పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Pardhasaradhi Vutukuru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pardhasaradhi Vutukuru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Pardhasaradhi Vutukuru కవిత

మన పాత తరాలకు గుర్తింపు పెద్దలు మన పూర్వికుల జ్ఞాపకాలు పెద్దలు మనం కుడా భవిష్యత్ లో పెద్దలమే మనం తెలియకుండా ఎదిగిపోతాం ఇప్పటికి మన బాల్య జ్ఞాపకాలు మనల్ని అంటి పెట్టుకొనే వుంటాయి అనుభవాలే మనల్ని పెద్దవాళ్ళని చేస్తాయి పెళ్ళికి ముందు అమ్మ నాన్నల ప్రేమ యుక్త వయసులో స్నేహితుల సరదాలు బాంధవ్యం తో కుటుంబ బాధ్యతలు పిల్లలతో హృదయ పూర్వక అనుబంధం పెళ్ళిళ్ళతో కోడళ్ళతో పెద్దరికం ఒంటరి తనం లో పాత జ్ఞాపకాలు ఇప్పుడు ఎవరికీ అవసరం లేని బయట పారేయ్యలేని ఒక బరువు !!పార్ధ !!23/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5E60u

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ఏదైనా చెప్పాలి తెలియచేయాలి అనుకున్నా మనకున్న ఏకైక సాధనం మాట అది లోపల ఉన్నంత వరకు మనం దానికి రాజు అది బయటకు వస్తే దానికి బానిస పరుషం గా మాటలాడటం ఆత్మాభిమానం కావచ్చు ప్రేమ గా మాట్లాడితే విరోధి కుడా ఆప్తుడే అవుతాడు బాధ కలిగించే పరుష వాక్యాల కంటే ధైర్యాన్ని ఇచ్చే మంచి మాట మేలు నేస్తమా !!పార్ధ !!23/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nwpbCX

Posted by Katta

22, జూన్ 2014, ఆదివారం

Pardhasaradhi Vutukuru కవిత

మనుషుల మధ్య వున్నామా మృగాల మధ్య వున్నామా కొంచం అయినా కనికరం మృగానికి ఉందేమో కాని ఉన్నత విద్య చదివినా కనీసం మానవత్వం మర్చిపోయి కేవలం ధనమే పరమా వధిగా జీవించే మానవ రక్కసులు మన్యం లో మహిళల దేహాలే వాళ్లకు సోపానాలు మంచి చెడు తెలియదు వ్యాది వున్నా లేకున్నా ప్రతి దానికీ ఆపరేషన్ మార్గం ఆపరేషన్ చేయకపోతే చావే దిక్కు ఒక్క సంవత్సరం లో ఎనబది ఇదు వేల ఆపరేషన్ లు ప్రతి ఒక్కరికి గర్భసంచి తీసివేయటమే ఇది తప్పు అన్యాయం అనే దిక్కే లేదు వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు ఆడ పిల్ల అని తెలిస్తే అప్పుడే చంపెయటమే కదా దానికి అర్హత వున్నా వైద్యుడా అన్న నియమం అసలే లేదు జ్ఞానం వున్న వాళ్ళే డబ్బుకు కక్కుర్తి పడితే ఎవరికీ చెప్పుకోవాలి అమాయక ప్రజలు .. దేవుడా చూస్తూనే వుండు !!పార్ధ !!22/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T0NyjH

Posted by Katta

21, జూన్ 2014, శనివారం

Pardhasaradhi Vutukuru కవిత

ఎవడు శాశ్వతం ఇక్కడ ఏది శాశ్వతం ఇక్కడ పుట్టినపుడు మనం ఏమి తోడూ తెచ్చుకోలేదు పోయే సమయంలో కనీసం మొలతాడు కూడా రాదు ఎందుకీ ద్వేషాలు ఎందుకీ ఆవేశాలు ప్రశాంతం గా కడుపార తినలేక ఆనందం గా కళ్ళ నిండా నిద్ర లేక మనసులో బాధలు పెంచుకుని వేరొకరితో పంచుకోలేక ఎందుకీ వేదన ఎంత సంపాదించినా నీదే నీకుంటుంది ఎంత పొరలినా నూనే ఎంత అన్తుకోవాలో అంతే కదా మరీ దేనికీ వెంపర్లాట ... దేనికోసం తపన ఒక్కటి పొందితే తృప్తి ఉంటుందా ?? .. లేదే మరొక దానికోసం మళ్ళీ శునక ప్రవ్రుత్తి వున్న దానితో తృప్తి పడితే వచ్చే ఆనందం వేయి రెట్లు ప్రేమను పెంచుకో ... ప్రేమను పంచు ... పది మంది హృదయాలలో పది కాలాలు వుంటావు !!పార్ధ !!21/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lULDEm

Posted by Katta

20, జూన్ 2014, శుక్రవారం

Pardhasaradhi Vutukuru కవిత

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అన్నాడు ఎపుడో పెద్దాయన దానికి తగ్గట్లు గానే మహిళలు ముందున్నారు ప్రతి రంగం లోను ఎదురులేని విధం గా చంద్రమండల యానం చేయటం లోను ఎవరెస్టు శిఖరాలు అధిరోహించటం లోను దేశ ఉన్నత పదవులు అలంకరించటం లోను పారిశ్రామిక రంగం లోను పురుషులకు పోటీగా కంప్యుటర్ రంగం లో ఇపుడు అందరు మహిళలే చదువుకున్న అమ్మ ఇంట్లో వుంటే లక్ష్మి , సరస్వతులు ఆనంద తాండవం చేస్తున్నట్లే !!పార్ధ !!20/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ifmVUq

Posted by Katta

19, జూన్ 2014, గురువారం

Pardhasaradhi Vutukuru కవిత

యుగయుగాలుగా సజీవ సాక్షులు సూర్య చంద్రులే మనలో ధైర్యాన్ని ఇస్తూ శక్తి ని సూర్యుడు అందిస్తే మానసిక ఉల్లాసాన్ని , ఉత్సాహాన్ని జాబిల్లి ఇస్తుంది జాబిల్లి అంటేనే ఎందుకో ప్రతి ఒక్కరికి మక్కువ చల్లని వెన్నెలలో పిల్ల గాలులలో మధుర భావాలకు నెలవు చిన్నారి రామయ్యకు కుడా చందమామే ఆటబొమ్మ ప్రతి చిన్నారికి చందమామ రావే జాబిల్లి రావే ఉరట జ్య్తోతిష శాస్త్రం లో కూడా చందమామ మనసు కారకుడు అలసిన మనసులు , కష్ట పడిన శరీరాలకు జాబిల్లి దివ్యౌషధం అందరిని అలరించే జాబిల్లికి తప్పలేదు కదా గ్రహణం ఇదే సృష్టి వైపరీత్యం ... విచిత్రం కదా .. మనమెంత !!పార్ధ !!19/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lYrKB1

Posted by Katta

18, జూన్ 2014, బుధవారం

Pardhasaradhi Vutukuru కవిత

బ్రతుకు పోరాటం లో లేదు లింగ భేదం ఆకలి కేకలకు లేదు ఆడ మగ తేడా కష్టం వస్తే ఎవరు రారు మనకు తోడూ నీ కాయ కష్టం గుండె ధైర్యం నీకు తోడూ మగవాడు పని చేయ లేకుంటే ఆగదు లోకం కుటుంబ పోషణ కోసం నేనున్నాను అంటుంది మహిళా లోకం అన్ని రంగాలలో పోటీ పడి పనిచేసి ఆత్మ గౌరవం కాపాడుకునే మహిళామతల్లులకు జగతి ఇస్తుంది సదా జేజేలు ఆడది అంటే ఆట బొమ్మ అనుకునే వాళ్లకి నీలాంటి వాళ్ళ నీడ సోకినా వుండదు ఉనికి తప్పు లేని పని ఏది చేసినా తప్పులేదు రూపాయి కోసం ఎవెధవను చేయి చాచ అవసరం లేదు !!పార్ధ !!18/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iFISqu

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

Pardhasaradhi Vutukuru కవిత

మానవ జీవితం నిత్యం వైకుంటపాళి జీవిత గమనం లో నిరంతరం కాల సర్పం తో పోరాటం మన ఉచ్వాస నిస్వాసాలు సర్ప భావనే కదా మన వెన్నుముక కుండలిని సర్ప ప్రతిరూపమే నిలువెల్లా విషమున్న మనుషుల కన్నా నిండు కుటుంబాన్ని పోషించే సర్పాలే మాకు మిన్న చిన్న పిల్లలతో , పిల్లలు గా ఇంటి పెద్ద గా మాతో సహజీవనం చేస్తూ మాకు జీవనాధారం అయిన ఆ సర్ప జాతి నాగ దేవత మాకు రక్ష ప్రేమ అనేది మనసులో నిండుగా వుంటే జాతి వైరం మర్చి క్రూర జీవులు కూడా మనతో మమైకం కాగలవు నేస్తమా !!పార్ధ !!17/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pbz8Iu

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Pardhasaradhi Vutukuru కవిత

ఉమ్మడి కుటుంబం అన్న పదం విని ఎన్నిరోజులయిందో ప్రతి చోట చిన్న కుటుంబాలే ఒక్కరు లేక ఇద్దరు ఎవరి జీవితము వారిదే ఎవడి కష్టాలు వాడివే వీళ్ళని పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రులు ఎవరికీ అవసరం లేదు మానవత్వం తో వాటా వేసుకునే కొడుకులు వద్దు అనలేక వృద్దాశ్రమం చేర్చే సుపుత్రులు సొంత వాళ్ళకే అవకాశం లేకపోతె బాబాయి పిన్ని పరాయిలే భార్యా భర్తల మధ్య సమన్వయము లోపిస్తే విడాకులే శరణ్యం మూడో వ్యక్తీ కి తావు లేదు ఇద్దరు పనులలో వుంటే పిల్లల పరిస్తితి కేవలం డబ్బుతో హాస్టల్ చదువులు చూసే అవకాసం వుండదు వాళ్ళ దృష్టిలో కుడా తల్లి తండ్రులు atm యంత్రాలే పిల్లలతో కుటుంబం తో సమన్వయము చేసే పెద్దల తో కూడిన పెద్ద కుటుంబాలు ఇక కనపడవేమో కదా !!పార్దః !!15/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1y4UrRU

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ఏమిటి బంధాలు ఎందుకు ఈ అనుబంధాలు ఏమై పోతున్నారు ఎక్కడికి వెళుతున్నారు ఉహ తెలియని క్షణం నుంచి మనకు తోడూ వుండి ప్రతి దాంట్లో తోడూ నీడ గా వుండి ఏడిస్తే నేను వున్నాను అని ఓదార్చి చిన్న దెబ్బ తగిలితే నాకోసం నిద్రకాచి పువ్వుల పెంచి తరగని ఆప్యాయత పంచి జీవితం లో తామే ముఖ్యం అనే భావన పెంచి మదిలో ధైర్యాన్ని గుండె దిటవు ఉంచి ఒక్కరోజు కనబడక పొతే నాకోసం వెతుకుతూ వచ్చి నిను వీడను అని భరోసా ఇచ్చి నిర్దాక్షిణ్యం గా ఈ ప్రపంచం లో ఒదిలేసి వెళితే ఎక్కడ వెతకాలి ఆ ప్రేమ అనురాగం ఆప్యాయత ఎప్పుడు కనిపిస్తుంది ఆ చెరగని చిరునవ్వు ఇక ఎప్పటికీ కనపడదు నీకు నీవే భరోసా ఈ భావం గుండెల్లో వస్తే .. ఏమి చెప్పాలి చిత్రం చుస్తే గతం జ్ఞాపకాలు వెంటాడుతాయి అన్నీ నిజాలే .. కాని వాటిని పదిల పరిచిన నువ్వెక్కడ నాన్నా !!పార్ధ !!15/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKDLyj

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

నాన్న అన్న పిలుపే ఒక ధైర్యం నాన్న నీ చిరు నవ్వే ఒక అభయం క్రమశిక్షణలో నాన్న అంటే ఒక భయం ఎన్ని అనుకున్నా నా జీవితం లో నీవు ఒక భాగం బ్రతుకు తెరువు కోసం పోరాటం లో యోధుడిని చేసావు కష్టాలలో గుండె నిబ్బరం అలవాటు చేసావు కొడుకు వివాహం అంటే తెగ సంబరపడిపోయావు నీ కంట తడి నాకు తెలియకుండా గంభీరం గా వున్నావు ప్రయత్నం చేస్తే సాధించ లేనిది ఏది లేదని చూపావు అమ్మకు అనారోగ్యం అయితే పసివాడివే అయ్యావు ఎవరు ఎన్ని చెప్పిన నీ బాధ్యతలు నీవు చేసావు అమ్మ దూరం అయితే పిచ్చివాడివే అయ్యావు అప్పుడు కాని తెలియలేదు నీలోను నా మీద అమ్మ మనసు వుందని చివర వరకు ఎవరికీ బరువు కాకూడదు అనుకున్నావు నవ్వుతూ వెళ్లావు కానీ మళ్ళీ తిరిగి రాలేదు నువ్వు గుర్తుకు వస్తే గుండె బరువు అవుతుంది నాన్నా నీ జ్ఞాపకాలు చాలా ఇచ్చావు జీవితానికి సరిపడా నేను నాన్న ను అయితే కాని తెలియలేదు నాన్న నాన్న ప్రేమ ఎలా వుంటుందో ?? ఎన్నో జన్మల పుణ్యఫలం నాన్న నీ కొడుకు నవటం నలభై ఏళ్ళు భరించావు మమ్మల్ని నలభై నిమిషాలు మోయలేక పోయాము నాన్న నిన్ను .. !!పార్ధ !! ( పితృ దినోత్సవం గా నాన్నకు జ్ఞాపకార్ధం ..... ) 14/06/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mXPCkB

Posted by Katta

13, జూన్ 2014, శుక్రవారం

Pardhasaradhi Vutukuru కవిత

ఈ సృష్టి లో దేవుడు ఉన్నాడో లేడో తెలియదు అమ్మ లేదు అన్నవాడు ఎవరు వుండరు మనం ఎలా వున్నా మనల్ని ప్రేమించేది అమ్మ మన కోసమే నిరంతరం తలచుకునేది అమ్మ తనకు లేకపోయినా నీళ్ళు తాగి నీకు పాలు ఇస్తుంది ఈ ప్రపంచం లోకి రాక ముందే నిన్ను ప్రేమించేది అమ్మ నీ నడక కోసం , నవ్వు కోసం , పిలుపు కోసం ఆత్రుత పడేది అమ్మ తనకు బాగోలేక పోయిన నీకు కొద్దిగా బాధ అనిపిస్తే విలవిల లాడి అన్నాహారములు మానేసేది అమ్మ పెరిగి పెద్ద అయి నీకు బరువు అనిపించినా నీ ఇంట్లో పనిచేస్తూ నిన్ను చూస్తూ సంతోషించేది అమ్మ ఈ అమ్మ ప్రేమ కోసం దేవుడు కూడా మనిషి జన్మ ఎత్తాడట అమ్మ ప్రేమ నోచుకోని వారి వేదన చెప్పతరం కాదు సోదర !!పార్ధ !!

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mNyHBk

Posted by Katta

12, జూన్ 2014, గురువారం

Pardhasaradhi Vutukuru కవిత

జీవితం అశాశ్వతం అంటే మాట బాగుంటుంది అనుభవిస్తే తెలుస్తుంది జీవితం విలువ ఉన్నపుడు మనకు దాని విలువ తెలియదు లేనపుడు ఎంత వేదన చెందినా తిరిగి చూడలేం ఆడుతూ పాడుతూ సరదాగ్ విహారానికి వెళ్ళిన విద్యార్ధులు ఏమి ఘోరం చేసారని అన్యాయం గతం లో కేదార నాధ్ లో జల ప్రళయం సాముహిక మృత్యు కేళి ... విధి విలాసం ఎక్కడ ఎక్కడో పుట్టారు ఒక్కసారే ఒక్కచోటే కలసి మృత్యు కౌగిలి లోకి వెళ్ళారు దురదృష్టం కాకపొతే శివుడి ఆజ్ఞ అపుడే అవ్వాలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రానున్నది రాకమానదు పోనున్నది పోక మానదు అన్నట్లు జరుగుతున్నాయి అంతా మనమంచికే అని ఎలా అనుకోవాలో అర్ధం కావటం లేదు కడుపు కోత తో రోదించే కన్న తల్లుల వేదన ఎలా తీరేను చావు కోసం ఎదురు చూసే వారికి అది రాదు నిండు భవిష్యత్ వున్న చిన్నారుల బలి గొన్న విధి ఎంత కటినాత్మురాలు !!పార్ధ !!12/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kpYeiu

Posted by Katta

11, జూన్ 2014, బుధవారం

Pardhasaradhi Vutukuru కవిత

!! ఆత్మస్తైర్యం !! మనిషి గా జన్మ ఎత్తినతరువాత సుఖాలే కాదు కష్టాలు ఎదురవుతాయి కష్టాలలో ఓర్పు నేర్చుకో మని సుఖాలలో ఒకింత ఒదిగి ఉండమని ధనం వున్న వాడికే ఖర్చు వుంటుంది ధైర్యం వున్న వాడికే ఎదుర్కునే శక్తి వుంటుంది పళ్ళు వున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అలాగే సామర్ధ్యం ఉన్నవాడికే సమస్యలు వస్తాయి ఇది ప్రక్రుతి మనకు తెలియచేసే గుణ పాటం సమస్య వస్తే ధైర్యం గా ఎదుర్కొ భీరువు లా పారిపోకు నిన్ను వెంటాడుతుంది గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది నీలో వున్న శక్తి ఏమిటో తెలుసుకో నిన్ను ఎవరు ఏమి చేయలేరు నేస్తమా నీకోసం ఎవరు రారు నీ ఆత్మ స్తైర్యమే నీకు తోడూ నేస్తమా !!పార్ధ !!11/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oe6kmk

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

అతివ అంటే ఎంత గౌరవమో మన జాతికి ధరిత్రి అని భూమాత అని పూజిస్తాం ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని సంబరపడతాం భగవంతుని మరో రూపు ప్రకృతిని కూడా స్త్రీ తో పోలుస్తాం నిజంగా అంతటి గౌరవం దక్కుతోందా వారికి ?? కేవలం వంట ఇంటి కుందేలు భావాలు మారాయా ?? భర్తతో సమానం గ ఉద్యోగం చేసి వస్తే విశ్రాంతి ఉంటోందా ?? తెలిసిన వ్యక్తితో పరిచయం గ మాట్లాడితే తట్టుకోగలుగుతున్నారా ?? కొన్ని కుటుంబాలలో అందరు వున్నా ఒంటరే కదా తన భర్త ఇంటిలోనే నివసించే అతిధి తన ఇంటిలో ఉంటున్న మనోభావం చెప్పుకోలేని అందమైన రిమోట్ వస్తువు ఎన్ని కష్టాలు వచ్చిన ఒక్క చిరునవ్వుతో మాయం చేసే దేవత అని ఎపుడు తెలుస్తుంది కోట్లు వున్నా పలకరింపు మాత్రమే కోరుకునే అమాయకురాలు అని తెలిసేది ఎప్పుడో యత్ర నార్యస్తు పూజ్యతే ... తత్ర రమంతే దేవత వేద వాక్యం మాత్రం కాదు .. అక్షర సత్యం సోదరులారా !!పార్ధ !!11/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uUQuwG

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

Pardhasaradhi Vutukuru కవిత

ఏమిటో ఈ జీవితం కొన్ని సార్లు అసలు అర్ధం కాదు ఏదో చెయ్యాలి అని ఆరాటం ఏమి చేయలేని నిరుత్సాహం తెలియని నిరాసక్తత .. మాటలు లేక మౌనం ఎందుకో ఈ స్తబ్దత .. నిడురపోలేము మన పని లో క్రమ శిక్షణ లోపమా లేక అతి పని వత్తిడి కారణమా అర్ధం కాదు పసి పాపల బోసి నవ్వుతో పోగొట్టుకోవచ్చు ప్రియమైన వ్యక్తులతో మనసు పంచుకోవచ్చు సమస్య ఎవరు ప్రియమైన తెలియకపోవటమే సాధన ఏదైనా సాముహికత లోనే వున్నది సంతోషం కానీ ఉత్సాహం కానీ ఒంటరి ఆలోచనలు వదలి జనజీవన స్రవంతి లో సంతోషం గా కలసిపోదాం !!పార్ధ !!10/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hDR0MN

Posted by Katta

9, జూన్ 2014, సోమవారం

Pardhasaradhi Vutukuru కవిత

!! యువత తరంగం ... తలుచుకుంటే !! యవ్వనం ఎంతో ఆహ్లాదకరం ప్రతి ఒక్కరికి ఏదో తెలియని ఆవేశం .. ఉత్సుకత స్నేహం అంటే తెలియని ఆరాటం గురువులు అంటే భక్తీ వున్నా ఏదో తెలియని కోపం అమ్మ నాన్న అంటే ప్రేమ కానీ కట్టడి చేస్తేనే తెలియని కసి ప్రతిదీ తెలుసుకోవాలి అనే ఉత్సాహం తెలుసుకున్నది అర్ధం చెసుకొగల్గె శక్తి ప్రోత్సహిస్తే ఏదైనా సాధించ గల సత్తా దీనికి ఒక సరియైన లక్ష్యం తోడయితే దానికోసం పట్టుదల తో కృషి చేస్తే ప్రతి యువకుడు దేశానికి పట్టుకొమ్మ కాగలడు సాంకేతికంగా ఎంతో ఎదిగిన ఈరోజుల్లో సాంకేతికత ను సద్వినియోగం చెసుకొగల్గితె అవకాశాలు వారినే వెతుక్కుంటూ రావా ?? నిరుద్యోగం అన్న పదం వినిపిస్తుందా ?? తమ శక్తి ని తాము తెలుసుకోలేని అభినవ మేధావులు ... నేటి యువకులు యువతా మేలుకో .. జాతిని మేల్కొలుపు ... !!పార్ధ !!9/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ss14N7

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

!! ప్రయాణం లో పదనిసలు !! అది ఒక తాత్కాలిక ప్రపంచం నవ్వులు చిందిస్తూ పలకరింపులు ఒకరివి క్రొత్త పరిచయాల తలనొప్పి మాకేల అనే చూపులు కొందరివి సమయానికి ఆఫీసు కు చేరాలి అన్న తపన ఒకరిది బాధను దిగమ్రింగి క్రుంగుతూ ఒకరు ఇది నాకు మామూలే అన్న భావన తో ఒకరు స్నేహితులతో కలసి దొంగ చూపులు ఒకరివి క్రొత్త జీవితం నాకు మీరే భరోసా అన్నట్లు భర్త గుండెలపై నిద్రించే భార్య బ్రతుకు తెరువుకు అక్కడే జీవీంచె జీవితాలు కొన్ని కళ్ళు మూసుకుని గతం లోకి వెళ్ళే స్వాప్నికులు కొందరు పోయిన దగ్గర బంధువు ఆఖరి చూపుకు తపన పడుతూ ఆవేదనలో మరికొందరు చదువులకోసం రోజు ప్రయాణం ఇంకొందరు వీరంతా నావాళ్ళంటూ ఆత్మీయంగా సమయానికి చేర్చే రైలు ప్రయాణం ఒక తీపి అనుభవం !!పార్ధ !!9/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgCcUt

Posted by Katta

7, జూన్ 2014, శనివారం

Pardhasaradhi Vutukuru కవిత

నేను కవిని కాకపోయినా మంచి కవుల నడుమ నన్ను ఉంచిన కవి సంగమం వారికి ధన్యవాదములు ,సహా కవులకు అభినందనలు

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pmZc4b

Posted by Katta

5, జూన్ 2014, గురువారం

Pardhasaradhi Vutukuru కవిత

!!మధ్య తరగతి జీవితం !! జీవితం అంటే ఏమిటో ఎవరిని అడగాలి కోట్ల ధనమున్నా కాస్త అయిన ప్రేమలేని జీవితాలా వున్న సంపద చాలక తోటి వాని ఎదుగుదల ఏడ్చే వారిదా నిష్ఠ దరిద్రుడను ధనం కోరుకునే బీద నా ప్రతి వాడి జీవితం లోను అసంతృప్తి ఏమి లేకపోయినా వున్నంతలో తృప్తి పడే మధ్యతరగతి మనిషి అంటే సమాజానికే లోకువ పల్లకీ ఎక్కాలని ఆశ వున్నా ఎక్కలేడు పల్లకీ మోయటానికి ముందుకు రాలేడు తనకు ఉన్నదాంట్లో సంతృప్తి పడగలడు లేని తనాన్ని ప్రేమ మాటలతో భార్యను ఒదార్చ గలడు ఎన్ని వున్నా ఏదో కావాలి అని వ్యామోహ పడే చిన్న మనసు వున్న పెద్దవాళ్ళకంటే ఎన్నో రెట్లు పెద్దవాడు మధ్యతరగతి వాడు నీ దగ్గర వున్నదాంతో తృప్తి చెందు లేనిదానికై ప్రాకులాడకు సర్దుకో అని మనసుకు సర్దిచేప్పుకోగల గొప్పవాడు మధ్యతరగతి వాడు లోపల బాధ వున్న చిరునవ్వు తో సంపూర్ణ జీవితం అనుభవించగలిగెది అతడే కదా ... !!పార్ధ !!05/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kEskn4

Posted by Katta