పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, మార్చి 2014, శుక్రవారం

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| ఎవరు? అమ్మ కొడుకు|| మానవ జన్మ మహత్తరమైనదని వచిస్తూనే తోటి మానవులకు ద్రోహం చేయడమేమిటి? అక్షరాలను నేర్చిన పాఠశాలనే పాంథశాలగానో, పానశాలగానో మార్చటమేమిటీ? గురువులకే వంగి నమస్కరించిన వాడే పంగనామాలెట్టడమేమిటి? ప్రజల మద్దతుతో పదవులందుకొని ప్రజలను నట్టేట ముంచడమేమిటీ? అమ్మ పాలు కమ్మగా తాగి రొమ్ములు కోసే నైజమేమిటీ? గ్రామస్థాయి నుండి పార్లమెంటు మెట్లెక్కి గ్రామసింహ స్థాయికి దిగజారుడేమిటి? అంటే వాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడేనా? సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పక్షాన అత్యున్నత స్థాయికెదిగి చొక్కా మార్చిన చందాన పార్టీలు మార్చి నిన్న పొగిడి, నేడు తెగనాడు వాడు లం........కొడుకు కంటె హీనమగుటేమిటి? చెట్టుపేరు చెప్పుకొని, తాతల ప్రవరలు చెప్పుకొని పబ్బం గడపటానికి ఈ వేదికే దొరొకిందా! నిత్య కృత్య రాజకీయ వ్యభిచారమాచరిస్తూ నికృష్ట బతుకులో పందిలాగ బురదలో పొర్లుతూ నీతి సూత్రాలు వల్లించుటేమిటి? ఓటేసే ప్రజలు దేవుళ్ళంటూ దేవురించి గట్టేక్కిన పిదప గద్దెక్కి వాళ్ళ కూడు, గూడు, గుడ్డ గుంజుకుని వివస్త్రులుగా, నిర్వాసితులుగా, ఆకటి కేకలకెరచేయుటేమిటి? ఎత్తిన జెండా కడకంటా మోయండం గొప్ప! చచ్చిన పిదప కప్పించుకునే గౌరవం పోగొట్టుకుంటే ఎలా? ఇది రాజకీయమా? అరాచకీయమా ''రా''క్షసంగా ''జ''నాలకు ''కీ''డుచేయు ''యం''త్రాంగ నైపుణ్యంతో పదవీ కామ ప్రకోపాన ప్రతాపాలు చూపువారు లం............కొడుకులు! 21.3.2014 ఉ.11.21

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PWv97g

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి