పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, మార్చి 2014, శుక్రవారం

Indira Bhyri కవిత

ఇందిర ఎవడు వీడు ఖచ్చితంగా వీడో రాజాధిరాజు అడగకుండానే సర్వం సమకూరాలి నటనాసార్వభౌముడికీ వశంకాని నవరసాలొలుకుతాడు గానగంధర్వుడికీ చేతకాని బాణీలు పలుకుతాడు సందేహమే లేదు వీడు మహా జాదూగర్ కొమ్ములు తిరిగిన తాతల్నీ పసివారిని చేసి ఆడిస్తాడు చిరునవ్వులతోనే చిత్తుచేస్తాడు అడుగడుగుకీ రక్షణకోటలు కట్టుకున్న చక్రవర్తి ఆహ్లాదమౌ అల్లరితో రోజుకో తాజుమహలు కట్టే మొగలురాజు అలవోకగా నవ్వులలో ముంచితేల్చే మా ఆస్థాన విదూషకుడు చేయిచాస్తే లేదనని దానకర్ణుడు సహనాన్ని పరీక్షచేసే ధర్మరాజు ఎదురేమున్నా బెదురులేక సాగే వీర జవాను చిట్టి చేతులతో మట్టి పిసికే బాల కృషీవలుడు అడుగిడిన చోటల్లా బృందావనాలు తీర్చే కృష్ణబాలుడు గుండెల్లోనే గుడులు కట్టిన నవ పల్లవరాజు అలా చూసి ఇలా పట్టేసే అష్టావధాని ఇంటి యూనివర్సిటీలో అన్ని శాస్తాలు ఒంటబట్టించి పట్టాలెన్నో పుచ్చుకున్న చిట్టి మేధావి (21/3/2014) పండు (శ్రీహిత్ పుట్టిన రోజు సందర్భంగా .......బాల ప్రపంచానికి అకితమిస్తూ....) రచనాకాలం 2007 ;తెలుగు వలుగు నవంబర్ సంచికలో అచ్చైబహుళాదరణకు నోచుకున్నది .

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PVN6Ta

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి