కొంతం వేంకటేశ్: ఋణము..: ఈ ఎద వాకిలి తలుపు తెరిచింది నీవే అనంతాకాశపు శూన్యం ఆవరించిన నా మనో మండలములో కోటి ప్రేరణా తారకలను వెలిగించినావు..! ఈ బదిరాంధక హృదయ సంద్రాన్ని లంఘించినదీ నీవే నా నిరాశ నిస్సత్తువ నిశీధి చట్రాన్ని ధనుమాడి ఆశల జాబిల్లివై చైతన్య జ్యోతికల వెలుగులు నింపినావు..! కాంతి విహీన కన్నుల కోటి సూర్యుల దివ్య ప్రభలను వెలిగించినదీ నీవే అంకిత భావమును నా కణకణమున ప్రవహింపజేసి విజయ తీరాల దారుల్లో నను విహరింపజేసినావు..! చేష్టలుడిగి అలసిన హస్తపు ద్వయమున పరిపుష్ఠిని చేకూర్చినదీ నీవే రుధిర జ్వాలవై అణువణువును నన్నాక్రమించి కష్ట సహిష్ణతను చేతల కూర్చినావు..! జాజ్వల్యమానముగా అంతహ్ చేతనమై నాలో వెలసినావు..!! సాధనా చంద్రికల సరోజనివై నా ఎద తటాకమున శాశ్వతముగ నిలిచినావు..!! మరో జన్మ కావాలి..!! నీ ఋణము తీరాలి..!! 10/03/2014
by Kontham Venkatesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fk3MgH
Posted by Katta
by Kontham Venkatesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fk3MgH
Posted by Katta