వల _____అరుణ నారదభట్ల మనసు గిరిగీసుకున్న మహావృక్షమైనప్పుడు ఆ కొమ్మల నీడలెప్పుడూ కేవలం తన చుట్టే తత్వం నేర్చుకున్న యోగి ఆకుల సందుల్లోంచి దూసుకొచ్చే వెలుతురు గురించి ప్రత్యేకంగా చెప్పాలా...! సూర్యకాంతితో మెరిసే ఆకాశం తనకుతనే మెరిసిపోతున్నానని కలగనడం గమనించావా...! అదే అల్లుకొని ఉన్న బంధం గుంబనంగా నింపుకున్న ఆకుల చాటున నిండుకున్న చీకటిని నీడలా భ్రమపడినప్పుడే కలా ఆవిరై పోయింది...! లోనికి చొరబడే కిరణాలలో ఎప్పటికప్పుడూ ఆకులను రాల్చేస్తూ కదలిక లేని సముద్రంలా నిశ్చల స్థితి పోగేస్తూ అరణ్యంలా నిండుకున్నప్పుడే వెలుగూ అలసి పోయింది...! కప్పుకున్నవెలుగు దుప్పటి కింద పరుచుకున్న నీడజాడలో వెన్నెలై వెలగడం బదులుగా నదిలా పారాడడం గమనించేసరికే కాలమంతా కరిగి ముద్దయింది! ఉదయమూ...అస్తమయమూ... రెండూ ఈ చేతిలో లేవు జీవితపాఠం నేర్పినట్టుగా హిమాలయం గట్టిది అయినా ప్రసరించే కిరణాలలో కరుగుతూనే ఉంది! అలిసినమోములో నిద్రమబ్బు కనిపిస్తుంది గానీ కార్తీకంలోని ముద్దబంతి అవుతుందా.. ఆకాశపు చీకటిని తరిమే సూరీడు కూడా తనలో తను ఆహుతి అవుతూనే ఉన్నాడు! ఆరాటమో...గమన పోరాటమో ఆత్రంగా ప్రశ్నలా జీవితం అగ్నిగోళమై ప్రసరిస్తుంది! బ్రతుకును కట్టై దహించి కాసేపు మబ్బులమాటున దాక్కున్నంత మాత్రాన... వేడి చల్లారుతుందా... కొమ్మల మధ్యన చిక్కిన కాంతిరేఖలా సరళరేఖై ఓ దారిలామారి గోదారి తీరం చేరేదాకా... అగాథాల ఆనవాళ్ళను అన్వేశిస్తూనే ఉండాలేమో! 21-3-2014
by Aruna Naradabhatla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PWv8zZ
Posted by Katta
by Aruna Naradabhatla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PWv8zZ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి