\\విబంధం\\ -డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి చందమామ ఇంటి మీంచే సాగిపోతుంటది మెర్క్యురీ బల్పునే జాబిలిగా విశదమవుతం ఆహ్లాదమై అంతరంగాన్ని తాకే వెన్నెలకు నో స్పేస్ సూర్యడు ఎప్పటిలాగే సంచరిస్తుంటడు పగలు కూడా నియోన్ లైట్‌నే సూర్యుడని మైమరుస్తం ఛాయ వెనుక నిలబడ్డ నిజానికి నో స్పేస్ పగళ్లు కదిలిపోతుంటవి రాత్రుళ్లు కరిగిపోతుంటవి ఇరు సంధ్యల రంగుల వాకిళులకు నోస్పేస్ వాన వచ్చి తడితడిగా పలకరిస్తుంటది చినుకు సోకకుంట కవచాలెన్నో కప్పుకుంటం అద్భుత పులకరింతకు నో స్పేస్ చెల్లె వచ్చి ముందు కూర్చుంటది చెలి ఎంతకూ వదలదు సెల్‌లో రాఖీలా వచ్చిన చెల్లెకు నో స్పేస్ కలబోసుకుందామని ఎప్పటి స్నేహితుడో కాల్ చేస్తుంటడు అంతర్జాల ఇంద్రజాల కిక్కుల చిక్కుకుంటం పక్కనే కలవరించే దోస్త్‌కు నో స్పేస్ ఎండ ఎదురొచ్చి చేతులు సాపుతుంటది కిరణాలు తాకకుంట చలువ తంత్రిణులు నులివెచ్చని స్పర్శకు నో స్పేస్ మాఘమాసం కౌగిలికై అల్లుకుంటది అలకో అహమో బ్లాంకెట్‌కటూ ఇటా బ్రాంకట్లు ఆది అనంత ఆత్మల ఐక్యతకు నో స్పేస్ అమ్మ నుంచి అనవరతంగా ఆ్తమ రింగవుతుంటది భార్య అనారబిటస్ మాల్ చెవిలో చేరదు ఆదుర్దాయై ప్రసరించే అమ్మ వాసనకు నో స్పేస్ బంధం ఒంటరి శిలాజమై పోయింది పురాశిల్పం కన్ను తెరిచి చూస్తున్నది -
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hLXLXX
Posted by Katta
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hLXLXX
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి