీ వడలని చర్మపుతోళ్ళు. వసంతానికో నవ్వు చూడను దశాబ్దానికో పులకింత కనను శతాబ్దాలుగా పుడుతూనేవుంటాను యుగాలుగా బ్రతికేస్తూనేవుంటాను ! 25/05/2014

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m9BhT7

Posted by Katta

23, మే 2014, శుక్రవారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ -------బాల్యం ఏ గిరి శికరాల పైకి ఎగబాకి అనంత వాయువుల్లో కలిసిపోయిందో ఏ దిగంతాల అంచుల పంచన చేరి కనుమరుగైపోయిందో. జ్ఞప్తికి వచ్చిన క్షణం శ్రావణ సమీరమై వచ్చి హృది గదిలో కొన్ని జ్ఞాపకాలను జార విడుస్తుంది. నెమరు వేసుకున్న సమయాన అనుభూతులు కన్నీరుగా మారి కళ్ళల్లో గుచ్చుతున్నాయి ఏది నా బాల్యం ! 23/05/2014

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TzXv8W

Posted by Katta

18, మే 2014, ఆదివారం

Gubbala Srinivas కవిత

।। పాపం చెట్టు ।। ---------------------- ఒక చెట్టు మొలిచింది నేల తల్లిని క్షోభపెట్టి నిలువెత్తు వట వృక్షమై నిలిచి .. భూసారాన్ని పీల్చుకుని తన రక్తంలో కలుపుకుని వొంటినిండా మధుర ఫలాలను పండించి పేర్చుకుంది సువాసనలతో.. ఇంతలో అటుగా వచ్చాడు నారూ ,నీరూ పోయని వీరుడు రాళ్ళతో ఒక్కొక్క పండునీ నేల కూల్చాడు చెట్టుకి సరిహద్దులు గీసి.. కొమ్మలకు గాయాల్ని చేసి పోయాడు. పచ్చని ఆకుచీర కట్టినట్టు విరగబూసింది లక్షలాది ఆకులను కొందరు అటుగా వచ్చారు అవసరమో.. అనవసరమో .. కనికరం లేకుండా ఆకులన్నీ తెంచి కొమ్మలను మోడు చేసిపోయారు. గువ్వల గుంపు అటుగా పయనిస్తూ విడిది చేసాయి ,సేద తీరాయి ,ముచ్చట్లు చేసుకున్నాయి కానీ చెట్టు శాశ్వత నేస్తం కాదుకదా అందుకే పోతూపోతూ తమ వ్యర్ధాలతో పాడుచేసి ఎగిరిపోయాయి . భీకర తుఫానుగాలి వీచింది వేళ్ళు సైతం బయటికొచ్చేలా చిటారు కొమ్మలు నేలను తాకి మళ్ళీ పైకి లేస్తున్నాయి అయినా ఆ చెట్టుకు మరణం రాలేదు . ఓ దుర్మార్గుడు మళ్ళీ అటువైపుగా వచ్చాడు తన అవసరాన్ని.. వెంట తెచ్చుకున్న కత్తికి చెప్పాడు నిర్దాక్షణ్యంగా చెట్టుని నరికాడు వేళ్ళతో సహా పెకిలించాదు చివరికి నేల కూలింది ఆ చెట్టు (18-05-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jIzn8V

Posted by Katta

14, మే 2014, బుధవారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ -------ప్రేమంటే ఇదేనా ? ఇన్ని సంవత్సరాలుగా నాతో సహకరించిన నా మనసు ఈనాడు నన్ను ప్రతిఘటిస్తోంది ఏనాడూ ఏ బాధా ఎరుగని ఈ దేహం ఔషదం తెలీని వింత రోగానికి గురైంది బహుశా ఇదేనేమో ప్రేమంటే ! (ఈ కవిత 2001 లో "ఆంద్రభూమి " వారపత్రికలో ముద్రితం ) 14-05-2014

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sN7QKM

Posted by Katta

9, మే 2014, శుక్రవారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ -------వొద్ద్గు ఈ కన్యాశుల్కం పసితనం,కన్నెతనం కర్కశంగా అమ్ముడుపోతోంది అక్కడ తల్లితండ్రుల పేదరిక బేరసారాల్లో . విశాల భారతావనిలో బ్రతుకుల్ని పండించుకోలేక ఎడారి దేశంలో తమ భవితవ్యం మోడులుగా మార్చుకుంటూ . ఇంకా సరిగ్గా చిగురించని చిరుప్రాయం మనువు ముసుగును ధరించి కన్నవారికి దూరంగా,భారంగా . వోయోభేధంతో పనేలేదక్కడ కామం నోట్లలో కుమ్మరించబడుతుంది పసిప్రాయం మూగబోతుంది . కళ్ళల్లో కన్నీటి సంద్రాలను నింపుకుని కన్నోళ్ళ కష్టాలను ఇష్టాలుగా మార్చుకుని కాటివైపు నడుస్తున్నారు కట్టుకున్న వాడివెంట . వారికీ ఓ రోజు రావాలి పరిణయం ఇచ్చే మరణం కన్నీటితో ఖరీదు చేసుకోని రోజు ! (మన హైదరాబాద్ లో చాలామంది తల్లితండ్రులు పేదరికంతో తమ పిల్లలను అరబ్ షేక్లకు అమ్మేస్తున్న వార్త చదివి ) 9-5-14

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l6T0eT

Posted by Katta

6, మే 2014, మంగళవారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ------నోట్లు -వోట్లు కట్టలు.. కట్టలు.. నోట్లకట్టలు లొట్టలు.. లొట్టలు .. ప్రజలు లొట్టలు. తప్పెను.. తప్పెను.. దారితప్పెను వచ్చెను..వచ్చెను.. పల్లెపల్లెకు వచ్చెను. చుట్టెను..చుట్టెను.. చుట్టమై వచ్చి ఇళ్లన్నీ చుట్టెను. పెట్టెను..పెట్టెను.. ప్రతి మనిషినీ ప్రలోబపెట్టెను. దాటెను..దాటెను.. అధికారుల్ని మాయచేసి సరిహద్దులు దాటెను. ముంచెను..ముంచెను.. మూర్ఖ మనుషులను ఐదేళ్ళు ముంచెను. వేసెను..వేసెను.. దురాశ వోటరుకు శిక్షలు వేసెను ! (మీ ఆత్మ ప్రభోదం మేరకు వోటెయ్యండి )

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1seWijk

Posted by Katta

4, మే 2014, ఆదివారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ _______పాలవొడి ఆకలి తీర్చే క్షీరమే అనుకున్నా అమ్మ ఆ పాలవొడి కానది ఆయుష్షు నింపే అమృతం అయ్యింది నా తుది శ్వాష వరకు . అప్పుడు పొందిన అనర్వచనీయ స్పర్శే ధశాభ్దాలు నాతో నడుస్తున్నది నన్ను నడిపిస్తున్నది . ఒక్కొక్క బింధువు పెదవంచులను తడుపుతూ నన్ను తిరుగులేని మనిషిగా నిర్మించాయి . ఇప్పుడు రెక్కలొచ్చాయి నా రక్త మాంసాలకు ఆనాడు పీల్చుకున్న కొన్ని పాలచుక్కలతోనే . ఎప్పుడో తడిమి చూసుకున్నా నా మనసును ఎదలోయల్లో దాగున్న ఆ పాలామృతం చిక్కగా గడ్డకట్టి నా రక్షణ కాస్తూనేవుంది. అలసిపోయానో .. మరచిపోయానో .. ఒకానొక నా తొలి ఆహారం శక్తి విసర్జించిన నా దేహం ఎముకల గూడులా . ఇప్పుడు మళ్ళీ ఆ అమృతం కావాలి పసిపాపగా మారైనా అమ్మవొడి చేరాలి ! (04-05-2014(

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hp8ZB4

Posted by Katta

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ________తడి చూడని మది భావనలు తెగిన ఆనకట్టలై మది గదుల గుండా ప్రవహిస్తున్నా తడి స్పర్శను స్పృశించుకోలేని మది అది . ఒక్కొక్క శబ్ధమూ ఆ గోడల చెవులను తాకి నిర్జీవంగా నేల రాలిపోతుంటాయి మరుజన్మ పుట్టుకులను తమతో భూస్థాపితం చేసుకుంటూ. రాగమూ ,బంధమూ ,అనుబంధమూ ఆ రాతిముందు శిలా ప్రతిమలై తమ రాతలను అవే చెక్కుకుంటాయి . రేపు రాని రోజులెన్నో ఉద్బవిస్తుంటాయి . నేటి క్షణాలకు అల్పాయుస్షును అతి బద్రంగా దాచుకుంటూ . కడలి అంతా కల్లోలం అయ్యి అయినా , మేఘమంతా నింగి జారయినా ఆ మదిని ఒక్క బిందువుతోనైనా తడపాలి ! (29-04-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PNLfyM

Posted by Katta

26, ఏప్రిల్ 2014, శనివారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ________రాతిపుష్పం ఉలి గాయాల్ని పైపూత పూసుకుని శిలల రేకల రెక్కలు విచ్చి పరిమళం వెదజల్లని ఓ రాతిపుష్పం నువ్వు . అచేతనమైన నువ్వు ప్రతిరోజూ పుష్పించాలని అనుకుంటావు మరిక్కడ వసంతాల్ని మొలకెత్తించేదెవరు ? బండశిలల జంట వీడి.. ఈ గుండెను కోస్తున్నావు ఉన్న కాస్త పన్నీటి చలమల్ని పీల్చేస్తూ . నీకు ఎలానూ అశ్రువుల్ని వర్షించటం తెలీదు ఈ కళ్ళనెందుకు రెప్పలతో బందిస్తావు . ఆ క్షణం నా హృదయం స్థాణువులా నీ ఉనికిని కనుగొన్న ప్రతిసారీ నా కన్నులు నావి కావేమోనని . మకరంద బిందువులతో మెరుస్తావు తీరా తాకబోయే హృదయానికి గండశిలల స్పర్శను రుచి చూపిస్తూ . ఇహ నీతో మాట తీసుకోవాలి ఈ జన్మకు ఇటుగా రాబోకని, నా గుండె స్పందనలను ద్వంసం చెయ్యొద్దని ! (26-04-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fhTy21

Posted by Katta

20, ఏప్రిల్ 2014, ఆదివారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ____గాజుదేహం --------- కోట్ల కణాలను తనువునుండి ఒక్కొక్కటిగా త్యజిస్తూ నిలబడిన ఓ గాజుదేహం . స్వేధంలో అలసి ఒకసారి, రుధిరంలో తడిసి మరోసారి ఇప్పుడు నెరళ్ళు తీసిన భీడుభూమిలా . అవయవాల కొసన వేలాడుతూ.. అవసాన ప్రాయం వీడలేక ముతకచర్మం నిశభ్ధ తపన . గుండె గదుల్లోని మాటలు.. గొంతు పెగలక మూగ రాగాలుగా పెదవుల గోడలనుండి లాలాజలంలా జారుతూ . చలనాల్ని అనుభవాల అగాధాల్లొకి వొంపేసి తనని తాను ఇంటిమూలలో ఇనుప కొక్కేనికి తగిలించుకుని . కదలని అడుగులు.. పెనవేసుకోలేక వాడిన లతల్లా విడుతూ ఆకురాల్చే ఋతువుకై ఆత్రంగా . ఈ జన్మకు మరో పుట్టుక కావాలి కానీ ప్రతిక్షణం పగిలే గాజుదేహంలా కాదు ! (20-04-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eQqEpu

Posted by Katta

16, ఏప్రిల్ 2014, బుధవారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ _____''రెక్కలోచ్చాయి'' వొంటికి అంటుకున్న పురిటి వాసన ఇంకా ఆరనేలేదు వాడికి అప్పుడే రెక్కలోచ్చాయి ఎగిరిపొవటానికి. గుండెలపై ఆడిన ఆ పాదాలు ఇంకా బ్రతుకు నడక నేర్వనేలేదు కన్నవారిని మరచి కొత్తదారులు గాలిస్తున్నాయి . ఇక్కడ తన చిన్న ఉనికిని కూడా స్తాపించలేదు ఊహల లోకంలో ఆశల సౌదాన్ని నిర్మిస్తూ ఆత్మవంచనలను తవ్వుతూ .. వాడెప్పుడూ పోతూనే ఉంటాడు మూలాలను మారుస్తూ ,గతాలను విస్మరిస్తూ , కొన్ని జీవితాలను గాయపరుస్తూ . వెనుతిరిగి చూడదు కనుపాపలకు దూరమైన రాగబంధాలు కన్నీళ్ళతో పిలుస్తున్నాయని తెలిసీ ! (16-04-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eIsLMo

Posted by Katta

13, ఏప్రిల్ 2014, ఆదివారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ----------- '' నదీ-నేను '' అలల అలజడులతో నువ్వు సాలెగూడులా కల్లోల అల్లికలతో నేను సారుప్యత ఒక్కటే జీవనదివై నువ్వు జీవితమంతా చిక్కుముడుల జీవంతో నేను . పొంగుతుంటావు,పారుతుంటావు అలుపెరుగక అనునిత్యం నువ్వు శోదిస్తాను ,సాధిస్తాను ,రోదిస్తుంటాను గమ్యం ఏమిటో తెలియక నేను . ఎంత స్వచ్చమో నువ్వు ఏ దేహం మీద నువ్వు ప్రవహించినా ఆ చర్మపు వర్ణంలో మిళితమైపోతావు రంగులు మారుస్తూ నేను నా రంగునే కోల్పోతుంటాను . రాళ్ళముళ్ళను మృదువుగా సహిస్తూ సాగిపోతుంటావు నువ్వు గీసుకున్న దారులవెంట ముళ్ళబాటలను తొక్కుకుంటూ ఎదిగిపోతూ.. ఒక్కోసారి దిగుతూ జారిపోతాను పాతాంలోకి . ఒకరోజు నువ్వు ప్రశ్నిస్తావు నేను విశ్రమిస్తే ఏమవుతావని ? కానీ ఆ రోజు వచ్చినా కూడా నా దగ్గరా జలనిధి ఉందంటూ నా కన్నీళ్లను వర్షిస్తాను ! (13-04-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ex9sWr

Posted by Katta

10, ఏప్రిల్ 2014, గురువారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ---॥ ఈ రెప్పల వెనకాల ॥--- ఎప్పుడైనా గమనించావా ? ఈ రెప్పల వెనకాల నువ్వు చేసిన గాయాల గుర్తులు ఇంకా సజీవంగా ఉండటం . నువ్వు నాలో ఆవాహన అయిన ప్రతిసారి అవి ఇంకా పచ్చిగా గుచ్చుతూనే ఉన్నాయి చిధ్రమైన ఈ దేహాన్ని . చిత్రమో .. ! విచిత్రమో .. ! గాని నీ సావాసం కోసం అవి తహతహలాడుతుంటాయి ఖండాంతరాలు దాటి ఎగిరివచ్చే పక్షికోసం ఎదురుచూసే వనంలా. నీదో వింత వైనం అది అంతులేని మరో ప్రపంచాన్ని అల్లుతూ ఎప్పుడూ కొత్తగానే ఆవిష్కరిస్తుంటావు కానీ నీదైన నా మనసుకు అది ఎప్పుడూ సుపరిచితమే. ఇక ఏ గాయాన్ని ఈ హృదయం స్వీకరించదు ఇక ఏ భావాన్ని ఈ గుండె పలికించలేదు ఈ దేహం శిధిలం అవ్వకముందే మరికొంత ప్రేమతో నన్ను పునర్నినిర్మించాలి నువ్వు మరువవు కదా నేస్తం ! (10-04-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sFvMAD

Posted by Katta