పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Indira Bhyri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Indira Bhyri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జూన్ 2014, ఆదివారం

Indira Bhyri కవిత

ఇందిర నిన్ను కొంచెం బాధపెట్టినందుకే భూమ్మీద పడగానే ఏడ్చాను ! జీవితాంతం నువ్వనుభవించిన బాధల్ని తలచుకుని నీ (ఈ) నిష్క్రమణవేళ నేడెంత ఏడ్వాలి నేను 8/6/14

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mqfgyd

Posted by Katta

31, మే 2014, శనివారం

Indira Bhyri కవిత

ఇందిర పోలవరం ఇప్పుడు జనాల్ని ముంచడానికో ముద్దుపేరు ప్రాజెక్టు ! ****** ఇన్నాళ్లూ విన్నది బహుళార్థ పథకాల గురించి కానీ ఇది బహుళనర్థ పోలవరం ! ******* అడవి సంద్రంలో చిచ్చుపెడితే తప్పదు తిరుగుబాటు సునామీ ! ******** మనోవ్యధకు మందులేదు మా బాధకు సరితూగు పరిహారాలు లేనేలేవు ! ********* నిర్వాసిత కనులలో చీకటి భవితవ్యం బాధిత గళమే కర్తవ్యం! ******* నిరసన గళాలు పెను ఉప్పెనైతే పోలవరం గడ్డిపోచ ! ******* కన్నీటితో ప్రాజెక్టులు కడితే రాళ్లు తప్ప రత్నాలు పండవు ! ****** పనికొచ్చే ప్రాజెక్టులు కడితే చెమటనీరు ధారపోస్తాం ! ******* ఆవాస పథకాలు ఉపాధి హామీలెరుగం నోటికాడి కూడు లాగేస్తే తిరగబడ్డం మాత్రం తెలుసు (2006 - ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి పోలవరం గిరిఘోష ' జీవన్మరణం 'సంకలనం నుండి ) 31/5/2014

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pttrc1

Posted by Katta

19, మే 2014, సోమవారం

Indira Bhyri కవిత

....అని ! చిన్నప్పుడు నా బాధ నీకు తెలియాలని... నా ఏడుపు మొహం నువ్వు చూడాలని ఎన్ని పాట్లు పడేదాన్నో నీ మరణయాతన చూడలేక నా కన్నీరు నీ కంటపడకుండా ఉండాలని ఏవో వ్యర్థప్రయాసలు అమ్మా ఇప్పుడు 19/5/14

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jLJ1aK

Posted by Katta

11, మే 2014, ఆదివారం

Indira Bhyri కవిత

. . . గజల్ ఆనందం కలిగినపుడు అమ్మ గుర్తుకొస్తూంది ఆవేదన తీర్చు అమ్మ ప్రేమ గురుతుకొస్తూంది అడగనిదే వరాలిచ్చె ఆమెచేతి చలువ చూస్తె ఫలాలిచ్చె కల్పతరువు కొమ్మ గురుతుకొస్తూంది ప్రశంసలే పన్నీరై నాపైనే కురిసినపుడు సుఖమంటే ఎరుగని తన శ్రమ గురుతుకొస్తూంది తెలిసితెలియకేనేమో మాటలనే తూలినపుడు కన్నీటితొ కడిగేసిన క్షమ గురుతుకొస్తూంది కోరుకున్న విజయాలే నాకు స్వంతమైనపుడు మాటరాని తనకన్నుల చెమ్మ గురురుతుకొస్తుంది మాను వంక చూసినపుడు మాటరాక నిలిచిపోతె అమ్మ త్యాగభరితమైన జన్మ గురుతుకొస్తూంది వింతలీను జగమునంత చుట్టినపుడు ఓ ' ఇందిర ' అమ్మ నాకు కొనిఇచ్చిన బొమ్మ గురుతుకొస్తూంది (అమ్మ తీవ్ర అనారోగ్యం పాలైన స్థితిలో ....అమ్మలందరికీ వందనాలు తెలపాలని ఈ కాస్త వీలు చేసుకున్నాను)

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gaa6df

Posted by Katta

21, మార్చి 2014, శుక్రవారం

Indira Bhyri కవిత

ఇందిర ఎవడు వీడు ఖచ్చితంగా వీడో రాజాధిరాజు అడగకుండానే సర్వం సమకూరాలి నటనాసార్వభౌముడికీ వశంకాని నవరసాలొలుకుతాడు గానగంధర్వుడికీ చేతకాని బాణీలు పలుకుతాడు సందేహమే లేదు వీడు మహా జాదూగర్ కొమ్ములు తిరిగిన తాతల్నీ పసివారిని చేసి ఆడిస్తాడు చిరునవ్వులతోనే చిత్తుచేస్తాడు అడుగడుగుకీ రక్షణకోటలు కట్టుకున్న చక్రవర్తి ఆహ్లాదమౌ అల్లరితో రోజుకో తాజుమహలు కట్టే మొగలురాజు అలవోకగా నవ్వులలో ముంచితేల్చే మా ఆస్థాన విదూషకుడు చేయిచాస్తే లేదనని దానకర్ణుడు సహనాన్ని పరీక్షచేసే ధర్మరాజు ఎదురేమున్నా బెదురులేక సాగే వీర జవాను చిట్టి చేతులతో మట్టి పిసికే బాల కృషీవలుడు అడుగిడిన చోటల్లా బృందావనాలు తీర్చే కృష్ణబాలుడు గుండెల్లోనే గుడులు కట్టిన నవ పల్లవరాజు అలా చూసి ఇలా పట్టేసే అష్టావధాని ఇంటి యూనివర్సిటీలో అన్ని శాస్తాలు ఒంటబట్టించి పట్టాలెన్నో పుచ్చుకున్న చిట్టి మేధావి (21/3/2014) పండు (శ్రీహిత్ పుట్టిన రోజు సందర్భంగా .......బాల ప్రపంచానికి అకితమిస్తూ....) రచనాకాలం 2007 ;తెలుగు వలుగు నవంబర్ సంచికలో అచ్చైబహుళాదరణకు నోచుకున్నది .

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PVN6Ta

Posted by Katta

4, మార్చి 2014, మంగళవారం

Indira Bhyri కవిత

ఇందిర గజల్ ఒకరినొకరు కబళిస్తే జాతి నిలిచి ఉండునా అంతకంత దిగజారితె ఖ్యాతి నిలిచి ఉండునా నిప్పుకడుగు సూర్యుడినే దాచగలుగు మబ్బులేవి స్వార్థమనే చెదలుచేర నీతి నిలిచి ఉంటుందా అడుగడుగున పదునెక్కుతు సాగినదే జీవితం రగిలించే చమురులేక జ్యోతి నిలిచి ఉండునా మాటరాని జీవులైన జట్టుకట్టి మసలునే సమభావన లేక ఐక్యగీతి నిలిచిఉండునా త్యాగధనుల చరితలన్ని మేలుకొలుపులే 'ఇందిర' మూలాలను మరచిపోతె రీతి నిలిచి ఉండునా 2011 రచన . 4/3/14

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eZJl3G

Posted by Katta

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Indira Bhyri కవిత

ఇందిర అమానుషం నీకేందమ్మా మారాజువు 'కొడుకులగన్న కోట'వని నలుగురూ ఎకసెక్కాలాడినపుడు లోలోపల ఎంత ఉప్పొంగిపోయావో కుడిచెయ్యీ ఎడమచెయ్యీ అనకుండా అందరి ముడ్లూ మూతులు కడిగి అడ్డమైన చాకిరంతా ఆనందంగా చెయ్యలేదా ఏడేడు ఇళ్లల్లో పిల్లిలా తిప్పి కళ్లలో వత్తులేసుకుని పూచికపుల్లా దాచిపెట్టి తినీతినక కూడబెట్టి ఇల్లుకట్టి పిల్లల్ని నీ వీపుకు కట్టుకోలేదా అంతా ఒక రేవుకొచ్చేదాకా కునుకైనా తీశావా పిల్లలకై బ్రతకాలంటూ జీవితాన్ని ప్రేమించావే ఇళ్లూ వాకిళ్లు పంచుకుని ఇప్పుడు నిన్నేపంచనుంచాలో తోచక ఎటూతేల్లుకోలేక కొడుకులంతా కొట్టుకుచస్తున్నారే నువ్వేమైనా ఆస్తివా పాస్తివా ఆబగా పంచుకోడానికి ! ఆరుబయట అరుగుమీద బండరాయి గుండెలపై బుక్కెడు బువ్వకోసం నీ గాజుకళ్ల ఎదురుచూపు చావుకు చేరువైన చేతులు వాలుతున్న ఈగల్ని తోలలేక వేలాడబడ్డాయి నీచేతుల్లో ఏముందింక కనకమ్మత్తా !! (2009) 18/2/2014

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N4in4n

Posted by Katta