పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Pusyami Sagar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pusyami Sagar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జూన్ 2014, శనివారం

Pusyami Sagar కవిత

చేతులు ... _____ Pusyami Sagar అవును అవే చేతులు .. అకుంటిత దీక్షతో పని చేస్తూ .., నాలుగు వ్రేళ్ళు నోట్లో పోవటానికి నువ్వు వదిలేసిన ఆశుద్ధాన్ని ఎత్తి పడేస్తున్న శ్రామిక చేతులు ...!!! సాధికారత మైకుల్లో ఉధరగొడుతు . పెంట కుప్పలలో పడి దొర్లుతున్నప్పుడు స్వేచ్చ ని వదిలేసి తట్టలు ఎత్తిన చేతులు ...!!! అక్షరాలని పోగేసుకొని కూడా నిలదీయలేని చేవ చచ్చిన చేతులవి .. రేపంటే ఏంటో తెలియక ... నీచే నిత్యం చీదరింపుల పర్వం లో తడుస్తూ సమాజం ఉమ్ముల్ని తుడిచేసుకుంటున్న గొప్ప సహనం కలవి !! నింగికి నిచ్చేనలేసే కాలం లో కూడా బతుకు గడపను పట్టుకొని నడవలేకపోతున్నాయి !!!! ఏ దేవుడు వీరిని నడిపిస్తాడో ...ఆశగా కళ్ళలో కి తొంగి చూస్తున్నాయి ఆ చేతులు ..!!! 21JUne14

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ijgSy9

Posted by Katta

16, జూన్ 2014, సోమవారం

Pusyami Sagar కవిత

వర్ణ చిత్రం ________పుష్యమి సాగర్ దేవుడు ఎదురు చూపు మంత్రం .. కడుపు ఏడుస్తుంది !! వాగ్దేవి లక్ష్మి దూరమే అగ్ర వర్ణం కదా...!! దేశం రాజకీయం వెనుకబాటు మరో 1000 ఏళ్ళు అయినా...!!!... జూన్ 16, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qVSZfY

Posted by Katta

13, జూన్ 2014, శుక్రవారం

Pusyami Sagar కవిత

ఫలితం ______పుష్యమి సాగర్ చీకటి తప్పు ములాఖత్ !! ఆకాశం వర్షం గుడిసె నుంచి ఏడుపు ..!!!! వందలు వేలు పుట్టెడు చీమల్లా !! దేవుడు వదిలేసిన పిచ్చి మొక్కలు లెక్కలేనన్ని దేశం లో !! జూన్ 13, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SGpq5S

Posted by Katta

12, జూన్ 2014, గురువారం

Pusyami Sagar కవిత

వెలిసిన చిత్రం ________ పుష్యమి సాగర్ సూరీడు కాన్వాసు రోడ్డు పై దేవుళ్ళ నృత్యం !! కాసుల గల గలలు కలలు కనే పిచ్చి కళ్ళు ..!! తెగిపడిన కాళ్ళు నరకబడ్డ ఆలోచన బతుకు చిత్రం రంగుల లో ....!! జూన్ 12, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iqE87P

Posted by Katta

9, జూన్ 2014, సోమవారం

Pusyami Sagar కవిత

!!స్వగతం !! _____పుష్యమి సాగర్ ఆ రోడ్డు నలు దిక్కులను కలిపే వారధి ... ఎన్ని వేల చెమట చుక్కల పన్నీరు ను మట్టి లో కలుపుకొని చాపగా పర్చుకున్నదో మరి !!! ఇప్పుడంటే నల్లటి తారు ను దుప్పటి గా కప్పుకొని దర్జాగా కాలాలను తమ పై వర్షించుకుంటుంది కాని ఒకప్పుడు పచ్చని నందనవనాలకి ప్రతీకలు మొదలుకంటా నరకబడ్డ చెట్ల పునాదులపై నాగరికతని శాఖోప శాఖలు గా విస్తరించారు కదా!! ఎన్ని కొత్త జంటలు తమ కలలని చిదిమేసుకొని వాహనాలకు బలి అవ్వలేదు చెప్పు ...!! రేపటికి పునాదులవ్వాల్సిన విద్యార్ధులు నింగికెగసిన రాకెట్టు లా దూసుకెళ్ళి కోడగోట్టిన దీపం లా సగం లో నే తమ ప్రయాణం ముగించలేదు ....!! వాగ్దానాలలో చిందర వందర గా తమ బతుకులను ముక్కలు చేసుకుంటూ కూడా ఇప్పటికి ఎన్ని ఉళ్లు తమ రాక కోసం కళ్ళలో కాయలు కాసాయో ఎవరికైన తెలుసా ...!!! అభివృద్ధి అడవులను మింగేస్తూ కొత్త దారేదో మొలకేత్తినపుడు మనకు మరో అవకాశం లేదు .... పుట్టే దగ్గరనుంచి చచ్చే దాకా... చచ్చుకుంటూ ఆ దారంట వెళ్ళాల్సిందే !!!... జూన్ 9, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ss5S58

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Pusyami Sagar కవిత

చీకటి జ్ఞాపకం _________పుష్యమి సాగర్ చీకటిని చీల్చాలని కొన్ని మిణుగురులేవో సంగీతాన్ని మోస్తూ గాలిలో వాయులీనం గా గానాలు .. నా ఆలోచనలో కలిసిపోతు సిమ్మట పురుగు లు ట్యూబ్ లైట్ కాంతి లో పరావర్తనం చెందుతూ ...ఆత్మ హత్య చేసుకుంటాయి ...!!! దూరము గా ఎక్కడో సిలోన్ రేడియో నుంచి పాటలు నేను నా మనసు పయనిస్తూనే ఉంటాం.... ఆకాశం లో మేఘం లా..!!! గాలికి కొట్టుకొచ్చిన గతమేదో ..వీపు చరిచి రెండు చుక్కలను చెంపల నుంచి జారి పరుగు తీసింది గుండెలోకి ..!!! ఇప్పుడు మాటలు మౌన ముద్ర దాల్చి తపస్సు చేసుకుంటాయి ...!!! నిశ్చలమైన సరస్సులా..... ఎన్ని జ్ఞాపకాలు నా కళ్ళ నుంచి జారి పడిపోలేదు .. ఎన్నని లెక్కపెట్టేది అనుభవాల కొస అంచున జీవితాన్ని ఉరి తీసినపుడు ... శరీరం ...ఆత్మ మాత్రం ఎందుకు కలిసి ఉండాలి ...? రెండు విడిపోవటం కోసం ఒక్కటి గా ఎదురు చూస్తున్నాను ...!!! జూన్ 8, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TugO3d

Posted by Katta

5, జూన్ 2014, గురువారం

Pusyami Sagar కవిత

పాశం _____పుష్యమి సాగర్ కన్నా.... నువ్వు కాళ్ళ తో తంతు అమ్మ గర్బం నుంచి భూమికి గెంతినపుడే నేను మరల పుట్టాను ఏమో ..! నా మోము లో వెయ్యి వాల్టు బుల్బుల వెలుగులు ... నీ అల్లర్లు నన్ను నడి వీధి లో నిలబెట్టినా కూడ నాకెప్పుడు ముద్దు గానే ఉండేవి నువ్వు నడక ను ఓనమాలు గా దిద్దినపుడు చదువుల తల్లి ఉయ్యాలలో ఉగుతున్నప్పుడు నువ్వు నడిచే దారంతా మల్లెల్లు కావాలని , కోసుల దూరలైన నా కాళ్ళ లో కి నదులై ప్రవహించేవి ...!! అక్షరాలు నీలోంచి నడిచి ప్రపంచపు పటము లో గుర్తులైనపుడు , విను వీధి లో నీ పేరు నలు దిశల మొగుతున్నప్పుడు నేను విహంగాన్ని ...ఆకాశమంతా చుట్టి వచ్చాను !!!.. నా నుంచి విడిపోయి మరొకరి గుండె లో నువ్వు నివసిస్తున్నప్పుడు కూడా ప్రేమ నే తాగాను , నువ్వు పంచి ఇచ్చిన జ్ఞాపక అమృతం తో ...! నీ ప్రయాణం సాఫీ గా సాగాలని నా కల ల మేడలన్ని కూల్చేసి నీకు పునాది అయ్యాను ....!! కాని కన్నా ..!! ఎదిగి వచ్చిన నీ పెద్దరికం కంటి తుడుపు మాటల వలయం లో నేను గిల గిల కొట్టుకుంటున్నప్పుడు నువ్వే లోకమని భావించిన నాకు ఏమి కాకుండా దూరంగా నెట్టబడుతున్నాను !! రాత్రింబవళ్ళు నిద్రలని కొండ ఎక్కించి నిన్ను ఎవరికి అందనంత ఎత్తున కూర్చోబెట్టాను నీ నీడ ను కూడా నాలో కలుపుకొని కను రెప్పలు మూయక నా వీపు పై మోసాను కదా... నా మనసు లో సముద్రాన్ని ధారపోసినా కూడా, ...గుప్పెడు ప్రేమ ని బిక్షం గా వెయ్యలేకపోయావా బిడ్డ...!! నీ సుఖాల కోసం నేను రెక్కలు తెగిన పక్షి లా మారినా కూడా ఈ కన్న తండ్రి పై నీకు ప్రేమ కలగలేద కన్నయ ... నువ్వు ఆర్తి గా పిలిచే !!నాన్న !! పిలుపు కోసం ఈ కట్టే కాలే దాక ఎదురు చూస్తూనే ఉంటుంది మై సన్ ....!!! లవ్ యు .. జూన్ 05, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tLwPwA

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

Pusyami Sagar కవిత

Si RA గారు రాసిన కవిత // చరిత్ర పుస్తకం ! కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ చరిత్ర లో జరిగిన ఘటనలు కు అక్షర రూపం ఇచ్చి పుస్తకం గా మలిచి దాచుకోవడం పురాతన కాలం నుంచి వస్తున్నదే ...SI Ra గారు బహుశ చరిత్ర లోని ఘటనల సమూహం నుంచి పయనిస్తూ ...తను నిజంగా అక్కడ జరిగిన ఘటనలకి సాక్షీభూతం గా నిలిచారు అనే ఆలోచనలో నే మనకు తనలో ఉన్న భావాన్ని చెప్పారు . పుస్తకం అంటే అందరికి అక్షరాలే కనిపిస్తాయి, కాని కవి గుండె నుంచి రక్తం గా మారి కాలువలై ప్రవహించాయి ..గత చరిత్ర పుస్తకం ఒక నడిచే మనిషి లా ఉహించి కవిత వస్తువు ని నడిపించటం బాగుంది .అందుకే ఒక చోట .... //ఆ పుస్తకంలో నీకు అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయెమొ//నాకు రక్త కాలువలు కనిపిస్తున్నాయ్! ఆ పుస్తకంలో నీకు కాగితాలు మాత్రమే కనిపిస్తున్నాయెమొ..నాకు జీవం ఉన్న అవయవాలు కనిపిస్తున్నాయ్! /// మామూలు గా చూస్తే అందరికి అవి కేవలం రాతలే ....కాని ప్రభుత్వాలను మార్చేసిన విప్లవ పంధా కలిగిన పదునెక్కిన భావాలతో నిండి ఉన్నాయి ...అవి సజీవం గా నిలిచిఉన్న అవయవాలే ....నా మనసు లో అంటూ తన ఉద్దేశం లో చరిత్ర పుస్తకానికి ఉన్న ప్రాధాన్యత ని సూటి గ చెప్పారు . రచయతల కి ముఖ్యం గా విప్లవ రచనల ద్వారా చైతన్యాన్ని రగిలించి ...తద్వారా స్వేచ్చా ప్రపంచాన్ని చూడాలన్న ఆకాంక్ష ని కవి ఈ పుస్తకం లో చూడగలిగారు .. ఒక్కో అక్షరం కత్తులు గా, వ్యాసం రాసినపుడు తెగ నరకడానికి వచ్చిన ఆయుధాలకు సిద్ధం గ తల ఒగ్గుతూ ఉంటాయి ఇందులో ని ప్రతి ఒక్క విషయము, హక్కుల ను సాదించు కోవటానికి పడిన తపనలను పుస్తకం లో చూసాను ..అంటారు ... !ప్రతి వాక్యం చివర, ఫిరంగి పేలిన శబ్ధం //ప్రతి వ్యాసం తర్వాత, తలలు తెగిపడుతున్న చెప్పుడు.!! కవిత శైలి బిన్నం గా సాగుతుంది ....ప్రతి లైన్ లో లోకం చూసిన విధానానికి ...తన మనసు లో కలిగిన భావాలకి పొంతన కుదరక తనే అసలు ఆ చరిత్ర లో దాగి ఉన్న నిజాలను వెలికి తీసారు .. చరిత్ర పుస్తకం చదవటం అంతా చదివాక తనకు అందులో ఒక విప్లకారుని కల కన్పించిది ...నిజమే ఒక రక్తసిక్త మైన చరిత్ర ని చదివాక అలాంటి అభిప్రాయం కలగడం సహజమే.. !!ఒక సారి పుస్తకం అంతా అల తిప్పి చూస్తే తుపాకి కంటి తో స్వప్నించె విప్లవకారుడి పలకరింపు.!! పుస్తకం చరిత్ర రెండు వేరు కావు, మనిషి దేహం లా నే విసిరివేయ బడ్డాయి ...తను భయం తో దూరం గా పడేస్తే మాంసపు ముద్ద లా అనిపించిది .అంటారు కవిత శైలి ..ఎంచుకున్న వస్తువు కొత్త గా ఉన్నదీ ...చరిత్ర ని అక్షరాలూ గా బందించిన పుస్తకాన్ని మనిషి ఆలోచన తో ముడిపెట్టి ...ముందుకు నడిపించిన ఆవేశాన్ని చైతన్యాన్ని ..., అందులో ని సారాంశాన్ని నిజ జీవితపు ఘటనల తో పదును గా వ్యక్తీకరణ చేసారు ...లోకానికి అది మాములు పుస్తకమే అయిన తన దృష్టి లో అది జీవితానికి ఒక లెసన్ ..కదా...! మంచి కవిత ను అందించిన SI Ra గారికి అబినవందనలు, కాకపోతే .విషయాన్ని వాక్యాలు గా రాసి వుంటే చదువరి కి ఇంకా సులభం గా ఉండేది ....అలాగే అక్కడ అక్కడ అక్షర దోషాలను సవరించుకుంటే బాగుంటుంది ... మంచి సందేశాత్మక కవితలు రాస్తూ ముందు కు వెళ్ళాలని ఆసిస్తూ .. సెలవు ... పుష్యమి సాగర్.. Si Ra// చరిత్ర పుస్తకం // 3-6-2014 ఆ పుస్తకంలో నీకు అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయెమొ నాకు రక్త కాలువలు కనిపిస్తున్నాయ్! ఆ పుస్తకంలో నీకు కాగితాలు మాత్రమే కనిపిస్తున్నాయెమొ నాకు జీవం ఉన్న అవయవాలు కనిపిస్తున్నాయ్! పేజీలు తిప్పుతుంతె, అర్థనాదాలు వినిపిస్తున్నయ్ ఎక్కడ చూసినా, యుద్దాలు, చీలుతున్న దేహాలు కేకలు, తెగిపడుతున్న చేతులు, చిద్రమౌతున్న నాగరికతలు ప్రతి అక్షరం లో రెండు కత్తులు రాజుకుంటున్న ధ్వని ప్రతి వాక్యం చివర, ఫిరంగి పేలిన శబ్ధం ప్రతి వ్యాసం తర్వాత, తలలు తెగిపడుతున్న చెప్పుడు. సరే అని కొంచం చుట్టు పక్కల చూస్తే యెగరేసిన జండాలు, కాలిపొతున్న దెహాలు దండయాత్రకి బయలుదెరుతున్న సైన్యాలు. గాలి పీల్చుకుంటే, గన్ పవ్డర్ వాసన ఒక సారి పుస్తకం అంతా అల తిప్పి చూస్తే తుపాకి కంటి తో స్వప్నించె విప్లవకారుడి పలకరింపు. భయం వెసి పుస్తకాన్ని దూరంగ విసిరేస్తే అది మాంసపు ముక్క అని ఒక డెగ దాన్ని ఎత్తుకెలిపొయింది. జూన్ 04 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ueULuA

Posted by Katta

29, మే 2014, గురువారం

Pusyami Sagar కవిత

ప్రయాణం _________పుష్యమి సాగర్ ఒక సాయంత్రం కరువుఅయిన శాంతి కోసమో ఏమో , సమాంతర పట్టాల నుంచి ముందుకు ఉరుకుతూ దూకుతున్న రైలు పెట్టె లో నన్ను నేను ఓ మూల గా కుక్కుకొని కూర్చున్నాను ... ఉపిరి ని కాస్త వదిలి నలు దిక్కులా చూసాను గాలిని మింగి కాస్త సేద తీరుదామని నన్ను అమాంతంగా కబళించిన బడుగు జీవులు కళ్ళలో దైన్యం , .ఒంటి కాలు పై తపస్సు ఓటేసిన పాపానికి ఫలితం కాబోలు ...!!! యాతనల వంతెనల నుంచి వడి వడి గా అడుగులేస్తూ ...ఒక్కరికి తీరిక లేదు... అప్పుడు అప్పుడు సజీవ బతుకు చిత్రాలు రంగులేసుకుంటూ మొహం పై చల్లి వెళ్తున్నాయి మలి దశ లో కొడుకు లు ఉమ్మేసిన తండ్రి నడుము వంగి అడుక్కుంటూ త్వరగా మరణపు అంచులను తాకాలని తహ తహ పడుతున్నాడు ...!! మరో గుడ్డి తమ్ముడు పెదాలపై కనిపించని దేవుడి ని తలచుకుంటూ పొట్ట నింపుకునే ప్రయత్నం లో సూటి పోటీ బాణాలు తుడిచేసుకుంటూ అంగీ లో వేసుకుంటున్న దృశ్యాలు !!!! ఇక చాలీ చాలని దుస్తులతో తమ శరీరాన్నే కాదు మనసు ని కప్పుకోలేక ఆకలి తో ఆక్రమించే పులుల మధ్య లో ఆడతనం బేల గా గుక్కపట్టి ఏడుస్తుంది ...!!! ఇలా చిద్రమైన బతుకుల నుంచి పయనిస్తూనే ఉన్నదీ .. తన గమ్యం ఎక్కడో తెలియని ఓ రైలు ...! మే 29, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mKq8tL

Posted by Katta

27, మే 2014, మంగళవారం

Pusyami Sagar కవిత

పనసకర్ల ప్రకాష్ గారు రాసిన కవిత !!చావు తరువాత !!//కవిత్వ విశ్లేషణ// _______పుష్యమి సాగర్. చావు అంటే శరీరంలోనుంచి జీవుడు పైకి పోవుట అని అర్ధం చెప్పబడింది ...పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది చావు లేదా మరణం (Death). తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. దీనిని సంస్కృతంలో మృతి లేదా మృత్యువు అని అంటారు.. మృత్యువు గురించి తాత్వికంగా చెప్పటం అంటే కొంచం కష్టమే...చావు తర్వాత కవిత లో కొన్ని నిజాలు ను చెప్పి జ్ఞాన భోధ కలిగించేలా మనసు ను తాకుతాయి ...నిజంగా చావు అంటే ప్రతి వారికి ఎందుకు భయం కలగాలి , చావు అంటే ఉదయం నుంచి సాయంత్ర్హం వరకు ఆడుకునే ఒక ఆట లాంటిది కదా....నిజమే జీవితం లో ఎవరు గుర్తు చేసుకోరు వచ్చే చావు కోసం... చావంటే ఏంటి ...? పురాతనకాలం నుంచి చెప్తారు మరణం మనిషికే కాని ఆత్మ కి కాదు ...ఇది ఒక దేహం నుంచి మరో దేహానికి విడిచి వెళ్ళే వాహకమే ..ఒకే ఒక వాక్యం లో చక్కగా చెప్పారు ... !! చావ౦టే ఏ౦టి..?//రూపాన్ని మార్చుకోడమేకదా..! నీడలా వెంట వచ్చి తీసుకు పోయేది చావే కదా ...మరి దానితో దోబూచులాట ఎందుకు ..ఇక్కడ చావు ను ఒక ఆట తో పోల్చడం బాగుంది ..పుట్టుక నుంచి చావు ..రోజు లో ఉదయం నుంచి సాయం వరకు ఆడే ఆట లాంటిదే మరి నీడై వె౦బడి౦చే చావుతో ఎన్నాళ్ళు//నీ దోబూచులు.../రాత్రైతే ఆట ముగిసిపోవాల్సి౦దే సహజ మరణం రావాలని అది కూడా సౌఖ్యం గా ఉండాలని కోరుకుంటారు ...కాని ఇక్కడ మన చావు కి మనమే దారులు వేస్తున్నాము ...చెడు అలవాట్ల తో .చెడు ఆలోచనలతో ..నిజమే మరి మన శరీరాఇనికి హానికరం అపాయకరమైన అలవాట్ల తో నే సగం చస్తున్నాం ... మన గోతుల్ని మన౦ ఎప్పుడో తవ్వుకునే ఉ౦టా౦ చెడు అలవాట్లతోనో చెడ్డ ఆలోచనలతోనో// చావు తరువాత ???....భూమి లో మన దేహం కప్పుబడ్డాక మొక్క లా తిరిగి మరల చిగురిస్తాం కదా...అంటే చావు కు ముందు మంచి జీవితం గడిపి నలుగురికి ఆదర్శ ప్రాయం గ నడుచుకోమని అర్థం.... మట్టిలోకి విత్తనమై మళ్ళీ చేరుకునే ము౦దు/// అన్ని కాలాలపాటూ నువ్వో పచ్చని జ్ఞాపకానివై ఈ లోక౦లో బతికే ఉ౦టావ్...... అన్ని కాలల లో నువ్వు పచ్చని చెట్టయి బతికే ఉంటావు ....చావు తర్వాత మిగిలేవి మంచి పేరే .....శాశ్వత మైన ధీ పేరు మాత్రమే ..సంపద కాదు అని చక్కగా చెప్పి ముగించారు ...ప్రకాష్ గారు ... తాత్వికత తో మంచి కవిత ను అందించిన ప్రకాష్ గారికి అబినందనలు ... \=============== "ఒక చావు తరవాత" వస్తే రానీ చీకటిని నేను మాత్ర౦ వెలుగుతూనే ఉ౦టాను చీకటిలోకి వెళ్ళేవరకూ..... చావ౦టే ఏ౦టి..? రూపాన్ని మార్చుకోడమేకదా..! ఊరికినే ఏడవకు ఎవరో సచ్చినట్టు కన్నీళ్ళు బుగ్గమీద‌ అమ్మ పెట్టిన తీపి ముద్దు గురుతుల్ని ఊరికే చెరిపేసి పోతాయ్ నీడై వె౦బడి౦చే చావుతో ఎన్నాళ్ళు నీ దోబూచులు... రాత్రైతే ఆట ముగిసిపోవాల్సి౦దే శాశ్వత౦కాని జీవితాన్ని మలుచుకోవాల్సి౦ది అ౦ద౦గా కాదు హు౦దాగా మన గోతుల్ని మన౦ ఎప్పుడో తవ్వుకునే ఉ౦టా౦ చెడు అలవాట్లతోనో చెడ్డ ఆలోచనలతోనో మన౦ ఇప్పుడు అటువైపే నడుస్తున్నా౦ మట్టిలోకి విత్తనమై మళ్ళీ చేరుకునే ము౦దు ఎన్ని గు౦డెలు నీ ఊపిరై కొట్టుకు౦టున్నాయో చూసుకో..... అన్ని కాలాలపాటూ నువ్వో పచ్చని జ్ఞాపకానివై ఈ లోక౦లో బతికే ఉ౦టావ్...... పనసకర్ల ప్రకాష్ 05/27/2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mlLAng

Posted by Katta

20, మే 2014, మంగళవారం

Pusyami Sagar కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె రాసిన కవిత !!ఖాళీ భూమి!!//కవిత్వ విశ్లేషణ// _______పుష్యమి సాగర్. ప్రపంచం కుగ్రామం అంటాము కదా మరి ఇంత పెద్ద విశాల భూమి లో చుట్టూ మనుషులు ఉన్న కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఉన్నప్పుడు !మనిషి ! సామాజిక జీవి అన్న దానికి అర్థం లేకుండా పోతుంది ఏమో...!!! S.v.k గారు తీసుకున్న వస్తువు కూడా మనిషి కి మనిషి కి పెరిగి పోయిన దూరాన్ని కొలిచే ప్రయత్నం చేసారు లా ఉన్నదీ ...ఓ చోట ఇలా అంటారు ...!!! ఒంటరి //యెవరికివారు; //గింజలు బుక్కు //సమయమే //ఉమ్మడి జాగ్రత్త గా గమనించండి ...ఆధునిక నాగరికత అని మనం మురిసిపోతున్నాం మనుషులు కలిసారు కాని, మనసు లు కలిసాయా ???? ఒకే కుటుంబం లో ఉన్న కూడా ఎవరికి వారే ...బువ్వ తినే ఆ రెండు క్షణాలు తప్ప , మనం ఎపుడైనా కలుసుకున్నామా !! మనిషి ని ముఖ్యం గా రెండు విషయాలు బాధిస్తాయి ....ఘటన జరిగినపుడు పుట్టిన వేదన .....మరి గడిచిన గతాన్ని తవ్వుకుంటూ కన్నీళ్లను కార్చినపుడు, నిజంగా మన చేతుల్లో గతాన్ని చెరిపి వెయ్యగల పరికరం ఏమన్నా ఉంటె బాగుండు కదా.... "కొన్ని తవ్వకాల అనంతరం //వెలువడు //జ్ఞాపకం పై పడు కన్నీరు బిందువులు-" ఇప్పుడున్న ప్రపంచం లో సర్వం స్వార్థం అయినపుడు, సమూహాలకు సమాధి కట్టేశారు ..... కేవలం ఇక్కడ మనిషి కి మరో మనిషి కి బందం ఏమన్నా ఉంది అంటే కేవలం పరిచయమే.... //మనిషి మనిషీ పరిచయం అంతే యిప్పుడు-// యెవరివ్వారివే మూకుమ్మడి //సంతలో //బేరాలు- పై వాక్యం లో చూడండి ...మనిషి తన కు కావలసిన వ్యక్తిగత అవసరం చూసుకుంటున్నాడు తప్ప పక్కనోడి గురించి పట్టించుకోవటం లేదు ఎవరికి వారె ...సంత లో ...బేరాలు లాగానే ...!!! మరి ముందుగా చెప్పుకునట్టు గా మనుషులలో పెరిగిపోయన స్వార్ధం వలన ఎవరి ప్రయోజనం వారే చూసుకోవాలి , ఈ కవి నిజంగా ప్రపంచం లో నిజమైన నికార్సనైన మనుషుల కోసం ..మనుసుల కోసం వెతుకుతున్నాడు ...మార్మికత పూర్తిగా నిండిన ఈ రచన లో కొన్ని బావ చిత్రాలను మనమే ఉహించుకొని ఆకళింపు చేసుకుంటే కవి చెప్పదలచుకున్న భావం చక్కగా అవగతం అవుతుంది ...మనుషుల్లో పెరిగిపోతున్న ఏకాంత , ఒంటరి సమూహాలను తరమి కొట్టి ..మనుషులు గా మసిలే రోజు కోసం ఎదురు చూడటం బాగుంది ... కవిత ను ఇంకాస్త సరళం గా రాసి ఉంటె పాఠకుడు ఏ స్థాయి వాడు అయిన త్వరగా ఆకళింపు చేసుకొనుటకు వీలు గా ఉంటుంది ..SVK గారు మంచి expression ఉన్న రచన ను అందించారు..కాస్త సమాజ పరంగా కూడా వారి కలాన్ని మరలించితే బాగుంటుంది ...ధన్యవాదాలు ... సెలవు .. •• ఖాళీ భూమి •• దేహంపై పురాతన మనిషి పచ్చబొట్టు- కాలంపై సందేహం మరక గుర్తు- ••• కొన్ని తవ్వకాల అనంతరం వెలువడు జ్ఞాపకం పై పడు కన్నీరు బిందువులు- కోల్పోవుతనం శ్వాస- "చట్లు సమస్తం నరకబడు కల బాధ చేయదు-" ఒంటరి యెవరికివారు; గింజలు బుక్కు సమయమే ఉమ్మడి చర్య- మాయలు చేయు యుగం సమాధి- మనిషి మనిషీ పరిచయం అంతే యిప్పుడు- ••• యెవరివ్వారివే మూకుమ్మడి సంతలో బేరాలు- 05/21/2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gj3Dfy

Posted by Katta

13, మే 2014, మంగళవారం

Pusyami Sagar కవిత

కొండవీటి సత్యవతి గారు రాసిన కవిత //తల్లుల రోజట....అహా ఆహా హా//కవిత్వ విశ్లేషణ _______పుష్యమి సాగర్... తర తరాల పోరాట ఫలితం గా స్వాతంత్ర్యం తెచ్చుకొని స్వేచ్చ ని అనుభవిస్తున్న కూడా ఇంకా మన మనసు బానిస భావజాలాన్ని వదిలించు కోలేక పోతుంది, మనది కాని నాగరికత ని, అలవాటు లేని దినాలని నెత్తి కి ఎక్కించుకొని చిందులు వేస్తున్నాము ....ప్రపంచం కుగ్రామం గా మారినపుడు అందులో ప్రతి దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం బాగానే ఉంది , కాని ఒక జన్మనిచ్చిన మాత కి ప్రత్యెక రోజు అని పెట్టి పూజించడం, ఎంత వరకు సబబు ...పురాతన కాలం నుంచి అమ్మ ను కోలుస్తునే ఉన్నాం మరి ఇవ్వాళ ప్రత్యేకం గా ఒక రోజు పెట్టాల్సిన అవసరం ఏమిటి ...?...ఇదే విషయాన్ని సత్యవతి గారు తమ రచన లో నిరసిస్తూనే సగటు గృహిణి గా ఎన్ని విధులను ఎన్ని రకాలు గా నిర్వహిస్తున్నదో చెప్పే ప్రయత్నం చేసారు .. ఎంచుకున్న కవితా వస్తువు సమకాలపు అసమానత కు , దోచుకోబడుతున్న శ్రమ విలువ ని ఎండ గడుతున్నారు. మొత్తం కవిత లో మూడు అంశాలను వెలికి తీస్తాను ....ముందు గా అమ్మ ని ఎలా చూస్తున్నాము, మనకు తెలిసిన అర్థం లో , కాని వాస్తవం గా అమ్మ స్థానం ఏమిటి, ....రెండవది శ్రమ దోపిడీ ...గృహస్తాశ్రమం లో భార్య ..మాత పాత్ర ఎనలేనిది, అలాంటి అమ్మ ను నేడు మనం వస్తువు గా యంత్రం గా మార్చేసాము ..మూడవది ...అందరికి అన్ని ఇచ్చి తానూ మాత్రం ఏమి ఆశించకుండా విశ్వజనీనమైన ప్రేమ ని పంచె అమృతం లాంటిది .. అమ్మ ఒక నిశ్శబ్ద గీతమని //పగలు రేయి తేడా తెలియని//పనుల వలయంలో //అమ్మొక తిరగలి, అమ్మొక చీపురు అమ్మొక చేట, అమ్మొక గాస్ స్టవ్ ... పై వాక్యాలలో ఒక బానిస భావజాలానికి ప్రతిక లా గా నే కనిపిస్తుంది ...కాని అమ్మ ప్రేమ .వాటిని అధిగమించి తన వాళ్ళ కోసం కరిగి పోతుంది మరి .. లోక సహజం అయిన ఒక వాస్తవం ఏంటి అంటే...ముందు తన గురించి కాకుండా బిడ్డ ల ఆకలి ని తీర్చాలని చూస్తుంది ఏ ప్రాణి అయిన సరే , అమ్మ ప్రేమ కి నిదర్శనం అందరి కడుపులూ నింపే అక్షయ పాత్ర //తన కడుపు వేపు కన్నెత్తి కూడా చూసుకోదు కొడుకులకు కూతుళ్ళ కు ఆత్మీయత ని కలిపి తినిపిస్తుంది తన కడుపు కట్టుకొని మరి పిల్ల ల లకి లోటు రానీయకుండా చేస్తుంది ... అమ్మతనపు ఆత్మీయతని//అన్నంలో కలిపి తినిపిస్తుంది... బార్య లని హింస పెట్టె భర్తల ఆగడాలను మౌనం గా భరిస్తూ , పంటి బిగువున అన్ని భరిస్తూ ...సహనానికి నిలువెత్తు రూపం లా నిలుస్తుంది ...తమ బిడ్డలకు ఎలాంటి కీడు జరగకుండా పొదివి పట్టుకొని జాగ్రత్త గా కాపు కాస్తుంది .. కట్టుకున్న వాడు అహరహం//నరనరాన్ని నలుచుకుతింటున్నా//చిరు నవ్వుని పెదాలకి అతికించుకుంటుంది తన గుండెల్లో గునపాలు దిగుతున్నా //పంటి బిగువున బాధని ఓర్చుకుంటుంది పిల్లల కోడిలా బిడ్డల్ని గుండెల్లో దాచుకుంటుంది/// దుఖపడాలి మనం నగ్న సత్యాలు చూసి/అమ్మని దేవతని చేసిన చోటనే అడుక్కుంటున్న ఈ అమ్మలెవరో మరి సూటిగా సమాజానికి ప్రశ్న నాగరికత ని నెత్తికి ఎక్కించుకున్న ఆధునికత, అడుక్కుంటున్న అమ్మలను దేవత అనరు ఎందుకు మరి ....? వృద్ధాప్య కేంద్రాల్లో శూన్యంలోకి చూస్తూ కుమిలిపోయే అమ్మలందరూ దేవతలు కాదా!!! ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర... రోడ్ల కూడళ్ళ దగ్గర అత్యంత దీనంగా అడుక్కుంటున్న ఈ గాజు కళ్ళ అమ్మలందరూ దేవతలేనంటారా??? ఇప్పటివరకు అమ్మ గొప్పతనాన్ని వివరించి దేవత అంటున్నారు ...అమ్మ లు కేవలం సోకాల్డ్ లేదు ధనిక స్వామ్యం లో ఉన్న స్త్రీలే నా ...., మరి జీవితాన్ని దార పోసి మలి దశ లో కొడుకల చేత గెంటి వెయ్యబడ్డ ముసలి తల్లి దేవత కాదా....అలాగే ప్రతి రోజు కనిపించే ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర దీనం గా అడుక్కునే తల్లులు కూడా దేవత నే ..నా ...కొన్ని సమాధానం దొరకని ప్రశ్నలకు మనం జవాబు చెప్పాలి ...అమ్మ పేరు న ఒక రోజు ని జరిపి అన్నం పెట్టడం కాదు ...మన ఉన్నతి కి తను కరిగి పోయే అమ్మ కి గుప్పెడు అన్నం ప్రతి రోజు పెట్టండి అంటూ మనసు ద్రవించేలా రాసారు సత్యవతి గారు ... మంచి వస్తువు ని ఎంచుకొని సరళం గా రాసి సమాజపు పోకడల ను మార్చాల్సిన అవసరం ఉంది అని నమ్మి చక్కని రచన ను మనకు అందించారు ..వారు మరిన్ని మంచి రచనలు చెయ్యాలని ఆసిస్తూ ... పుష్యమి సాగర్... (తల్లుల రోజట....అహా ఆహా హా...) .=== అమ్మంటే దేవతని అమ్మంటే అనురాగ మూర్తని అమ్మంటే ఆది శక్తని ఇంకా ఇంకా ఎన్నో బిరుదులు అమ్మ గోరు ముద్దలు తినకుండా అమ్మ లాలి పాట వినకుండా ఎవరైనా పెరుగుతారా అమ్మ గుర్తొస్తే..... గోరు ముద్దలేనా గుర్తొచ్చేది లాలి పాటలేనా గుర్తొచ్చేది అమ్మ ఒక చాకిరీ యంత్రమని అమ్మ ఒక నిశ్శబ్ద గీతమని అమ్మ ఒక సంక్షుభిత రూపమని పగలు రేయి తేడా తెలియని పనుల వలయంలో అమ్మొక తిరగలి, అమ్మొక చీపురు అమ్మొక చేట, అమ్మొక గాస్ స్టవ్ అందరి కడుపులూ నింపే అక్షయ పాత్ర తన కడుపు వేపు కన్నెత్తి కూడా చూసుకోదు కలో గంజో ఆమె కడుపు లోకి కన్న వాళ్ళ కట్టు కున్నవాళ్ళ కలల సాకారమే ఆమె నిరంతర కృషి అమ్మతనపు ఆత్మీయతని అన్నంలో కలిపి తినిపిస్తుంది కట్టుకున్న వాడు అహరహం నరనరాన్ని నలుచుకుతింటున్నా చిరు నవ్వుని పెదాలకి అతికించుకుంటుంది తన గుండెల్లో గునపాలు దిగుతున్నా పంటి బిగువున బాధని ఓర్చుకుంటుంది పిల్లల కోడిలా బిడ్డల్ని గుండెల్లో దాచుకుంటుంది ఇంత చేసి............... రెక్కలొచ్చిన పిల్లలు తలో దిక్కూ ఎగిరిపోతే గుండె చెరువై కూలబడుతుంది అమ్మంటే దేవతని అన్నదెవరురా/సిగ్గుపడాలి మనం ఆ మాట అన్నందుకు దుఖపడాలి మనం నగ్న సత్యాలు చూసి/అమ్మని దేవతని చేసిన చోటనే అడుక్కుంటున్న ఈ అమ్మలెవరో మరి వృద్ధాప్య కేంద్రాల్లో శూన్యంలోకి చూస్తూ కుమిలిపోయే అమ్మలందరూ దేవతలు కాదా!!! అమ్మ మనిషి, అమ్మకి అన్నం కావాలి అమ్మకి ప్రేమ కావాలి అమ్మకి మందులు కావాలి అమ్మకి బట్టలు కావాలి అమ్మకి అన్నీ కావాలి అమ్మంటే దేవతని ఒట్టి మాటలొద్దు గోరు ముద్దలు తినిపించిన అమ్మకి గుప్పెడు అన్నం పెట్టండి చాలు

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1joRh0d

Posted by Katta

11, మే 2014, ఆదివారం

Pusyami Sagar కవిత

వలస చిత్రం ____________పుష్యమి సాగర్... ఇక్కడ కొన్ని వెలిసిన రంగులు కాన్వాసు పై చిత్రాలు గా మారతాయి పిండం ఉమ్మ నీరు లో చేప లా ఈధుతున్నప్పుడు, విత్తనాన్ని మరెక్కడో మొలకేత్తించాలని తమ కడుపులు కట్టుకొని ...ఆశల దారాల్ని అల్లుకుంటూ అహరహం శ్రమించి ఆకాశంలో పయనింప చేస్తారు రెక్కలొచ్చిన కొన్ని పక్షుల్ని ...!!!!!. తమ బతుకులు మార్చుకోవాలని తమని తాము చెక్కుకుంటూ ఇంకిపోయిన కన్నీళ్ళని కరెన్సీ కట్ట ల కింద దాచేస్తు ... చరవాణి ద్వారా గుండె చప్పుడు వినిపిస్తారు ...., చిన్నప్పటి జ్ఞాపకాలను, కొన్ని ఆనందాలను, దుఖాలను ఇంటి వాకిట పరిచి గడిచిపోతుంటాం కాలం ఒడి లో ...!!!! చదువులను మదించి ముళ్ళను పూలబాటగా మలచుకొన్న బతుకు చిత్రం....దీనికి మరో వైపు , గంపెడు పిల్లలని , ఆబగా నోరు తెరిచి చూస్తున్న అవసరాలను . .పెళ్ళికి ఎదిగిన కూతుళ్ళ చూపులను ., కట్టుకున్న ఆడది వంటికి నిండుగా కప్పలేని నిస్సహయత ని జనాల జాలిచూపులని ..తట్టుకోలేక కసిగా ... వెంటాడుతు విసిరేయబడతాయి ... అజ్ఞానపు తురుపు ముక్కలు !! ఎడారి పచ్చిక బయళ్ళలో పాస్ పోర్టులు లాక్కోబడి, ముద్ద దొరకక కడుపుచుట్టుకుపోయిన పేగులను తన్నుకుంటూ వచ్చిన ఆకలికేకలు గాల్లో కలిసిపోయి చెత్త కుప్పలో దిక్కులేని కట్టే గా విసరబడ్డప్పుడు , పాలకులు చలువ కళ్ళద్దాల లో చిత్రమే చూసారు ... ఇవి కొన్ని చరిత్ర లో లిఖించబడని కొన్ని రక్తాక్షరాలు కనిపించని చేదు నిజాలెన్నో తమని తాము కాల్చుకుంటూ ప్రతి క్షణం బూడిద గా మారుతూనే ఉంటుంది ...!!! వ్యధాభరిత జీవితాలను ఓడ్డున పడేసే దేవుడు ఎప్పుడు వస్తాడో . వేల కళ్ళలో చిగురిస్తున్న అంతులేని ప్రశ్న ...!!!!! మే 11, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liyLLu

Posted by Katta

5, మే 2014, సోమవారం

Pusyami Sagar కవిత

చితి మంటలు _____పుష్యమి సాగర్ ఎందుకు నీలోనువ్వే నరాలన్నింటి ని కలిపి కుట్టుకొని గజ గజ వణికి పోతున్నావు భయం తో ...!!!! కాలేది కట్టే అని తెలిసాక కుడా, జీవితాన్ని ముగించి గుప్పెడు బూడిద గా మారి పోయే క్షణాల కోసం ఎన్ని బాధాపూరిత జీవులు ఎదురు చూడటం లేదు ..!!! సరే , ఇప్పుడు నీ వంతు జ్ఞాపకాలన్నింటి ని , ఎక్కడో ఒక చోట పాతి పెట్టి నీ వాళ్ళ అనుభూతులను గుండె నిండా నింపుకొని పరిగేడుతున్నావు కదా..పర్లేదు , ఎక్కడో ఒక చోట ఈ పరుగు ఆగుతుందని తెలిసి, ఆరిపోయే దీపానికి నునె గా మారి అలాగే ఉండిపోవాలని అర్రులు చాస్తావెందుకు !! శ్వాస వదిలింది మొదలు, ఒక్కో దశ ను దాటుకుంటూ సీతాకోక చిలకలా ఎగురుకుంటూ దుఖపు ప్రపంచపు దారుల గుండా... కళ్ళ నుండి జారిన కన్నీరు ని ...మిగిలిన ఏ కొద్ది సంతోషాలను మరి కొన్ని విరహాలను, కోపాలను , యుద్దాలను నీ సగభాగం తో ...మరి కొన్ని నీ పిల్లల తో సంపూర్ణ జీవితాన్ని కడుపార భుజించాక ... ఇంకా ఆకలి కోసం వెతుకుతావెందుకు ...మరి కొంత కాలం నూకలను ఏరుకొని నివాసం ఏర్పరచు కొవటానికా, చచ్చిపోయే చివరి క్షణం కోసం , ఇప్పటి నుంచే చస్తావు ఎందుకు ?!!!!! కొన్ని ప్రశ్నలు నిజంగా నీ మెడ మీద కత్తి లా వేలాడుతున్నాయి చితి మంటలు ఎప్పుడు రగులుతున్నట్లే ... నీ లో ని భయము ప్రజ్వరిల్లుతూనే వున్నది ...!!!!!! ఇప్పుడు నిన్ను నువ్వు అందులో కాల్చు కుంటావు జావాబు దొరకని కొన్ని ప్రశ్నల కోసం .... అలసిపోయిన మది కాలిపోతుంది నిరంతరం ఆలోచనల మంటల్లో ...!!! మే 5, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nZiDla

Posted by Katta

4, మే 2014, ఆదివారం

Pusyami Sagar కవిత

కాగితం ______పుష్యమి సాగర్ అందరికి అది తెల్ల కాగితమే, దవళ వస్త్రం లా ఎప్పుడు నా కనుల ముందు రెప రెప లాడుతుంటుంది ...... కలం ఎన్ని అక్షర రంగులను జల్లిందో తెలియదు కాని ఇప్పటికి పచ్చి గా నా చేతికి తగులుతున్నాయి...అచ్చం మట్టి నుంచి చీల్చుకొని వచ్చిన కొత్త విత్తనం లా .... ఎన్ని ఘటనలు ఆ వరసల వెంట వెళ్ళలేదు చెప్పు ... రక్తాక్షరాలు తో చరిత్ర లను లిఖించటానికి !!!!... చేతి కోసల చివర వెంట కారుతున్న ఇంకు చుక్కలు గొలుసుకట్టు గా ఒక్కో వాక్యం లో వోదిగిపోతుంటాయి ..... తెగ నరకబడ్డ జీవితాల్ని సజీవం గా దళసరి కాగితం పై చిత్రించటానికి ....కామోసు ...!!!! వసంతాలని , శిశిరాలని ఆత్రుత తో కౌగిలించుకొని కొన్ని భావనలను తన పై చేక్కుకున్నప్పుడు రాలి పడ్డ తోక చుక్కాలా ప్రేమ గీతాలను అలవోక గా ...నడుచుకుంటూ వెళ్తాయి ఇద్దరి సాన్నిహిత్యం లో నే...!!! ఇది తెల్ల కాగితమే కాదు మనసు పొరలను ఒక్కోటి గా విప్పి నిజాన్ని నీలో నింపే సిరా బుడ్డి కూడా.... ఇప్పుడు మరి పగలు ///.రాత్రి రెండిని కలిపి ఓడిసి పట్టుకోవాలి ... కాగితం పై శిల్పాలను చెక్కడానికి ..!!!! మే 4, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHbraE

Posted by Katta

1, మే 2014, గురువారం

Pusyami Sagar కవిత

బాల్యం నానీలు ... _______ మిత్రుడు ఇచ్చిన పాత మాస పత్రిక లో ("పత్రిక ") నానీలు కనిపించాయి ...అవి ఎంత గా హత్తుకున్నాయి అంటే .వాటి గురించి ఏదైనా రాయాలి అనిపించిది ...శేషం సుప్రసన్నచార్యులు గారు రాసిన నానీ లు బాల్యం ఎంత దురవస్థ లో ఉన్నదో తెలియ చెప్పే ప్రయత్నం కన్పించిది ....ముఖ్యం గా కార్మికుడికి (బాల ) ..మరి కాన్వెంటు విద్యార్ధి కి అట్టే తేడా లేదు ఇద్దరు మోస్తున్నారు బరువు లు అంటారు ఓ చోట .... కాన్వెంటు స్టూడెంట్ //బాల కార్మికుడు తేడా లేదు ///ఇద్దరు బస్తాలు మోస్తారు ....!! నిజమే కదః ....చిన్న వయసు లో నే బండెడు బరువు లను మోయిస్తున్న మన విద్యా వ్యవస్థ ...భావి పౌరులను తాయారు చేస్తున్నదో లేదో తెలియదు కాని ఖచ్చింతంగా కూలి లను మాత్రం తాయారు చేసే కర్మాగారం అయిపోతున్నది కదా... లేత బాల్యం వీపు పై //పుస్తకాల బురువు పర్వాలేదు ఫ్యూచర్ లో //కూలి నెంబర్ వన్... పేదరికం లో ఉన్నవాడికి జబ్బు వస్తే ....గుండె కి చిల్లు పడి దీనావస్థ లో ఉన్నవాడికి ప్రేమా తో అనురాగం తో వాడి జీవితాన్ని ..గుండె ను రెండి టి ని ప్రేమ తో పూడ్చాలి ..అది నిజంగా జరిగితే ఎంత బాగుండు ను కదా... డబ్బు కరిచిన బాల్యం //గుండెకు చిల్లు పొడిచింది ... ప్రేమాబ్ఘిమానలతో //పూడ్చాలి ... నేతలు మాటలను కోటలను దాటిస్తారు ...ఎక్కడ ఏ అన్యాయం జరిగిన ముందు ఉంటారు ఎప్పుడైనా వారి దృష్టికి బాల కార్మికుల వెతలను తీసుకు వస్తే ...చర్యలు తీసుకుంటాము అంటారు ...కాని చిత్రం ఏమిటి అంటే..అదే ఇంట్లో బోలెడు మంది పిల్లలు పని చేస్తూ వుంటారు ...డబ్బు ఉన్నవాడి చేతి లో బాల్యం మరి చితికిపోతుంది ....ఒక మనిషి లా గ కూడా చూడరు !!!! బాల్యం నేతల //కోతల్లో నే కాదు ఉన్నవారి చేతల్లో //కూడా బంది అయింది ...!! ఆద్యంతం మనసు కరిగించేలా వున్నా ఈ నానీ లను అక్కున చేర్చుకోవడం నాకు చాల ఆనందం గా వున్నది ..శేషం సుప్రసన్న చార్యులు వారు ఎక్కడ వున్నా ...ఇలాంటి మంచి కవితలను రాసి సామాజిక స్పృహను తేవాలన్నది అభిలాష ...ఇప్పుడు "పత్రిక ! (మాస ) ...వెలువడుతున్నదో లేదో నాకు తెలియదు కాని ...ఈ పత్రిక మరల పునః ప్రచురణ పొందితే నేను చాల సంతోషిస్తాను ..మరోసారి ఇంత మంచి పత్రిక ను అందించన మిత్రుడు కి ధన్యవాదాలు ... బాల్యం నేతల /కోతల్లో నే కాదు ఉన్నవారి చేతల్లో / కూడా బంది అయింది ! లేత బాల్యం వీపు పై //పుస్తకాల బరువు పర్వాలేదు ఫ్యూచర్ లో //కూలి నెంబర్ వన్ !!! డబ్బు కరిచిన బాల్యం //గుండెకు చిల్లు పొడిచింది ... ప్రేమాబ్ఘిమానలతో //పూడ్చాలి ... లేత బాల్యం వీపు పై //పుస్తకాల బురువు పర్వాలేదు ఫ్యూచర్ లో //కూలి నెంబర్ వన్... కన్పించని శ్రమ జీవి /బాల కార్మికుడు కన్పించే బాల కూలి //కాన్వెంటు విద్యార్ధి ___ శేషం సుప్రసన్న చార్యులు సెలవు పుష్యమి సాగర్ (మే 1, 2014)

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o70NKi

Posted by Katta

30, ఏప్రిల్ 2014, బుధవారం

Pusyami Sagar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ రాసిన కవిత //ఊరుపేరెంది మరి//కవిత్వ విశ్లేషణ _______పుష్యమి సాగర్... పల్లె నుంచి పట్నం పోయిన వలస బతుకుల చిత్రమే నరేష్ కుమార్ గారు రాసిన కవిత !!ఉరు పేరేంది మరి !!...చాల చక్కని మాండలికం లో రాసిన ప్రతి అక్షరం బతుకు చిత్రమే..అందరు దైనందిన జీవితం లో ఉరుకులు పరుగులతో సాగుతూనే వుంటారు ఎంత యాంత్రికమైన కూడా ...ఇక్కడ పల్లె నుంచి పట్నం వచ్చిన వ్యక్తుల ఆలోచన, వారి లో వుండే వ్యధ, అంతరంగ వ్యక్తీకరణ కన్పిస్తుంది ...మేము ఎలా ఉన్నామో చూడండి అంటూ ఇలా అంటారు ఇంట్లకేంచి ఆఫీస్కూ//ఆఫీస్ల ఖుదాహఫీజుల్జెప్పి ఇంట్లకూ...//"బైంగన్ కా జిందగీ" అనుకుంటనే బేషరం గాల్ల లెక్క//బజార్లపొంట నడుస్తనే ఉంటం ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టి అందులో మమేకం అయినపుడు తన పాత రోజులులను తలచుకొని బాధ పడుతున్నాడు ...పల్లె నుంచి పట్నం వచ్చిన వలసవాది మరి పొద్దున నుంచి సాయంత్రం దాక ప్రపంచాన్ని చుట్టి వచ్చిన సూరుడు పొద్దు పొడిచే వరకు అంత వేగం గా ఎలా సాగుతుంది ...ఇదే ఆలోచన నుంచి అన్నం తినడం కూడా మర్చిపోతాం .. మల్ల ఎర్రవడి వొర్రెల దుంకుతడు//గ్రాండ్గ బతుకుతున్నం అనుకుంటనే రావొత్తు ఏన్నో పారేస్కొని//పల్లెం ల మారన్నం బెట్టుకునుడు పల్లె నుంచి కడుపు నింపు కోవటాని కి పట్నం వచ్చినపుడు మరల అదే పల్లె భాష కాని, వారి అలవాట్లు ...మాట కాని పలకరిస్తే.....మనసు కొట్టుకుంటుంది ఒకసారి అన్నా నా పల్లె ను చూడాలి ..అక్కడ నేను కోల్పోయిన ప్రతి ఒక్కటి ని ముద్దాడాలని ఉంది ...ఒక జానపద గాయకుడి పాట కన్న ఊరు కి రప్పించే శక్తి ఉన్నదీ అంటే ...గొప్ప పాట దా ...లేక పాట రాసేలా ప్రేరేపించిన ఊరుదా ...ఏమో!!!! ...తను తిరిగిన వీధులను ...గుర్తు చేసుకుంటూ మొత్తం తిరగ మనసు అవుతుంది .....మల్ల ఎప్పుడు అయిన ఊరికి వెళ్తే ...అక్కడ తన పల్లెతనం కాకుండా కొత్త గా ...పట్నం మొహం కన్పిస్తుంది ...????!!! నిజమే ...పల్లె నగరీకరణ అయినపుడు అంతే కదా.,... ఎప్పుడన్న ఓసారి //రేడియల కెల్లి గొరటెంకన్న వొర్లినప్పుడు//యాదికచ్చిన ఊరు కండ్లల్లకెల్లి కార్కత్తది.../గల్లిలల్ల గాయి గాయి తిర్గబుద్దైతది పల్లె పట్నపు మొకమేస్కొని//గడంచెలగూసోని//నవ్వుతాంటది... తన ఆత్మ పల్లెటూర్లో నే వదిలేసి యంత్రకత ను నింపుకొని సాగుతున్న పట్నం బతుకును తలుచుకొని విచారిస్తున్నప్పుడు తన పల్లె తమ్ముడు మారిన తన పల్లె కి ఏమి పేరు పెడదాం అన్నప్పుడు నిజంగా పల్లె మనసు ఎంత గా క్షోబించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ... మాడుప్మొకమేస్కొని//మంచాల గుసుంటే//కడుపుల కత్తివెట్టినట్టు తమ్ముడచ్చి అడుగుతడు//"అన్నా మనూరికి కొత్త పేరేం బెడ్దామే" అని మొత్తానికి నరేష్ గారు పట్నం మింగేసిన పల్లె ని మరోసారి చిత్రం పై కి తీసుకు వచ్చారు తన కవిత ద్వారా., ...వారి కవితలేప్పుడు కూడా సామాజిక అంశాల ను తడుముతూ ..ముందుకు సాగుతుంది ..కాకపోతే అచ్చమైన తెలంగాణా మాండలికం లో ఉన్నదు వలన కొన్ని అర్థం కానివి వుండి ఉండొచ్చు ఉదాహరణ కు "సిల్పర్లతోటి" , "సైబాత్ సమజైనట్టు"మనకతం "గాయి గాయి! వంటి కొత్త పదాలు అర్థం చేసుకోవడం ..ముఖ్యం గా తెలంగాణా మాండలిక ము తో పరిచయం లేని వాళ్ళకి కొత్త గానే అనిపిస్తుంది ..కొన్ని వాటికి వివరణ ఇచ్చి ఉంటె బాగుండేది ...అది మరింత చేరువ గా వెళ్ళేది పాటకుడి మనసు లో కి ..మంచి కవిత ని అందించిన నరేష్ కుమార్ గారికి వందనాలు ... సెలవు ఏప్రిల్ 30, 2014 ----- సొన్నాయిల నరేష్కుమార్ //ఊరుపేరెంది మరి// ఉర్కుతనే ఉంటం అందరం ఇంట్లకేంచి ఆఫీస్కూ ఆఫీస్ల ఖుదాహఫీజుల్జెప్పి ఇంట్లకూ... "బైంగన్ కా జిందగీ" అనుకుంటనే బేషరం గాల్ల లెక్క బజార్లపొంట నడుస్తనే ఉంటం ఏదో పీకుదాం అని తెల్లవడ్డ సూర్యుడు పొద్దూకంగ సైబాత్ సమజైనట్టు మల్ల ఎర్రవడి వొర్రెల దుంకుతడు మనకతం గాదు గ్రాండ్గ బతుకుతున్నం అనుకుంటనే రావొత్తు ఏన్నో పారేస్కొని పల్లెం ల మారన్నం బెట్టుకునుడు మర్శిపోతం. ఎప్పుడన్న ఓసారి రేడియల కెల్లి గొరటెంకన్న వొర్లినప్పుడు యాదికచ్చిన ఊరు కండ్లల్లకెల్లి కార్కత్తది... ఊల్లెకు వొయ్ సిల్పర్లతోటి గల్లిలల్ల గాయి గాయి తిర్గబుద్దైతది సికింద్రవాద్ల తలుపుదీశి ఊర్కడుగువెడ్తే పల్లె పట్నపు మొకమేస్కొని గడంచెలగూసోని నవ్వుతాంటది... మాడుప్మొకమేస్కొని మంచాల గుసుంటే సర్వపిండి ని పిజ్జా లెక్క కొరుక్కుంట పక్కపొంటి కూసోని కడుపుల కత్తివెట్టినట్టు తమ్ముడచ్చి అడుగుతడు "అన్నా మనూరికి కొత్త పేరేం బెడ్దామే" అని

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pKXRHG

Posted by Katta

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Pusyami Sagar కవిత

ఓ రాత్రి _______పుష్యమి సాగర్ కొన్ని రాత్రులు ఇక్కడే ఎక్కడో గిరికీలు కొడుతూ నా చుట్టూ తిరిగుతున్నాయి ప్రతి రోజు మాటలు లేని మౌనావస్థ లో నన్ను నేను కరిగించుకొని ముద్ద లా ఉన్న నన్ను విగ్రహం గా మలిచి చుక్కలకి చంద్రుడికి మధ్యన కూర్చోబెట్టాయి !! జ్ఞాపకాలన్నీ వణికిపోతున్నాయి అవును, నా మెదడు సంచి లో నిండా కుక్కేసాను కదా...!!!! కల్లోల సాగరం లో కలలు అన్ని కొట్టుకుపోయాయి దిక్కుతోచని పక్షి లా ఎగురుతూనే వున్నాను చీకటి కి వెలుగు కి మధ్యన ...!!! ఇప్పటికి రాత్రి కి నా పై దయ రాలేదు కనులు మూసి కౌగిలి లో కరిగిపోదామనుకుంటే..!!!! ఏప్రిల్ 29, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m4bNGY

Posted by Katta

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Pusyami Sagar కవిత

మధుశాల _______పుష్యమి సాగర్ మనసు ని చిక్కబట్టుకొని, ముప్పిరిగొంటున్న జ్ఞాపకాలని పొదివి పట్టుకొని ఓ మూల గా నక్కి కూర్చున్నాను ఏదో ఒక ఖాళి టేబుల్ ముందు అదొక మత్తు జగత్తు, అక్కడంతా బాధలని .కష్టాలని విషం లో కలుపుకొని గొంతు మీదుగా కడుపు లో కి దించుకుంటారు !!!!! బద్ధ శత్రువు కూడా ఆప్త మిత్రుడే , గుండె మంటలను ఒక చోట చేర్చి చల్లార్చుకునపుడు . ఇక్కడ అంతా స్పందన చచ్చిన మనుషులే .. మనసు అద్దం పగిలి అతికించు కోలేనపుడు ఆవేశాలను ఫోన్ల ద్వారా బట్వాడా చేసి ఆత్మ సంతృప్తి పొందుతారు !!!! కధలు, కబుర్లు, కాకరకాయలు, యుద్ధాలు ...అలకలు ..మొహాలు అన్ని కలబోసుకొని చుక్క చుక్క లా వళ్ళంతా రుద్దుకుంటారు ఇంటి ఆడది వాసన పసిగట్టి మొహం చిట్లించి పక్కకు తప్పుకున్న సరే ...!!!! ప్రతి వారం ఈ తంతు జరగాల్సిందే ... జేబు సాక్షి గా..>!!! సోకాల్డు, లేబర్ , డబ్బున్నోడు లేనోడు తేడా లేని అసమానత అసలే లేని గొప్ప ప్రపంచం అది ... అడుగు అడుగు కు సేద తీర్చే నీటి చేలమలా ప్రతి చోట పుడుతూనే వుంటాయి .....బాదలు ఉన్నత వరకు ! ఏప్రిల్ 25, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pxf3k4

Posted by Katta

23, ఏప్రిల్ 2014, బుధవారం

Pusyami Sagar కవిత

KB గారు రాసిన కవిత !!ద గ్రేట్ స్టుపిడిటి|| కవిత్వ విశ్లేషణ నడుస్తున్న చరిత్ర ని సెటైరికల్ గా వ్యక్తీకరించారు కింది కవిత లో ..అసలు ప్రజాస్వ్యమ్యం ప్రజాస్వామ్యం లో జనమే బలము ...జనమే బలహీనత ...తమని తాము ఉద్ధరించుకునే ప్రక్రియ ఏది అయినా వుంది అంటే అది ఓటు అనే వజ్రాయుధము తో నే ...కాని అది ఈ రోజు ఎలా దుర్వినియోగం అవుతుంది , అసలు జనాలు వ్యక్తిత్వము గల వారు కావాలి....తన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు ...జనం లో వున్న బలహీనతలని ఆధారం గా చేసుకొని దోచుకుంటున్న నోరు మెదపని ఆవులాంటి జనాలు ...కావాలి ఆవులు కాని బర్రెలు కాని పాలు పిండినపుడు ప్రతిఘటించవు దాని లక్షణం అది ...అలనే జనం కూడా తమను తమ ఫలాన్ని కష్టాన్ని పిండుకున్న కూడా నోరు మెదపని జనం కావాలి ..ఇది చైతన్య రహిత నికి సూచిక కావొచ్చు ..., అవును మన జనం ఎప్పుడు గొర్రెలే కదా ... //పొదుగుల నుండి రక్తం పిండుతున్నా//ప్రతిఘటించడం చాతకాని బర్రె లు ../// ప్రతి ఒక్క లైన్ లో పోలిక బాగున్నాయి వ్యంగం గా చెప్తూ ...ఇలాంటి జనలు మన దేశం లో తర తర లా నుంచి తల రాతలు మారక అదే ప్రజాస్వ్యామ్య ఊబి లో కొట్టుకు పోతూనే వున్నారు ...అజ్ఞానం తో వుండే వారిని తమ అవసరాల కోసం వాడుకొనే వాడే అవకాశ వాది ..నాయకులకు కావాల్సింది ఇలాంటి వారే కదా... వోటు విలువను కాగితానికో ...మందుకో అమ్ముకునే జనం కావాలి , అవును నిజమే ఓటు హక్కు గురించి గొంతెత్తి మొత్తుకుంటున్నా కాని మనకు పట్టదు ...చదువుకున్న వారు ఎలాగు వోటు వెయ్యరు .ఇలాంటి జనమే కావాలంటాడు ..., ఇక్కడ వోటరు ను అమ్ముకుంటుంది ఓటు కాదు తన శరీరాన్నే...బాగుంది వేశ్య తో పోల్చడం .. !!రెండు కాగితాలకు, ఓ క్వార్టర్ మందుకో తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు,!! జనాలు తాము మనుషులం అన్న సంగతి ఎప్పుడో మరిచార ఏమో అలానే అనిపిస్తుంది ...కొన్ని జంతువుల లాంటి జనాలు కావాలి ఎలాంటి మనస్తత్వం కల వారు కావలి అంటే గాడిదల్లాంటి (చాకిరి చేసేందుకు), గొర్రెల్లాంటి (గుడ్డి గా అనుసరించేదుకు), పాముల్లాంటి (ఆలోచనలేకుండా ముందుకు వెళ్లేందుకు), జిత్తుల మారి తెలివి కి (నక్క ) ఇలాంటి లక్షణాలు ఉన్న జనం కావాలి అవును ఇక ఇలాంటి వారు వున్నప్పుడు డెమోక్రసీ లో వోటు ఎక్కడ బతుకుతుంది గాడిదల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి, నక్కల్లాంటి// మనిషి ని ఇంకో మనిషి ని తల్చుకోవాలంటే సిగ్గు తో తలదించుకోవాలనే విధం అయిన మనుషులు కావాలి నాకు, అవును ఇంత దిగజారిన విలువలతో వున్నప్పుడు ఎవరైనా తనని మనిషి గా చూడటానికి ఇష్టం చూపిస్తాడ ..., మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే,//సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు. ఇప్పుడు ఉన్న నాయకులకి చైత్యనం తో నిండుకున్న జనాలు అవసరం లేదు ..ఎప్పుడు అయితే జనాలు చైత్యనం గా ఆలోచించటం మొదలు పెడతారో అప్పుడు అభివృద్ధి కి బాటలు వేసుకుంటారు .కాని అలా ఆలోచించే వారు గా వుండటం నాయకులకి ఇష్టం లేదు ..., కళ్ళు ఉండి చూడలేక, చేతులు ఉండి పని చెయ్యలేక, సోమరులు, బతుకంటే ఏమిటో ... బతకడం చేతాకని .దద్దమ్మలు నాకు అవసరం అని తన కోరిక ను వెల్లడించాడు ...చైతన్యం ఉన్న చోట ఎపుడు ప్రశ్న ఉదయిస్తుంది ....కదా అందుకు ...జనాలు చైతన్య దిశా గా అడుగులు వెయ్యడం ఇష్టం లేదు ...అవే కింది వాక్యాలలో చాల బలం గా వ్యక్తీకరించారు చూడండి... కళ్లుండి చూడని జనాలు,//మెదడుండి ఆలోచించని జనాలు,//కాళ్లూ చేతులూ వుండి//పనిచేయని సోమరి జనాలు.//బతుకంటే ఏంటో తెలియని జనాలు,//బతకడం చేతకాని జనాలు, ఇంకో తరాన్ని పుట్టించలేని నపుంసక వ్యక్తిత్వాన్ని అలాగే తానూ చెప్పినట్లు వినే బసవన్నల్లాంటి జనాలు కావలి ... బీజమూ లేక, అండమూ రాక//కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే//నపుంసకుల్లాంటి జనాలు కావాలి. నేననుకొనెట్లు మాత్రమే ఆడగల//బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు. క్లైమక్ష్ లో ఇలాంటి సరుకు (జనాలు ఎప్పుడు సరుకు వస్తువు లంటే వారు కదా) ...నేను కొనుక్కోవాలి ఎంత మంది దొరకొచ్చు ...ఓ వంద కోట్లు ..అంటే భారత దేశం లో ఉన్న ప్రజానీకం అన్నమాట... కవిత ఆసాంతం కూడా చాల చక్కగా వ్యంగ్యం గా సాగిపోతుంది ..నాకు ఒక విషయము లో అర్థం కాలేదు ...కవి గారి ఉద్దేశం ప్రకారం 100 కోట్ల ప్రజలలో కొద్ది మందికి అయిన కూడా చైత్యన్య వంతులు లేరా ? (చదువుకున్న వాళ్ళు ఓటు ని దూరం గా పెట్టటం కూడా ఒక కారణం ? కావొచ్చు )...., చదువుకున్న తెలివిగల సమూహం కూడా మౌనం గా వుంటే ఇదే జరుగుతుంది ఏమో ...ఏది ఏమైనా చక్కని కవిత ను అందించిన భాస్కర్ గారు అబినందనీయులు ...వారు ప్రతి విషయాన్ని కొత్త గా చెప్పటానికి ప్రయత్నిస్తారు ...తీసుకున్న వస్తువు సమకాలిన అంశానికి ప్రతికలే ...ముందు మనం మన ఆలోచన మారితే ...దేశానికి బాగుటుంది. వ్యంగ్యం గా చెపుతూ ...వ్యవస్థ లో ని లోపాన్ని ..మారవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు ....మంచి కవిత ను అందించిన భాస్కర్ కొండ్రెడ్డి గారి కి ధన్యవాదాలు ... ==== నా కిప్పుడు జనం కావాలి. పల్లకీలో ఎక్కించి,.ఒహోం ఒహోం అంటూ మోసుకెల్లే బలిసిన భుజాల్లాంటి జనాలు. రెండు మెతుకులు కూడు కోసం, కుక్కల్లా కాళ్లు నాకే విశ్వాసం గల జనాలు. పొదుగుల నుండి రక్తం పిండుతున్నా ప్రతిఘటించడం చాతకాని బర్రెల్లాంటి జనాలు. రెండు కాగితాలకు, ఓ క్వార్టర్ మందుకో తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు, నాకిప్పుడు జనం కావాలి. గాడిదల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి, నక్కల్లాంటి ఇంకా ఇంకా కొన్ని జంతువుల్లాంటి జనాలు అసలు నేను మనిషిననే సంగతే మరిచిన జనాలు మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే, సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు. నాకిప్పుడు జనం కావాలి. కళ్లుండి చూడని జనాలు, మెదడుండి ఆలోచించని జనాలు, కాళ్లూ చేతులూ వుండి పనిచేయని సోమరి జనాలు. బతుకంటే ఏంటో తెలియని జనాలు, బతకడం చేతకాని జనాలు, నాకిప్పుడు జనం కావాలి. బీజమూ లేక, అండమూ రాక కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే నపుంసకుల్లాంటి జనాలు కావాలి. నేననుకొనెట్లు మాత్రమే ఆడగల బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు. 2 ఓ ఆర్డర్ కి సప్లైయ్ చేయాలి. ఎంత మంది దొరకచ్చిక్కడ? షుమారుగా ఓ వంద కోట్లు! అంటూ చక్కని ముగింపు ఇచ్చారు .. ఓ ఆర్డర్ కి సప్లైయ్ చేయాలి. ఎంత మంది దొరకచ్చిక్కడ? షుమారుగా ఓ వంద కోట్లు! ఏప్రిల్ 23, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rhAuDb

Posted by Katta