పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Kodanda Rao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kodanda Rao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జూన్ 2014, మంగళవారం

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-77// ****************************** 1. కురులు చిక్కగావుంటే, కొప్పు కుదరడం సులభం, మంచోడన్నాక...గుర్తింపు సహజం 2. చెప్పేదెప్పుడూ తెలిసిందేగా, వినడం మొదలెట్టు... సామిరంగా, ఒక్క విషయమైనా తెలుస్తుంది...నీ మీదొట్టు. 3. ఒంటి సత్తువ తగ్గిందంటే, ఉండదులే పెదవిమోహం, కట్టె కాల్తున్నా... చావదులే పదవిదాహం. 4. సృజనశక్తి నశిస్తే,భజనపాటే శరణ్యం, రోజూ నువు కొత్తగా పుట్టకపోతే, నీ ఉన్నతి అన్నది శూన్యం. 5. తంబాకు నోటికి, జిలేబి సహిస్తుందా? పెడమాటలు వినే చెవికి, ప్రియసూక్తి రుచిస్తుందా. 6. పెరిగిన జుట్టుకి, పెట్టిన విగ్గుకి తేడా గుర్తించడం ఏమంత కష్టం, కళ్లలోకి చూడు,తాత్పర్యం స్పష్టం. 7. పదార్ధాల కల్తీ పాడుచేసేది దేహాన్నే, పడకండిరా యువతా! మత్తులో... పూర్తిగా ఆర్పేస్తుంది దేశాన్నే 8. నటించే చిరునగవుల కన్నా, నయం సుమా కసిరే బెత్తం, మాట కాదు... మనసు చూడరా నేస్తం. 9. అందమైన చందమామది, మచ్చనెందుకు వెదుకుతున్నావ్? చచ్చేటంత చిరాకుతో, బ్రతికి ఏం సాధిస్తావ్. 10. కుక్కలు విస్తరికై కుమ్ముకుంటున్నాయ్, పదవికోసం నాయకుడొకడు... 'చీ'అంటే అవి పోతాయ్, ఏమనాలో ఇపుడు. ========================== Date: 17.06.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/U4Swxd

Posted by Katta

14, జూన్ 2014, శనివారం

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-76// ***************************** 1. భయమెందుకోయ్,బ్రతుకంటే బయటికంపేదెవ్వడు, బతికుండగా నిన్ను 2. మధువిచ్చి దీవించాడు దేవుడు, మహాప్రేమ మనిషంటే, రోదిస్తున్నాడు,మంచినీళ్లబదులు వాడేస్తుంటే 3. జాలిపడే విషయం ఏంటంటే, గాలివాటం మనం మార్చలేం, తెలివైనోడికే తెలుస్తుంది దాన్ని వాడుకోవడం 4. నీకు గుర్తుపట్టడం తెలిస్తే, పక్కనున్నోడి ప్రతిభని... నీ ప్రతిభ తెలుస్తుంది,ఎవ్వరైనా కొలిస్తే 5. తప్పదులే... అప్పుజేసైనా ఆర్భాటంగా చేస్కోవాలి, పెళ్లి,చావు పదిసార్లు రావుగా 6. నీ అనుమతిలేకుండా, చిన్నబుచ్చేదేదీలేదు,నిను లోకంలో బాల్యంలోనే బలమొస్తుందోయ్ శోకంలో 7. చీకటిని,మరో చీకటి తొలగిస్తుందా? ఎవడో 'చీ' అన్నాడని,పేచీపడకు, ప్రేమే గెలుస్తుందోయ్ కడకు 8. విజ్ఞానికే హద్దులు... ఊహలకుంటాయా? నువు వినని కధలున్నాయ్, నీలో విను... నిజాలవ్వక ఊరుకుంటాయా? 9. సివరాకరికి సివాలెత్తేది, ఆడెవడో తిడితే కాదు, మనోడు... అన్నోడు, మాట్టాడకుంటేనే 10. నిరీక్షణ బాధిస్తుంది, మరిచిపోవడం వేధిస్తుంది, కానీ, ఆ గాయం శోధిస్తుంది. ======================= Date: 13.06.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1veyIEE

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-75// ******************************* 1. భోజనం అరక్కపోతే, డైజీన్ గోళీలుంటయిరా, కారణాలు చెప్పాలంటే,పురాణాలే ఆసరా 2. సుఖమైనా,దుఃఖమైనా కన్నీళ్లే, కోరుకోరోయ్ ముందు నెంబరే, టైం మిగులుద్ది, తుడవక్కర్లే 3. కాంతివేగం లేదులే, ఏ చరానికి లోకంలో... ౠజుమార్గం లేని రూమర్లకు తప్ప 4. ఈత రానోడు ఏట్లో పడ్డట్టే, కొత్తగా మనం ఏం నేర్చుకుంటున్నా, గజీతగాడైనా, మొదటిరోజది మామూలే 5. గుడ్డుమార్నింగ్ అన్నమాటే,ప్రతీనోట శుభం ఆడికో, ఈడికో చెప్పకుండా నమస్కారాలు మునిగినట్టున్నాయ్ నట్టేట 6. ఈ ప్రపంచం ఒక నాటకరంగం, మనమంతా పాత్రదారులం, ఓరి దేవుడా! ఏమిటీ చెత్త నటవర్గం. 7. సారాయి మరిగినోడైనా, బారునొదిలేస్తాడేమో కాని, గ్రంధం మరిగినోడు,ఆ బంధం వీడిరాడు. 8. ఒట్టేసి మరీ చెబుతారు అబద్దాలు, అదేదో బులెట్ ప్రూఫ్ జాకెట్లా, నిజం షార్ప్ షూటర్రోయ్, గురెప్పుడూ బుర్రకే 9. మరుపన్నది అలవాటైతే, మంచి సాధన చేసినట్లే... విచక్షణలో గౌరవ డాక్టరేట్ పొందినట్లే 10. విజయం నాదేనంటే... అవకుండానే యుద్ధం, విషయమ్మీద అవగాహన లేదని అర్ధం, దానికి మరోపేరే అహంకారం. ========================== Date: 03/06/2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kAInSW

Posted by Katta

3, జూన్ 2014, మంగళవారం

Kodanda Rao కవిత

మిత్రులు శ్రీ రాజేంద్రకుమార్ గారి కవిత ఒకటి ఇప్పుడే చదివాను, బాధ కలిగింది. నేనూ ఒక కవిత రాసి దానికి కామెంటు గా పెట్టాను. శ్రీ రాజేంద్రకుమార్ గారి కవిత ******************* తెలంగాణా ఇక ప్రత్యేక రాష్ట్రం అవశేషాంధ్రకు ప్రత్యేక పథకం మరి నా రాయల కో .....? వీలయితే ప్రత్యేక దేశం చెయ్యండి సాధ్యమయితే భూమండలంలోంచే విడదీసి విసిరేయండి. మరో గ్రహమయినా అనుగ్రహిస్తుందేమో ? 18/02/2014 కె.కె.// ఒకటేలే// ************* రాయలన్న పదంలోనే, రాజసమున్నదిలే, ఎక్కడున్నా, ఎప్పుడైనా స్వతంత్రులే,స్వతంత్రులే, వ్యధలు పడకు, మదన పడకు చింతనెపుడు చెంతకు రానియ్యకు, అవశేషాంధ్రము కాదిది, అశ్వమేధ యాగానికి సంసిద్ధం చేయబడ్డ శ్రీరాముడి గుర్రమిది. తెలంగాణ వేరుపడినా, అని ఎవరో అంటున్నా, అదంతా పనికిరాని కాగితాలపైనా, తమ్ముడొకడు అలిగాడు, మద్య గీత గీసాడు, స్పర్ధలు ఉండవులే ఎపుడూ, అమ్మనొదిలి ఏడకు పోతాడు. తెలుగు పదం, తెలుగు జనం ఒకటేలే, ఒకటేలే తెలుగు తనం, తెలుగు జగం ఒకటేలే, ఒకటేలే ============ 02.05.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n5joGU

Posted by Katta

16, మే 2014, శుక్రవారం

Kodanda Rao కవిత

"మేము చదువుకునే రోజుల్లో, అబ్బో! మా కాలేజీ రోజుల్లో ఎంత అల్లరిచేసేవాళ్లమంటే" అని చాలామంది చెబుతూ ఉంటారు. ఆ జ్ఞాపకాలు, ఆ మధుర స్మృతులు మరొక్కసారి మిమ్మల్ని పలకరించి పోవాలని నా ఈ చిన్న ప్రయత్నం ఈ పాట ద్వారా... ఇది నిజానికి పాట కాదు, మిమ్మల్ని పలకరించే జ్ఞాపకాల ఊట... కె.కె.//హల్లో స్టూడెంటుగారూ...// ******************************* పల్లవి:- హల్లో స్టూడెంటుగారూ... తగ్గాలి మీ జోరు...(2) ఖాళీ బస్సులో సైతం వేలాడేస్తుంటారు, క్లాసు మాస్టార్లపైనే కార్టూన్లే గీస్తారు, (మీ)ఫ్రంట్ బెంచిలో అమ్మాయుంటే...(2) ఈలేసి గోల్జేస్తారు ****************************************//హల్లో// చరణం:- క్రికెట్ మ్యాచులు చూస్తూ మీరు చిందులు వేస్తారు, సినిమా టికెట్లకోసం మీరే ఫీజులు తీస్తారు, పికునికులంటూ మీరు తెగ తిరిగేస్తుంటారు, బైకు పెట్రోలుకోసం ఫాదర్ పర్సే కోస్తారు, (మీ)ప్రోగ్రెస్ కార్డ్ ఇంటికి ఇస్తే...(2) సంతకాలే చేసేస్తారు. **********************************//హల్లో// చరణం:- ఎలెక్షన్సులో మీరు హీరోలమే అంటారు, జోడీ సెలెక్షన్సులో ఎపుడు మీరు ముందే ఉంటారు, కొత్త స్టూడెంట్ ని చూస్తే ర్యాగింగులు చేస్తారు, లేడీస్ హాస్టల్ ముందే జాగింగులు చేస్తారు, (ఫైనల్) పరీక్ష డేటుని ఎనౌన్సు చేస్తే...(2) గుళ్లో అర్చన చేసేస్తారు. *******************************//హల్లో// (స్టూడెంటులంటే అబ్బాయిలేనా??? అందుకే...) చరణం:- ముఖసౌందర్యం కోసం మేకప్పులు వేస్తారు, ప్రతీవాడికి మీరే నిక్ నేములు పెడతారు, చిలిపిగ నవ్వే కళ్లే రింగుటోనుగా పెడతారు, షాపింగ్ మాల్ బిల్లే బాయ్ ఫ్రెండుకి తోస్తారు, (ప్రేమతో) గ్రీటింగ్ కార్డ్ చేతికి ఇస్తే...(2) రాఖీతో బాయ్ అంటారు. ******************************//హల్లో// Date: 16/05/2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nXwQwP

Posted by Katta

15, మే 2014, గురువారం

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-74// ***************************** 1. గంట, ఘడియైపోద్ది అమ్మాయితో మాట్లాడుతుంటే, ఘడియ, గంటైపోద్ది ఇంటర్వ్యూలో కూర్చుంటే, కె.కె. తేడా ఎక్కడుందంటావ్? 2. పాడులోకం అనుకుంటే అంతా ఈజీనే, బాగుచేద్దాం అనుకుంటేనే... రోజు ప్లానింగైనా కష్టమే 3. "నేనేమనుకున్నానంటే" అని ఎప్పుడూ అనకు, ఎందుకనున్నావో కూడా చెప్పాల్సొస్తది. 4. మతం చెబుతోంది మనుషుల్నొదిలేసి.... అక్కడెక్కడో దేవుడున్నాడని, డబ్బులిస్తేనే కనబడతాడని. 5. చరిత్రకి జాలెక్కువేమో, అస్సలు కాదనదుగా... కధలెన్ని అల్లిచెప్పినా... 6. చాలాసార్లు...నోరు డెలివరీ చేసేలోపే, బుర్ర నాలిక్కరుచుకోమంటుంది, అందుకేనేమో థింక్ ట్వైస్ అనేది. 7. కాలం ఒక మహా ఔషధం, ఎక్కువగా వాడితే... అయిపోతుందోయ్ అదే విషం 8. బాల్యం,యవ్వనం,వృద్ధాప్యం... అన్నింటికీ ఉందోయ్ కాల పరిమితి, అజ్ఞానమ్మాత్రం ఒదిలేసావెందుకోయ్ భగవతి. 9. పక్కోడు చేసిన తప్పులైనా, అవన్నీ నీకు పాఠాలేరా నాన్నా, అంత టైంలేదు అవన్నీ ఓసారి చేద్దామన్నా 10. కష్టపడితేగానీ గెలవలేం, గెలిచాక మరింత కష్టపడతాం, అందుకు ఆనందిస్తున్నోళ్లెందరోనని ========================= తేదీ: 15.05.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sQAA5u

Posted by Katta

14, మే 2014, బుధవారం

Kodanda Rao కవిత

KK // ఇదిగో బెదరూ!!! నీ తెలుగు తెలుసుకో// ============================== ఈ మద్య తెలుగు సినిమాలలో, టీవీ సీరియళ్లలో .... ముఖ్యంగా యాంకరింగులో వాడే కొన్ని తెలుగు పదాల విశ్లేషణ... క్లుప్తంగా... ఎవ్వరు పుట్టించకపోతే అసలు మాటలెలా పుడతాయి, వేసుకో వీడికి రెండు.... అన్న చందాన కొన్ని మాటలు అలా పుట్టేస్తుంటాయి, అంతే. వాటి పుట్టు పూర్వత్రాలు పక్కనబెడితే... మీ అసలు ప్రశ్నకి సమాధానంలోకి వెళదాం. 1. తొక్క:- సహజంగా వొలిచి పారేసేదాన్ని తొక్క అంటారు, ఇక్కడ సదరు వ్యక్తికి రుచించని/నచ్చని ప్రతీ విషయం గురించి తొక్క అనే పదం ఉపయోగిస్తారు. 2. తొక్కలోది:- తొక్కలోనిది పండో లేక కాయో ఒలిచేవరకూ తెలియదు ఎవ్వరికైనా... అలాగే సందిగ్ధంలో సదరు వ్యక్తి ఉంటే వారు తొక్కలోది అనే పదప్రయోగం చేస్తారు. 3. పీకావులే:- కలుపు పీకితేనే పంట ఏపుగా పెరుగుతుంది అన్న సత్యం నుంచి ... పరిస్థిని మన అదుపులోకి తెచ్చుకుంటే పీకాడని, లేదంటే ఏమీ పీకలేకపోయాడని ప్రయోగం జరుగుతుంటుంది. 4.బొంగు:- వెదురు బొంగు పైకి దృఢంగా కనపడినా లోపలంతా డొల్లే అనేది ఇక్కడ అర్ధం.... పైకి తెలిసినట్టు కనపడి తర్వాత నిర్ఘాంతపోయే సందర్భంలో ఈ ప్రయోగం జరపబడుతుంటుంది. 5.అదుర్సు:- సహజంగా కంపించేది విపరీత పరిణామాలు లేదా ఊహించని మార్పులు జరిగినప్పుడే... అలాంటి సందర్భంలో ఈ ప్రయోగం. 6.చింపావులే:- తప్పురాస్తే కాగితాన్ని చింపేస్తాంగా... నువ్వు తప్పు చేసావోచ్ అని చెప్పడానికి ఈ ప్రయోగం. 7.ఇరగదీసావ్:- పొయ్యిలో పెట్టే కట్టెల్ని చిన్నవిగా/అనువుగా చెయ్యడానికి విరిపినట్లే... విషయాన్ని అతి సునాయాసంగా ఎదుటివాడికి అర్ధం అయ్యేలా చెప్పగలిగితే ఈ ప్రయోగం చెయ్యవచ్చు. చివరగా నేను ఇరగదీసాను అని మీరు ఈ సందర్భంగా అనవచ్చు. తెలుగు దేదీప్యమానంగా వెలుగుతోంది. అందరికీ జేజేలు. మీరు ఇద్దామనుకున్న పుణ్యం మొత్తం ఇచ్చేయ్యండి సార్ (కొరియర్ చేసినా/ ఆన్లైన్ ట్రాంజాక్షన్ చేసినా అంతా మీ ఇష్టం. ======================================================== Date: 13/05/2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gn4Cf2

Posted by Katta

6, మే 2014, మంగళవారం

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-73// ********************* 1. నిన్న భూతం,రేపు అనుమానం, నేడొక్కటే నిజం, అందుకే... అది కాలం అందించిన "వర్తమానం" 2. అందరికీ తెల్సిందే జీవితం చిన్నదని, అయినా వీళ్ల దుంపతెగ, తొంగి చూడ్డమెందుకో పక్కోడి జీవితంలోకి 3. అడిగింది లేదని చెప్పకుండా, ఉన్నదేదో తెచ్చేసే హోటల్ సర్వర్లా, అదృష్టం బహుచిత్రం సుమీ 4. బాల్యంతోనే బతుకు ముగిసిపోద్ది, మిగిలిందంతా చావే, కప్పెట్టడమో,తగలెట్టడమో లేట్... అంతే 5. ఇప్పటి బిజీలైఫ్ 120లో పరిగెడుతోంది, చమురుకోసం చూసి 40లోకి తెచ్చామో, చెమట చమురుతో నడపాల్సొస్తోంది. 6. ప్రతీ కుక్కకి ఓ రోజుందట, ఆ రోజు ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో తెలీలా... పాపం. 7. పిల్లల బతుకుల కోసం, బిల్డింగులు కడుతున్నారు, చెట్లునరికి సమాధులూ కడుతున్నారు. 8. "బాలు" మైకు బదులు బ్యాటు పట్టుకుంటే, ఆయనా తిట్టుకునేవాడు నీలాగే, అందరూ ప్రతిభున్నోళ్లే... ఎక్కడుందో తెలీదంతే 9. పుస్తకాల్లో ఆరోగ్యం చదవకు, అచ్చుతప్పు పడిందో... అనుమానంతోనే పోతావ్. 10. చాతీ సంకోచ,వ్యాకోచాలు పీల్చే దమ్ము మీదే, జీవితంలో చీకటి,వెలుగులు కె.కె. నువ్వు చూపించే ధైర్యమ్మీదే ===================== Date: 05.05.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iWM7Zd

Posted by Katta

7, ఏప్రిల్ 2014, సోమవారం

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-72// ****************************** 1. దీపం ఉంటేనే వెలుగివ్వగలమా? దీపాన్ని అద్దంలో చూపించినా వెలుగే, మనసుండాలంతే... మార్గాలెన్నో 2. పచ్చిమాంసం తినేవాడికి, బచ్చలికూర రుచిస్తుందా? వాగ్దానాలు ఎన్నిజేసినా... 3. అర్ధంకాని పద్యంలో అలంకారాలు ఎన్నుండి ఏం లాభం? పై,పై మెరుగులతో రాదులే ఆత్మసౌందర్యం 4. చీకట్లను తోలే పొద్దంటే, గుడ్లగూబకు చిరాకే, మంచిజేసినా మాటొస్తది, ఒదిలేయ్. 5. సుష్టుగాతిని తొంగుంటే అది భోగం, పక్కనోళ్లు కాకుల్లా పొడుస్తున్నా, పక్కమీద ఒళ్లుమరిస్తే, అదే యోగం. 6. జుట్టన్నాక చిక్కుపడుతుంది, సర్దుకుంటే పాపట కుదురుతుంది, అదేపనిగా దేవుడ్ని చిరాకెట్టీక 7. చెట్టు పచ్చగుంటుందా, చీడ వేరుచేరాక, బడికెళ్లే బచ్చాగాడికెందుకోయ్, కులం కాలమ్మ్... చెరిపేయ్. 8. దొంగరాకుండా కట్టడిచేస్తావ్, దుస్వప్నం రాకుండా ఏం జేస్తావ్? మంచోడిగా బతకాలంతే... వేరే దారేలేదు. 9. ఎద్దు వీపుమీద పుండుని, గెద్ద,కాకి ఎందుకు పొడుస్తాయ్? నోటిదురదకి మందులేదు, ఎదవల్ని వెలేసెయ్. 10. పుట్టిన బిడ్డని, కుట్టిన గుడ్డని చూసినప్పుడు ఎవరికైనా తృప్తే, ఎవరు ఆనందించరోయ్ కె.కె, మంచిమాట చెప్తే. ========================== Date: 07.04.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kC7G48

Posted by Katta

3, ఏప్రిల్ 2014, గురువారం

Kodanda Rao కవిత

కె.కె//గుప్పెడు మల్లెలు-71// ****************************** 1. ఎక్కడున్నాయ్ ఎల్లలు,ఎగిరే పక్షికి, పోవే పిచ్చిమనసా! నీ ఊహలకేం... కోకొల్లలు 2. పొద్దు గద్దెనెక్కితే, అబ్బో... భజలెన్నెన్నో ప్రతీఇంట్లో, దిక్కుమాలి దిగితే, నిద్దరేలే ప్రతీ కంట్లో 3. ఎందుకు పుట్టానని ప్రశ్నించుకోకెప్పుడూ, దేవుడిని చూపించమంటే జవాబు చెప్పేవాడెవ్వడు? 4. చక్కెరపాకం వేసేస్తే, చక్కెరకేళీలొస్తాయా వేపచెట్టుకి, మూర్ఖుడ్నొదిలేయ్ వాడిమట్టుకి 5. పెద్దలన్నారేవో సామెతలంట, అవి హద్దులు దాటేవైతే, పెనురోతే అని నేనంటా. 6. పొగబెడితే దోమలు పోతాయా? పొగతాగే భామలూ ఉన్నారోయ్, అమ్ముతూ తాగొద్దంటే ఎలా? 7. ప్రతీ పదం,గుండె మెలితిప్పితే కవిత్వం ప్రతీ మెలిక,ముడివిప్పితే గెలిచినట్లేలే మానవత్వం 8. రోజూ కొత్తేనా! తొలిపొద్దు సూరీడు, అది నిజమే అనిపిస్తుంది, అమ్మ ఒళ్లో పడుకున్నప్పుడు 9. కొత్తసృష్టి జరగాలంటే, కొంతపిచ్చి ఉండాలేమో? చేదుపాట షూటింగైనా విదేశాలు వెళ్లాలేమో? 10. చిన్నబీజం నుంచి చెట్టు మొలుస్తుంది, చిన్నవాక్యమైనా దిక్కులు పలికిస్తుంది, గుప్పెడు చాలు కె.కె, గుండెను తడిమేస్తుంది. ======================== Date: 02.04.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pO8FSd

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

Kodanda Rao కవిత

KK//గతం-స్వాగతం// ************** గడిచినదంతా గతం, అది ఎన్నో మంచి,చెడుల సమ్మేళనం, గడిచినదంతా గతం, అది చేసిందిలే ఎంతో కొంత శుభం, గడిచినదంతా గతం, ఆ గతంవైపు చూస్తూ కూర్చుండిపోతే మనం అక్కడే ఆగిపోతాం, గడిచినదంతా గతం, ఆ క్రితం కన్నా, గతం కన్నా బాగుంటుందిలే ఈ నవ సంవత్సరం, మనందరి తరఫునా ఇది నా అశాభావం... అందుకే మిత్రులారా... నే చెబుతున్నా మనసారా నవ యుగాదికి స్వాగతం, ఈ జయనామ సంవత్సరం కలిగించుగాక, సర్వ జనులకెల్ల జయం... విజయం... ==================================== Date: 30.03.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iPfxMg

Posted by Katta

26, మార్చి 2014, బుధవారం

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-70// ************************** 1. కారణాలు వెదక్కు, కాలేదని చెప్పడానికి, ఫలితాలు దొరకవ్ ఎప్పటికీ 2. దుఃఖాన్ని పంచెయ్, సంతోషం పెంచేయ్, నలుగురూ ఉంటే సుఖమదేనోయ్. 3. భయమెందుకోయ్ నీకు, వాడెవడో కిందకి లాగుతాడని, వాడున్నది నీ కిందనేగా 4. టైములేదెవ్వడికీ ఇక్కడ, నిన్ను ముందుకి తోసేందుకు, ముందడుగెయ్యాల్సింది నువ్వే...మార్పుకి 5. ఓడానని అనుకోకు, మరు ప్రయత్నం చేస్తున్నంతవరకు, ఆడుతున్నావనే అర్ధం. 6. ఎం సీలో,ఫెవికోలో ప్రతి పగులుకి ఒక మందుంటుంది, విరిగినట్టేడుస్తావేరా వెర్రోడా 7. కాళ్లు తడిపిందని కాస్త ముందుకెళితే, కాటికంపదా సముద్రం, తెగేదాక లాగొద్దు... నీలో శత్రువే అహం. 8. వాదిస్తేనో, వేదిస్తేనో నమ్మకాలు మారవ్, నిజం నిరూపించాలంతే 9. తెల్లగోడకే పంది వీపురుద్దేది, అతిజాగ్రత్తకి పోతేనే, అపాయం ఎదురయ్యేది... కదూ! 10. సామాన్యుడికి, అసమాన్యుడికి తేడా... ఆడుపడే కష్టం. =================== Date:26.03.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Qd2xXe

Posted by Katta

6, మార్చి 2014, గురువారం

Kodanda Rao కవిత

కె.కె//గుప్పెడు మల్లెలు-69// ******************** 1. కవరుపేజీ చెప్పగలదా, కహానీ మొత్తం, చూసినంతనే అంచనాలెందుకు? 2. తినలెదేచెట్టు పళ్లెప్పుడూ, కారణాలెందుకోయ్, సాయం చెయ్యాలనుకున్నప్పుడు 3. గెలుపన్నది సులభమే, అల ఒచ్చినప్పుడు, తలొంచడం తెలిస్తే... 4. తప్పుదారి తగులుతుంది, ప్రయాణంలో చాలాసార్లు, కొత్తదారి పరిచయానికి 5. కాలమంటే గడియారమా, నచ్చినప్పుడు సరిజెయ్యడానికి, పరిగెత్తయినా సరే... అందుకోవాలంతే 6. ప్రతిమెట్టు అనువే, కులాసాగా కూర్చోవడానికి, నువ్వు లొంగొద్దు ఆ మోసానికి 7. వర్షంలో తడుస్తున్నప్పుడు, ఆగాక నడుస్తున్నప్పుడు తేడాలేదా, జీవితమంటే రెండూ కలిపేకదా 8. కాలకూటంలా అడ్డుతగిలే, తడిగుడ్డ వాక్యం, "అదిసరే... కానీ" 9. నీకధ చెప్పడానికి సిగ్గెందుకు? అయితే ఆడికో పాఠం, లేదా గొప్ప గుణపాఠం. 10. అవసరాన్ని మించి, మనిషి ఖర్చుపెట్టేది ఏమిటో, అబ్బో... అది విశ్రాంతే అనుకుంటా. ==================== Date: 06.03.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e2puBp

Posted by Katta

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-68// ******************* 1. నిన్నుచూసి,నవ్వితే నవ్వనీ, అసలే ఆనందానికి కరువొచ్చింది, ఈ మద్య మనదేశంలో... 2. ఇక్కడేదీ కాదు శాస్వతం, ఎవడో చెప్పిన మెట్టవేదాంతం, మరి ఉండిపోద్దా సమస్య మాత్రం. 3. నిప్పు రాజుకోనప్పుడే, పొగ గుప్పుమనేది, సరుకులేనోడికే చిరాకు 4. మనిషిని సృష్టించాడు దేవుడు, ఈడు ఋణం తీర్చేసుకుంటున్నాడు, వీధికో దేవుడ్ని పుట్టించి 5. తమ్ముడూ! నీకిది అవమానం, నువ్వుండగానే ఎలా కమ్మిందోయ్, నీ మిత్రుడికి ఒంటరితనం. 6. లాగివదిల్తేనేగా వెలుతుంది బాణం, ఆవేశం పెరిగితేనేగా కె.కె., కళ్లెర్రజేస్తుంది కలం. 7. ఇళ్లు కడుతున్నంతవరకే, పనివాళ్లంతా మనవాళ్లు, ఆస్తొచ్చేవరకే కన్నోళ్లు... ఈ రోజుల్లో 8. ఊరుమొత్తం కాట్లోగలిసినా, ఆకాశం సుస్థిరమేలే, ఆస్తులుపోయినా, పేకంటే ఆశచావదులే 9. ఆతిథ్యమిస్తానని,మృత్యువంటుంటుంది, చేయికలిపావా, కుక్కిన పేనై కాళ్లదగ్గర పడుంటుంది. 10. గొడుగుతో అదిలిస్తే, కుండపోత బెదిరిపోతుందా? కాలం తప్పదంటే, మార్పు ఆగుతుందా. ====================== Date: 28.02.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kgiDvE

Posted by Katta

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-67// ******************** 1. ఎత్తుని చూస్తే భయం, ఎక్కేంతవరకే... అదేలే మనిషి నైజం. 2. గ్రహాలమద్య భవిష్యత్ వెతక్కు, కృషి చెయ్, నీరాత, నీ చేతుల్లోనే 3. గతం గుర్తుంచుకో చాలు, వెనక చూస్తూ నడిస్తే, ముందుకి సాగలేవు 4. నిన్ను మించిన, నమ్మకస్తుడెవరు, నీకు నలుగురూ నిను నమ్మాలంటే 5. నువ్వు చూస్తున్న లోకం, నీ ప్రతిబింబం, నీ నీడచూస్తే, భయమెందుకోయ్. 6. చెట్టు విరుగుద్దేమోనని, పిట్ట భయపడదులే, రెక్కలకష్టం నమ్ము,చుక్కలైనా చుట్టాలే 7. సాధించినదానికి గర్వించు, జీవితం పుష్పకవిమానం, ఒక సమస్యకి జాగా ఖాయం. 8. తప్పుదోవ పట్టించే, ఒక చిన్నమాట, "నేనేమనుకున్నానంటే" 9. ఓడాక రెండోచాన్స్ లేదు, అప్పుడు ఆడిన ఆటకి... నీక్కాదు. 10. ఓ మనిషీ!!! నువ్వెప్పుడూ ఓడిపోయే పందెం, సమస్యనొదిలి పరిగెత్తడం. ===================== Date: 21.02.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ohw9lr

Posted by Katta

17, ఫిబ్రవరి 2014, సోమవారం

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-66// ********************* 1. బ్యాగులకు చక్రాలొచ్చాయ్, ఎర్రచొక్కాలకు కన్నాలు పడ్డాయ్, రైల్వే స్టేషన్లో... 2. పనికిరానిదేముంది లోకంలో, పుట్టగొడుగుల కూరే ప్రత్యేకం, ఫైవ్ స్టార్ హోటల్లో... 3. కంచెగట్టి కాపలా పెట్టొచ్చేమో, పూలతోటకి... మరి పరిమళానికో, ప్రతిభకి అవరోధాలెక్కడివోయ్ 4. కుక్కకూడా భయపడుతోంది, ముక్క లాక్కుంటాడేమో మనిషని, పరాకాష్ఠలో స్వార్ధం... అంతటా మని,మని 5. మార్పు అనివార్యం, అనుకున్నప్పుడే మొదలవుద్ది, ఓర్పుకి పరీక్షా ప్రహసనం. 6. వడదెబ్బ తగిలినోడికి, నీడనిస్తే చెట్టుకేంటి నష్టం, ఉన్నప్పుడు లేనోడికిస్తే, ఏంటి కష్టం 7. కుండైపోద్దా మట్టి, కుమ్మరి నడుం ఒంచకపోతే, బాధ్యత తేలికే, బరువనుకోకపోతే 8. తిరుగుతుంటేనే చూస్తాం గడియారం, ఎంత గోప్పదైతేనేం వంశం, పనిచెయ్యకుంటే లేదోయ్ గౌరవం. 9. అనుకున్నది అవుతుంటే, అంతా మనసత్తా అనిపిస్తుంటుంది, ఆగిందో, కర్మసిద్ధాంతం మొదలవుతుంది. 10. బజారుసరుకా శీలం కొనేందుకు, నిజాయితీ రక్తంగా మారాలి, అది పొందేందుకు...... ========================== Date: 16.02.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MpQvYz

Posted by Katta

15, ఫిబ్రవరి 2014, శనివారం

Kodanda Rao కవిత

ప్రేమికుల రోజు సందర్భంగా, ప్రపంచం మొత్తం ప్రేమతో నిండిపోవాలన్న స్వార్ధంతో... నేను రాసిన ఒక గజల్. కె.కె.// ప్రేమ-గజల్// *************** కాదని అనగలనా...తనప్రేమే నడిపిస్తోందంటే, కాదని అనగలనా... ఎడబాటే వేధిస్తోందంటే చెంతలేకున్నా, వలపు సంకెలేసిందేమో, కాదని అనగలనా... చెలిరూపం ఛేదిస్తోందంటే ఏ మంత్రమున్నదో ఏమో... మతిపోయి తిరుగుతున్నాలే, కాదని అనగలనా... చిరునవ్వే ఆడిస్తోందంటే కొమ్మలూగుతున్నా, పలకరింపు లాగున్నాదే కాదని అనగలనా... చెలిఊహే లాలిస్తోందంటే గుండె సవ్వడైనా, కొండ పేల్చినట్టుందే, కాదని అనగలనా... తన మౌనం కాలుస్తోందంటే ఎదురుచూపులెన్నున్నా, గెలుపుంది 'కోదండ' కాదని అనగలనా... నీ విరహం సుఖమేనంటుంటే ============================= Date: 14.02.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jjTkVK

Posted by Katta

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Kodanda Rao కవిత

మిత్రులందరికీ నమస్కారం, "మా అబ్బాయికి అస్సలు తెలుగు చదవడమే రాదు, మాట్లాడ్డం ఒచ్చు అంతే" అని చెప్పుకోవడం గొప్పగా భావిస్తున్న ఈ రోజుల్లో... "నాన్నా, లాంగ్వేజీలు మనకు అవసరం లేదు. గ్రూపు సబ్జెక్టులు ముఖ్యం. అయితే అమెరికా వెళ్లాలంటే ఇంగ్లీషు రావాలి కదా, అది మాత్రం చదువు, తెలుగు 35 మార్కులు వస్తే చాలు" అని కన్న తండ్రే ప్రోత్సహిస్తున్న ప్రస్థుత సమాజంలో... తెలుగులో మాట్లాడటం, ఒక తెగులు అని భావిస్తూ, హేయ్ డ్యూడ్, హాయ్ బ్రో అని సంబోధిస్తూ, తప్పు తను చేసినా, పక్కవాడు చేసినా, షిట్ అనే చెత్తని ఊతపదం అయితే గొప్పగా ఉంటుందని యువత నిర్ణయించుకున్న దౌర్భాగ్యపు రోజుల్లో... ఇంకా తెలుగుమీద మక్కువ చావని నాలాంటి చాదస్తులు, చాందసులకి (ఒక్క ముక్కలో చెప్పాలంటే పిచ్చోళ్లకి) నమస్కారం. ఆనందం,బాధ,ఆశ్చర్యం,దుఖః... ఇలా ఎన్నో అనుభూతుల సమాహారం మనిషి జీవితం. మనసారా నవ్వి చాలా కాలమయ్యింది అంటుంటారు చాలామంది, అక్కడికి ఏడవడం ఏదో బాగా తెలిసినట్టు. మనం మనసారా ఏడ్చికూడా చాలా రోజులయ్యింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా పని మనసారా చెయ్యాలంటే, అది సహజ సిద్ధమైనది అయ్యుండాలి. కృత్రిమానికి, మనసారా అనేపదం వర్తించదు. అమెరికాలో స్థిరపడనవాడైనా, ఆఫ్రికాలో చదివినవాడైనా తెలుగోడైతే... కాలికి దెబ్బతగిలితే అమ్మా అని అరుస్తాడు. అదే సహజత్వం. ప్లాస్టిక్ పూలతో సువాసన సాధ్యమా? కాలంతో మార్పు అతి సహజం... ధూమ శకట వాహనం గైకొని రమ్ము అంటే అది ఏమిటో అర్ధం కాదు, కారు తీసుకొని రా అంటేనే అర్ధం అవుతుంది. టీ తాగుతావా? అని అంటే అర్ధం అయినంత బాగా, తేనీరు పుచ్చుకుంటావా? అంటే అర్ధం కాదు. భాష అనేది భావాన్ని వివరించేది అని నేనూ పూర్తిగా నమ్ముతాను. కాని పరభాషలో మాట్లాడీతేనే గౌరవం పెరుగుతుంది అనే భ్రమలో అందరం బ్రతికేస్తున్నాం అనే బాధ రోజు,రోజుకి పెరిగిపోతోంది. అలాంటి బాధనుంచి, నా కవిత్వం జనించింది. నేను రాసేది కవిత్వమో, కాదో నాకు తెలీదు. చందస్సు, యతి ప్రాసలు సరిగా తెలియవు. కాని మనిషి జీవితాన్ని, అందులోని ప్రశ్నలని అర్ధం చేసుకోగల సామర్ధ్యం ఉన్నదనే నా భావన. వాటినే అక్షర రూపంలో రాయడానికి ప్రయత్నించాను. కవిత్వానికి ఎవరెన్ని నిర్వచనాలు చెప్పినా, నా నిర్వచనం మాత్రం " సంఘహితం కోరేదే కవిత్వం". మొదట దీర్ఘ కవితలు రాసే ప్రయత్నం చేసాను, కానీ కవులన్నవారే చదువుతున్నారని అర్ధం అయ్యింది. అదికూడా రంధ్రాన్వేషణ కోసమే అని బాగా అర్ధం అయ్యింది. అప్పుడు మొదలయ్యిన ఒక ఆలోచనే నేను రాసే "గుప్పెడు మల్లెలు". గుప్పెడు చొప్పున చల్లుతున్నా, చూస్తుండగానే అవి గంపెడు తయారయ్యాయి. ఆదరిస్తున్న అందరికీ నమస్సుమాంజలి. ఈ నా గుప్పెడు మల్లెలు ముఖ్య ఉద్దేశ్యం... "ప్రతీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది మనసుతో ఆలోచిస్తే" అని. ఆ అలోచన మాతృ మూర్తి, మాతృదేశం, మాతృభాష మీద ప్రేమతోనే సాధ్యం అని చెప్పాలని... ఈ ప్రక్రియకి సహకరించిన ఎన్నో అంతర్జాల సమూహాలు వేదికగా నిలబడినందుకు, వారికి ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను. ముఖ్యంగా కవి సంగమం, అచ్చంగా తెలుగు, కృష్ణ తరంగాలు, ప్రేమ.. ఇంకా ఎన్నో గ్రూపులు. వారందరికీ ధన్యవాదాలు. జై హింద్..... మీ "గుప్పెడు మల్లెలు" కె.కె.

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7dnMv

Posted by Katta

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Kodanda Rao కవిత

కె.కె//గుప్పెడు మల్లెలు-65// ******************** 1. మబ్బుని కోసినా, మంచినీరేగా, మంచోడు బాధపడినా... పట్టించుకోరు అందుకేగా 2. కోరికలు, ఊరికుక్కలు, ఏమిచ్చినా... వెంటబడుతూనే ఉంటాయ్. 3. నదిని పాయలో, పాయని నదిలో చూడగల్గాలి, పారదర్శకత అంటే.. ఉంటే... 4. శవాలు తేలే నదిలో, శివ,శివాంటూ మునక, ఏమనాలి, భక్తి మించిన మత్తు లేదనక 5. మాట తడబడదా, మత్తు తలకెక్కితే, గద్దెనెక్కాడాయె,తూలుతాడులే 6. ఇసుకమేడ ఉనికి, వాన చినుకుతో సరి, ఎన్నాళ్లోయ్ నడమంత్రపు సిరి 7. ఎక్కడానికేనోయ్ కొండ, అక్కడ తొంగోడానికా... ఎక్కిన పదవే, స్వర్గద్వారమా 8. చీకటి ముసిరితేనే, చుక్కలు అగుపడతాయ్, కష్టాల్లో ఆప్తుల్లా 9. తలకొట్టినా, జలమిస్తుంది బోండాం మంచోడంటే ఆడేనోయ్, పెట్టుకో ఆడికి దండం. 10. గాలికెగిరే కాగితం గాలిపటమా? వెనకనుంచి అరిచే ఆకతాయీ, వేదికమీద చూపు నీ బడాయి. ================== Date: 05.02.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c42hh1

Posted by Katta

5, ఫిబ్రవరి 2014, బుధవారం

Kodanda Rao కవిత

కె.కె//గుప్పెడు మల్లెలు-65// ******************** 1. మబ్బుని కోసినా, మంచినీరేగా, మంచోడు బాధపడినా... పట్టించుకోరు అందుకేగా 2. కోరికలు, ఊరికుక్కలు, ఏమిచ్చినా... వెంటబడుతూనే ఉంటాయ్. 3. నదిని పాయలో, పాయని నదిలో చూడగల్గాలి, పారదర్శకత అంటే.. ఉంటే... 4. శవాలు తేలే నదిలో, శివ,శివాంటూ మునక, ఏమనాలి, భక్తి మించిన మత్తు లేదనక 5. మాట తడబడదా, మత్తు తలకెక్కితే, గద్దెనెక్కాడాయె,తూలుతాడులే 6. ఇసుకమేడ ఉనికి, వాన చినుకుతో సరి, ఎన్నాళ్లోయ్ నడమంత్రపు సిరి 7. ఎక్కడానికేనోయ్ కొండ, అక్కడ తొంగోడానికా... ఎక్కిన పదవే, స్వర్గద్వారమా 8. చీకటి ముసిరితేనే, చుక్కలు అగుపడతాయ్, కష్టాల్లో ఆప్తుల్లా 9. తలకొట్టినా, జలమిస్తుంది బోండాం మంచోడంటే ఆడేనోయ్, పెట్టుకో ఆడికి దండం. 10. గాలికెగిరే కాగితం గాలిపటమా? వెనకనుంచి అరిచే ఆకతాయీ, వేదికమీద చూపు నీ బడాయి. ================== Date: 05.02.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c42hh1

Posted by Katta