పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Poornima Siri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Poornima Siri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మే 2014, సోమవారం

Poornima Siri కవిత

పూర్ణిమా సిరి !! ప్రణయ గీతి..పయన రీతి !! అనుకోకుండా చేరువైనరోజుల్లో సరస్సులో నీటి నై పేరుకున్న పాచిలో కూడా కలువగా వికసించాను ఉండీ ఉండని గడియల్లో నదిలా ప్రవహించడం నేర్చుకున్నా నా ఆలోచనల గడపనొదిలి నీ అవగాహన ముంగిలిలో తిరుగాడాను నడిచే నదికి వీచే గాలికి సుస్థిరత ఏదని సాంత్వన తో సరాగాలు పాడాను నువ్వోక్కోఅడుగు దూరం వేసినప్పుడు ఉప్పు సంద్రాన్ని ఘనీభవించమని శాసించాను నువ్వూ నేను ప్రపంచానికి అతీతులం కాదని అంతటా మనమే కదలాడామని అంగీకరించాను నిజమే కదా వేడెక్కుతున్న నీళ్ళు అడుగునుండీ ఉష్ణాన్ని పైకి ఎగదోస్తాయి ఘనీభవిస్తున్న నీళ్ళు పైనుండి లోనికి గడ్డ కడుతాయి పలకరింపుతో మొదలయిన పయనం ప్రణయంగా హృదిని తాకినట్టు నిర్లిప్తతతో నిర్లక్ష్య మౌన రణం మెల్లిగా మది మరణంతో ముగిసినట్టు.... 5.5.14

by Poornima Siri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q6Iqdl

Posted by Katta

Poornima Siri కవిత

పూర్ణిమాసిరి II సంచారి - పథికుడుII ఒక బాటసారిలా ముందుకు నడుస్తావో ఒక సాహసిలా జీవిస్తావో, ఆలోచనల్లోనే తేలియాడుతావో, ఆలోచనలకు ఆధ్యుడవవుతావో దారపుకండె వేరొకరికిచ్చి గాలిపటంలా ఎగురుతావో గమనవేగాన్ని పెంచే మలయమారుతంగా పరిణమిస్తావో అడుగులే వేస్తావో,అడుసులోకి కూలిపోతావో బాధ్యత నాదంటావో,హక్కులకే వాపోతావో నిన్ను నీవు తెలుసుకొని నిబ్బరంగా ఉంటావో ఊకదంపుడు మాటలకే నీఉర్విని రాసిస్తావో ఎవరూ తేల్చిచెప్పరూ...తేల్చుకోడానికీ రహదారినివ్వరూ కేవలం సంద్రపు తడి తెలిస్తేనే చాలదు దాని అలజడీ తెలిసినవాడే సమర్థ నావికుడు సమయపాలన స్వయంపాలన కొరవడి పథికులు కాలేనే జీవన సంచారులెందరో.. 5.5.14

by Poornima Siri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1icIKl2

Posted by Katta

22, ఏప్రిల్ 2014, మంగళవారం

Poornima Siri కవిత

పూర్ణిమా సిరి II వలయ గమనం II నడుస్తున్న దారిలో నక్షత్రాలను జల్లి ఎవరోవచ్చి నెలవంకగా ముస్తాబు చేయరని అప్పుడప్పుడు మీమాంసల మనోగతం నుండి మరో అడుగు ముందుకు వేస్తాం కాల పదకేళిలో పద్దతిగా కూసింత పరిణితితో సాఫల్యాలతో పాటు సంకెళ్ళనీ గుర్తించ సాహసిస్తాం తెరిచిన తాళంచెవి మరో తాళాన్నికూడా బిగిస్తుందని అర్థంచేసుకోలేక మరో తాళంచెవికై పరుగుతీస్తాం ఎప్పటికప్పుడు వృత్తపరిధి పెరుగుతుందనుకుంటామే కాని వృత్తానికావల మరో వృత్తాన్ని గీస్తున్నామని స్పురణకురాదు ఇంతకుముందు ఎన్ని గొంతుకలలో మన స్వరం కలిసి నినదించిందో ఎన్ని నిశ్శబ్ద ఖేదాలకు మౌన ఆమోదం తెలిపామో సుగంధం వెదజల్లిన పువ్వు కన్నా గుచ్చిన ముల్లు చిందించిన రుధిరం తో జీవితపు అసలు రంగు తెలిసొచ్చినా మళ్ళీ మళ్ళీ కేవలం పువ్వులనే మోహిస్తాం బలిపీఠంపై జీవితమో జీవితమే ఒక బలిపీఠమో తేల్చుకునే ప్రయాసలో మనని ఎంతోకొంత నిక్కచ్చిగా తెలుసుకుంటాం అసాధారణంగా ఆలోచిస్తూనే సాధారణ వలయాల్లో భ్రమించే అతిసాధారణ ఉనికి మనదని ఎంత చెప్పినా,ఎన్ని తెలిసినా నమ్మలేకపోతాం,ఒప్పుకోలేకపోతాం ఇంకా దేనికోసమో ఎదురుచూస్తూ మననుండి మనని తరిమేస్తాం 22.4.14

by Poornima Siri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jFaJb0

Posted by Katta

5, మార్చి 2014, బుధవారం

Poornima Siri కవిత

పూర్ణిమా సిరి || నువ్వు|| ఏదో ఒక మలుపులో మన కలయిక తప్పదు,నువ్వు కలుస్తావనే స్పృహతో జీవించడం నాకు సాధ్యం కాదు,చేరలేని తీర దూరాల కోసం వేచే నేను కలవక తప్పని నిన్నెందుకో మోహించలేను,అలా అని ద్వేషించనూ లేను.. నిశ్శబ్దనీరవంలోకి జారిన ప్రతీసారి నాకు నీ స్పురణ వస్తుంది,నువ్వు హత్తుకుంటే బాగుండు అని చిత్రమైన చిత్రాలను చిత్తం సృజిస్తుంది, నీకంటే నాకు ఆప్తులెవరున్నారు! నీకున్నంత మోహం నాపై ఎవరికుంది గనుక? నీలో నేను కరిగాక ఈ లోకం లోని బంధాలన్నీ అబద్దాలనిపిస్తాయి. నిజాన్ని జీర్ణించుకోవడం మొదలు పెడతాను కానీ ప్రయాసంతా కొన్ని ఘడియల్లోనే ముగిసిపోతుంది మళ్ళీ ఆట మొదలు, నాతో ఊహలో,నేను ఊహలతోనో ... మరిన్ని బొమ్మలు,కొత్త ఆట నీవు నన్ను గెలిపించేంత వరకు.. అన్నీ నన్ను నవ్విస్తూ,కవ్విస్తూ,అన్నీనిజాలేనని భ్రమింపజేస్తూ ,కొత్త ప్రయాణాలకు ప్రారంభ గీతికలు ఆలాపిస్తూ, జీవధారను ప్రసరింపజేస్తూ,నీకు దూరంగా పరుగెత్తుతూ వెనకటి వాసనలు వదలని కొత్త నేను కానీ నువ్వెప్పుడూ అలానే! ఏ మార్పూ లేకుండా,కరుణా భరిత నయనాలతో, ప్రేమగా హత్తుకోవడానికి సిద్దంగా!! నాకెన్నెన్నో పేర్లు,మరెన్నో రూపాలు...నువ్వేమో ఎప్పటికీ ఒకే పేరుతో... అన్నింటినీ నీలో దాచుకునేంత అనాదితత్వంతో ,అనురాగంతో నీటి బింధువులా నేను.. సముద్రం,సూర్యతాపాల సంతులిత శక్తిలా నువ్వు అప్పుడే నిన్ను మృత్యు కన్యకవనుకుంటా పునర్జన్మ నిచ్చే ఏకాంతమై ఎదురవుతావు లోలోని నీశీధి రాగమా! ఏకాంతమా! అంతులేని ప్రేమ నీది అర్థాలు వెతుక్కునే ఆరాటం నాది 5.3.14

by Poornima Siri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dq3jbv

Posted by Katta

3, మార్చి 2014, సోమవారం

Poornima Siri కవిత

పూర్ణిమా సిరి ||చిన్నోడా! || ఋజుమార్గంలో పయనించేవాడికి సవాళ్ళన్నీ కాలగతి ననుసరించే ఋతువులే పలువిధాల ప్రశ్నించే తలపులున్న లోకంలో తర్కానికతీతమైన తపనలన్నీ తప్పులే ఎప్పుడైనా అక్కడికక్కడే పరుచుకునే తీగకే పందిరేస్తారు కాని ఏపుగా ఎదిగే చెట్టుకి కాదు చిన్నోడా! నీకు నీవే ఒక సైన్యమై ముందుకు కదులు ఇదే క్రమంలోని మరిన్ని చిన్న కవితల కోసం ఈ లింక్ http://ift.tt/1cnvcTu

by Poornima Siri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cnvcTu

Posted by Katta

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

శూన్యత || పూర్ణిమా సిరి||

శూన్యం లో ఏమీ ఉండవనీ
ఏమీ ఉండకుంటే అది శూన్యమని
నిర్వచించిన వాళ్ళని ఏమనాలి
అది నిజమే అనుకోని
నిర్లిప్తంగా ఉన్న నన్నేమనుకోవాలి

ఒక్కోసారి అదే శూన్యం

అనంతాలకు దగ్గరి దారిలా
మనలోకి మనని తీసుకెళ్ళే
స్వయంనిర్మిత పుష్పక విమానం లా
ఒక వింతలా ,విభ్రాంతిలా
ఎన్నో అలసటలను తీర్చే విశ్రాంతిలా

మరిప్పుడు అదే శూన్యం

ఒక జ్ణాన సరస్వతిలా
ఒక్కో అక్షరం మళ్ళీ నేర్పిస్తూ..
అమ్మలా లాలిస్తూ..
నేస్తం లా ఓదారుస్తూ..
నాలోకి నన్ను ప్రవహింపజేస్తూ..

హ్మ్! అందుకే అప్పుడప్పుడూ

ఖాళీ తనం కూడా
కావాల్సినతనమే...

5.9.2012

17, ఆగస్టు 2012, శుక్రవారం

ఏ క్షణానికాక్షణం ప్రత్యేకం - పూర్ణిమా సిరి

నిన్నటిరోజు చాలా బాగా గడిచింది...ఏక్షణానికదే ప్రత్యేకంగా..

పొద్దున్నే ఆఫీస్ కి వెళ్తూ వాసు చెప్పాడు...నాకు రావడం కుదరదేమో కానీ ప్రయత్నిస్తాను ఎలాఅయినా నువ్వు తప్పకుండా వెళ్ళు కవిసంగమం కలయికకి..మనసెరిగిన సహచర్యం కన్నా కావల్సింది ఏముంది..

సిరి స్కూల్ నుండి వస్తూ అమ్మ ఈ స్వీట్ నీకు నాన్నకు మీకు స్కూల్స్ లేవు కదా..మీకు ఎప్పుడూ పనులే కదా...సో స్వీట్ ...సిరి నువ్ నా జీవితపు సిరివి

వీలుచూసుకొని తొందరగ
ా వచ్చేసి వాసు మేము బయల్దేరి వెళ్ళాం ఇఫ్లూ లో జరిగే మీట్ కి...
వెళ్ళగానే దారిలో కలిసిన అరుణా దిలీప్,(ఈ పేర్లను విడి విడి గా రాసినా ఒక్కటిగా రాసినా ఒకే లా స్పురిస్తాయి, ద్వనిస్తాయి...వాళ్ళలానే) ప్రవీణా..(ప్రవీణా రాలేనంటే అటుగా వెళ్ళిన అరుణా దిలీప్ తీసుకొచ్చేసారు)
ప్రవీణా చాలా సంతోషంగా దగ్గరికి తీసుకుంటే చాలా హాయిగా అనిపించింది...
నిజం స్నేహానికి ఉన్న సౌరభం దేనికి ఉంటుంది చెప్పండి ..వాడని సుమం అది...

కలిసిన మరో వ్యక్తి జయా...మేము మొదటి సారి కలిసాం..చూడగానే నిన్ను హత్తుకోవాలని ఉంది సిరి అని అంటే ఎంత సంతోషం కలిగిందో చెప్పలేను...అక్కడ నేను ఉన్నది కాసేపే అయినా చాలా మదురం ఆ క్షణాలు..

వెళ్ళిపోతుండగా జాన్ హైడ్ గారు వచ్చి...నేను జాన్ హైడ్ ని అని పరిచయం చేసుకోవడం మంచిగా అనిపించింది...

బివివి ప్రసాద్ గారు, మేము, రఘు,గురుస్వామి ,మోహన్ రుషి ,కాశి రాజు,నందు,కట్టా శ్రీనివాస్ గారు ఇలా అందరం ఒక ఫోటో ని కెమరాలో జ్ణాపకాలని మనసులోనూ బందించాం..నేను ఎక్కువ సమయం అక్కడ గడపలేకపోయాను..ఎందరినో కలవలేకపొయాను...

అరుణా దిలీప్ స్నేహితురాలు హిమ తో స్నేహపరిచయం..అక్కడి నుండి అరుణ వాళ్ళింట్లో ప్రవీణా తో కలిసి రాత్రి భోజనం...హిమ వాళ్ళ బాబు ముద్దు మాటలు..సిరి అల్లరి..అలా ఓ గంట గడిచింది నిమిషం లా..

ప్రవీణా ని పంపించి మేము చార్మినార్ కి వెళ్ళటం...వాసు మాటల అల్లరి...దిలీప్ నవ్వులు...వాసు కి అరుణ వత్తాసు పలకడం హ హ హ చాలా బాగా గడిచింది...
హ్మ్..చార్మినార్ దగ్గర రాత్రి వేళలో నడక...నాకు మళ్ళీ బాల్యాన్ని తిరిగిచ్చిందా అనిపించింది..నందు,రఘు మీరు ఉంటే బాగుండు అని గుర్తొచ్చారు రా...ఎందుకో అజితా కొల్లా కూడా గుర్తోచ్చింది ...అసలు నేను అజిత తో మాట్లాడడమే తక్కువ ..మరి ఎందుకో ఏమో గుర్తొచ్చింది..
ప్రవీణా నువ్వు ఉంటే మనం చాలా సరదాగా ఉండే వాళ్ళం అనిపించింది..

నిజంగా నిన్న ఏ క్షణానికాక్షణం ప్రత్యేకం గా గడిచింది..

Thank u dears for being with me in my life.

9, జులై 2012, సోమవారం

పూర్ణిమ సిరి॥తెలిసి..తెలిసీ॥

ఆసాంతం విరబూసిన రెమ్మని
అడిగావా ఎప్పుడైనా
నిన్నటి మొగ్గలు ఏమయ్యాయని
మరి నన్నెందుకు అడుగుతావ్
ఈ వేళ మాటలు కరువయ్యాయా అని...

అమావాస్యరోజున నక్షత్రాలతో మెరిసే
ఆకాశాన్ని అడిగావా ఎప్పుడైనా
ఆ చంద్రుడు లేకున్నా నీకేం లోటనీ
మరి నన్నెందుకు అడుగుతావ్
నీవు లేని క్షణం ఎలా ఉందనీ

నీవన్నీ ప్రశ్నలే ఎప్పుడూ
సమాధానాలన్నీ నీతోనే... నీలోనే..
ఏం కాదంటావా? నా మాటల్లోనిజం లేదంటావా??
ఇదిగో మళ్ళీ నేను కూడా ప్రశ్నిస్తున్నా
సమాధానం తెలిసి తెలిసి...
*8.7.2012

పూర్ణిమ సిరి॥ముంగిలి॥

దారి పొడవున
జారి పడిన వరి గింజలను
ఒడుపుగా ఏరి తెచ్చి
గొలుసులుగా కడతాను
గుమ్మానికి వేలాడదీస్తాను..

వచ్చీ పోయే ఓ పిచ్చుక
నీకెలా చెప్పేదే-
అలా జారిపడిన గింజలపై జాలి కానీ
నాకై నువ్ ఎగిరి ఎగిరి రావాలనే ప్రేమ కానీ
నాకేమి లేవని...

ఏటి ఒడ్డున చేరి
అందమైన గులకరాళ్ళూ ఏరి
పలురకాల జలపుష్పాలు తెచ్చి
గాజు పెట్టె లో అమరుస్తాను
ముంగిలిని అలంకరిస్తాను

చూడగానే ముద్దులిస్తూ
మురిపించే సజీవ జలపుష్పమా!
నీకెలా చెప్పేదే..
నాలోకం నీవే అని భ్రమించే నిన్ను
అందంగా బంధించానని
నీలోకాన్ని నే కుదించానని..

నాకోసమే అన్నీ చేస్తూ...
నావల్లే అన్నీ అని తలచే నేను
అన్నింటికన్నా తక్కువే అని
తెలిసినా ఎలా ఒప్పుకునేది..
ఈ తలపులనుండి ఎలా తప్పుకునేది...
*8.7.2012