పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sasi Bala కవిత

వసంత హొయలు .......................శశిబాల ----------------------------------------------- వర్ణ వర్ణ శోభితమైన కుంకుమ వన్నెలతో వసంత లక్ష్మి బాలభానుని ఎర్రని కాంతిని పెదవులకు అద్దుకొని ఆధరాలు పూపరాగ మధువులనుకొని తుమ్మెదలు వాలుతుంటే తెమ్మెరలతో వాటిని తరమాలని ప్రయత్నిస్తున్నది కోయిలలను గారాం చేస్తే అవి గునగున లాడుతూ ముద్దుగా కూని రాగాలు తీస్తున్నాయి చిగురాకు ఊయలలూగే చిలుకలు చేసే శ్రావ్యమైన మేజువాణీలు ఎదలో మధుర భావనలు రేకెత్తిస్తున్నాయి కళకళలాడే కలువ కన్నెలు వసంత లక్ష్మి పాదాలకు పారాణి శోభలందిస్తున్నాయి చిలుకలు కొరికిన అరమగ్గిన జామపండ్లు తళుకులీనే ఆమె బుగ్గలను గుర్తు చేస్తూ మదిలో అలజడి సృష్టిస్తున్నాయి కోకిలలు ఆలపించే రాగాలు మదిలో మోహన గీతాలై పులకింతల గమకాలై పూలతలను కదలించి జలజలా నేలకు విరులను రాలుస్తున్నది అందాల రతి రాణి ముత్యాల పలువరుస వసంత కన్య కంఠసీమలో ముత్యాల సరమై ప్రకాశిస్తున్నది మన్మథుని విలంబానికి (ఆలస్యానికి ) అలిగిన ఆమని మోము కెంజాయ వర్ణాలను సంతరించుకొని వింత కాంతులను ప్రతిఫలిస్తున్నది ఆహా ఎంత మనోహర మీ వసంత శోభ (4 ఏప్రిల్ 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OgvkbL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి