పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
బాలసుధాకర్ మౌళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బాలసుధాకర్ మౌళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

బాలసుధాకర్ మౌళి కవిత

వస్తుస్పష్టతతో గొప్పగా నిర్వహించబడిన కవిత. గుండెల్ని కదిలించే కవిత. సాక్ష్యం / ప్రసాదమూర్తి ------------------------- కురిసిన నెత్తురు కురిసినట్టే ఉంది మేఘాల సాక్ష్యం ఏదని ఆకాశం కేసు కొట్టేసింది. తెగిపడ్డ తలకాయలు కళ్ళ ముందు ఎగురుతూనే ఉన్నాయి మొండేల జాడ ఏదని గాలి కేసు కొట్టేసింది వెన్నుపూసను వణికిస్తున్న జ్ఞాపకాల చెట్టుకు నరకబడ్డ కాళ్ళూ చేతులూ వేళ్ళాడుతూనే ఉన్నాయి కత్తుల మీద నెత్తుటి చుక్కలు లేవని కాలం కేసు కొట్టేసింది మృతదేహాల మూటలు తుంగభద్ర తరంగాల్లో కలిసి తలలెత్తి ఎగిసిపడుతూనే ఉన్నాయి నీరు నోరు మెదపలేదని గట్టు కేసు కొటేyసింది హతులున్నారు హంతకులే లేరు హంతకులున్నారు సాక్షులే లేరు సాక్షులున్నారు వినే చెవులు లేవు చూసే కళ్ళు లేవు ఇదేంటని ప్రశ్నించే నోళ్ళున్నా సాక్ష్యంగా జవాబులే ఉండవని ఫైనల్‌ గా మనువు కేసు మూసేశాడు సాక్ష్యం చెప్పవే చుండూరా చుండూరా చుండూరా దేశం దేహమ్మీద సలపరం పెడుతున్న మనుధర్మ రాచపుండూరా!! (చుండూరు మారణకాండలో బాధితులకు న్యాయం కోసం పోరాడుతున్న శక్తులకు మద్దతుగా..) ( 23.06.2014.... సోమవారం, ప్రజాశక్తి )

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lid3Zn

Posted by Katta

29, మే 2014, గురువారం

బాలసుధాకర్ మౌళి కవిత

ప్రకటన పాము బుసకొట్టదు కాటేయదు మెత్తగా సుతారంగా మునివేళ్లతో వొళ్లంతా రాస్తున్నట్టు - ఆలోచనల పుట్టలోకి చొరబడుతుంది అణువణువునూ ఆవరిస్తూ మండీ వేసుకుని కూర్చుంటుంది అది అప్పుడప్పుడూ తల పైకెత్తి చుట్టూరా చూస్తుంది నిద్రలో కళ్ల ముందుకొచ్చి తైతిక్కలాడుతుంది ఊపిరికొసల్ని ముడేసి వొళ్లంతా పాకుతుంది వొదలదు - యింటిలోకీ వొస్తుంది భార్యామణుల ఊహల్లోకి మరీ మరీ వొస్తుంది దాన్ని చూసి పిల్లలంతా మారాం చేస్తారు దాని మీదికెక్కాల్సిన బదులు దాన్నే మీదికెక్కించుకోవాలని మహా ఉబలాటం పడతారు ప్రకటన పాము ఎవ్వరినీ వొదలదు - కొద్ది రోజుల్లోనే వచ్చిన పని అయిందనుకున్నాక మరో పుట్టని వెతుక్కుంటుంది మాయలమారి 'ప్రకటన పాము' - ఆలోచనల పుట్టలోనివే 'తెలివిడిచీమల'న్నీ వొక్కటై చుట్టూరా దడి కట్టి దాడిచేస్తే అంత బడాయి పామూ చచ్చి ఊరుకుంటుంది ! * నేనిప్పుడు ప్రకటన పాముకు పాడె కట్టాలి నువ్వో చెయ్యేస్తావా.... ? రచనా కాలం :29 మే 2014 -------------------------------- 29.05.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lU1bsx

Posted by Katta

26, మే 2014, సోమవారం

బాలసుధాకర్ మౌళి కవిత

రైల్లో 3 గొంతును వేణువుగా చేసుకున్నాడు గొంతువేణువులోనే సప్తస్వరాల్ని మించిన విన్నూత్న రాగాన్నేదో పలుకుతున్నాడు మాటలకు అందనిది - జీవన విషాదం నుంచొచ్చి దుఃఖం వాసన వేస్తున్న రాగం బహుశా అలానే వుంటుంది కాబోలు అతను నిజంగా యోధుడు - రైల్లో అస్తవ్యస్తంగా పడివున్న దేశపటాన్ని కలిపి కుడుతున్నాడు అందర్నీ ఏకత్రాటిపై నిలబెడుతున్నాడు కళ్లు లేకపోయినా అతని బతుకుదారికీ గొంతే కన్ను రోజూ సూర్యుడతని ముందు ఓడిపోతూనే వున్నాడు ఉదయం తరగలు తరగలుగా పోటెత్తుతున్న ఉత్సాహం గుర్రం మీద కనిపిస్తాడు సాయంత్రమూ అదే గుర్రంపై అదే తీరుగా కనిపిస్తాడు ఆ స్వరచక్రవర్తి - వొక రోజును వొక రాగంగా తీర్చిదిద్దుతున్నాడు ! రచనా కాలం : 26 మే 2014 --------------------------------- 26.05.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mfLzkx

Posted by Katta

25, మే 2014, ఆదివారం

బాలసుధాకర్ మౌళి కవిత

రైల్లో - 2 అతని వేళ్ల చివర అతని గుండె వుంది వేళ్ల కాళ్లు కంజిర మీద నాట్యమాడుతున్న కొద్దీ గుండె వేల వేల ఖండితాల చరణాలుగా మారి పాటై ప్రవహిస్తుంది అతను - ఆ పాటగాడు రైలు పెట్టెనంతా వో వాద్యపరికరంగా మార్చేశాడు ! రచనా కాలం : 25 మే 2014 ------------------------------ 25.04.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mapILh

Posted by Katta

19, మే 2014, సోమవారం

బాలసుధాకర్ మౌళి కవిత

ఈ పొద్దున్నే లేవగానే వొక అద్భుతమైన కవిత చదివాను. వస్తువు గానీ, అభివ్యక్తి గానీ విష్మయం కలిగించేటట్టు - మరీ యింత కొత్తగా, యింత విన్నూత్నంగా కవిత్వాన్ని సృజించొచ్చా ! ఆశ్చర్యానందం ! కవిత చదువుతున్నాను - అది మనసు మీద వేసిన అనుభూతి పొరలను ఆలోచనా స్పర్శతో విప్పుకుంటూ విప్పుకుంటూ - కవితా శీర్షిక వైపు 'మళ్లొక్కసారి వెనక్కి, మళ్లొక్కసారి వెనక్కి' - అంటూ తలతిప్పుకోకుండా వుండలేకపోయాను. ఆలోచననను రేకిత్తించే స్వభావమే - కారణం. ఈ కవిత ఆకలి కేంద్రీకృతంగా నిర్మించబడినా - లోలోన రగులుకుంటున్న వొక ప్రవాసవేదన, ఆ దుఃఖం నేపథ్యంగా లేకుండా ఈ కవిత యిలా రాకపోవచ్చు. ఈ కవితకు ఎత్తుగడ ప్రాణభూతమైంది - కవితను, కవిత చదివే పాఠకుణ్ణి లోలోపకు లాక్కునేటట్టు - వొక అయాస్కాంత తరంగం ఆవరిస్తూ ! కవి యిక్కడో మాట అనేసి పోయాడు. ఏం లేదు వొక మాట.. వొక పదునైన మాట ! ఏ మానసిక అలజడి కేంద్రం నుంచో ! ఏ ఆకలి సముద్రాల తీవ్ర సుడిగుండాల ప్రవాహఉధృతి నుంచో ! ? ? కవి : అఫ్సర్ నోరు, చెయ్యి అను ఆ రెండు దేశాలు ----------------------------------------- దూరాల మాటే కదా అనుకుంటున్నదిప్పుడు నోరూ చెయ్యి - ఈ రెండు దేశాల మధ్య దూరాన్ని దేనితో కొలవాలో ఎవరూ ఇంకా చెప్పలేదు పోనీ, ఏదయినా వొక కొలమానం కనిపెట్టి, ఈ దూరాల లెక్క అయినా తేల్చలేదు ! 1 నోరు దీంట్లో మన్నుపడ ! దీని నోట్లో ఎన్ని భూఖండాలూ ఎన్ని సముద్రాలూ ఎన్ని శూన్యాలూ ఎన్ని ఆకాశాలూ ఎన్ని సూర్యగోళాలూ, అన్నీ గప్ చూప్ లే ! దాగుడు మూతా దండా కోర్ లే ! అన్నీ పెదాల దాకా వచ్చి సర్వసమాధి అయిపోతాయి చెయ్యి దీన్ని తుంచి పొయ్యిలో పెట్ట ! ఇది ఎన్ని చేస్తుంది ? కత్తులు పట్టీ, కటార్లు తిప్పీ, గొంతులు కోసీ, కడుపులో ఇంకా కన్ను కూడా తెరవని ఆడ పిండాల్ని నొక్కీ, నిలుచున్న పణాన నిలువెత్తు మనిషిని శవాన్ని చేసీ, అయినా... దీని వేళ్లు ఎంతకీ నోటి దాకా వెళ్లవే ! 2 దూరాల లెక్కే కదా అందరూ అడిగేది ఈ దూరాల్ని చెరిపెయ్యాలనే కదా ఎల్లరూ భూమ్యాకాశాలు కలపెట్టేది చెయ్యి వొక దేశం నోరు వొక దేశం నువ్వూ నేనూ శరీరఖండాలం ఇంకా తెగిపోతాం సరిహద్దులు తెంపి పోతాం వొకే వొక అన్నం మెతుకు నీ, నా వునికి ! మిన్ను విరిగి మీదనే పడనీ భూమి బద్దలయితే బద్దలవ్వనీ - మరి, ఆ క లి ! ( వివిధ - 19 మే 2014 )

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mKXjOy

Posted by Katta

14, మే 2014, బుధవారం

బాలసుధాకర్ మౌళి కవిత

అజేయులు ------------ ఆ యిద్దరు పిల్లల కాళ్ల ముందు సముద్రం కుక్కలా మొరుగుతుంది వాళ్లకదేది పట్టటలేదు సముద్రం మొరిగి మొరిగి అలల తోకాడించుకుని మళ్లీ వెనక్కి జారుకుంటుంది పాదాలపడవలేసుకుని తీరం గ్రామం మీదుగా నడుస్తూ ఎక్కడో వుండీ లేని ఇంటి గుమ్మంలోనో ఎప్పుడో వుండేదనుకుంటున్న వీధిలోనో తమకు తెలీకుండానే పారేసుకున్న కళ్లు వాళ్ల ఆల్చిప్పల చంద్రకాంతి కళ్లు - అడుగడుక్కీ కనిపిస్తుంటే సముద్రం వాళ్లకి కుక్కేనా అవుతుంది సముద్రం వాళ్లకి చచ్చిన పామేనా అవుతుంది వాళ్లు అజేయులు - సముద్రాన్ని జయించారు ! రచనా కాలం : 14 మే 2014 ------------------------- 14.05.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iM9WDh

Posted by Katta

15, ఏప్రిల్ 2014, మంగళవారం

బాలసుధాకర్ మౌళి కవిత

'లావణ్య' రాసిన మరో కవిత కోయిలమ్మా ! --------------- ఏదీ వొక్కసారి నీ గళం విప్పి గొంతెత్తి నవజీవనానికి బాటలు వేసే పాటలు పాడరాదూ... బహుశా నీ పాటలు యిక్కడ మూగబోవొచ్చు పదాలు విషపులోకంలో నిద్రపోనూవొచ్చు వజ్రవైఢూర్యాల కన్నా విలువైనది నీ గొంతు గంభీరంగా గొంతెత్తి మళ్లీ మళ్లీ పాడు - ఆకాశం ఉలిక్కిపడి మేఘాలు కదిలి అమృత వర్షంలో మేల్కోవాలి .. కదా ఓ కోయిలమ్మా ! ---------- 15.04.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eE0C9a

Posted by Katta

14, ఏప్రిల్ 2014, సోమవారం

బాలసుధాకర్ మౌళి కవిత

నా శిష్యురాలు 'లావణ్య' రాసిన మరో కవిత ! ఒక ఎడారి స్వప్నం ! ----------------------- స్వప్నం ఒక ఎడారి స్వప్నం మట్టిపూల సువాసనలు లేని ఎడారి స్వప్నం మబ్బుల్లోంచి ముత్యపు చినుకులు జారిపడని ఎడారి స్వప్నం ముళ్లు, విషసర్పాలు తప్ప అమాయకపు జింకపిల్లల పరుగులు లేని ఎడారి స్వప్నం తల్లి ప్రేమ కోసం ఉరికే దూడపిల్లలు లేని ఎడారి స్వప్నం స్వప్నం ఈ స్వప్నం సమస్తం కోల్పోయింది పసిపిల్లల నవ్వులతో సహా.. అంతా ముళ్లే, విషసర్పాలే - భయం భయంగా ఉలిక్కిపడి లేచిన నేను నా తల్లి అరణ్యం ఒడిలోంచి లోకంలోకి చూస్తూ.. ... చిన్న కుందేటిపిల్లలా... ----------------- 14.04.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gsBuxd

Posted by Katta

12, ఏప్రిల్ 2014, శనివారం

బాలసుధాకర్ మౌళి కవిత

నా శిష్యురాలు 'లావణ్య' - ఎంత సున్నితమైన ఊహ చేసిందో చూడండి. తనను చూసి నేను గర్వపడుతున్నాను. ఆడపిల్లలపై ప్రతి చిన్న విషయానికి ఆంక్షలు విధిస్తున్న ప్రస్తుతకాలంలో తను కవిత్వం రాయడం.. అదీ కళ్లు మెరిసేటట్టు రాయడం నాకు గొప్ప ఆనందాన్ని యిస్తుంది. తనిప్పుడు తొమ్మిదవ తరగతి. కన్నీటి చుక్కలు ------------------- కాసిన్ని కన్నీటి చుక్కలు యివి పవిత్ర నదీజలాలు ఒంటరి జీవితంలో వెంట వచ్చే పవిత్ర నదీజలాలు - నాలుగు కన్నీటి చుక్కలు చాలు - బాధల్లో బాంధవ్యాలనూ, బాధ్యతలనూ తెలియజేయడానికి ! నేనేం చేస్తాను నా ఒంటరి పోరాటంలో్ కాసిన్ని కన్నీటి చుక్కలు రాలుస్తాను కాసిన్ని కన్నీటి చుక్కలు యివి నా దుఃఖసమయంలో ఓదార్పునిచ్చే నా నేస్తాలు కాసిన్ని కన్నీటి చుక్కలే నా ఆనందపు దోసిలిలో సగభాగంగా మెసిలే హంసలు యివి పూలలా వాడిపోవు మబ్బుల్లా కరిగిపోవు యివి నిరంతరం నా తోడుగా నిలిచే నా ప్రియనేస్తాలు ! ----------------------------------- రచనాకాలం : 12 ఏప్రిల్ 2014 12.04.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iGBKdR

Posted by Katta

6, ఏప్రిల్ 2014, ఆదివారం

బాలసుధాకర్ మౌళి కవిత

పిల్లలూ.. కవులూ... కనిపించని పూలగుత్తులతో పిల్లలు ఎదురుచూస్తుంటారు అభిమానం కొంత ఆరాధన కొంత కళ్ల నిండుగా పరిమళిస్తుంటుంది కవుల ఆలోచనలచేతుల్లోనూ కనిపించని శ్రమ సౌందర్యపు పూలుంటాయి కరచాలనం చేసినా కౌగిలించుకున్నా కళ్ల ఆర్ధ్రమేఘాల బిందువులు దేహం నుంచి దేహంలోకి ప్రవహిస్తాయి కవులూ పిల్లలూ ఏ దేశానికైనా ప్రాణవీచికలు ! రచనా కాలం : 4 ఏప్రిల్ 2014 Time : 7 pm

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q5YgkN

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

బాలసుధాకర్ మౌళి కవిత

నదిపాట అలల గొంతుతో నది పాడుతుంటుంది ఏ సుదూరాన్నుంచో పక్షులు నదిపాట విని కచేరీ ముందు వీక్షకులు చేరినట్టు నది వొడ్డున చేరుతుంటాయి నది గొంతెత్తి మరింత మార్దవంగా ఆర్ధ్రంగా లాలిత్యంతో పాడుతుంది నదిది సమూహపు పాట సర్వదుఃఖాలనూ, దుఃఖావశేషాలనూ కడిగేసే జోలపాట జలపాట ఈ నది పుట్టి ఎన్నాళ్లయ్యిందో ఏ ఆదిమకాలపు వీరుడో నదిని నిలువునా ఛేదించి ఆవలి తీరానికి తొలి దారి వేసాడో ఎందరి మబ్బు బట్టిన కన్నుల్లో వేకువ సూరీణ్ణి నాటిందో నది గత వర్తమాన చరిత్రకు నిలువుటద్దంలా ఈ నది 2 నది దుఃఖాన్ని ప్రేమిస్తుంటుంది నురగల పరవళ్ల పాటలాగే దుఃఖాన్నీ గొంతు నిండుగా నింపుకుని దిక్కుల గుండెల్లో ధ్వనించేట్టు మహా ఆవేశంతో ఆలపిస్తుంది నది పాటంటే గాయాల పాటేనేమో ఏ ఆదివాసీ తల్లో పరమ ఆవేదనతో కార్చిన కన్నీరు ఎండి జ్ఞాపకంలా మిగిలిన కన్నీటి చారికేనేమో ఈ నది - కౄర అరణ్యమృగం దాడికి ఎముకలు బయల్పడిన లేత జింక దేహంలా నిండా తేలిన రాళ్లతో చుక్క నీరు లేని ఈ నది - 3 ఈ రోజు తెల్లారి కలలో నది కనిపించింది పడవేసుకుని నది మీదికి బయలుదేరాను లయబద్ధంగా తంత్రుల్లా కదలాడాల్సిన అలలు మూగగా రోదిస్తూ.. ఏవో కొన్ని పక్షులు నది మీది ఆకాశాన్ని రెక్కల కింద బరువుగా మోస్తూ మహా గుంభనంగా.. నది చనిపోయిందా ? ఏఏ అరణ్యాలనో, ఏఏ పర్వతాలనో దాటుకుంటూ తరాల మధ్య వంతెనలా అనంత జీవకోటి దేహాంతర రక్తప్రసరణలా ఎన్నెన్ని ఊళ్లనూ ఎన్నెన్ని పొలాలనూ వొరుసుకుంటూ ప్రవహించిందో ! నది మీద నాలుగు కన్నీటి బిందువులు రాల్చాను నదిని దగ్గరకు చేరదీసాను చేతులారా తడిమాను మూగబోయిన నదికి మళ్లీ తన రెక్కల పాటను గుర్తుచేయాలనుకున్నాను యిలా అనుకోవడమే అనుకోవడమే నది పాటయ్యింది పాటే నది అయ్యింది 4 విష పుష్పావృతచేతులతో నదిని దహనం చెయ్యొచ్చు వికశిత పుష్పాలంకారిక మాంత్రిక హస్తంతో నదిని మహానదిని చెయ్యొచ్చు నది ప్రజల అరచేతుల్లో నిండా మొలిచిన తడి మొలక నది - నది పురివిప్పుతుంది నది పురివిప్పుతుంది ( 'చంపావతి నది'ని చూసి దుఃఖంగా.. ) రచనా కాలం : 1 ఏప్రిల్ 2014 3.4.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hETAjf

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

పిల్లలూ.. కవులూ... కనిపించని పూలగుత్తులతో పిల్లలు ఎదురుచూస్తుంటారు అభిమానం కొంత ఆరాధన కొంత కళ్ల నిండుగా పరిమళిస్తుంటుంది కవుల ఆలోచనలచేతుల్లోనూ కనిపించని శ్రమ సౌందర్యపు పూలుంటాయి కరచాలనం చేసినా కౌగిలించుకున్నా కళ్ల ఆర్ధ్రమేఘాల బిందువులు దేహం నుంచి దేహంలోకి ప్రవహిస్తాయి కవులూ పిల్లలూ ఏ దేశానికైనా ప్రాణవీచికలు ! రచనా కాలం : 4 ఏప్రిల్ 2014 Time : 7 pm

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q5YgkN

Posted by Katta

3, ఏప్రిల్ 2014, గురువారం

బాలసుధాకర్ మౌళి కవిత

నదిపాట అలల గొంతుతో నది పాడుతుంటుంది ఏ సుదూరాన్నుంచో పక్షులు నదిపాట విని కచేరీ ముందు వీక్షకులు చేరినట్టు నది వొడ్డున చేరుతుంటాయి నది గొంతెత్తి మరింత మార్దవంగా ఆర్ధ్రంగా లాలిత్యంతో పాడుతుంది నదిది సమూహపు పాట సర్వదుఃఖాలనూ, దుఃఖావశేషాలనూ కడిగేసే జోలపాట జలపాట ఈ నది పుట్టి ఎన్నాళ్లయ్యిందో ఏ ఆదిమకాలపు వీరుడో నదిని నిలువునా ఛేదించి ఆవలి తీరానికి తొలి దారి వేసాడో ఎందరి మబ్బు బట్టిన కన్నుల్లో వేకువ సూరీణ్ణి నాటిందో నది గత వర్తమాన చరిత్రకు నిలువుటద్దంలా ఈ నది 2 నది దుఃఖాన్ని ప్రేమిస్తుంటుంది నురగల పరవళ్ల పాటలాగే దుఃఖాన్నీ గొంతు నిండుగా నింపుకుని దిక్కుల గుండెల్లో ధ్వనించేట్టు మహా ఆవేశంతో ఆలపిస్తుంది నది పాటంటే గాయాల పాటేనేమో ఏ ఆదివాసీ తల్లో పరమ ఆవేదనతో కార్చిన కన్నీరు ఎండి జ్ఞాపకంలా మిగిలిన కన్నీటి చారికేనేమో ఈ నది - కౄర అరణ్యమృగం దాడికి ఎముకలు బయల్పడిన లేత జింక దేహంలా నిండా తేలిన రాళ్లతో చుక్క నీరు లేని ఈ నది - 3 ఈ రోజు తెల్లారి కలలో నది కనిపించింది పడవేసుకుని నది మీదికి బయలుదేరాను లయబద్ధంగా తంత్రుల్లా కదలాడాల్సిన అలలు మూగగా రోదిస్తూ.. ఏవో కొన్ని పక్షులు నది మీది ఆకాశాన్ని రెక్కల కింద బరువుగా మోస్తూ మహా గుంభనంగా.. నది చనిపోయిందా ? ఏఏ అరణ్యాలనో, ఏఏ పర్వతాలనో దాటుకుంటూ తరాల మధ్య వంతెనలా అనంత జీవకోటి దేహాంతర రక్తప్రసరణలా ఏఏ ఊళ్లనూ ఏఏ పొలాలనూ వొరుసుకుంటూ ప్రవహించిందో ! నది మీద నాలుగు కన్నీటి బిందువులు రాల్చాను నదిని దగ్గరకు చేరదీసాను చేతులారా తడిమాను మూగబోయిన నదికి మళ్లీ తన రెక్కల పాటను గుర్తుచేయాలనుకున్నాను యిలా అనుకోవడమే అనుకోవడమే నది పాటయ్యింది పాటే నది అయ్యింది 4 విష పుష్పావృతచేతులతో నదిని దహనం చెయ్యొచ్చు వికశిత పుష్పాలంకారిక మాంత్రిక హస్తంతో నదిని మహానదిని చెయ్యొచ్చు నది ప్రజల అరచేతుల్లో నిండా మొలిచిన తడి మొలక నది - నది పురివిప్పుతుంది నది పురివిప్పుతుంది ( 'చంపావతి నది'ని చూసి దుఃఖంగా.. ) రచనా కాలం : 1 ఏప్రిల్ 2014 3.4.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hETAjf

Posted by Katta

23, మార్చి 2014, ఆదివారం

బాలసుధాకర్ మౌళి కవిత

ప్రగతిశీల సాహిత్య సంస్థల అవసరం.. యిప్పుడు కచ్చితంగా వుంది ! 1 సకల వ్యవస్థలూ ధ్వంసమైపోతున్న వొకానొక ఎడారితనం మన దేశంలో పరుచుకుని వుంది. గత నలభై, నలభై ఐదు సంవత్సరాలుగా దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ వొక అనిశ్చిత స్థితి వ్యాపించింది. వొక స్తబ్దత ఆవరించింది. నైన్టీస్ తర్వాత Globalization ప్రభావం చేత మరింత వేగంగా వైషమ్యాలు సమాజాన్ని పట్టిపీడించడం మొదలుపెట్టాయి. మనుషులలో నిజాయితీతనం స్థానంలో నటన ఆక్రమించడం, ఉత్త వెర్రి భ్రమలు పెరగడం, వస్తువీకరణ జరగడం - ఇవి అత్యంత విషాదకర దశాబ్దాల అనుభవాలు. ఈ స్థితి నుంచి బయటపడడం ఎలా ? సామాన్యంగా విజ్ఞులకు తోచే ప్రశ్న యిది. బహుశా సాహిత్యం - ముఖ్యంగా 'పోరాట సాహిత్యం' దానికి జవాబు అవుతుందని.. అనుకుంటున్నాను. డబ్భైల్లో ఆ పనినే సాహిత్యం నెరవేర్చింది. కవితైనా, కథైనా, వ్యాసమైనా, నాటికైనా, నవలైనా - ఏ సాహితీరూపమైనా - సమాజాన్ని జాకృతి పరిచి, చైతన్యవంతం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనిని చరిత్ర నిరూపించింది. మానవ సమూహాలకు వెలుగు దారి చూపించే దివ్వె 'చరిత్ర' .. అని నమ్ముతున్నాను. 2 సాహిత్యం ప్రజలిది. ప్రజాబాహుళ్యాన్ని విముక్తి చేయడంలో సాహిత్యం అగ్రగామి. నేను ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఊరిలో - ఈ రోజు నేనొక Experiment చేసాననుకుంటున్నాను. ఫలితం - అనుకున్నట్టే వస్తుందని పూర్తి విశ్వాసం వుంది. నా మిత్రుని ఇంటిలో ఐదుగురు స్కూల్ పిల్లలతో.. 'వొక సాహితీ సంస్థ ఏర్పాటు చేసుకోవాలి' - అనే దానికి Ground work చేసాము. ప్రపంచంలో గానీ, దేశంలో గానీ - వాటి సూక్ష్మరూపాలైన గ్రామాలలో గానీ పరుచుకుని వున్న - సంక్లిష్టమైన సామాజికావరణం నుంచి - నూతన వ్యవస్థ దిశలోకి వెళ్లడానికి ఏం చేయాలి ? .. అనే ప్రశ్న గత రెండు సంవత్సరాలుగా నా మనసును దొలుస్తుంది. గత సంవత్సరం ముఖ్యంగా అదే పని కోసం నా పాఠశాల గల ఊరిలోకి మకాం మార్చాను. వివిధ కారణాల వలన ముఖ్యంగా అమ్మ మీద ప్రేమ.. నన్నా ఊరిలో వుండనివ్వలేదు. పిల్లల కోసం సాహితీ సంస్థను స్టార్ట్ చేయాలనే - నా మనసులో కదిలిన ఆలోచన. కానీ సాధ్యపడలేదు. ఈసారి సాధ్యం కాబోతుంది. సాహితీ సంస్థ బాధ్యతను పిల్లల భుజాల మీదే పెట్టాను. They are pillars of our country and world - వాళ్ల మీద నాకు చాలా నమ్మకం వుంది. నిర్భందం ప్రతి చోటా వుంటుంది. యిప్పుడు దేశంలో నిర్భందం వుంది. గ్రామాల్లోనూ వుంది. మనుషులు - శత్రువును గుర్తుపట్టని స్థితిలో దాడి జరుగుతుంది. దేశ సాంస్కృతిక సంపదపై దాడి జరుగుతుంది. వాటన్నింటినీ తట్టుకుని లేవాలి. లేస్తాము. దురదృష్టవశాత్తు మనలోని మనుషులే - ప్రపంచీకరణ మాయ వలన సామూహిక జీవనం నుంచి దూరమై.. వ్యక్తివాదానికి.. దాని పరిమితులకు కుదించుకుపోతున్నారు. యిది వొక సాహితీసంస్థకు చాలా ఇబ్బందులను బహుశా సృష్టించవొచ్చు. కానీ ఇబ్బందులను అధిగమించి విజయవంతంగా నిలబడ్డ చరిత్ర మన కళ్ల ముందు వుంది. 3 ఉగాది కవిసమ్మేళనంతో 'పిల్లల సాహితీ సంస్థ'ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ప్రణాళికలో అంశాలు : ------------------------- అ. నెలకు రెండు, మూడు సాహిత్య సమావేశాలు నిర్వహించుకోవడం. ఆ. అభ్యుదయ సాహిత్య పుస్తకాలు, సాహిత్య - సామాజిక పత్రికలు చదవడం; అందులోని అంశాలు చర్చించుకోవడం. ఇ. తరుచుగా కవిసమ్మేళనాలు నిర్వహించుకోవడం. ఈ. ప్రగతిశీల కవిత్వం, కథలపై చర్చ. ఉ. మంచి వక్తల ఉపన్యాసాలను వినడం. ఊ. పట్టణాల్లో జరిగే అభ్యుదయకర సాహిత్య కార్యక్రమాలలో పాల్గోవడం. ఎ. సామాజిక పరిశీలన చేస్తూ.. దానిని కళ చేయడం. ఏ. విష సంస్కృతిని వ్యతిరేకిస్తూ.. సాహితీ సృజన చేయడం. ఐ. సభ్యుల సంఖ్యను పెంచడం. 4 సంస్థకు వొక పేరు కావాలి. పేరు కూడా చాలా ప్రధానం అనుకుంటున్నాను. మిత్రులు, శ్రేయోభిలాసులు, సాహితీ జీవులు, సాహిత్య ఆరాధకులు వొక పేరు సూచిస్తారని కోరుతున్నాను. పిల్లల సాహిత్య సంస్థే - కానీ వాళ్లతో పాటూ అది పెరుగుతుంది - భవిష్యత్తులో కూడా వాళ్లూ, వాళ్ల తర్వాత వాళ్లూ సంస్థను మోస్తారు. అందులో.. సీరియస్ అంశాలనే చర్చించడం జరుగుతుంది. పేరును సూచిస్తారని అందరినీ మళ్లీ మరోసారి కోరుతూ.. ధన్యవాదాలు. 23 మార్చి 2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jqPw4T

Posted by Katta

21, మార్చి 2014, శుక్రవారం

బాలసుధాకర్ మౌళి కవిత

కవిత్వంతో నా అనుభవం : ---------------------------- కవిత్వం వొక గొప్ప చలనభూతమైనది. మనిషిని అది అత్యంత గొప్పగా ప్రభావితం చేస్తుంది. నిర్మిస్తుంది. ప్రంపంచ దేశాలలో అన్ని కాలాలలో కవిత్వం మనిషిని తలవంచని వీరుణిగానే నిలబెట్టింది. వొకొక్కప్పుడు కవిత్వం కొందరికి చెందిన సరుకుగా చెలామణి అయినా చివరకు అది చేరాల్సిన వాళ్ల చేతుల్లోకే చేరింది. చేయాల్సిన పనినే చేస్తుంది. కవిత్వం వొక ఆయుధమైంది. గాయాన్ని మాన్పే ఔషధమైంది. తల నిమిరే జాలి చేయి అయ్యింది. కవిత్వమంటే ప్రపంచ మానవ సమూహాలపై తెరుచుకున్న చైతన్యపు కన్ను. అలాంటి కవిత్వంతో ఈ ప్రపంచ కవిత్వ దినోత్సవం సందర్భంగా నా అనుభవం మీతో పంచుకోవాలనిపించింది. నేను చదివిన తొలి కవిత్వ సంపుటి - 'మహాప్రస్థానం'. మా ఊర్లో మా ఇంటి దగ్గర బీరువా నిండా పుస్తకాలు. మార్క్సిస్ట్ మహా గ్రంధాలు. 'కార్ల్ మార్క్స్ -ఎంగెల్స్' పేర్లు అక్కడ తెలిసాయి. రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థ కుప్పకూలాక - తొంబై ఒకటిలో విజయనగరం కోట దగ్గర చవగ్గా అమ్మితే నాన్న కొన్నవవి. రెండు మూడు కాగితాలు తిప్పి పెట్టేసేవాడిని. కానీ వాళ్ల గొప్పతనాన్ని నాన్న చెప్పేవారు. స్కూల్ డేస్ లో అల్లూరిని, గాంధీజీ జీవిత చరిత్రను చాలా ఇష్టంగా చదివేవాడిని. అల్లూరి పోరాటం నచ్చేది. దానిని పక్కవాడికి Explain చేసేవాడిని. వాణ్ణీ ఉద్యుక్తున్ని చేయడమే నా ఉద్దేశం. తర్వాత మార్క్స్, మావో, చేగువేరా, ఫైడల్ కాస్ట్రో, లెనిన్, స్టాలిన్ ల రచనలు చదివాను. చదువుతున్నాను. ఈ మహానుభావుల రచనలను నేనైతే మనల్ని ఊపేసే కవిత్వంగానే భావిస్తాను. వొక గొప్ప ఆలోచనను కలిగించి మనపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయవి. నాకు అత్యంత ప్రేరణ, బలం యిచ్చిన కవిత్వం కె. శివారెడ్డి గారిది. 'గగనమంతా తలతో.. ' - చదివాక నా ఆలోచనల్లో మార్పుని గుర్తించాను. చర్య, అతను చరిత్ర - కవిత్వం చదివాక పోయిట్రీ సొబగు తెలిసింది. ఆ తర్వాత.. శివసాగర్ కవిత్వం నన్ను సమ్మోహితున్ని చేసింది. అరణ్యం మీద, పోరాటాల మీద వొక రకమైన curiasity ని పెంచింది. నగ్నముని 'కొయ్యగుర్రం' చదివాక - ఆ కవిత్వ వస్తువుకు, వ్యక్తీకరణకు, కవి దృక్పథానికి గాల్లో తేలిపోయాను. హెచ్చార్కె 'వానలో కొబ్బరి చెట్టు' కవిత్వ నిర్మాణం, అందులో ఆర్థ్రత నన్ను విపరీతంగా కదిలించాయి. అఫ్సర్ 'ఊరి చివర' చదవడం - వొక అనుభవంగా మిగిలిపోయింది. యాకూబ్ 'ప్రవహించే జ్ఞాపకం'లో సున్నితత్త్వం నా కవిత్వానికీ కావాలనుకుంటాను. అలెక్స్ హెలీ 'Roots' - నవల చదివాక గుండె బిగబట్టీసింది. ఆ రోజు రాత్రంతా దుఃఖపీడనంతో ఏడ్చుకున్నాను. నా ఆలోచనను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకమది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఇతర మార్క్సిస్ట్ పుస్తకాలు - ఆ కోవలో వచ్చిన అనేక వ్యాసాలలో కవిత్వాన్ని నిర్మించే గొప్ప వ్యూహముంటుంది. అవి కచ్చితంగా చదవాల్సినవి. ఇటీవల నేను చదివిన వొక అద్భుతమైన పుస్తకం- డా. ఎం.ఎఫ్. గోపీనాథ్ గారి - 'నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా ? అయితే సంతోషం !' - .కొత్త ఆలోచనను, దృక్పథాన్ని యిచ్చింది. నెరూడా, అంద్రాదె, లాంగుస్టన్ హ్యూగ్యూస్ లాంటి వివిధ దేశాల కవులను చదవడం వలన మన ఆలోచనల్లో , కవిత్వ వస్తువుని తీసుకోవడంలో, కవిత్వ నిర్మాణ వ్యూహాలలో విస్తృతి పెరుగుతుంది. * నా పాఠశాల నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. పిల్లల్లో నుంచి Poets ని, artists ని బయటకు తీసే పనిలో వున్నాను. నాకు దొరికిన అద్భుతమైన కవిత్వపాదాలు వాళ్లు. వాళ్లతోనే నన్ను నేను వ్యక్తం చేసుకుంటాను - వాళ్లలోనే నన్ను నేను శోధించుకుంటాను - నన్ను నేను సానబెట్టుకుంటాను. Expression is more important to poetry - నా పిల్లల మధ్య పాఠ్యాంశ విషయాలను - ప్రాపంచిక అంశాలతో, వర్తమాన సామజిక స్థితిగతులతో మిళితం చేసి , నా దేశాన్ని గురించి సైద్ధాంతిక శాస్త్రీయ అవగాహన పొందేటట్టు.. చెబుతూ - లీనం కావడం నాకు అమితమైన యిష్టం. అది నా టీచింగ్ శైలి. రానున్న కవిత్వ యాత్రలో నా కవిత్వ వ్యక్తీకరణకు పిల్లల మధ్య వుండడం అనేది - ప్రధాన కారణంగా వుంటుందని నమ్ముతున్నాను. అన్ని దేశాల ప్రజాసమూహాలను కలిపి వుంచే గొప్ప వంతెనగా వున్న కవిత్వమా... జయహో ! మామూలు మనుషులను మహా శక్తివంతులుగా తీర్చిదిద్దే కవిత్వమా జయహో ! కవిత్వం చరిత్రను తిరగరాస్తుంది. కవిత్వం చరిత్రను తిరగరాస్తుంది. కవిత్వం చరిత్రను తిరగరాస్తుంది. కవిత్వం చరిత్రగా మిగిలిపోతుంది. -------------------------- 21 మార్చి 2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5X7Lz

Posted by Katta

18, మార్చి 2014, మంగళవారం

బాలసుధాకర్ మౌళి కవిత

Restrogression ? అప్పుడే పుట్టిన లేగదూడ చర్మం మెరుపులాంటి వర్షాకాలపు పొద్దుటిపూట - చెరువు మీద వేటకు దిగుతాడు రెండేళ్ల బుడతడు వర్షాకాలపు పొద్దుటిపూట చెరువు - తనలాగే పసిది తల్లి వొడిలోంచి అప్పుడే నిద్రలేచిన నిద్రకళ్ల పసిముఖంది మెరకల్లో గేదెల మీద గుర్రపు స్వారీ చేసిన అనుభవమున్న ఆ రెండేళ్ల బుడతడు చెరువు మీదికి ఆశ్చర్యానందాల చూపులరివ్వ విసురుతాడు బుడతడి కళ్లల్లో గుప్పెడు బంగారు రంగు పరిగెలు ఈదులాడ్డం చూస్తాం వొక తడి స్వప్నం ముగ్ధంగా కదలాడ్డం చూస్తాం బుడతడు నక్షత్రకాంతిధారుడు గొప్ప సాహస యాత్రికుడు సౌందర్య ఉపాసకుడు ఆ బుడతడెవరంటే.. నలభైయేళ్ల కిందట వాగులో జింకలా పల్టీలు కొట్టిన నువ్వే గావొచ్చు లేదూ ఇరవైయేళ్ల కిందట మెరకల్లో మట్టిని ముఖం నిండా నలుగులా పూసుకున్న నేనే గావొచ్చు బాల్యం అద్భుత కళాఖండం శిలాక్షరాలపారవశ్యగీతం Restrogression అంతా తలకిందులయ్యింది వర్షాకాలపు పొద్దుటిపూట అప్పుడే పుట్టిందైనా - చెరువు క్రూరమైన మృగంలా కనిపిస్తుంది ఇష్టందీరా తిరిగిన పచ్చని మెరకలన్నీ లోపలకు మింగేసే మహా అగాథాలనోళ్లలా కనిపిస్తాయి కాళ్ల పాదాల దగ్గరే ఏ దుర్గమారణ్యం నుంచోతప్పిపోయొచ్చిన కుందేటి పిల్ల భయంతో మునగడదీసుకుంటుంది మమకారపు చే స్పర్శని కాసింత యివ్వనైనా యివ్వం కళ్ల ముందే రెక్కలు విప్పుకుంటూ రంగురంగుల పిట్ట సుదూరాకాశంలోకి రివ్వున ఎగిరిపోతుంది చూపుని కాస్తా అటువైపు తిప్పనైనా తిప్పం fearness భయం డ్రాకులా మనిషిని బంధీ చేస్తుంది సకల సౌందర్యానుభవాలనూ మనవి కాకుండా చేస్తుంది ఈసారి వర్షాకాలం వొచ్చినప్పుడు ఏ భయాందోళనలూ లేని రెండేళ్ల విలుకాడు - బుడతడుగానే మారదాం కళ్లను కోమల మార్దవ జలతటాకాలను చేసుకుందాం అంతా ఇక బాగుంటుంది ! 18.03.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cVaZV3

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

బాలసుధాకర్ మౌళి కవిత

విద్యార్థుల కవిత్వం ------------ 13. కమలాకర్. ఎ ------------ ఆ ముగ్గురూ.. ఆ ముగ్గురూ.. కాసిన్ని బతుకు కాగితాలను ఏరడానికై సిద్ధమయ్యారు వాళ్లకు అవి ప్రాణం గుండెలపై వాటిని హత్తుకుంటారు అవి బతకడాన్ని నేర్పుతుంటాయి వాళ్లు పోరాటానికి సిద్ధమైన సైనికులు వాళ్ల అదృశ్య తల్లులు చూపుడు వేళ్లతో ఉదయాల్ని చూపిస్తారు వాళ్ల పోరాటాన్ని పుట్టుకతోనే ప్రారంభించినవాళ్లు ఆ ముగ్గురూ.. ఆ పనిలో గొప్ప కార్యకర్తలు ప్రతి తెల్లవారి వాళ్లు సూర్యోదయాన్ని వొంటికి పూసుకుని బయలుదేరుతారు వాళ్లకు ఆ కాగితాలు జీవితాక్షరాలను చూపిస్తుంటాయి వాళ్ల- కళ్ల ముందు కాలం నిలిచి వుంటుంది కాలం మీద వొక అపూర్వమైన సంతకం వాళ్లు! -------------------- 15.03.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nsqjgr

Posted by Katta

7, మార్చి 2014, శుక్రవారం

బాలసుధాకర్ మౌళి కవిత

స్తబ్దత నది నదిలా లేదు పడవ పడవలా లేదు ప్రయాణం ప్రయాణంలా లేదు దరులను వొరుసుకుంటూ నీళ్లలా భ్రమింపచేస్తున్న పొడి యిసుక- దున్నల కాళ్లకడ్డం పడుతూ తెగిపడుతున్న తూనీగల రెక్కలు- ఆకాశం నడిమింట నెత్తుటెండను స్రవిస్తున్న సూరీడు- అంతా స్తబ్దతావరణం అవిశ్రాంత అలజడిమబ్బు నిశ్శబ్దం పాము చుట్టలు చుట్టుకుని బద్దకంగా కాలం రాయి కింద పడి వుంది అడుగు తీసి అడుగు వేస్తే ముళ్లు- ముళ్లు పరుచుకున్న నేల మీద యుద్ధాన్నెలా రచిస్తావు- అంతా ఎడారి నిశ్శబ్దం శ్మశాన నిశ్శబ్దం యుద్ధం తర్వాత యుద్ధక్షేత్రంలో చెల్లాచెదురుగా పడివున్న క్షతగాత్రుల అవయవ నిశ్శబ్దం ఓటమి నిశ్శబ్దం శిలాసదృశ్యమైన నేల మీద యుద్ధాన్నెలా రచిస్తావు- * కళ్లంలో కొంటికర్రతో సొప్పను పైకెత్తుతున్నాడొక రైతు పుల్లలను కూడేసి రాజేసిన మంటలో దుంపను కాలుస్తున్నాడొక పిల్లాడు పూలగంపను నెత్తిన పెట్టుకుని చెరువు కట్టెంబట ఊరిలోకి బయలుదేరుతుంది ఒకామె * నిశ్శబ్దం కొండ కూలుతుంది జనం నది కదులుతుంది ---------------------------------- Date: 07.03.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g60ZY8

Posted by Katta

24, ఫిబ్రవరి 2014, సోమవారం

బాలసుధాకర్ మౌళి కవిత

విద్యార్థుల కవిత్వం: -------------------- 11. సాలాపు దాలి నాయుడు ------------------------------- నాలుగు తాలు కట్టిన గూడతో.. ------------------------------- కోడి కుయ్యనే లేదు పొద్దు పొడవనే లేదు సూర్యకిరణాలు భూమిని తాకనే లేదు నాకు అమ్మానాన్న నోట పిలుపు వినిపించింది ఆ పిలుపు విని నేను కంగారుగా లేచాను మా గోడ పక్క గడియారం చూస్తే చిన్నముళ్లు ఒకటి దగ్గర - పెద్ద ముళ్లు పన్నెండు దగ్గర దట్టమైన పొగమంచు చూడడానికి కళ్లు కనిపించడంలేదు అమ్మానాన్న నన్ను లేపి గూడ డబ్బను పట్టుకోమన్నారు ఆ గూడకు నాలుగు వైపులా నాలుగు తాలు కట్టి పట్టుకోమన్నారు అర్థరాత్రి వేళ శ్మశానం దాటి పోతున్నం మా దగ్గర ఏమీ లేదు - నాన్న చేతిలో టార్చ్ లైట్, అమ్మ చేతిలో తువ్వాల, నా చేతిలో గూడ తప్ప - ఆ అర్థరాత్రి వేళ అమ్మను నన్ను గూడను పట్టుకుని వెయ్యమన్నాడు నాన్న నాన్న మాత్రం వరిసేనుకు తారీలు కట్టి వస్తానని వెళ్లాడు - ఆ అర్థరాత్రి అమ్మా నేను - నాలుగు తాళ్లు కట్టిన గూడ డబ్బాతో చెరువులో వున్న నీటిని పొలంలోకి తోడుతున్నం పొద్దు గడవనే గడిచింది పొలంలో నీరు కలవనే కలిసింది అప్పుడు అమ్మ వరిసేను వైపు చూసి దండం పెడుతుంది, ఎలా అంటే.. 'అమ్మా పొలమా.. నువ్వు మాకు తినడానికి తిండినిస్తావు.. మాకు తెలుసు ! మేము నీ కోసం పెట్టిన మదుపు చేసిన అప్పులు నీతోనే వున్నాయి.. నువ్వు మా నంద నింపేలా పొట్ట వెయ్యమనీ ' - అమ్మ దండం పెడుతుంది కొన్ని రోజులు పోయాక తెలియాలి మా అమ్మ దండం ఫలితం. ---------------------------- 24.02.14

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxBuP5

Posted by Katta

12, ఫిబ్రవరి 2014, బుధవారం

బాలసుధాకర్ మౌళి కవిత

Dictator దేన్నీ కాదనం- వస్తువులను పొందిగ్గా మనం అలమరాల్లో అమర్చుకుంటుంటాం ముద్దుగా వుందని పింగాణి చెవులపిల్లిని టేబుల్ మీద పెట్టుకుంటాం రబ్బరు కుక్కపిల్లని టీపాయ్ మీద కూర్చోనిస్తాం గోడల మీద ఫెలికాన్ సీతాకోకలనూ టీ.వీల మీద ప్లాస్టిక్ పూలనూ ఎగరేస్తాం ముచ్చటపడతాం హొయలుపోతాం మూతి మూడు వంకరలు చేసి తిప్పుతాం పసిలోకాలన్నింటినీ సరాసరి మార్కెట్ నుంచే దిగుమతి చేసుకుంటాం పసిహృదయాలనూ ఆటబొమ్మల్లోనే చివరకు ఆటబొమ్మల్లోనే వెతుక్కుంటాం Break out మనుషులను Dictate చేస్తున్న కాలం మనుషులను వస్తువులుగా వస్తువులను మనుషులుగా Dramatic చేస్తున్న కాలం సింహంజూలుకాలం నాగుపాముకాలం గదుల్నిండా, అలమరాల్నిండా పేరుకుపోయి దుమ్ముపట్టిన జెర్రిగొడ్డుకాలం మనుషులపై వస్తువులు దండయాత్ర చేసే తేలుకొండెకాలం వస్తువులే సర్వస్వం మనుషులు శూన్యం - మనుషులే శూన్యం నియంతలు ఎక్కడో లేరు మన చుట్టూ మన ఆలోచనల్లోనూ సర్వ వింధ్వంసకర పేలుడు పదార్థాలతో వ్యాపిస్తున్న పుట్టపగిలిన కాలమే- కాలమొక పెద్ద నియంత కాలం చేతిలో తోలుబొమ్మ ఆలోచనొక నియంత నియంతలు కూలాలి నియంతల పీఠాలూ కూలాలి నియంతల్ని తయారుచేస్తున్న పెద్దపులి కుట్రలూ కూలాలి Press the trigger భ్రమల్నీ, భ్రమల గోడల్నీ, కుళ్లిన మస్తిష్కాలనూ Shut down ! రచనా కాలం: 11-02-2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iOSFMo

Posted by Katta