పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Udaya Babu Kottapalli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Udaya Babu Kottapalli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జూన్ 2014, మంగళవారం

Udaya Babu Kottapalli కవిత

ఉదయబాబు **ఒక సంధిగ్ధ సమయంలో**17-6-2004 మొన్న మరణించిన వత్సరంలోంచి నిన్న మరణించిన రోజులోనుంచి... మొలకెత్తిన వరినారుమడిలా క్షణాలు కొల్లలై...కోకొల్లలై...పుట్టుకొస్తున్నాయి... ఆశల పాలు పోసుకుని కోరికల కంకులు... స్పృశిస్తున్న పైరగాలిలో...వయ్యరాలు పోతున్నాయి... చంటిపాప మునిపంట కొరికిన ఇడ్లి ముక్కలా చతుర్దశి చంద్రుడు పరువానికి రాని వెన్నెలను పైరుమీద పరుస్తున్నాడు... పండుతున్న పంటను చూసి... శ్రమించిన శారీరక శ్రమ స్రవిస్తున్న రాలుకన్నీటి పిందెల్ని మోచేతుల ఎముకల బద్దలపై నిలబెట్టిన అరచేతులపంజరంలో మెరుస్తున్నాయి... ఆక్షణంలో అవి ఆనందభాష్పాలే...... పవితమైన ఓటుతో నిలబెట్టిన అధికారం ఇచ్చిన మాటను వోటుకుండ పాలు చేసి... ప్రకౄతి పగబట్టిన వేళ... ఆ క్షణంలో సర్పయాగానికి సన్నద్ధమయ్యే జీవన సమిధలు విసర్జించే రక్తాశ్రువులే... \u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C ::: >>>>>>>>>>>

by Udaya Babu Kottapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uAzUjG

Posted by Katta

31, మే 2014, శనివారం

Udaya Babu Kottapalli కవిత

సమాధి బయటకు ఆహ్వానం కొత్తపల్లి ఉదయబాబు 31-5-2014ఎవరో...ఎవరో ఛళ్ళు ఛళ్ళున చరుస్తున్నారు... అశాంతుల్ని...విభ్రాంతుల్ని....ఆశావహాలని, పెచ్చులూడిపోతున్న జ్ఞాపక శకలాల్ని కుండపెంకుల్లా విచ్చిపోతున్న అనుభూతుల్ని... కాలపు బీడుభూముల నెరజల్లోకి...జార్చేసుకుని... చిక్కగా అల్లిన క్షణాల దుప్పటిని కప్పుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన నన్ను....ఎవరో.... ఎవరో...ఎవరో ఛళ్ళు ఛళ్ళున చరుస్తున్నారు... ఏదో ఒక అజ్ఞాత వాక్కు....ఆకాశ అశరీర వాణిగా... తనకోసం బ్రతికేవాడు మనిషి... చుట్టూ ఉన్నవారికోసం బ్రతికేవాడు మనీషి... హస్త కళపు కలానికి తుప్పు పట్టించి... భావజాలపు జలలోంచి...ఉత్తుంగతరంగాలై ఎగసే కవితావేశాన్ని,...కోశస్థ దశలోకి పంపి ప్రపంచానికి దూరంగా పరకాయప్రవేశం చేసే అర్హత ఎవరిచ్చారు సుకవీ నీకు... రా...కదలిరా....లే....లేచిరా....నీ ఆలొచనల వనరుల్ని... పదిమంచికి పంచి....వారి అనుభవ రాశుల్ని... అవసరార్ధులకు పంచే నీ నిరంతర శ్రమ కొనసాగించు... అనంతవాహిని యై పునః ప్రభవించు...!!! \u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C :: >>>>>>>>>>>>>>>>>>>>>>

by Udaya Babu Kottapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1u0xZ9I

Posted by Katta

3, మే 2014, శనివారం

Udaya Babu Kottapalli కవిత

నానీలు నోటు నల్లముసుగు లో ఓటు అమ్ముకుంటే . . పాలించేది నేత కాదు . . నిలువునా దోచేసే జాతి పీత . . . అమ్మ పాలు ..వేసే ఓటు . . . అమృతం అంత పవిత్రం . . నోటు తో చేయకు దానిని గరళం . . . . . నాయకులు . . . . గురువులు లేని పూ . . జారులు . . లింగంపాటు గుడినీ . . . కబ్జా చేయగల జాలరులు . .

by Udaya Babu Kottapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Retz0w

Posted by Katta

Udaya Babu Kottapalli కవిత

నానీలు ఓటు పతివ్రత అని ఎవడన్నాడు . . రాజకీయ కౌరవ దర్బారులో వలువలు ఒలిచే దుశ్శాసనుడినడుగు . . . . . నీ చూపుడువేలు పైన పెట్టినది ఓటు చుక్క కాదు . . అచ్చమైన సేవకుడి నుదుట వీరతిలకం . . . . . . అంపశయ్య మీద రాజకీయ కళేబరానికి నీ ఓటే ధీటైన సంజీవని . . . . . కొత్తపల్లి ఉదయబాబు . . 20.4.2014

by Udaya Babu Kottapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q0aYVB

Posted by Katta

21, మార్చి 2014, శుక్రవారం

Udaya Babu Kottapalli కవిత

నిండు చంద్రునికి ఒక నూలుపోగు కొత్తపల్లి ఉదయబాబు : 21-3-2014 అమ్మా..! .నాన్న ఏడని అడిగిన ప్రతీ బిడ్డ ప్రశ్నకు... సమధానం గా ఆమె చూపుడు వేలు చివర నిలబడ్డ ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం...నాన్న... విత్తిన ప్రతివిత్తు...చిగురుపిట్టై మొలకెత్తాలని మొక్కై ఒడుదుడుకులనెదుర్కొని ఎదిగి వటవృక్షమై నిలవాలని సేద్యం చేసే నాన్న ఆశ...! అమ్మ క్రమశిక్షణా శిబిరంలో నాన్న ఒక దండనాయుధం... నిత్య సంసార సమరంలో అమ్మచాటు అందరికి నాన్న ఒక ఛత్రం..... గడియారపు ముల్లును ఓడించే నాన్న వౄత్తిధర్మం ముందు అధర్మం ఎప్పుడూ అవిటిదే.... పాతికేళ్ళ జీవితాన్ని సమాజంలో సగౌరవపు స్థానంలో నిలబెట్టిన పెంపకానికి మూల ధనం నాన్న... వెన్ను ఇంద్రధనుస్సై జీవితాన్ని మూడోకాలు నడిపిస్తున్నప్పుడు... ఎడమ భుజమై బిడ్డకు తోడై నిలబడే నాన్నను చూసి ప్రతీ కుటుంబపు పతాకం " జై "కొట్టాల్సిందే... ప్రతీ బిడ్డ ఆరూపానికి సాష్టాంగపడాల్సిందే...!!! ********************* ::: ********************

by Udaya Babu Kottapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5X8ix

Posted by Katta

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Udaya Babu Kottapalli కవిత

సాహితీ మిత్రులందరికీ సాహిత్యాభివందనాలు...ఈ నెల " కౌముది " లొ నా కవిత ను ఈ క్రింది లింక్ లో చదివి ఆశీర్వదించండి...http://ift.tt/LmOifi

by Udaya Babu Kottapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LmOifi

Posted by Katta