పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
దాసరాజు రామారావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దాసరాజు రామారావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

దాసరాజు రామారావు కవిత

//వాన మాయ// -దాసరాజు రామారావు నన్ను తడిపిన వాన ... కళ్ళ మీద కురిసి ముళ్ళ చూపులు విరిచింది నుదుటి మీద ముసిరి అదృష్ట రేఖలు సవరించింది నాసికాగ్రాన బిందువై జారి తన సువాసన తెలిపింది పెదాల మీద వాలి బతుక్కొక చిరునవ్వును కానుక ఇప్పించింది చెంపల మీద కారి ప్రేమ కెంపుల చెమరింపులు పూయించింది మెడ మీద పారి చక్కదనాల చక్కిలిగింతలు తొణికించింది నన్ను కడిగిన వాన.... ముసురుపట్టిన ఆకాశమంతా నా వదనమై- ప్రకృతంతా నా హృదయంలో ఒదిగిన గువ్వపిట్టై- నన్ను విడువని వాన..... 23-6-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j6OBpv

Posted by Katta

22, జూన్ 2014, ఆదివారం

దాసరాజు రామారావు కవిత

//ఈ కవిని చూశారా ..విన్నారా..// దాసరాజు రామారావు "అసమానతలపై అక్షరాల పంజా ఎత్తి అజ్నానంపై అక్షరదాడి చేయడానికి చైతన్యం పంపుతున్న ఆత్మీయతాక్షరాలై చదువురానోల్లను అల్లుకుంట చదివేటొల్ల సారమై జవాబిస్త ఉదయం లేచింది మొదలు ఊపిరులున్నంత వరకు అక్షరాలే జీవితం " గా కొనసాగుతున్న కవి సిద్దెంకి యాదగిరి తన " బతుకు పాఠం " కవితా సంకలనంతో సాహిత్య సమాజంలో స్థిర పడటానికి వస్తున్నాడు . ప్రముఖ తెలంగాణ కవి 'నందిని సిధారెడ్డి 'ఈ కవిని ఇట్లా నిర్వచించిండు. " అన్ని చలనాల చైతన్యం పొదవుకున్న కవి సిద్దెంకి యాదగిరి. రాబోయే కాలంలో మరింత బాధ్యతగా , మరింత శక్తివంతంగా అక్షరాలు సంధించగలడని సంపూర్ణ విశ్వాసం కలిగిస్తున్నడు.మానవ వనంలో అలజడి దర్శించడం తెలుసు. ఒత్తిడిని తట్టూకుని,అవమానాల్ని గెలవగల స్థిర సంకల్పం తెలుసు. రాలిన తారల కాంతితో,వేల ఇంధ్రధనుస్సులు వెలిగించే ఉద్యమం గుర్తు.అక్షర కణాల్ని పిడికిట్లో బంధించి భూమ్మీద వెదజల్లే కవిత్వం గుర్తు. సిద్దెంకి యాదగిరి కవిత్వాన్ని అభినందిస్తున్నాను. అక్షరంతో ఉద్యమంలో నిరంతరం వికసించాలని ఆశిస్తున్నాను". మరో ప్రముఖ తెలంగాణ ఉద్యమ (ఉస్మానియ ఉనివర్సిటి) గాయకుడు 'దరువు ఎల్లన్న' ఈ కవిని గురించి " యాదన్న కవిత్వం శ్రమ కవిత్వం.బతుకు కవిత్వం. అందుకే బతుకు పాఠంగా ముందుకు తెచ్చినడు . మనస్పూర్తిగా ఆహ్వానిద్దాం. సాహిత్య ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్న నవతరం తెలంగాణ కవుల్లో నావికుడు కావాలని సిద్దెంకి యాదగిరన్న మరిత బాధ్యతతో ముందుకు సాగాలని ఎదనిండా కోరుకుంటున్న". ఊపే విసనకర్ర ..నిద్రకు మెత్త బతుకు తీరు అంతా మా అవ్వకొంగుతోనే రెపరెపలాడుతున్న జండాను చూసినా కండ్ల నిండ మా అవ్వకొంగే కనబడ్తది ( మా అవ్వకొంగు) సిద్దెంకి యాదగిరి " బతుకు పాఠం" లోకి తొంగి చూద్దామా..... 22-6-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UvIqFO

Posted by Katta

9, జూన్ 2014, సోమవారం

దాసరాజు రామారావు కవిత

//నమో నమః // ------------- ----- కీర్తి కాంక్షా సంకీర్తనం ... వినీ వినీ వీనులు పావనమై కనీ కనీ కనులకు కాషాయ విశ్వరూప సందర్శనమై మోదీ మానియాలో మీడియా పారవశ్యమై చాయ్ వాలా చమత్కారీ మోదీ కృప అవినీతి అరచేతిపై కమలం కాడ శూలమై గుచ్చి ... భరత్ మాతా చరణోం మే కోమల్ కమల్ పుష్ప్ ప్రణామ్ మే భాయి బహనోం కే సాత్ అమీర్ గరీబోం కే సాత్ సర్వలోక్ సర్ ఝుక్ నా ...తందాన తాన వల్లబ్భాయ్ ఉక్కుసంకల్పం మతోన్మత్త వజ్రసంకల్పమై తలకు చుట్టేనా 'తెలియ'దన్న సాకు చాటు అంతరాత్మను రాజముద్రగా బహిరంగపరిచి క్షమాపణ కోరేనా సగభాగాన్నేలని ఏలిక సమధర్మాలను ఇరువైపులా నడిపేనా ' భారత్ మరో గుజరాత్ ' ' తెలంగాణ పునర్నిర్మాణం ' అర్థాల వెనుక అనర్థాలా ..విపరీతార్థాలా .. చూస్తూనే వుండండి టీవీ 1,2,3,4,5... ఐదేళ్ళ రాజకీయ వెండితెరమీద ... ---దాసరాజు రామారావు 9-6-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uKTz2m

Posted by Katta

28, ఏప్రిల్ 2014, సోమవారం

26, ఏప్రిల్ 2014, శనివారం

దాసరాజు రామారావు కవిత

\\జంబి ఏప్రిల్ 2014 సంచిక ఆవిష్కరణ (వేముగంటి మురళీకృష్ణ) \\ ---------------------------------------------------- గూట్లోంచి చెల్లా చెదురైన పక్షులు ఎతిమినాన్‌గ ఇంటికి మళ్ళే వేళ ఎండిన వరి చేను వెండి వెలుతురై పల్లెను తట్టి లేపుతున్నది సరం మీద పొట్లం కట్టిన దుఃఖాన్ని నిమజ్జనం చేయాల్సిన సమయమిది చీకటి ఊబిలో కూరుకపోయిన కలల్ని పాతాళ గరిగెతో మెల్లగా పైకి తియ్యాలి ఆకులు రాలిన చెట్టుకింద ఒంటరై జీవిస్తున్న అవ్వల రెట్టల్లో సంతోషాన్ని నింపాలి పందిళ్ళ నిండా బీర తీగల్ని పారించి బతుకులను పచ్చని నీడల కింద నిమ్మళం చెయ్యాలి మొగులును వడికి నీటి ధారలతో కుంటలని, ఒర్రెల్ని, మక్కజొన్న చేన్లని తనివితీర మత్తడి దుంకించాలి మజ్జుగ కదులుతున్న దేహాలతో నమ్మకాల నగారా మోగించాలి చల్లని గాలి కింద వేపచెట్టు పోరడై ఉయ్యాలలూగాలి వలసపదాలు ఇసుకలోంచి బురదనేలలో చిందెయ్యాలి దశాబ్ధాల గాయాలమీద కట్లు కడుతున్న ఉమ్మెత్త చెట్టు ముందు బోనం వండి పండుగ చేయాలి పాలపిట్టకు రుమాల్‌ చుట్టి తెలంగాణ జండ మీద పెద్ద మనిషిలెక్క కూసోపెట్టాలి 26-04-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fiqcRd

Posted by Katta

8, ఏప్రిల్ 2014, మంగళవారం

దాసరాజు రామారావు కవిత

ఘంటసాల నిర్మల " జుగల్ బందీ " ఒక విలక్షణమైన కవిత. భార్యాభర్తల అన్యోన్య దాంపత్య సమాగంలో చివరాఖరికి స్త్రీ ఆనందానుభూతికన్నా ఓటమి, ఒంటరితనమే జీవనానుభవ పరాకాష్టగా పొందిందని వర్ణించింది కవయిత్రి . స్త్రీవాద ధోరణితో రాసినా, ఒక గాఢతను సంతరించుకుంది ఈ కవిత. మరొక్కమారు ... ఆస్వాదిద్దాం ...... 8-4-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PMk206

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

Blog: కొత్త పాళీ Post: TTV - Duet - Ghantasala Nirmala Link: http://ift.tt/1kfCZ9l

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfCZ9l

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

\\బ్లెయిర్ ఇక లేడు\\ కారు రేడియో స్పీకర్ ఆ రోజు నా చెంపమీద ఛెళ్ళున చరిచింది. బ్లెయిర్ ఇక లేడు. మా నగరపు మహాకవి ఇక లేడు. మైకు ముందు గొంతు విప్పితే ఎలుగెత్తిన శాక్సొఫోన్‌లా ధ్వనించే బ్లెయిర్ ఇక లేడు. కడలి తరగలా, ఝంఝామరుతంలా మహోత్సాహంతో మహాశక్తితో సంచలించే బ్లెయిర్ ఇక లేడు. రోడ్డు పక్కన ఒక ఖాళీ పార్కింగ్ లాట్‌లోకి కారుని ఆపి అలా కూర్చుండి పోయాను. రేడియో ఆపేశాను. చుట్టూ నిశ్శబ్దం. నిశ్శబ్దమే మిగిలింది. బ్లెయిర్ ఇక లేడు మరి. బ్లెయిర్ అనే ఒక్క పేరుతో ప్రఖ్యాతుడైన డెట్రాయిట్ ముద్దు బిడ్డ, డేవిడ్ బ్లెయిర్, విశేషణాలకి అతీతుడు. ముద్రల చట్రాల్లో ఒదగనివాడు. కవి, గాయకుడు, కళాకారుడు, సంగీతదర్శకుడు, శిక్షణ ఇచ్చే గురువు, ఉద్యమనాయకుడు, ఇంకా ఫలానా అని పేరు పెట్టలేని ఎన్నో కార్యకలాపాల్లో మునిగితేలేవాడు. అన్నిటినీ మించి గొప్ప మనిషి. తోటి మానవుల్ని నిర్ద్వంద్వంగా ప్రేమించ గలిగిన మానవత్వం ఉన్న మనిషి. బ్లెయిర్ 1967 లో న్యూజెర్సీ రాష్ట్రంలో పుట్టాడు. కానీ డెట్రాయిట్‌ని తన నివాసం చేసుకుని ఈ నగరంతో మమేకమయ్యాడు. తన కార్యకలాపాలకోసం అమెరికా దేశమంతా, ప్రపంచమంతా తరచూ పర్యటిస్తూ ఉన్నా, అతని గుండె చప్పుడు మాత్రం డెట్రాయిట్‌నే పలవరించి కలవరించింది. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఎన్నో రికార్డులు రిలీజ్ చేశాడు. తన పాటలు తనే రాసుకునేవాడు. అతని పాటలకి లెక్క లేనన్ని ఎవార్డులు పొందాడు. కానీ ఏనాడూ ఎవార్డులకోసం అతను పనిచెయ్యలేదు. ఎన్నో ప్రక్రియల్లో నిష్ణాతుడైనా, ఎప్పటికప్పుడు ఆ క్షణాన చేస్తున్న పనిలోనే సర్వశక్తులూ కేంద్రీకరించి పూర్తిగా దానిలోనే లీనమై ఆ పనిని అత్యంత ప్రతిభావంతంగా పూర్తిచెయ్యడం బ్లెయిర్‌కి మజ్జాగతమైన లక్షణం. కవిత్వంలోనూ అనేక ఎవార్డులు గెలిచాడు. 2010లో ప్రతిష్ఠాత్మకమైన కెలలో ఫెలోషిప్‌కి ఎంపికయ్యాడు. అతను కవిత్వాన్ని పైకి చదవడానికి బాగా ఇష్టపడేవాడు. అనేక సార్లు Poetry Slam అనే కవితాపఠన పోటీలో విజేతగా నిలిచాడు. అతని కవిత్వం కూడా బాలడ్ అనే ప్రక్రియలో, గేయాలకి దగ్గరగా ఉంటూ వచ్చింది. పైకి చదవడానికి, ప్రదర్శించడానికి అనువుగా ఉంటుంది. బ్లెయిర్‌ది కొద్దిగా జీరతో కూడిన బలమైన గొంతు, స్పష్టమైన ఉచ్చారణ. పైగా భావస్ఫోరకంగా కవిత చదవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అందుకని అతనే ఆ కవిత్వాన్ని చదివి వినిపించినప్పుడు గొప్ప శక్తితో శ్రోతలని కుదిపేస్తుంది. రెండు సార్లు ప్రత్య్క్షంలో అతను కవిత్వం చదవడం విన్నాను. గొప్ప అనుభూతికి లోనైనాను. ఒకసారి అతను డెట్రాయిట్ గురించి రాసిన కవిత While I was away చదివినప్పుడు నా పక్కన కూర్చున్నామె వెక్కి వెక్కి ఏడవసాగింది. "మీరు బానే ఉన్నారా?" అని ప్రశ్నించాను. ఆ కన్నీళ్ళలోనుంచే చిన్న నవ్వు నవ్వి, It is so beautiful అన్నారామె. నాకు ఎప్పుడో పదేళ్ళ కిందట ఒక సాయంత్రం పూట హైదరాబాదులో ఒక మేడ పై అంతస్తులో డాబా పైన ఆరుబయట కూర్చుని గోరేటి వెంకన్న పాట విన్న అనుభూతి గుర్తొచ్చింది. బ్లెయిర్ చాలా ప్రతిభావంతుడైన అధ్యాపకుడు కూడా. ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది - ఏదైనా పని చెయ్యడం బాగా తెలిసిన వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఆ పని ఎలా చెయ్యాలో ఇతరులకి నేర్పే అధ్యాపకులవుతారు అని. కానీ ఏదైనా కళారూపాన్ని నేర్చుకోవడానికో నేర్పడానికో ప్రయత్నించిన ఎవరికైనా ఇది నిజంకాదని అనుభవం చెబుతుంది. ఎంతో గొప్ప కళాకారులైనా అందరూ గురువులు కాలేరు. ప్రతిభావంతులైన గురువులు చాలా కొద్దిమందే ఉంటారు. బ్లెయిర్ అట్లాంటి అధ్యాపకుడు. ఏదో ఒక బడికో, సంస్థకో అంకితం కాలేదు. అంకితం కావడమంటే కట్టుబడి ఉండడం, పరిధులకి లొంగి పోవడం - అది అతని స్వభావానికే విరుద్ధం. ప్రాథమిక పాఠశాలల దగ్గర్నించీ మహా విశ్వవిద్యాలయాల దాకా, చర్చిలలో, కమ్యూనిటీ కేంద్రాలలో, సమ్మర్ కేంపులలో - ఎక్కడ అవకాశం వస్తే, ఎక్కడ ఎవరు పిలిస్తే అక్కడ ప్రత్యక్షం. ఎదురుగా ఉన్నది పదిమందైనా, వందమందైనా బ్లెయిర్ బోధనలో పెల్లుబికే శక్తితరంగం ఒకటే. నేర్పేది ఒకే ఒక్క పాట అయినా, లేక ఒక సెమెస్టర్ అంతా బోధన చెయ్యబోతున్నా ఆ బోధనకి అతని కమిట్‌మెంట్ ఒకటే. అసలే మనుషుల్ని బాగా ఆకట్టుకునే వ్యక్తిత్వం. అందులోనూ పిల్లల్ని బాగా ప్రేమించే వాడు. ఏ వయసు పిల్లల్తో అయినా చాలా సులభంగా కబుర్లు కలిపేసి, కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ అభిమానం చూరగొనేవాడు. నగరంలోని ఒక పేద పేటలో ఒక చర్చి నిర్వహిస్తున్న సమ్మర్ కేంప్‌లో ఈ వేసవి ఒక మగపిల్లల బృందానికి పాడడం నేర్పుతూ ఉన్నాడు. అతను వాళ్ళకి పరిచయం చేసి నేర్పుతున్న పాట పూర్తికాక ముందే అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. బ్లెయిర్ సంస్మరణ సభలో ఆ పిల్లల బృందం అతనికి నివాళిగా ఆ అసంపూర్తి పాటనే పాడారు - అద్భుతంగా. ఒక బ్లెయిర్, ఒక బాలగోపాల్ - ఇలాంటి వ్యక్తుల్ని మరణం గెలిచిందంటే నమ్మడం కష్టం. ఎందుకంటే వాళ్ళలో ఎప్పటికప్పుడు పెల్లుబుకుతూ ఉన్న జీవశక్తి అంత గొప్పది. వాళ్ళ జీవితాన్ని, ఆ జీవితంలో గొప్పదనాన్ని తల్చుకుని ఉత్తేజితులమవుతూ మనకి చేతనైన పద్ధతిలో, చేతనైన మేరకి వాళ్ళని అనుసరించడమే మనమివ్వగలిగిన నివాళి. తాజాకలం: బ్లెయిర్ కవిత చదువుతున్న దృశ్యాన్ని ఈ కింది యూట్యూబు లంకెలో చూడవచ్చు. http://ift.tt/1oEeftf POSTED BY NARAYANASWAMY S. 8-4-2014. :

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oEeftf

Posted by Katta

6, ఏప్రిల్ 2014, ఆదివారం

దాసరాజు రామారావు కవిత

Link: http://ift.tt/1kfCZ9l

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfCZ9l

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

\\బ్లెయిర్ ఇక లేడు\\ కారు రేడియో స్పీకర్ ఆ రోజు నా చెంపమీద ఛెళ్ళున చరిచింది. బ్లెయిర్ ఇక లేడు. మా నగరపు మహాకవి ఇక లేడు. మైకు ముందు గొంతు విప్పితే ఎలుగెత్తిన శాక్సొఫోన్‌లా ధ్వనించే బ్లెయిర్ ఇక లేడు. కడలి తరగలా, ఝంఝామరుతంలా మహోత్సాహంతో మహాశక్తితో సంచలించే బ్లెయిర్ ఇక లేడు. రోడ్డు పక్కన ఒక ఖాళీ పార్కింగ్ లాట్‌లోకి కారుని ఆపి అలా కూర్చుండి పోయాను. రేడియో ఆపేశాను. చుట్టూ నిశ్శబ్దం. నిశ్శబ్దమే మిగిలింది. బ్లెయిర్ ఇక లేడు మరి. బ్లెయిర్ అనే ఒక్క పేరుతో ప్రఖ్యాతుడైన డెట్రాయిట్ ముద్దు బిడ్డ, డేవిడ్ బ్లెయిర్, విశేషణాలకి అతీతుడు. ముద్రల చట్రాల్లో ఒదగనివాడు. కవి, గాయకుడు, కళాకారుడు, సంగీతదర్శకుడు, శిక్షణ ఇచ్చే గురువు, ఉద్యమనాయకుడు, ఇంకా ఫలానా అని పేరు పెట్టలేని ఎన్నో కార్యకలాపాల్లో మునిగితేలేవాడు. అన్నిటినీ మించి గొప్ప మనిషి. తోటి మానవుల్ని నిర్ద్వంద్వంగా ప్రేమించ గలిగిన మానవత్వం ఉన్న మనిషి. బ్లెయిర్ 1967 లో న్యూజెర్సీ రాష్ట్రంలో పుట్టాడు. కానీ డెట్రాయిట్‌ని తన నివాసం చేసుకుని ఈ నగరంతో మమేకమయ్యాడు. తన కార్యకలాపాలకోసం అమెరికా దేశమంతా, ప్రపంచమంతా తరచూ పర్యటిస్తూ ఉన్నా, అతని గుండె చప్పుడు మాత్రం డెట్రాయిట్‌నే పలవరించి కలవరించింది. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఎన్నో రికార్డులు రిలీజ్ చేశాడు. తన పాటలు తనే రాసుకునేవాడు. అతని పాటలకి లెక్క లేనన్ని ఎవార్డులు పొందాడు. కానీ ఏనాడూ ఎవార్డులకోసం అతను పనిచెయ్యలేదు. ఎన్నో ప్రక్రియల్లో నిష్ణాతుడైనా, ఎప్పటికప్పుడు ఆ క్షణాన చేస్తున్న పనిలోనే సర్వశక్తులూ కేంద్రీకరించి పూర్తిగా దానిలోనే లీనమై ఆ పనిని అత్యంత ప్రతిభావంతంగా పూర్తిచెయ్యడం బ్లెయిర్‌కి మజ్జాగతమైన లక్షణం. కవిత్వంలోనూ అనేక ఎవార్డులు గెలిచాడు. 2010లో ప్రతిష్ఠాత్మకమైన కెలలో ఫెలోషిప్‌కి ఎంపికయ్యాడు. అతను కవిత్వాన్ని పైకి చదవడానికి బాగా ఇష్టపడేవాడు. అనేక సార్లు Poetry Slam అనే కవితాపఠన పోటీలో విజేతగా నిలిచాడు. అతని కవిత్వం కూడా బాలడ్ అనే ప్రక్రియలో, గేయాలకి దగ్గరగా ఉంటూ వచ్చింది. పైకి చదవడానికి, ప్రదర్శించడానికి అనువుగా ఉంటుంది. బ్లెయిర్‌ది కొద్దిగా జీరతో కూడిన బలమైన గొంతు, స్పష్టమైన ఉచ్చారణ. పైగా భావస్ఫోరకంగా కవిత చదవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అందుకని అతనే ఆ కవిత్వాన్ని చదివి వినిపించినప్పుడు గొప్ప శక్తితో శ్రోతలని కుదిపేస్తుంది. రెండు సార్లు ప్రత్య్క్షంలో అతను కవిత్వం చదవడం విన్నాను. గొప్ప అనుభూతికి లోనైనాను. ఒకసారి అతను డెట్రాయిట్ గురించి రాసిన కవిత While I was away చదివినప్పుడు నా పక్కన కూర్చున్నామె వెక్కి వెక్కి ఏడవసాగింది. "మీరు బానే ఉన్నారా?" అని ప్రశ్నించాను. ఆ కన్నీళ్ళలోనుంచే చిన్న నవ్వు నవ్వి, It is so beautiful అన్నారామె. నాకు ఎప్పుడో పదేళ్ళ కిందట ఒక సాయంత్రం పూట హైదరాబాదులో ఒక మేడ పై అంతస్తులో డాబా పైన ఆరుబయట కూర్చుని గోరేటి వెంకన్న పాట విన్న అనుభూతి గుర్తొచ్చింది. బ్లెయిర్ చాలా ప్రతిభావంతుడైన అధ్యాపకుడు కూడా. ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది - ఏదైనా పని చెయ్యడం బాగా తెలిసిన వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఆ పని ఎలా చెయ్యాలో ఇతరులకి నేర్పే అధ్యాపకులవుతారు అని. కానీ ఏదైనా కళారూపాన్ని నేర్చుకోవడానికో నేర్పడానికో ప్రయత్నించిన ఎవరికైనా ఇది నిజంకాదని అనుభవం చెబుతుంది. ఎంతో గొప్ప కళాకారులైనా అందరూ గురువులు కాలేరు. ప్రతిభావంతులైన గురువులు చాలా కొద్దిమందే ఉంటారు. బ్లెయిర్ అట్లాంటి అధ్యాపకుడు. ఏదో ఒక బడికో, సంస్థకో అంకితం కాలేదు. అంకితం కావడమంటే కట్టుబడి ఉండడం, పరిధులకి లొంగి పోవడం - అది అతని స్వభావానికే విరుద్ధం. ప్రాథమిక పాఠశాలల దగ్గర్నించీ మహా విశ్వవిద్యాలయాల దాకా, చర్చిలలో, కమ్యూనిటీ కేంద్రాలలో, సమ్మర్ కేంపులలో - ఎక్కడ అవకాశం వస్తే, ఎక్కడ ఎవరు పిలిస్తే అక్కడ ప్రత్యక్షం. ఎదురుగా ఉన్నది పదిమందైనా, వందమందైనా బ్లెయిర్ బోధనలో పెల్లుబికే శక్తితరంగం ఒకటే. నేర్పేది ఒకే ఒక్క పాట అయినా, లేక ఒక సెమెస్టర్ అంతా బోధన చెయ్యబోతున్నా ఆ బోధనకి అతని కమిట్‌మెంట్ ఒకటే. అసలే మనుషుల్ని బాగా ఆకట్టుకునే వ్యక్తిత్వం. అందులోనూ పిల్లల్ని బాగా ప్రేమించే వాడు. ఏ వయసు పిల్లల్తో అయినా చాలా సులభంగా కబుర్లు కలిపేసి, కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ అభిమానం చూరగొనేవాడు. నగరంలోని ఒక పేద పేటలో ఒక చర్చి నిర్వహిస్తున్న సమ్మర్ కేంప్‌లో ఈ వేసవి ఒక మగపిల్లల బృందానికి పాడడం నేర్పుతూ ఉన్నాడు. అతను వాళ్ళకి పరిచయం చేసి నేర్పుతున్న పాట పూర్తికాక ముందే అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. బ్లెయిర్ సంస్మరణ సభలో ఆ పిల్లల బృందం అతనికి నివాళిగా ఆ అసంపూర్తి పాటనే పాడారు - అద్భుతంగా. ఒక బ్లెయిర్, ఒక బాలగోపాల్ - ఇలాంటి వ్యక్తుల్ని మరణం గెలిచిందంటే నమ్మడం కష్టం. ఎందుకంటే వాళ్ళలో ఎప్పటికప్పుడు పెల్లుబుకుతూ ఉన్న జీవశక్తి అంత గొప్పది. వాళ్ళ జీవితాన్ని, ఆ జీవితంలో గొప్పదనాన్ని తల్చుకుని ఉత్తేజితులమవుతూ మనకి చేతనైన పద్ధతిలో, చేతనైన మేరకి వాళ్ళని అనుసరించడమే మనమివ్వగలిగిన నివాళి. తాజాకలం: బ్లెయిర్ కవిత చదువుతున్న దృశ్యాన్ని ఈ కింది యూట్యూబు లంకెలో చూడవచ్చు. http://ift.tt/1oEeftf POSTED BY NARAYANASWAMY S. 5-4-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oEeftf

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

\\రచయిత రచన భాష\\ ---------------------- ప్రతి కళలోనూ కళాకారుడికి కొన్ని పనిముట్లు ఉంటాయి. చిత్రకారుడికి కుంచెలూ కేన్వాసు, శిల్పికి ఉలి సుత్తి. రచయితకి కూడా ఉన్నై పాత రోజుల్లో అయితే గంటాలు, భూర్జపత్రాలు, తరవాత ఇంకు పెన్నులు కాయితాలు, ఈ రోజుల్లో అయితే కంప్యూటర్లు. అసలు సరుకంతా ముడిపదార్ధంలో ఉన్నది. శిల్పికి చెక్కనో శిలనో ఎలాగో రచయితకి భాష అలాగు. ఐతే ఒక మౌలికమైన భేదం లేకపోలేదు. రచయితకి ముడి సరుకైన భాష, శిలలాగానో కేన్వాసులాగానో ప్రాణం లేనిది కాదు, అది సజీవమైనది. చరిత్రని పొట్టనిండా నింపుకుని సంస్కృతిని సాంప్రదాయాన్ని వేళ్ళకొసల్లో కనుకొలుకుల్లో తొణికిస్తూ ఉంటుంది. తన జాతి చైతన్యంతో అది నవనవలాడుతూ ఉంటుంది. ఎప్పుడూ. భాషతో వ్యవహారం ఆషామాషీ కాదెప్పుడూ. ఇలా సజీవమైన ముడిసరుకుతో కుస్తీ పట్టే రచయితని చూస్తే నాకు చెవులుకుట్టే వాళ్ళూ, పచ్చబొట్టు పొడిచేవాళ్ళూ గుర్తొస్తారు. పచ్చబొట్టు పొడిచేవాడు అసమర్ధుడైతే, వాడి ముడిసరుకునైన నేను వాడి చేతిలో నరకం చూస్తాను గద! ఆ బాధలో వాడీ గొంతునులిమి చంపెయ్యలేక పోవచ్చును గానీ కుయ్యో మొర్రో అని మొత్తుకుంటాను గద! అటూ ఇటూ మెలికలు తిరుగుతాను గద! ఇంతా చేసి చివరికి ఆ పచ్చబొట్టు నానాకంగాళీ అవకతవగ్గా తయారవుతుందని వేరే చెప్పాలా? ఆ మచ్చని - మనకి నచ్చనిదైనా - చెరిపేసుకోలేను గద! అసమర్ధుడైన రచయితచేతిలో భాష కూడా ఇలాంటి పాట్లే పడుతుంది. విజ్ఞుడైన రచయిత భాష పట్ల గౌరవంగా ఉంటాడు. ప్రాణానికి జీవానికి మనమిచ్చే ఒక మౌలికమైన గౌరవమది. జ్ఞాన నిధులైన పండితులకిచ్చే గౌరవమది. అది తెలిసి మసలుకునే రచయితని భాష కరుణిస్తుంది, ప్రేమిస్తుంది. ఒకే క్షణంలో తల్లీ ప్రేయసీ కూడా అవుతుంది. ఆ కరుణలో ప్రేమలో తడిసి పునీతుడైన రచయిత ఆ భాషకి నగిషీలు చెక్కి అందాలు అద్దుతాడు. POSTED BY కొత్త పాళీ LABELS: భాష Link: http://ift.tt/1fRMjMi 5-4-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fRMjMi

Posted by Katta

2, ఏప్రిల్ 2014, బుధవారం

దాసరాజు రామారావు కవిత

" ఒక స్వాప్నికుడి సంభాషణల్లో ఏమున్నాయో ఎలా చెప్పడం ? కాలంలో కరిగిపోతున్న మనిషిని పట్టుకోడానికి ఒక భావుకుడూ, విమర్శకుడూ కలిసి తీస్తున్న పరుగు నుంచి ఎన్ని పదచిత్రాలని ఒడిసి పట్టుకోగలం? కలల దారులు ...నిజాలు నమ్మకాలు.... అశలు అద్భుతాలు ....నిరసనలు ధిక్కారాలు ... ఈ రచనల టాగ్ వర్డ్స్. వాటి చుట్టూ కట్టిన ఈ సంభాషణా సౌధంలో కావలిసినన్ని కవిత్వ పాదాలు, గొంతు చించుకోగలిగినన్ని నినాదాలు , కంఠతా పెట్టగలిగినన్ని సుభాషితాలు, కళ్ళు చూడగలిగినన్ని కాంతి స్తంభాలు కనపడతాయి. అందుకే ఆగి ఆగి వెళ్ళండి.వీలై నన్ని మజిలీలు చేయండి . పైనున్న నగిషీలతో పాటు కాళ్ళ కింద నేలను కూడా చూస్తూ సాగండి. సన్నటి దారేదో కనిపిస్తుంది. కనిపించకపోతే కనిపించేదాకా వెతకండి.ఆది తప్పకుండా మిమ్మల్ని మనిషి దగ్గరికి తీసుకెళుతుంది. ఆదమరిచిన క్షణాలలో మీరు పోగొట్టుకున్న మీ లోపలి మనిషి దగ్గరికి తీసుకెళుతుంది. మనిషి అంతరంగానికి మించిన రణస్థలి ఏదీ లేదు ఇవాళ. అక్కడ నిలబడి ఇరుపక్షాలతోనూ మాట్లాడటమే సంభాషణకు కొత్త అర్థం.ఆ సాహసం చేసినందువల్లే ఈ అక్షరాలు,ఆలోచనల పట్ల మనకు ఇంత మోహం." పర్స్పెక్టివ్ (ఆర్.కె) ప్రచురణలో భాగంగా కె.శ్రీనివాస్ ( ఆంధ్రజ్యోతి సంపాదకులు) ఆంధ్రజ్యోతి లో ( 2004-2010) వరకు నిర్వహించిన' కాలమ్స్' లలో కొన్ని వ్యాసాలను కలిపి "సంభాషణ " గా (2011) లో తీసుకువచ్చిన పుస్తకం అట్ట వెనుక 'వేమన వసంతలక్ష్మి' రాసిన మాటలవి. " నూరు పూలు వికసించనీ .. వేయి ఆలోచనలు సంఘర్శించనీ " అన్న సిద్ధాంత విశ్వాసానికి నిబద్దతే ఈ గ్రంధాన్ని చదవడం. 2-4-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAgpol

Posted by Katta

28, మార్చి 2014, శుక్రవారం

దాసరాజు రామారావు కవిత

|| గెలుపు పిలుపు || తెలంగాణ పేరొక కీర్తిపతాక – కల్లు సాక బోసి , ఊరి పోశవ్వ కు దిష్టి తీయాలె బొడ్రాయి చుట్టూ పొర్లుదండాలు తీసి మొక్కులు చెల్లించాలె చావిడి కాడ ఆలువా ఆడి కచేరీల కరణం పంతుల్తో పహాణి చౌపస్లాలో మన రాష్ట్రం పేరు రాయించాలె ముసలోల్ల కండ్లల్ల ముసిముసి నవ్వుల భవిష్యత్ చిత్రపటం ఆవిష్కరించాలె తెలంగాణ గెలిచిన నిరీక్షణ – వైతాళికుల నుడుగులను అడుగడుక్కి నాటుకోవాలె త్యాగాలను దిగుట్ల సందె దీపాల్లా వెలిగించుకోవాలె పోరాట రూపాలను కతలు కతలు గా చెప్పుకోవాలె వేరు తెలంగాణ సాధనాశూర – గోదావరికి మనవూరి చెరువు దారి చూపించాలె కళలు , సంస్కృతి వానాకాలం చదువులు కాకుండా చూడాలె పజ్జోన్నల చేల మీంచి పల్లెపదాల గాలులు తేలియాడుతూ రావాలె తుమ్మ శెల్క పడుగు పేర్చి , చెమ్మచెక్క ఆడాలె సాగరతీరం స్పురణ మూర్తుల స్మరణ కీర్తనల కేంద్రం కావాలె ‘జయ జయహే’ గీతానికి పట్టాభిషేకం జరుగాలె చెడి, బతుకబోయే బిడ్డ...తెలంగాణ – *** -దాసరాజు రామారావు, 28-03- 2014

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1rST7

Posted by Katta

21, మార్చి 2014, శుక్రవారం

దాసరాజు రామారావు కవిత

\\విబంధం\\ -డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి చందమామ ఇంటి మీంచే సాగిపోతుంటది మెర్క్యురీ బల్పునే జాబిలిగా విశదమవుతం ఆహ్లాదమై అంతరంగాన్ని తాకే వెన్నెలకు నో స్పేస్ సూర్యడు ఎప్పటిలాగే సంచరిస్తుంటడు పగలు కూడా నియోన్ లైట్‌నే సూర్యుడని మైమరుస్తం ఛాయ వెనుక నిలబడ్డ నిజానికి నో స్పేస్ పగళ్లు కదిలిపోతుంటవి రాత్రుళ్లు కరిగిపోతుంటవి ఇరు సంధ్యల రంగుల వాకిళులకు నోస్పేస్ వాన వచ్చి తడితడిగా పలకరిస్తుంటది చినుకు సోకకుంట కవచాలెన్నో కప్పుకుంటం అద్భుత పులకరింతకు నో స్పేస్ చెల్లె వచ్చి ముందు కూర్చుంటది చెలి ఎంతకూ వదలదు సెల్‌లో రాఖీలా వచ్చిన చెల్లెకు నో స్పేస్ కలబోసుకుందామని ఎప్పటి స్నేహితుడో కాల్ చేస్తుంటడు అంతర్జాల ఇంద్రజాల కిక్కుల చిక్కుకుంటం పక్కనే కలవరించే దోస్త్‌కు నో స్పేస్ ఎండ ఎదురొచ్చి చేతులు సాపుతుంటది కిరణాలు తాకకుంట చలువ తంత్రిణులు నులివెచ్చని స్పర్శకు నో స్పేస్ మాఘమాసం కౌగిలికై అల్లుకుంటది అలకో అహమో బ్లాంకెట్‌కటూ ఇటా బ్రాంకట్లు ఆది అనంత ఆత్మల ఐక్యతకు నో స్పేస్ అమ్మ నుంచి అనవరతంగా ఆ్తమ రింగవుతుంటది భార్య అనారబిటస్ మాల్ చెవిలో చేరదు ఆదుర్దాయై ప్రసరించే అమ్మ వాసనకు నో స్పేస్ బంధం ఒంటరి శిలాజమై పోయింది పురాశిల్పం కన్ను తెరిచి చూస్తున్నది -

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hLXLXX

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

దాసరాజు రామారావు కవిత

ప్రముఖ కవి నందిని సిధారెడ్డి ఇటీవలి తన అరవ కవితా సంపుటి " ఇక్కడి చెట్లగాలి " లోంచి ఒక కవితను చూడండి.... \\ తలంపు \\ ఈ లోపల పాట చెవిలో ప్రపంచ రహస్యం ఊదాలె పగలని గుండుకు తొలికొట్టి మందుగుండు పెట్టాలె అర్ధాంగీకారం అనిపించినా మౌనం కూడా వ్యూహమే కూలిపోతున్న ఊరి చెలిమెలో కూరిమి తోడాలె రాత్రిని వెలిగించేది సాహసం ఒక్కటే ఈ లోపల వలసపోయిన వసంత మేఘానికి ప్రేమలేఖ రాయాలె వట్టిపోయిన తరానికి మనిషిని కానుక ఇవ్వాలె స్వభావవిరుద్దమనిపించినా మౌనం కూడా వ్యక్తీకరణే ఈ లోపల కాలం కనురెప్పల మీద జీవితం రచించాలె తడి కోల్పోయిన ఆధిపత్యానికి గడియలు గణించాలె మౌనం నిరంతర దీక్ష తల ఎత్తితే కందిరీగలు తరుముతయి చావు ఒకటే వేలసార్లు వెంటబడుతది ఈ లోపల అక్షరానికి అంతరంగానికి సయోధ్య కుదుర్చాలె యుగానికీ యుద్దానికీ దారి వేయాలె ఈ లోపల గాలి రెక్కల మీద మనిషిని చేరుకోవాలె ఎవరికీ తలవంచని రేషం అద్ది పద్యం ఎగురవేయాలె .......15-03-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nsqg4l

Posted by Katta

14, మార్చి 2014, శుక్రవారం

దాసరాజు రామారావు కవిత

శ్రీ శ్రీ -" ప్రజ "- గ్రంధం నుండి మరికొన్ని ..... ----------------------------------------- 11. మీరు నిర్దేశించిన మరో ప్రప్రంచం స్వరూపం ఏమిటి ? * నిర్దేశించలేదు. ఇమజిన్ చేశాను. అప్పటికింకా నాకు రష్యావిప్లవం కూడా తెలిదు.సాహిత్యకారుల్లోంచి-ఫర్ ఇన్ స్టేన్స్ (గురజాడ గేయాలు, ఫ్రెంచి సింబలిస్టులు , ఫ్రెడరిక్ డెలిస్( వీళ్ళు కొంచెం ముందుకు పోయి చూశారు). అలాగే కవిత్వం ద్వారా నేను మరోప్రపంచం చూశాను. అదే సామ్యవాద ప్రపంచమని అప్పటికి తెలీదు.ఒక విధమైన సాంఘీకన్యాయమ్ లభించాలని, అన్యాయం ,అధర్మం,పోవాలని కోరుకున్నాను. ఈనాడు అదే మరింత స్పష్టంగా రష్యా, చైనా, క్యూబా దేశాల్లో కనిపిస్తోంది. నేను భావించిన మరో ప్రపంచం అదే. 12.మీలోని "నేను" గురించి (కవిత్వంలో) సాధ్యమైనంత వివరంగా చెప్పండి.? * చాలావరకు నా దృక్పధం నుంచే రాశాను. సబ్జెక్టివ్ పోయెట్రియే ఎక్కువ.ఆబ్జెక్టివ్గా రాసిన 'వెర్రివాడా కుర్రవాడా' , 'బిక్షువర్శీయసి ''లాంటివి తప్ప. ' నేను సైతం' కూడా సబ్జెక్టివ్ గా రాసినదే. 13. మీరు ఎన్నడూ మరిచిపోలేని , మీ మీద శాశ్వత ప్రభావం కలిగించిన గ్రంధాలేవి ? * ఒకటి యూలిసిస్( జేమ్స్ జాయిస్ రచన ), ఇంకొకటి లెనిన్ ( మయకొవస్కీ రచన ), మరొకటి కూడా చెప్పాలంటే గురజాడ వారి సమస్త సాహిత్యం. 14. కళ ప్రజల కోసమా ? విప్లవం కోసమా ? * ఈ రెంటికి వైరుద్యం లేదు. విప్లవ సాధనకు కళఒక ఆయుధంగా ఉపయోగపడాలి . అప్పుడే అది ప్రజాకళ అవుతుంది. కళాకారుడు విప్లవసాధన కోసం జరిగే మహోద్యమానికి తన కళను అంకితం చెయ్యాలి . అందుకోసమే దానిని వినియోగించాలి. అప్పుడే అది నిజమైన కళ అవుతుంది. 15.మీ రచనల్లో ఉత్తమంగా భావించే కవిత ఒకటి చెప్తారా ? * " కవితా ఓ కవితా! " కి ప్రథమస్థానం ఇస్తాను. అంటే మిగిలినవి నచ్చవని కాదు.జగన్నాథరథచక్రాలు, దేశచరిత్రలు ఇట్లా నాకు నచ్చినవి ఉన్నాయి. 16. మీరోసారి ధ్వనికవిత్వం కమ్యూనిజంలోనే సాధ్యం అన్నారు. వివరిస్తారా? * ధ్వని - కమ్యూనిజాన్ని ధ్వనిస్తేనే ధ్వనికవిత్వం అన్నాను. ఆనంద వర్దనాచార్యులేమన్నారంటే -వ్యంగ్యార్థం ఓటివుందనీ , కవి చెప్పిన దానికంటే గూడా అందులోంచి మనకి అవగాహన అయేటటు వంటిదే ధ్వని అంటారు.' రీతి ఆత్మస్యకావ్యం' అని ఒకడన్నాడు. ఇట్లాగ - ఔచిత్యం ముఖ్యమని క్షేమేంద్రుడు (11 వ శతాబ్దం -అభినవగుప్తుని శిష్య్డుడు.అలంకారికుడు ) రసచర్చ చేయడంలో ఎందఱో సంస్కృత అలంకారికులు చెప్పారు. వీటన్నిటిలోకి ధ్వనిమతం గొప్పది అంటారు. ధ్వని ఆంటే కవి చెప్పిన డానికంటే కూడా పాఠకుడు పీల్చుకునెదే గొప్పకవిత్వం.ధ్వని ప్రధానమైనదే కావ్యం అన్నారు. అలాగే మన రచనల్లో కమ్యునిజం ధ్వనిస్తేనే అది ధ్వని అని నేనన్నాను. 17.మీకు కవిత్వం రాయాలనే కోరిక ఎప్పుడు పుట్టింది? ఎందుకు పుట్టింది? * నాకు అక్షరాభ్యాసం జరగక ముందే మూడునాలుగేళ్ళ వయసులో చిత్రకారుడిగా నా ఆర్టిస్టిక్ జీవితం ప్రారంభమైంది .ఒక కుడ్య చిత్రకారుడిగా (mural painter) రంగు సుద్దలతో మా మేడ మీద గోడలనిండా బొమ్మలు గీసేవాణ్ణి. నాలో కళపై అభిరుచి ఆవిధంగా ప్రారంభమైంది. 18.1928 లో ' ప్రభవ' రాసేనాటి మీ మానసిక స్థితి ఏమిటి ? * నా 18 ఏట నేను ' ప్రభవ ' రాశాను. ఆ రోజులలో నాకు నా చుట్టూఒక సమాజముందన్నస్పృహ కూడా లేదు.నేను, నా బూర్జువా sorroundings మాత్రమే నాకు కనిపించాయి.అయినా మానసికంగా art for art's sake (కళ కోసమే కళ) వ్యక్తిని. అప్పటికి మాకు ఆస్తిపాస్తులుండేవి. భాధ్యతలెవీ ఉండేవి కావు. అందుకే సమాజాన్ని పట్టించుకునే అవసరం లేకపోయింది. 19. ' మహాప్రస్థానం ' మొదలైన అప్పటి మీ గీతాలకు నేపధ్యం గురించి , అంటే ఈ రకమైన స్పృహ మీలో కలగడానికి కారణమైన పరిస్థితుల గురించి వివరిస్తారా? * నేను 1928 లో కాలేజి చదువులకోసం విశాఖపట్నం నుండి మద్రాసు వెళ్ళాను. మా ఆర్థిక పరిస్థితులు దిగజారడం కూడాఅప్పటినుండీనే ప్రారంభమైంది. ప్రపంచమంతటా ఆకలిదప్పుల హాహా కారాలు వినిపిస్తున్నాయి . 1930 దశాభ్దాన్ని ఆకటి దశాబ్ధం (hungry thirties ) అంటారు. ఈ అన్నిటి ప్రభావ పలితంగానే ' మహాప్రస్తాన ' గేయాలు వచ్చాయి.అంటే , కుటుంబ ఆర్థిక పరిస్థితి, హంగ్రీ థర్టీస్ , నాకు అప్పుడు చదువుకోవడానికి లభ్యమైన సాహిత్యం , నిరుద్యోగ పట్టభద్రుడిగా వున్న చోట ఉండకుండా తిరిగిన తిరుగుడు నాలో సామాజిక స్పృహ కలిగించాయి. 20. యువకవులు, రచయితలకు మీ సందేశం ? * రచన అనేది ఒక కరదీపిక. అది ఎప్పుడూ వెలుగుతూ ఉండేటట్లు చూడాలి . దాని కాంతిని అది నలువైపులకు ప్రసరిస్తూ ఉండాలి. 14- 03 2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFszvN

Posted by Katta

6, మార్చి 2014, గురువారం

దాసరాజు రామారావు కవిత

శ్రీ శ్రీ ఒక ప్రయోగం,ఒక మలుపు,ఒక యోధా,మేధాక్షరం.అయన 'ప్రజ' నేలవిడిచి సాము చేయదు. సమాజాన్ని విడనాడదు. పద్యంలో 'ప్రాసక్రీడ' లా, గద్యంలో వాక్బాణం 'ప్రజ' అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఇవి హాస్యం, ప్రయోజనాల మేలు కలయిక. విజ్ఞాన వికాసాల మేళవింపు. సమాచారం, విశ్లేషణల సహజరూపం. మహాకవి శ్రీశ్రీ విశ్వరూపం 'ప్రజ'. ఇంతకూ ప్రజ అంటే ప్రశ్న జవాబులు .శ్రీశ్రీ సాహిత్యసర్వస్వం - 19, విరసం ప్రచురణ : డిసెంబర్ 1990.ఆ గ్రంధం లోంచి కొన్ని .................... 1.మీకు నచ్చిన కవి ఎవరు? * జపాన్ చక్రవర్తి . ఈయనఏడాదికో పద్యం రాస్తాడు .( జపాన్ చక్రవర్తి షోవా రాజవంశానికి చెందిన హిరోహిత ( 1901-89). రాజ్యాదినేతగా1926నుంచి చనిపోయేవరకు కొనసాగాడు .మంచి మెరైన్ బయలజిస్టు.గొప్పకవి). 2.మీరు రష్యాని ఎక్కువగా పొగడుతారు. ఎందుకు? * నాది భట్రాజు పొగడ్త కాదు. యాభై ఏళ్లకిందట ఇప్పుడు మన దేశంలో లాగే రష్యాలో దరిద్రం,అజ్ఞానం ,అనారోగ్యం తాండవిస్తూఉండేవి. ఈ స్వల్ప కాలంలో ప్రప్రంచం లోని అగ్రరాజ్యాలలో ఒకటిగా రష్యాదేశం మారింది. ఇందుకు కారణమేమిటో మిరే ఆలోచించుకోండి.ఇది మెచ్చుకోదగిన విషయం అవునో, కాదో మేరె తేల్చుకొండి. 3.మీరు దేవుణ్ణి నమ్ముతారా? * మానవుణ్ణి నమ్ముతాను. 4.రచయిత మానవ బలహీనతల్ని చిత్రించగలడు. కానీ అవే బలహీనతల్ని తనే ఎందుకు ప్రదర్శిస్తుంటాడు ? * రచయితకూడా మానవుడే కాబట్టి. 5.కవిత్వానికి ఏది గీటురాయి ? * జ్ఞాపకం వుండేది కవిత్వం. మరచిపోయేది కవిత్వం కాదు.ఈ అభిప్రాయం చెళ్ళపిళ్ళ వరూ అన్నారు. అంతకుముందు అల్లసాని పెద్దన కూడా "రాతిరియున్ పవల్ మరపురాని హొయల్ " అని అన్నాడు. 6. యువరచయితలకు ప్రాచీనసాహిత్య అధ్యయనం అవసరమా ? * పాట కవిత్వం ఎందుకు చదవాలంటే అది ఇపుడు ఎందుకు వ్రాయ కూడదో (why not to write) తెలుసుకోవడానికి . 7.జనసామాన్యాన్ని కవిత్వంతో మార్చవచ్చునంటారా ? * ఇది కొంచెం గడ్డుప్రశ్నే . జన సామాన్యానికి ఇది ఎంత చేరువలో వుంటుంది అన్నదానిపై ఆధారపడివుంటుంది.మనకి ముప్పూటలు కాదు. రెండు పూటలు కూడా తిండి దొరకడం లేదు. జనసామాన్యం కవిత్వాన్ని భోగ ద్రవ్యం గానే చూస్తున్నర. మినిమం అవసరాలు తీరాకనే కవిత్వం . మయకోవస్కి కవిత్వాన్ని ఇరవై ఏళ్ళ కిందటికన్నా ఇప్పుడు ప్రజలు ఎక్కువ ఆస్వాదిస్తున్నారు .ప్రజలలో కవిత్వాభిరుచి ని పోషించుకుంటూ రావాలి. 8. ఈనాడు సాహిత్యానికి రాజకీయాలకి వున్నదూరమెంత ? * ఇదివరకు మైళ్ళలెక్కన వుండేది. ఇప్పుడు సెంటిమీటర్లలో కొచ్చింది.రాజకీయ దృక్పధం సరిగా లేనివాడు సాహిత్యంలో రాణించలేని స్థితి వచ్చింది. 9. మహాకావ్యం ఎప్పుడొస్తుంది ? * అసాధ్యాన్ని సాధించడానికి మార్గాలు అన్వేషిస్తున్నప్పుడు కళాశీలి అనుభవించే అశాంతి లోనే మహాకావ్యం ఆవిర్భవిస్తుంది. 10. మీ కవిత్వానికి marxism కు సంభందం ఏమిటి ? * " మహాప్రస్థానం " అన్న గీతం రాసేనాటికి నాకు marxism ను గూర్చి తెలియనే తెలియదు. నేను marxism ను తెలుసుకున్నది సాహిత్యం ద్వారానే గని రాజకీయాల ద్వారా కాదు. 5-3-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7mRqs

Posted by Katta

4, మార్చి 2014, మంగళవారం

దాసరాజు రామారావు కవిత

|| కవిత్వం విందాం....కవిత్వం చదువుదాం ...|| ----------------------------------------------------------------------------- 60 ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణా రాష్ట్రం సాధించుకున్న విజయోత్సవ సందర్భంలో భాగంగా *తెలంగాణ కవిత్వోత్సవం * ప్రముఖ కవులతో .... తేది: 7-3-2014 ( శుక్రవారం ), సాయంత్రం: 5-30 కు , రామచంద్రాపురం మండలంలోని ' మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరం' ( బీరంగూడ కమాన్ దగ్గర ) లో డా.కాంచనపల్లి ( ప్రముఖ కవి ) అధ్యక్షతన , ఏనుగు నరసింహారెడ్డి ( ప్రముఖ కవి ) ముఖ్య అతిథిగా, దేశపతి శ్రీనివాస్( ప్రముఖ కవి , గాయకులు ) ఆత్మీయ అతిథి గా సభ ఏర్పాటు చేయనైనది తప్పక రండి. ...... ఆహ్వానితులు .... తెలంగాణ సాహిత్య సమాఖ్య , హైదరాబాద్ కవుల వేదిక

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fECYJ1

Posted by Katta