పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Murthy Kvvs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Murthy Kvvs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జూన్ 2014, గురువారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-50 వచ్చే జన్మ గురించి గాని గత జన్మ గురించి గాని తెలుసుకోవాలని మనిషికి ఎంత ఆసక్తి..! అసలు ఈ జన్మ గురించి అర్ధమైతే రెండు జన్మలూ అవగతమవుతాయి.. బ్యాటరీ లైట్ ఫోకస్ లా ఎంతసేపు బయటికే కాంతిని విరజిమ్మకుండా అప్పుడప్పుడు నీలోపలికి కూడా దాన్ని ప్రసరిస్తూ ఉండు.. అన్నీ అక్కడనే ఉన్నాయి...!!! ----------------------------------------------- 05-06-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tK2bni

Posted by Katta

1, జూన్ 2014, ఆదివారం

Murthy Kvvs కవిత

రెండు రాష్ట్రాలు-మూడు ప్రాంతాలు| KVVS MURTHY ----------------------------------------------------- ఒక చారిత్రక సన్నివేశం ఆవిష్కరింపబడుతున్నవేళ నా మాట నేను చెప్పకపోతే మరెవరు చెబుతారు..? తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి చివరికి అయితే మూడు ప్రాంతాలు గా తేలాయి ఇపుడు... ఆ మూడవది ఏమిటా...? అదే భద్రాచలం ప్రాంతం..! అవును నిజం... మా భాషలో యాస లేదని ఆంధ్రా వాళ్ళమంటారు ఇటువాళ్ళు మా ప్రాంతం ఇవతల ఉన్నది కాబట్టి తెలంగాణా వాళ్ళమంటారు అటువాళ్ళు...! మేమెవరిమో మాకే తెలియని పరిస్థితి రాముడి గుడినుంచి రెండు అడుగులేస్తే సీమాంధ్ర రాముడు మాత్రం తెలంగాణా... ఎవరినీ ద్వేషించలేని స్థితి పగవాడికి సైతం రాకూడదు ఈ గతి ఎలాగు పల్లె లోనూ ,నగరం లోనూ బ్రతికేయగల దేశద్రిమ్మరినే గదా.. ఏ చెన్నయ్ నో... భువనేశ్వర్ నో చెక్కేస్తే బాగుండుననిపిస్తుంది నాకైతే... --------------------------------------------------- 01-6-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n0h580

Posted by Katta

31, మే 2014, శనివారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-49 ఒకరి మీద రాయి వేయాలనుకుంటే అలవోకగా వేసేస్తాం... ఒకరిలో ఏదో నచ్చి అభినందించాలంటే మాత్రం హృదయం గొంతు నొక్కి ఆపేస్తాం... ఎవరూ ఇక్కడకి పేద గా రాలేదు... తమదైన ఏదో ఒక సంచితశక్తి తోనే జన్మించారు అది తెలుసుకున్ననాడు అసూయకు తావే ఉండదు...! -------------------------------------- 31-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mTKbWP

Posted by Katta

29, మే 2014, గురువారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-48 కళ్ళ ఎదుటే అను నిత్యం అనేక చావులు సంభవిస్తున్నా నీవు తొణకవు,బెణకవు కాని నీ నుంచి వచ్చిన ఒక జీవి కన్ను మూస్తే మటుకు ప్రపంచమే నీకు విషాదమవుతుంది కదూ... ఎందుకని...అది నీది కనకనా...? నీది అనుకున్నది ,నీది కాదని తెలియజెప్పడానికే ప్రకృతి నిరంతరం అనేక మార్గాల్లో తన పనిని తాను చేసుకుంటూ అలా...!!! --------------------------------------- 29-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nEG9Cy

Posted by Katta

28, మే 2014, బుధవారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-47 "ధన యోగం" అనే మాట ఎందుకు ఎందుకొచ్చిందో అని అనుకొనేవాడిని చిన్నప్పుడు... జనారణ్యం లో నా యాత్ర మొదలుపెట్టినప్పటినుంచి తెలుస్తోంది.... ఇక్కడ ఒకరి జేబులోనుంచి ఒక రూపాయి మన జేబులోకి రావాలంటే ఎంత ఓరిమి వహించాలో .. ఉన్న రూపాయిని కాపాడుకోవాలంటే ఎంత జాగరూకతతో ఉండాలో... బంధువులు,స్నేహితులు ఎవరూ నిజ సహకారులని నమ్మడానికి లేదు... ఈ వేటలో ఎప్పుడూ మనిషి ఒంటరి గా ఉండవలసిందే... సంసారం కంటే గుట్టుగా చేయలసినదేమైనా ఉందంటే అది ధనార్జనే... ఇది ఏ విద్యాలయం లోనూ నేర్పని విద్య.. అసలు దీనికి విద్యతో కూడ సంబంధం లేదు... అసలు ధనం సంపాదించే పరిణామక్రమం లోనే మనుషుల స్వరూపం అర్ధం అవుతుంది... ఈ ప్రపంచమూ అర్ధం అవుతుంది..! -------------------------------------------- 28-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nyzQAz

Posted by Katta

27, మే 2014, మంగళవారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-46 ఒకరి మీద అధికారం చెలాయించడం అంటే మనిషికి ఎంత ఇష్టం... అన్ని పనుల వెనుకన్న పరమార్ధమదేనేమో... అధికారం కూడా ఆలోచిస్తే ఒక గణిత సూత్రమే... కారణం ఏమైనా కాని...మనకి లోబడినవారిని మాత్రమే మనం అధికారించగలం... ప్రతివారి దగ్గరా తుపాకి ఉండనీ ఎవరూ ఎవరితో అవసరానికి మించి వ్యవహరించరు...! ----------------------------------------- 27-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jVSpNO

Posted by Katta

26, మే 2014, సోమవారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-45 నోరు తిరగక సంస్కృతాన్ని మట్టిబుర్రకి వంటబట్టక ఇంగ్లీష్ ని ద్వేషించినపుడు నాకదొక తృప్తి కలిగేది.. నా మాతృభాషకి పట్టువస్త్రాల్ని సమర్పిస్తున్న అనుభూతి కలిగేది.... ప్రతి భాష లోను తనదైన జీవమున్నది విఫలమైన క్షణం లోనే అసహనం హద్దుమీరుతుంది.. నాకది తెలిసేసరికి నాలాంటివారు నా పక్కన చాలామంది ఉన్నట్లు అర్ధమయింది...! ----------------------------------------- 26-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ozApcZ

Posted by Katta

19, మే 2014, సోమవారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-44 వానలో కొంచెం తడవనీ ఎండవచ్చినపుడు కొంచెం ఎండనీ చలిగాలిలో కొంచెం చల్లబడనీ,ఏ ఆచ్చాదన లేకుండా నేలమీద కొంచెం పొరలనీ- శరీరాన్ని మరీ సుకుమారించడంతోనే ఈ సమస్త రోగాలు... భూమిలో లేనివి ఏమి ఉన్నాయని ఈ దేహంలో సూక్ష్మీకరించబడిన భూమిలోని సకల పదార్థాల సమ్మేళనమే ఈ శరీరం - నాకయితే అర్ధం అయింది అదే...! ------------------------------------------- 19-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TkDsLO

Posted by Katta

15, మే 2014, గురువారం

Murthy Kvvs కవిత

Mario Puzo మరో నవల Fools Die గూర్చి చెప్పుకుందాం రమారమి 473 పేజీల ఈ నవల గురించి ఏదోకొద్దిలో రాసెయ్యడం సమంజసం కాదేమో అనిపించింది.సరే..సాధ్యమైనంత వరకు ముఖ్య సన్నివేశాలని చెప్తూ బ్రీఫ్ గా మననం చేసుకుందాం.70 వ దశకంలో రాయబడినది ఇది.మొదలు పెట్టడమే పుస్తకాన్ని తను మాట్లాడుతున్నట్లుగా మొదలు పెడతాడు.ఒక మనిషి గురించి మీకిపుడు చెబుతాను..అతని కి స్త్రీలపై గల ప్రేమ గురించి చెబుతాను. అలా ఒక ఉరవడిలో...కొన్ని కఠిన వాస్తవాలను చెబుతాను..అంటూ రచయితే ముందు పేజీల్లో మాట్లాడుతాడు. I will make you feel the painful beauty of a child,the animal horniness of the adolescent male,the yearning suicidal moodiness of the young female. దీంట్లో ప్రేమ గురించి ఉంటుంది. అయితే ప్రేమ గురించి మాత్రమే దీనిలో చెప్పలేదు.ఇది ఒక యుద్దానికి సంబందించినది కూడా..!Let me get to work.Let me begin and let me end. అంటూ రచయిత 1 వ భాగాన్ని ముగిస్తాడు. రెండవ భాగం లో సీను డిఫరెంట్ గా మొదలవుతుంది.లాస్ వెగాస్ లోని కేసినో ల గురించి బాగా అద్యయనం చేసి రాసినట్లు అనిపిస్తుంది.మొత్తం జూద గృహాల మద్య జరుగుతుంది ..ఈ లాస్ వెగాస్ లోని ఓ ఖరీదైన హోటల్ కం కేసినో Xanaddu.దీన్ని Gronevelt నిర్వహిస్తుంటాడు.గాడ్ ఫాదర్ ముందు చూపువల్ల లాస్ వేగాస్ లో జూద గృహాలు చట్టబద్దమయ్యి బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తుంటాయి.దేశం లోని నలుమూలనుంచి,ఇతరదేశాలనుంచి బాగాడబ్బులున్నవాళ్ళు ఇక్కడికొచ్చి కేసినో ల్లో బ్లాక్ జాక్ లాంటి రకరకాల గేంబ్లింగ్స్ లో కాలక్షేపం చేస్తుంటారు. ఇక్కడే మన ప్రధాన పాత్రలు కొన్ని తారసపడతాయి. వాళ్ళెవరంటే Merlyn,Jordan,Cully ఇంకా Diane. ఈ మెర్లిన్ ఒక రచయిత.హాలివుడ్ సినిమాలకి పనిచేసి బాగాడబ్బులు ,పేరు సంపాదించాలనేది ఇతని కోరిక.జోర్డాన్ లాస్ ఏంజల్స్ నివాసి.ఇక కల్లీ Xanadu లో ఉంటూంటాడు.అలాగే Diane అనే ఈ అమ్మాయి ఆ కేసినో shill గా పనిచెస్తుంటుంది.Provocative గా డ్రెస్ వేసుకొని ఆ ఆటగాళ్ళకి పక్కన ఉంటుంది.ఒక మాటలో చెప్పాలంటే ఒక సారి వచ్చినవాణ్ణి నాలుగుసార్లు వచ్చేలా చేయడం వీళ్ళ డ్యూటి.చిప్స్ అందివ్వటం ఇంకా కొంత జాబ్ చార్ట్ ఉంటుంది లెండి. వీళ్ళంతా ఆ హోటల్ లో Baccarat టేబుల్ దగ్గర కలుస్తూ ఫ్రెండ్స్ అవుతారు.కేసినోల్లో ఆడేవారికి ప్రత్యేకంగా గదులు కూడా ఉంటాయి. హాయిగా ఆడినన్నాళ్ళు ఆడి వెళ్ళవచ్చు. వీళ్ళలో జోర్డాన్ చాలా బాగా ఆడి డబ్బులు బాగానే సంపాదిస్తుంటాడు.అయితే ఇతని భార్య కాపురం చేసిన తర్వాత 20 ఏళ్ళతరవాత ఇంకొకరిని చేసుకొని వెళ్ళిపోతుంది.వీరి ముగ్గురు ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నప్పుడు కూడా ఆమె గురించి కోపం వ్యక్తం చేయడు.ఇతనికి మళ్ళీ ముగ్గురు సంతానం కూడా..! బంధాలని గౌరవించరని అనలేను గాని అసహాయంగా బంధాలమధ్య నిలబడి అర్ధించడం వారిలో ఉండదనిపించింది.నిజం చెప్పాలంటే ఎంత గొప్ప ప్రేమ అయినా ఒక ఎక్స్ పైరీ తేదీ ఉంటుంది దానికి....గొప్ప వేదాంతి అయినా అయి ఉండాలి లేదా అల్టిమేట్ ప్రాక్టికాలిటీ అయినా ఉండాలి.రెండు ఒక చోట అవి షేక్ హేండ్ ఇచ్చుకుంటాయి. ఆ..సరే...ఈ జోర్డన్ కేసినో లో గేంబ్లింగ్ రాత్రి పగలు ఆడి విపరీతంగా ఆడి బాగా సంపాదిస్తుంటాడు.అప్పుడు ఆ యజమాని Gronevelt కి అనుమానం వస్తుంది.వెంటనే Cully ని పిలుస్తాడు.ఏమిటి ఆ జోర్డాన్ బాగా లాభాలు తీస్తున్నాడు.అతణ్ణి ఏదో కరణం చెప్పి బయటికి పంపించే ఏర్పాటు చెయ్యి అంటాడి.ఇంతకు విష్యమేమిటంటే ఈ Cully అనేవాడు జూదగాళ్ళతో కలిసి తాను ఆడుతూనే యాజమన్యానికి Spy లా పనిచేస్తుంటాడు.అంటే బాకరెట్ టేబుళ్ళదగ్గరున్న వర్కర్స్ గాని ఇంకొకళ్ళుగాని ఏమైనా సీక్రెట్ డీలింగ్స్ చేసుకొని యాజమన్యాన్ని బురిడీ కొట్టిస్తున్నారా అని చూస్తుంటాడన్నమాట. అయితే ఉన్నట్టుండి జోర్డన్ ఆత్మహత్య చేసుకుంటాడు. తెల్లారిన తర్వాత ఈ వార్త కల్లీ ,మెర్లిన్ కి బాధగా చెబుతాడు. 'He blew his head off.He beat the house for over four hundred grand and he blew his fucking brains out.' ఆ తర్వాత కధ వచ్చేసారికి చూద్దాం.

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vaiiOF

Posted by Katta

13, మే 2014, మంగళవారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-43 పిట్టలు నిద్రలేచేవేళ చూస్తుంటాను.. అలారం పెట్టి ఎవరో లేపినట్లు కిచకిచలాడుకుంటూ పొద్దుటే లేచిపోతాయి..! అప్పటికి సూర్యుడు కూడా సరిగా నిద్రలేవడు.. గూళ్ళలోనుంచి జట్లు జట్లుగా గాలి తరంగాలలో ఈదుకుంటూ అలా వెళ్ళిపోతుంటాయి.. మళ్ళీ సూర్యుడు సాయంవేళ దిగుతుండగా గూళ్ళలో దీపాలు వెలిగించడానికా అన్నట్లు వెనుదిరిగి వస్తూనే ఉంటాయి.. ఒక వేళ ఏ పిట్ట అయినా ఆ రాత్రికి రాలేదో, ఇక ఎన్నటికీ రానట్లేనని అర్ధం.. గూటిలోని దానిపిల్ల రేపు తన రెక్కల కష్టంతో ఎగరవలసిందే లేదా తన చావు తాను చావవలసిందే...! ------------------------------------------ (13-5-2013)

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RMO8S8

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-43 పిట్టలు నిద్రలేచేవేళ చూస్తుంటాను.. అలారం పెట్టి ఎవరో లేపినట్లు కిచకిచలాడుకుంటూ పొద్దుటే లేచిపోతాయి..! అప్పటికి సూర్యుడు కూడా సరిగా నిద్రలేవడు.. గూళ్ళలోనుంచి జట్లు జట్లుగా గాలి తరంగాలలో ఈదుకుంటూ అలా వెళ్ళిపోతుంటాయి.. మళ్ళీ సూర్యుడు సాయంవేళ దిగుతుండగా గూళ్ళలో దీపాలు వెలిగించడానికా అన్నట్లు వెనుదిరిగి వస్తూనే ఉంటాయి.. ఒక వేళ ఏ పిట్ట అయినా ఆ రాత్రికి రాలేదో, ఇక ఎన్నటికీ రానట్లేనని అర్ధం.. గూటిలోని దానిపిల్ల రేపు తన రెక్కల కష్టంతో ఎగరవలసిందే లేదా తన చావు తాను చావవలసిందే...! ------------------------------------------ (13-5-2013)

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RMO5WE

Posted by Katta

Murthy Kvvs కవిత

Mario Puzo గాడ్ ఫాదర్ నవల లోని ఇంకా కొన్ని సన్నివేశాలు..! ఇదివరకు ఓ పోస్టులో Sicilian నవల గూర్చి చెప్పుకున్నాం కదా.తరవాత దానిలో ఇంకో నవల గూర్చి చెప్పుకుందాం. అయితే ఫుజొ కొన్ని ఇటాలియన్ మూలం లోనుంచి వచ్చిన పదాలనే ఇంగ్లీష్ రచన లోను వాడతాడు.ఎందుకంటే ఈ ఆర్గనైజెడ్ నేరవ్యవస్థ ని అమెరికాకి పరిచయం చేసింది సిసిలియన్ లే గదా..!అసలు God Father రాయాలనే ఆలోచన రావడం చాలా విన్నూత్నమైనది అప్పటికి.ఎందుకంటే ఆ కధ అంతా అమెరికా లో నే జరుగుతున్నా లీడ్ పాత్రల మూలాలన్నీ ఇటలీ పరిసరాలవే..! 1901 నాటికి డాన్ తండ్రి Antonia Andolini ని సిసిలీ లో చంపివేయడం తో తన సొంత ఊరునుంచి ఓ ఓడలో పారిపోయి అమెరికా చేరతాడు.అప్పటికతను ఇంచు మించు యవ్వనదశలో ఉంటాడు.అక్కడ మురికి వాడలో ఉన్న సిసిలియన్ లు కొందరు పరిచయం అవుతారు. వాళ్ళే CLEMENZO,SAL FESSIO వీళ్ళతో కలిసి బతుకు తెరువు కోసం చిన్న స్మగ్లింగ్ పనులు చేస్తుంటాడు.అయితే ఒక మనిషి ప్రయాణం విధి ఎలా నిర్ణయిస్తుందో చూడండి. అక్కడ ఆ మురికి వాడలో ఓ వీధి రౌడి ఉంటాడు..ప్రతి ఒక్కరు వాడికి విధిగా తాము సంపాదించినదానిలో కొంత ఇవ్వాలిసిందే.వీళ ముగ్గురుని బెదిరించి 700 డాలర్లని డిమాండ్ చేస్తాడు.అతగాడిని నేను ఒప్పిస్తానులే అని చెప్పి డాన్ ఆ రౌడి ని కలిసి కొంత డబ్బు ఇస్తాడు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అతడిని మర్డర్ చేస్తాడు.దానితో ఆ లొకాలిటీ లోని వ్యాపారస్తులు ,మిగతా జనాలు అతనికి గౌరవం ఇవ్వడం మొదలెడతారు.మనిషి పోకడ గురించి మంచి మాటలుంటాయిక్కడ.ఎవరైతే తమను భయపెట్టగలరో ప్రజలు వారినే గౌరవిస్తారు అనేది అర్ధం అవుతుందతనికి. ఇక మామూళ్ళు ఇతనికి ఇవ్వడం మొదలెడతారు. ఇక్కడ అతని ముందు చూపు శ్లాఘించవలసినదే.ఈ విధంగా ఎంతో కాలం సాగదు.కనుక చట్టబద్దమైన వ్యాపారాలలో ఉంటూనే ...మనం ఇతరుల వ్యాపారాలని కాపాడినందుకు,వాళ్ళ గొడవలు సర్దుబాటు చేసినందుకు ధనాన్ని వసూలుచేయాలి.ఆ రకంగా సమాజం లో మంచి పేరు తెచ్చుకొంటూనే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలి అని నిర్ణయించుకుని దాన్ని అమలుచేస్తాడు.ముందు ఆలివ్ ఆయిల్ బిజ్ఞెస్ లో సంపాదించిన తరవాత Gambling,Bootlegging లాంటి వ్యాపారాల వేపు దృష్టి సారిస్తాడు. అప్పటికి అవి చట్టబద్దమైన వ్యాపారాలు కావు...కాని కాలక్రమం లో అవుతాయని ,ఆ విధంగా ప్రభుత్వాన్ని మలచవచ్చని చెబుతాడు.పెళ్ళి చేస్కుని పిల్లల్ని కనడం,ఇతర పోటీదారులతో పోరాటాలు ,క్రమేపి వ్యాపార సామ్రాజ్యాన్ని తన స్నేహితులతో బంధువులతో విస్తరించడం ఇవన్నీ రకరకాల కధనాలతో ఇతర నవల ల్లో కూడా సాగుతాయి. తన పేరుని డాన్ విటో కార్లియాన్ గా మార్చుకుంటాడు.నిజానికి అతని సర్ నేం Andolini కాని తాను జన్మించిన కార్లియాన్ గ్రామం తనకి ఎప్పటికి గుర్తుండాలని తన ఇంటి పేరుని అలా మార్చుకుంటాడు. అప్పట్లోనే డాన్ పాత్ర అంటుంది మిగతా వాళ్ళతో..ఇలా విడిపోయి బిజినెస్ చేసినందువల్ల ఏం లాభం ఉంటుంది..మొనోపలి తీసుకురావాలి ఏ రంగం లోనైన అని.దాన్ని అమెరికన్ ధనవంతులు కాలక్రమం లో ఆచరణలో పెట్టారు కూడా..! గాడ్ ఫాదర్ బాగా ధనవంతుడైన తరువాత అనాధ పిల్లల్ని చేరదీసి చదివించడం..వారికి న్యాయశాఖ లో,పోలీస్ శాఖలో ..ఇలా అనేక శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాడు.దీని వెనుక కూడా దీర్ఘ ప్రణాళిక ఉంటుంది అతనికి....ఆ పిల్లలు జీవితాంతం అతనికి..అతని పిల్లలకి ...వ్యాపారాలకి కృతజ్ఞతతో ఉండాలనేది అతని ప్రణాళిక.ఆ విధంగా చారిటీ ని కూడా అతను దూరదృష్టితో చేస్తుంటాడు. నవల మొదట్లో Mario Puzo ఒక మాటని ఉటంకిస్తాడు."Behind every great fortune, there is a crime అని..! Qualified Man అనే పదం నవల లో వస్తుంది ...దానికి అర్ధం ఏమంటే ఒక మనిషిని చంపడం లో ప్రవీణుడు అని.ఇది సిసిలియన్ ప్రయోగమే.Consigliere అనే పదం కూడా ప్రత్యేకమైనది.బాస్ కి కుడి భుజం లాంటి వాడు అని.జడ్జ్ లతోను,మినిస్టర్ల తోను,అలాగే ఇతర ముఖ్య విషయాల్లో డాన్ తరపున సంప్రదింపులు చేస్తుంటాడు.ఒక ప్రణాళిక రూపొందించి డాన్ చెప్పడం తో ఇతను తగు వ్యవహారాలతో రంగం లోకి దిగిపోతాడు.Tom Hagen డాన్ కి ఈ విధంగా ఉంటాడు దీనిలో. Lupera అంటే ఆయుధం.Omerta అంటే రహస్యంగా వ్యవహరించే ఓ విధానం.ఇలా ఇవన్నీ సిసిలీ మూలాల లోవే.ఇవన్నీ తరచూ నవల్లో తగులుతుంటాయి.యవ్వనవంతునిగా ఒంటరిగా అమెరికా లో దిగి అక్కడే వివాహమాడి ,పిల్లల్ని ఇంకా మనవళ్ళని పొంది...వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ రకరకాల దశలుగా సాగే డాన్ జీవితాన్ని Eloborate గా వివరిస్తాయి.Fools die నవల్లో లో కూడా ఈ పాత్ర బాగ ఉంటుంది.సరే..అదెప్పుడైనా చెప్పుకుందాం...! --KVVS MURTHY

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jTfAba

Posted by Katta

11, మే 2014, ఆదివారం

Murthy Kvvs కవిత

Mario Puzo మరొక నవల Sicilian పై నా అభిప్రాయం God Father తో ఒక ప్రత్యేకతని సంతరించుకున్న రచయిత Mario Puzo రాసిన మరి ఒక నవల Sicilian గూర్చి ఇప్పుడు ప్రస్తావిస్తాను.1950 దశకం నుంచి ఈ కధ మొదలవుతుంది.రెండవ ప్రపంచ యుద్ధ చ్చాయలు అక్కడడక్కడ తొంగిచూస్తుంటాయి.అయితే దాని గురించినదే కాదిది.సిసిలీ లో ని మాఫియా కుటుంబాల ప్రాభవం ముస్సోలిని అణచివేతవల్ల కొంత తగ్గినట్లుగా చెబుతాడు రచయిత.అయితే అమెరికన్ సేనలు ఫాసిష్టులను పారద్రోలి వారి అనుయాయులను అక్కడ ఉంచినట్లుగా అర్ధమఔతుంది.రోం నుంచి వాళ్ళు నిరంకుశంగా పాలన సాగిస్తుంటారు.Palermo అనే ఊరిలో ఇంకా Montelepro అనే ఊరిలో ఈ కధ అంతా నడుస్తుంది. మీరు గనక గాడ్ ఫాదర్ చదవక పోతే మొదట వచ్చే Michael Corleone పాత్ర గూర్చి ఏమి అర్ధం కాదు.అగమ్య గోచరంగా ఉంటుంది,అంటే దానిలో నుంచి దీని లోకి ముడి వేస్తాడు రచయిత,అయితే దానికీ అర్ధం ఉంది.అమెరికా లో Sonny ని చంపిన ఓ పోలీస్ ఆఫిసర్ ని పకడ్బంది ప్లాన్ తో అతని సోదరుడు Michael ఓ హోటల్ లో మట్టుపెడతాడు.ఆ సన్నివేశం ఊహించనలవి కాదు మొదట్లో. ఓ హోటల్ లో సంధి కోసం కోసం హాజరవుతారు.వచ్చినపుడు Michael ని బాగా చెక్ చేస్తారు.ఎక్కడ ఎలాంటి ఆయుధం ఉండదు.విచిత్రంగా ఆ సన్నివేశం చివరిలో పోలిస్ అధికారిని టపా మని కాల్చి పారేస్తాడు.అసలు విషయం ఏమిటంటే ఆ హోటల్ లోకి రాకముందే అక్కడున్న సర్వర్ కి డబ్బులిచ్చి ఓ పిష్టల్ ని బాత్ రూం లో పెట్టిస్తాడు...తను పాస్ కి వెళ్ళినప్పుడు అది లోపల పెట్టుకొని టేబుల్ ముందు కూర్చుని మాటాడుతున్నప్పుడు ఠపీ మని కాల్చి పారేస్తాడు.50 వ దశకం లో నే వాళ్ళ మెదళ్ళు అలా ఉన్నాయి. సరే... ఇక్కడుంటే ప్రమాదమని తన స్వస్థలమైన సిసిలీ లోని మరో డాన్ డాన్ క్రాస్ దగ్గరకి పంపిస్తాడు. రెండు సంవత్సరాలు అక్కడున్నతరవాత అక్కడినుంచి ఆఫ్రికా కి సముద్రం మీదుగా వచ్చి అక్కడినుంచి విమానం లో న్యూయార్క్ రావాలనేది గాడ్ ఫాదర్ ప్లాన్ . ఇలా జరుగుతుండగా Salvatore Guiliano అనే విప్లవకారుణ్ణి మైఖేల్ తను వచ్చేటప్పుడు తీసుకురావాలనేది అతని తండ్రి షరతు.దానికీ ఓ కారణం ఉంది.నిజం చెప్పాలంటే ఈ Sicilian నవల లో హీరో ఈ Guiliano నే.సిసిలో ప్రజలని రోం పాలకుల సహాయం తో వేధిస్తున్న Mafia families కి సిమ్హ స్వప్న స్వప్న మౌతాడు.సుకుమారమైన,అందమైన రొమాంటిక్ జీవితాన్ని గడిపే అతని జీవితం కొన్ని సన్నివేశాల ఫలితంగా విప్లవకరం గా మారుతుంది.భయంకరమైన మోసపూరితమైన రాజకీయ అండదండలున్న వ్యక్తులను తన ధైర్య స్థైర్యాలతో,ప్రజల సహకారం తో ఎత్తుగడలతో ఎలా తన ఊరుచుట్టూ యున్న కొండలను వేదికగా చేసుకొని పోరాడాడో చదివితే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. మనిషి లోని నమ్మించి మోసం చేసే తత్వం ఎంత లోతుగా ఉంటుందో ప్రతి పేజీలోను అర్ధం అవుతుంది.గులియానో తల్లి మారియా పాత్ర సగటి భారతీయ స్త్రీ లానే ఉంటుంది.Adonis పాత్ర దీనిలో గుర్తుండిపోయే పాత్ర. అతను యూనివర్శిటి ప్రొఫెసర్ గా పనిచేస్తూ తన ఒకప్పటి స్టూడెంట్ గులియానో కి సహాయపడుతుంటాడు.కొండల్లోని గులియానో కి అనేక చరిత్ర పుస్తకాలని అందించటం.... వారి చదివే గుణానికి ప్రతీక. చివరివరకు ఏమౌతుందోనని చాలా టెన్షన్ గా ఉంటుంది.ఎవరు మంచి వారో..ఎవరు చెడ్డవారో..అసలు చాలా వరకు అర్ధం కాదు.మంచిగా ఉన్నవాళ్ళే శతృవుకి సహకరించడం...హీరోకి అత్యంత దగ్గరగా ఉండి అనేక దాడుల్లో అతనికి సహకరించిన అతని బంధువు(Aspanu) ఒక చిన్న కారణం చేత గులియానో చావుకి కారణమవుతాడు. అది ఊహించలేము.అంటే మానవ పరమైన Loyalties ఎంత బలహీనంగా ఉంటాయో అవగతమౌతుంది. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా చెప్పవచ్చు.బయటకి చక్కగా మాటాడుతూనే ఒకరిని ఒకరు manipulate చేసుకోవడం చెప్పదగినది. ఎన్నైనా చెప్పండి......తెలుగులో ఎన్ని అనువాదాలు చదివినా యూరోపియన్ల యొక్క Treacherous నేచర్ అర్ధం కాదు.వారి పలుకుబడులు,ఉద్వేగాలు,మానవ సంబందాలు ఇది చదివితే బాగా అర్ధం అవుతుంది అనిపించింది.ఇంగ్లీష్ రచయితల్లో నాకు ,ముఖ్యంగా ఫిక్షన్ రైటర్స్ లో, నచ్చిందేమంటే కొన్ని విషయాలు ఎవరేమనుకుంటారో అని వదిలి వేయరు.

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU7Ji

Posted by Katta

10, మే 2014, శనివారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-42 ఒక మనిషి అంతరంతరాళాల్లో ఎక్కడో తను గాయపడాలి ఎక్కడో ఓ ముల్లు గుచ్చి సలుపుతుండాలి ఒక సమూహం లో తను తప్పిపోవాలి తప్పిపోయిన గొర్రెపిల్లలా వేదనతో తన మంద కోసం అడివంతా అరుచుకుంటూ తిరుగుతుండాలి... అప్పుడుకదా కవిత్వం జల ఒక గుండెలో పడేది....! ----------------------------------- 10-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Rzno7z

Posted by Katta

6, మే 2014, మంగళవారం

Murthy Kvvs కవిత

స్పోకెన్ ఇంగ్లీష్ గూర్చి కొన్ని భావనలు (రెండవ భాగం) గతం లో ఎక్కడాపాను...ఎందుకని ఇంగ్లీష్ మాట్లాడటానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు,,ఓ వైపు తిట్టుకుంటూనే అనికదూ.!భారతదేశం లో మన ఒక్క రాష్ట్రమనే కాదు.....ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారని అనిపిస్తుంది ఆంగ్లం విషయంలో...!నరనరాల్లో అలా జీర్ణించుకుపోయింది.దాన్ని తీసివేయడం అంత సులువు కాదు.ఇంగ్లీష్ వచ్చినవారికి అన్ని విషయాల్లో ఎక్క్వ జ్ఞానం ఉంటుదని,వారు ఒక ప్రత్యేక తరగతికి చెందినవారని ఇలా కొన్ని ఆధునిక మూఢభావాలు లోలోపల పేరుకుపోయాయి.అయితే దానికి కారణాలు లేకపోలేదు. బ్రిటిష్ వారు మనల్ని పాలించడం వల్ల అది పాలకుల భాషగా మనదేశంలో గౌరవం పొందింది.కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో తిరిగినపుడు కూడా గమనించాను.ఎంతవాళ్ళకి "హిందీ" లో రాజ్య వ్యవహారాలు నడిచినా ..ఇంగ్లీష్ విషయం లో వాళ్ళకి తెలియకుండానే ఒక గౌరవాన్ని ఇస్తారు.దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఓసారి ఉత్తరాఖండ్ లో ఋషికేష్ పక్కన ఒక ఊరికెళ్ళాను.చాలామంది టూరిస్టులు భోజనాలు కానిస్తున్నారు.నా కప్పట్లో వచ్చిన స్పోకెన్ హింది స్వల్పం. సరే...పనులు నడుస్తాయి అది వేరే విషయం.నాకొచ్చిన బ్రోకెన్ హిందీ లోనే ఆర్డర్ ఇచ్చాను.ఎందుకనో దక్షిణాది వాళ్ళంటే ఉత్తరాది వాళ్ళకి కొంత చిన్న చూపే.వాళ్ళ రంగుని చూసో,వేషధారణ చూసో,మనవాళ్ళు కూడ ఇక్కడ దబాయించి మాట్లాడినట్లు అక్కడ మాట్లాడరు.తెలివిలో గాని,బురిడీ కొట్టించడం లో గాని మన ముందు వాళ్ళు ఎందుకూ పనికిరారు.కొద్ది అనుభవం లో అది తెలిసిపోతుంది.ఇక తమిళ,మళయాళీల గారడీల ముందు చెప్పాలంటే దిగదుడుపే.అయితే ఒకటి వాళ్ళ తో వచ్చిన సమస్య ఏమిటంటే ఉద్రేకస్వభావులు. ఆ..వచ్చేద్దాం వెనక్కి...హోటల్ లోకి వెళ్ళి సౌత్ ఇండియన్ తాలీ కి ఆర్డర్ ఇచ్చానుగదా.ఎంతకీ రాదు...ఓసారి ఓనర్ కి కూడా చెప్పిచూశా..!లాభం లేదు.అక్కడ మన తెలుగు నడవదు.మన హిందీ అంతంత మాత్రం.ఏదో బ్రోకెన్ హిందీ లో ఓ పరాయి రాష్ట్రం వ్యక్తి చెప్పాడుకదా అని అతని భావమేమో.నాకు కాలింది.ఇక లాభం లేదనుకొని అనుకున్నది అనుకున్నట్లుగా నా భావావేశాన్ని మొత్తం పది నిమిషాలు పాటు ఇంగ్లీష్ లో నాన్ స్టాప్ గా దంచికొట్టాను.మీరు నమ్మరు...ఒక్కసారిగా అతను నిర్ఘాంతపోయినంత స్థాయిలో ఇదైపోయి నా దగ్గరకి వచ్చి మరీ సర్వర్ చేత వడ్డింపజేసి ..మళ్ళి నేను వస్తున్నప్పుడు కూడా "టాటా" చెప్పి మరీ వీడ్కోలు చెప్పాడు. భారతదేశమా... నువ్వు ఇంతే మారవు..ఎక్కడైనా ఒక్కటే " అనిపించింది. ఈ వెయిటేజీ ఇంగ్లీష్ కి అడుగడుగునా మనకి దేశంలో కనిపిస్తుంది.అలా జీర్ణించుకుపోయిందంతే..!అందుకే ఇంగ్లీష్ గడ గడా మాట్లాడాలని చాలామందికి తాపత్రయం.ఓ రకంగా మంచి వ్యసనమే ఇది.వ్యసనం అని ఎందుకు అంటున్నానంటే ఆ రేంజ్ లో passion ఉన్నవారు ఆ భాషని నోటితో ఇట్టే అందిపుచ్చుకుంటారు. -- తప్పో,ఒప్పో మాట్లాడుతూనే ఉండాలి.దాంతో పాటుగా చదవటం,వినడం శ్రద్దగా చేస్తుండాలి.ఒక నెల ప్రయత్నిస్తే వస్తుందా ..రెండు నెలలు ప్రయత్నిస్తే వస్తుందా అనుకొని caliculation వేసుకునేవాళ్ళకి ఎప్పటికి రాదు.దాని పై ఒక ప్రేమ తో సాధన చేస్తే దానిలోని తీపిదనం తెలుస్తుంది తప్ప లెక్కల మాదిరిగా చేస్తే పని కాదు. --ఒక్కొక్క word ని కాకుండా word-cluster ల లో మాట్లాడటాడానికి నోటికి శిక్షణ నివ్వాలి అని చెప్పుకున్నాం గదా గతంలో..! ఉదా: నిన్న temple ని visit చేశారా..? అని కాకుండా Have you visited temple yesterday అని ఒకే stroke లో వచ్చేలా ప్రాక్టీస్ చేయండి.ఇది ఒక ఉదాహరణగా చెప్పాను. ఇలాంటివి మీరు ఎన్నైనా సేకరించుకొని సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తుండాలి.ఇలాంటివి అన్ని ఎక్కడ దొరుకుతాయి మాకు అని మీరు అడగవచ్చు.ఆ..అక్కడికే వస్తున్నా..ఇది అర్ధం అర్ధం చేస్కుంటే మీకు చాలా అవగతమైనట్లే..! మీరు మొదట్లో క్లిష్టమైన classics ని చదవటానికి ప్రయత్నించవద్దు.అంటే షేక్స్ పియర్ లాంటి ఉద్ధండుల రచనల్ని చదవవద్దు. -- సంభాషణలు ఉండే ఇంగ్లీష్ ఫిక్షన్ ని చదివితే చాలా మంచిది.News paper ని చదవవద్దని చెప్పను గాని దాని లక్ష్యం వేరు.మీరు composition రాయడానికో ఇంకా ఏదైనా written work చేయడానికో అది మీకు ఉపయోగపడుతుంది తప్ప ఇంగ్లీష్ దైనందిన చర్య లో భాగంగా ఎలా మాట్లాడాలో నేర్పదు.ఎంత natural గా effort less గా మాట్లాడితే అంత fluency పెరుగుతున్నట్లు లెక్క. --నా మటుకు నన్ను చెప్పమంటే Sidney sheldon రాసిన ఫిక్షన్ చదవమని చెప్తాను.దాని వల్ల కధా విషయం తెలియడం ఓ ఎత్తైతే మరో వైపు ఆ నవల ల్లోని పాత్రలు మాట్లాడే సంభాషణలు ..వర్ణనలు మీ మెదడు లో అప్రయత్నంగా రిజిస్టెర్ అవుతాయి.ఉదాహరణకి Sidney sheldon రాసిన MORNING,NOON& NIGHT అనే నవల్లో 293 వ పేజిలో గల కొన్ని సంభాషణలు మీ కోసం ఇక్కడ ఇస్తాను.ఓ స్త్రీ,ఓ పురుషుని మధ్య జరిగే సన్నివేశమిది. "Wait a minute...!We really have to talk.." "My bus is leaving" " There will be anoher bus " " My suitcase is on it" Steve turned to a porter."This woman is about to have a baby.Get her suitcase out of there ..!quick..!" Julia puzzled. "Do you know what you're doing" "No" Steve said. ఎంత సింపుల్ గా,హాయిగా,భావయుక్తంగా,ఉన్నయో చూడండి ఈ సంభాషణలు.దీనిలో అర్ధం కాకపోవడానికి ఏముంది..మీకు already ఇంగ్లీష్ వచ్చు.కాని fluency కోసమే గదా మీప్రయత్నం.బాగా గమనించండి...ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మాత్రమే చదివే వాళ్ళు మాట్లాడే భాషని మీరు బాగా గమనించండి...చాలా కృతకంగా...dry గా ఉంటుంది వారి శైలి.అది రాయడానికి బావుంటుంది..మాట్లాడం లో ఏదో ఆత్మ మిస్ అయినట్లుగ ఉంటుంది. నేను నా అనుభవం లోనుంచి చెప్పే ఏకైక తిరుగులేని పట్టు ఏమిటంటే ఇంగ్లీష్ ఫిక్షన్ మాత్రమే దీనికి సహకరిస్తుంది.మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు...ప్రయిత్నించండి..మీకు నేను చెప్పని చాలా ఇతర విషయాలు కూడా పట్టుబడతాయి.ఇప్పుడు ఎందుకు చెప్పానో అప్పుడుగాని అర్ధం అవదు. ఎవరైనా మీతో జోక్ చేస్తేనో ..ఇంకోటి చేస్తేనో ఇప్పుడైతే మీరేమంటారు. Don't be jovial అనో ఇంకోకటో ఒక stock లో ఉన్నవి మాత్రమే అంటున్నారా..Hey..stop fooling around here అనో stop kidding అనో ఇట్లా దైనందిన చర్యల్లో వాడుకలో ఉండే పదగుచ్చాలు అలవోకగా వచ్చేస్తాయి.ఏదైనా ప్రయత్నించకుండా ఎలా తెలుస్తుంది..?మీరు ఇప్పటిదాకా ఎన్నో విధాలా ప్రయిత్నించిఉండవచ్చు... చివరిగా నా ఈ విధానాన్ని చూసి,పనికిరాకపోతే చెప్పండి. ---K V V S Murthy

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rYpYz5

Posted by Katta

4, మే 2014, ఆదివారం

Murthy Kvvs కవిత

మహాత్ముల చెప్పిన వాటిని తమ సొంత విషయాలుగా ప్రచారం చేసుకోవడం సమంజసం కాదు. కొంతమంది ఆధ్యాత్మిక గురువులు వారి జీవిత కాలం లో కాలానుగుణంగా,సందర్భానుగుణంగా చెప్పిన కొన్ని విషయాలను తమ సొంత భావాలా అన్నంత రీతిలో కొంతమంది ఉదహరించడం, వివరించడం చేస్తుంటారు.మంచిది... దానివల్ల ఆ మాటల్లోని గుబాళింపు ఇంకా ఎక్కువమందికి తెలుస్తుంది.అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే కనీసం మాటమాత్రంగానైనా ఆ source ని ఎవరిదగ్గరనుంచి తీసుకున్నారో తెలుపకపోవడం. ఏం...ఎందుకు చెప్పాలి..?పేటెంట్ హక్కులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించవచ్చు.లేకపోవచ్చు...కాని ఆ అసలు వ్యక్తి పేరుని వెల్లడించినంతమాత్రాన తనకి వచ్చే గౌరవం ఏమీ తరిగిపోదు.పైగా పెరుగుతుంది కూడా..అతని నిజాయితీకి...! అలా కాకుండా వేరే ఓ చోట దాని true source గూర్చి తెలుసుకున్నప్పుడు వారి మీద జాలికలుగుతుంది.అది ఒక్కటనేకాదు...మహాత్ముల యొక్క మాటలు వారిని ఉదహరిస్తూ చెప్పడం వల్ల వారి ఆశీర్వాదం కూడా ఒనగూరుతుంది.బాగా గమనించినట్లయితే అది ఎవరికి వారికి తెలుస్తుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే... Gospel of Sri Ramakrishna లో శ్రిరామకృష్ణ పరమహంస ఆయన జీవితం లో జరిగిన ఒక ఉదంతం గురించి నరేంద్రునికి ఒక ఉదాహరణగా చెబుతారు.మక్కీకి మక్కి అదే విషయాన్ని ఆ మధ్య ఒక ప్రసంగం లో ఒకాయన తను కనిపెట్టిన విషయం లా చెప్పుకున్నారు.కనీసం reference కూడా ఇవ్వలేదు. మహాయోగీశ్వరుల యొక్క ప్రతిమాట వెనుక వారి శక్తి నిబిడీకృతమై ఉంటుంది.అందుకే అవి నిత్యనూతనంగా హృదయాలని వెలిగిస్తుంటాయి.అది గమనించాలి. శ్రీ రామకృష్ణులు నరేంద్రుని కొన్ని రోజులు చూడకపోయేసరికి దాని గురించి అడుగుతూ " నరేన్ ...నామాటల్ని అర్ధం చేసుకోగలింది నువ్వు ఒక్కడివే...నిన్ను చూడకపోతే నా హృదయం నీటితో తడిసిన వస్త్రాన్ని పిండితే ఎలా అవుతుందో అలా అవుతుంది" అంటూ ఒక ఒక వస్త్రాన్ని పిండి చూపిస్తారు. ఎంత కవితాత్మ ఉన్నది ఈ చిన్ని మాటలో అనిపిస్తుంది నాకైతే...! --KVVS Murthy (4-5-2014)

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hpB8YI

Posted by Katta

2, మే 2014, శుక్రవారం

Murthy Kvvs కవిత

అయితే ఎంతైనా మణిరత్నం కదా ,తనదైన శైలి లో చూపించాడు. ఒక పోలిస్ అధికారి తన కుమార్తెకి జరిగిన అమానవీయ సంఘటన ని వివరిస్తూ దానికి కారకులైన వారిని ఏమీ చేయజాలని స్థితిలో ఉన్నానని హీరో కమల్ హాసన్ కి తన అశక్తతని వివరిస్తుంటాడు.ఈ సన్నివేశం సరిగ్గా God father నవల నుంచి తీసుకున్నదే.... అయితే ఎంతైనా మణిరత్నం కదా ,తనదైన శైలి లో చూపించాడు. నవల లో Don Vito Corleone (గాడ్ ఫాదర్ పేరు) దగ్గరకి Bonasera అనే రొట్టెల వ్యాపారి వస్తాడు.ఇద్దరూ ఇటాలియన్ లే.చాలామంది సిసిలియన్ల లాగానే అమెరికా లో బ్రతుకుతెరువుకి వచ్చినవారే.Human instincts ని వివిధ పాత్రల ద్వారా గొప్ప విశ్లేషణ చేస్తాడు రచయిత Mario Puzo.వీళ్ళలో అనేక వ్యాపారాల ద్వారా వృద్ది చెంది ఆధిపత్యం చెలాయించే కుటుంబాలు ఓ అయిదు ఉంటాయి.నిజంగా ఆ నవల స్పిరిట్ ని అర్ధం చేసుకున్నవాడు దానిలోనించి ఎన్ని కధలనైనా వండవచ్చు.మన మహాభారతం లాగా. ఊ ...అయితే ఈ Bonasera అన్ని ప్రయత్నాలు చేసి Don దగ్గరకొస్తాడు.అప్పుడు అంటాడు Don," మిత్రమా ఇప్పుడు నేను జ్ఞాపకం వచ్చానా..ఘనత వహించిన నీ అమెరికన్ చట్టాన్నే ఆశ్రయించలేకపోయావా..." అంటూ mimic చేసినతర్వాత మరి నీ కుమార్తె కి జరిగిన దానికి నన్నేమి చేయాలని అనుకుంటున్నావు అంటాడు.అప్పుడు Bonasera అతని దగ్గరకి వచ్చి చెవిలో ఏదో చెబుతాడు.(ఈ వివరించే స్టిల్ God fatherసినిమాలో చాలా ఫేమస్ అయింది) సినిమా కంటే నవల నే బాగుంటుంది నా దృష్టిలోనైతే.అతను ఆ చెవిలో ఏం చెబుతాడో బయటికి ఇద్దరు చెప్పరు గాని....' అంత శిక్ష వాళ్ళకనవసరం...అయితే వాళ్ళకి జరగవలసింది జరుగుతుంది.నువ్వు వెళ్ళు.' అంటాడు. వెళ్ళేటప్పుడు Bonasera ని ఉద్దేశించి గాడ్ ఫాదర్ అంటాడు." మిత్రమా నీపై గల స్నేహ భావం చేత నేను ఈ సాయాన్ని చేస్తాను.అయితే దీన్ని నువ్వు గుర్తు పెట్టుకో..నేను ఎప్పుడైనా ఏదైనా సాయమడిగితే చేయీ..ఆ రకంగా నీ రుణం తీర్చుకో". యూరోపియన్ లకి,మనకి ఉన్ననీతి లేదా ధర్మశాస్త్రాలలోని తేడా ఇక్కడే కనిపిస్తుంది.ఒక వ్యాపార సంబందమా స్నేహం అనేది...అని మనకనిపిస్దుంది. దాన్ని మించిన ఓ concept ని ప్రవేశపెడతాడు రచయిత.ప్రపంచమే ఇచ్చిపుచ్చుకోవడం లో ఉంది.ఆ loyalty ని నిలబెట్టుకుంటేనే వ్యవహారాల్లో అరమరిక ఉండదు అనేది వారి నీతి. Don't quarrel with people.First, reason with people గాడ్ ఫాదర్ యొక్క ముఖ్యమైన underline message లో అది ఒకటి.Don జడ్జిమెంట్ కొన్ని సన్నివేశాల్లో అతడి స్థిత ప్రజ్ఞతని తెలుపుతాయి.నీ వ్యక్తిగత రాగద్వేషాలను వ్యాపారం లో చూపించకు.అది వేరు.ఇది వేరు అని కుమారుడు Sonny Corleone కి వివరించే తీరు హృద్యంగా ఉంటుంది. అనేక వైరుధ్యాలు నిండిన ఈ ప్రపంచంలో Don ఒక సంపూర్ణ మానవుడా అనిపిస్తుంది నవలంతా చదివిన తరవాత. అతని కుమారుల పట్ల,కుమార్తె పట్ల,ఇంకా భార్య పట్ల ప్రవర్తించే విధానమంతా కేథలిక్ విశ్వాసాల భూమిక గానే ఉండి మనం కూడా అతనితో అనేక సన్నివేశాల్లో మమేకమవుతాము. Family మొత్తం కలిసి ఉండడం లోని బలం నిరుపమానమైనద్ని అతని నమ్మకం. దానిలో తన కుటుంబ సభ్యులే కాదు.అతని మితృలు కూడా ఉంటారు.("Friendship is everything.Friendship is more than talent.It is more than the Government.It is almost the equal of family" ఈ ఒక్క మాట చాలదూ ) తెల్లవాళ్ళ లోకం లో loyalty కి ఎందుకు అంత విలువ ...? ఎంతైనా నాకైతే అనిపిస్తుంది ముందు కళ్ళు తెరిచి ప్రపంచదేశాల మీద పడినవాళ్ళు కదా...అనుభావాల భావ ప్రపంచం వాళ్ళది చాలా విశాలమైనది.ఆవేశం ని అదుపులో ఉంచుకొని ఏమి జరగనట్టుగా ఉండడం ...ఊహించని కోణాల్లో దెబ్బతీయడం ....జంతువు లా విరుచుకుపడడం....మళ్ళీ చాలా సున్నితమైన ప్రేమ గుణాన్ని అర్ధం చేసుకోవడం...ఒకరికొకరు గొప్ప సమన్వయం తో సహకరించుకోవడం ఇలాంటి విరుద్ధ భావాలు వారిలో పుష్కలం.అమెరికా లో ఉన్న ఇటాలియన్ లయినా,ఇంకా ఇతర తెల్లవాళ్ళయినా వాళ కుదుర్లు ఎక్కడున్నాయో వారికి తెలుసు. సరే....ఎప్పుడైనా ఇంకా కొన్ని సన్నివేశాలగురించి ముచ్చటించుకుందాం. ------K V V S Murthy

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n93mf1

Posted by Katta

27, ఏప్రిల్ 2014, ఆదివారం

Murthy Kvvs కవిత

A Short Review on Sahiti Yatra by Dasari Amarendra. Here I am introducing a collection of twenty four essays and seven interviews.This is published in Telugu language and the author is Dasari Amarendra ,a best known Telugu writer for his travelogues,stories and essays.I happened to buy the book when I was confronted him at a literary meet held at Kothagudem.The first part needs a lot of space,indeed, to glance over to justify the do.So I let's have a look in to the second part of the book,The interviews section. Amarendra interviewed seven different stalwarts who contributed a lot to their respective pursuits.No doubt all of them would enrich the reader in terms with their particular areas.Kalipatnam Rama Rao,a legend story teller of contemporary Telugu literary world expressed his concerns about ongoing story writing.Many interesting issues came up and the master answered the questions are really noteworthy. Next ...the second one is with renowned journalist/writer Khushwant Sing.Khushwant was well known for his out-spoken nature. Interacted widely about his life and writings.Amarendra wrote that he was given a few minutes of time by Sing but in course of the interaction he had loosen the constraint of the time so they discussed for hours. K.Sachidanandan,a renowned Malayalam poet and the editor of The Indian literature was interviewed and he spoke on Malayalam poetry and he did some comparisons in terms of present movements in the sphere of Indian literature.We could also find a thought provoking interview with Vadrevu Pandu Ranga Rao( also called as Penguin Ranga Rao).His deliberations on Telugu to English translations are of much useful to serious translators. And another Translator J.Lakshmi Reddy raised the real problems which he has been facing as an Hindi translator.The intricate things came up in the discussion are out rightly practical.The interview with Krittiventi Srinivasarao proved that he was a man of self-made.Poets Vadrevu Veera lakshmi devi and Yakoob are also there to share their thoughts.Totally deserved people.It would just not be another book,Rather it will touch you all the way.Try it.--------KVVS Murthy

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2CXi2

Posted by Katta

26, ఏప్రిల్ 2014, శనివారం

Murthy Kvvs కవిత

గేబ్రియల్ గార్షియా మార్క్వెజ్ : నాకు నచ్చిన నాలుగు మాటలు గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.చంద్రునికో నూలు పోగులా ఆయన నవల లలో నాకు నచ్చిన నాలుగు మాటలు ఇక్కడ తెలుగులో అనువదిస్తున్నాను.ఇవి One hundred years of solitude ఇంకా Love in the time of Cholera నుండి తీసుకున్నవి.విస్తృతమైన జీవితానుభవం ,లోతైన పరిశీలన వానిలో కనిపిస్తుంటాయి. 1.ఎవరైనా తమ పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తారంటే కేవలం వాళ్ళు తమకి పుట్టినందుకు మాత్రమే కాదు, వాళ్ళని పెంచడంలో కలిగే తీయని స్నేహమాధుర్యం వల్ల...! 2.వివాహం తరవాత ఎంత సంతోషంగా ఉన్నాము అనేదానికంటే దానిలో ఎంత స్థిరంగా ఉన్నామన్నదే ప్రధానమైనది. 3. ఏ ఒక్కరు నీ కన్నీటికి అర్హులు కారు.అంత ప్రేమాస్పదులు ఎప్పుడూ నీ కన్నీటిని కోరుకోరు. 4.మనిషికి తాను వృద్దాప్యానికి చేరువ అవుతున్నప్పుడు అతనికి తెలుస్తూనే ఉంటుంది.ఎందుకంటే చాలా విషయాల్లో తాను తన తండ్రి లాగానే ప్రవర్తిస్తున్నాని గుర్తించడం మొదలుపెడతాడు. ------------------------------------ 26-4-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fhTxLA

Posted by Katta

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-41 పైకి ఏదో అంటాం గాని మరణం మీద ప్రేమ లేనిదెవరికి...? నీకు నీవు పైకి చెప్పుకోలేని ప్రేమ అది నీ సమస్త గాయాల నుంచి విముక్తి చేసేదది అది నీకు వేరే ఎవరో చెప్పాలా...? నీ అంతర్ గ్రహం లో జరిగే నిష్కల్మష సంభాషణమది.. ! జీవితాన్ని ప్రేమించు... అలాగే మరణాన్నీ ఆహ్వానించు...! అది నిన్ను ఇంకో తీరానికి కొనిపోయే నావ ..! ----------------------------------- 25-4-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RSdQ88

Posted by Katta