కలిసి విడదీసాం ^^^^^^^^^ -సత్య మరి, జరిగిందేదో జరిగిపోయింది ఏది ఏమైనా మనమే కలిసి చేసేసాం నేనొక చోటా నువ్వొక పూటా వెరు వేరైనా విడివిడిగా ఒకే చందమామని కలిసి చూసేసాం నా నిరీక్షణ నీ దారి వేరువేరైనా ఒకరి తలపుల్లో ఒకరుగా కలిసి నడిచేసాం నా తలపు నీ మరుపు వేరు వేరైనా ఒకరి మనసుల్లో ఒకరం కలిసి మరిచేసాం నా తెగువా నీ బిడియం వేరువేరైనా ఎడభాటుకి మాత్రం కలిసి అడుగేసాం నా ఆవేదన నీ అలోచన వేరువేరైనా పంచుకున్న కాలాన్ని కలిసి మూసేసాం నా హరివిల్లూ నీ బొమ్మరిల్లూ వేరువేరైనా కలల సౌధాన్ని కసిగా కలిసి కూల్చేసాం నా విరహం నీ తమకం వేరువేరైనా తడబాటులో కన్నీరు కలిసి వదిలేసాం నా విడుపు నీ పట్టు వేరువేరైనా పెనవేసుకున్న కౌగిలి కలిసి విడదీసాం -సత్య
by Satya NeelaHamsa
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pPadJN
Posted by Katta
by Satya NeelaHamsa
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pPadJN
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి