పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, మార్చి 2014, శుక్రవారం

Abd Wahed కవిత

సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ’’ప్రేయసితో సంభాషణ‘‘ అన్నఅర్ధానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. రెండవ విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. పడగవిప్పి లేచినట్టి నల్లతాచు జడపొగరుకు సంపెంగల వంటిముక్కు కారణమూ లాగున్నది ఆకశాన హరివల్లుకు వంపునెవరు నేర్పారో చూసిందా చక్కని నీ పెదవి విరుపు లాగున్నది మంచుపొరలొ గులాబీపై ప్రతిఫలించే లేత ఎండ చెంపలపై నర్తించే మెరుపుపూవు లాగున్నది శంఖంలో సంగీతం పలుకుతుంది ఎందుకనో పోలికలో అది కూడా నీ కంఠము లాగున్నది అందంగా వంగుతోంది సెలయేరూ నర్తకిలా నడుం వంపు నేర్పిందా ఈ నాట్యము లాగున్నది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKC2Hu

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి