మిత్రులందరికి కవితా దినోత్సవ శుభాకాంక్షలు... ॥ఒక అపహరణ వృత్తాంతము॥ సన్నివేశం-1 నేను నీ గురించే ఒక అందమైన కవిత రాస్తున్నా ఉండు పిల్లా, నా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళను పలకరించి వచ్చేస్తా ప్లీజ్ ఆగరా కన్నా, నాకొక ముఖ్యమైన పని వుంది జస్ట్ ఇప్పుడే చేసి వచ్చేస్తారా నాన్నా, నేను ఊరెల్తున్నా రెండు రోజుల్లో వచ్చేస్తా బంగారు, రోజూ నాతో కాసేపు గడపడానికి, నాలుగు మంచి మాటలాడడానికి ఎన్ని కబుర్లు చెబుతున్నావు నేస్తమా... నాకు నీ సాకులొద్దు ప్రియా నువ్వు మరి నీ ప్రేమ కావాలి అంతే. సన్నివేశం-2 ఎక్కడో సన్నగా సుశ్రావ్యమైన సంగీతం వినబడుతున్నది. నిద్రమత్తు ఇంకా వీడనంతుంది. సన్న జాజుల పరిమళం ఆఘ్రాణిస్తూ ఏదో తెలియని మైకంలో తేలుతున్నట్టుంది. నేనెక్కడున్నాను!! అని తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి ముందే!! నా నుదుటిపైన ఒక తీయని ముద్రనిచ్చింది నా రాణి!! నవ్వుతూ వచ్చి నా ముందు సిగ్గుతో తలవంచి నిలబడింది. ఆమె చుట్టూ నా కౌగిలిని బిగించిన నేను మెల్లగా తన మోమును పైకెత్తి అధరాలపై ఒక ముద్దందించాను. ఎంత కాలం అలా ఉన్నామో తెలియదు. ఓహ్ !! జ్ఞాపకం వచ్చింది అప్పుడడిగాను నేనిక్కడికెలా వచ్చాను ? చెప్పవా పిల్లా ? అని ? నవ్వుతూ చెప్పింది నిన్ను నేను అపహరించాను రాజా. నువ్విక నా ప్రేమఖైదివని. మనమిప్పుడు ఒక రమ్యమైన ప్రాంత్యంలో ఏకాంతంగా ఉన్నామని. తనివితీరా నా రాజుతో విహారించేదాక విడిచిపెట్టే సమస్యే లేదని సెలవిచ్చింది. మనసారా ప్రేమించే నా బంగారుకొండను నాకే తెలియక ఇంత భాధ పెట్టానా అని నాలో నేనే మథనపడ్డాను. ముద్దుల్తో ముంచెత్తాను. స్వైరవిహారం చేసాము. తనివి తీర ఆనందించాము. ఆమె కోర్కెలన్నీ తీర్చాను. సుఖాంత్యం " ఇక ఇంటికి వెళ్తాం పదండి. మళ్లీ మీరిలా చేస్తే నేను మళ్లీ మిమ్మల్ని అపహరిస్తా" అని చిరునవ్వు నవ్వుతూ ఆజ్ఞాపించింది నా అర్ధాంగి.. ॥మాలచిదానంద్॥21-3-2014||
by Mala Chidanand
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PWvaIj
Posted by Katta
by Mala Chidanand
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PWvaIj
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి