పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
విష్వక్సేనుడు వినోద్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విష్వక్సేనుడు వినోద్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జూన్ 2014, మంగళవారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

గెలవలేక... ఆకర్శణాక్షణాలను అపురూపంగా లెక్కించి ఆనందమంటూ తనువంతా తాకట్టుపెట్టి అక్కరకు రాని అరవిరిసిన అందం కోసం అనవసర తాపత్రయం అదిమిపెట్టగలనా ప్రేమ రుచిలేదని ప్రాయాన్ని పణంగాపెట్టి పరువాలను సెలయేటి ధారలతో చుట్టి పనికిరాని పిరికి దేహానికి పవిత్రతంటూ పసుపురాసి గంధతో పరిమళింపజేయనా వాడిపోనిది వలపని ఆప్యాయతనాశపెట్టి వేడి వయసుకు తీపి కలల గంతలు కట్టి వాంచల వలని చేదించి ఇదే స్వేచ్చంటూ వెర్రిమనసుకుకిదోవ్యాదని మభ్యపెట్టగలనా గుబులుగుండెలో చిగురుటాశల గూడుకట్టి గమ్యం చేరకముందే మెదడుకు గొలుసుకట్టి గాడితప్పాక దిష్టి తగిలి గాలి సోకిందంటూ గెలువలేక విధిరాత ఇదని సర్దిపెట్టుకోగలనా

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v01Ayq

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఆక్రమణ... నీకూ నాకూ మధ్య ఎప్పుడూ యుద్ధవాతావరణమే! భీకరమైన మన పోరులో నీ చిరునవ్వుల తూటాలు పేల్చి నా దృష్టిని మరలుస్తావు. చూపుల శరాలను సంధించి నన్ను అచేతనుణ్ణి చేస్తావు. తర్కానికి తిలోదకాలిచ్చి రణంలో రసపట్టుతో కనికట్టు చేస్తావు. కనిపించకుండానే నా మనసులో పాగా వేసి నా అణువణువూ ఆకమించేస్తావు. నా విద్యల్ని మరిపించేలా చేసిన నికు యుద్ధతంత్రం బాగా తెలుసని నిన్ను నేను కీర్తిస్తుంటే నువ్వంటావు... ఏ తంత్రమూ ప్రదర్శించకుండానే నేనెప్పుడో నిన్నాక్రమించానని.

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/U50ZAe

Posted by Katta

14, జూన్ 2014, శనివారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

పండని జీవితం సారవంతమైన నా జీవిత క్షేత్రం లో క్షణక్షణం క్రమక్షయమే ! గడ్డిపోచనైనా మొలకెత్తించని నా ఆలోచనా సేద్యానికి, ఈ గంభీర కాయం విదిల్చిన ఏ స్వేధబిందువూ సహకరించదు. కనీసం విత్తునైనా మొలకెత్తించని నా వేదనాశృవు, ఉష్ణరుధిరమై ప్రవహించినా ప్రకృతిలో ఏ అణువూ చలించదు !!

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p4itGA

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

నేనెవరో... నీ హృదయ పటాలంలో సూక్ష్మ కణమైనా కాను ఒక జ్ఞాపకమై యుద్ధం చేద్దామంటే... నీ మనో క్షేత్రంలో మూలబిందువునైనా కాను మౌనంగా ఆశలు విన్నవిద్దామంటే... నీ జీవిత వృత్తంలో వక్ర చాపాన్నైనా కాను మలుపులో తలుపుగా నిలుద్దామంటే... నేనెవరని నిన్నడిగితే... కలలోనైనా దరిచేరనీయని కాకి ఎంగిలంటావు... అలల్లో కొట్టుకుపోయే ఆశయశూన్యుడివంటావు... వలలో చిక్కుకుపోయే వలపు వైధ్యుడివంటావు... దేవుడంటే గిట్టని గర్భగుడి నైవేద్యమంటావు... నేనెవరో నన్నడిగితే... ఎప్పటికీ తీరందాటని కోర్కెలు చంపుకున్న కంపిత కెరటాన్నంటాను... ప్రతిక్షణం నీ ఎదలోంచి గెంటేయబడుతున్న కన్నీటి కణాన్నంటాను... 04/06/2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oVTo46

Posted by Katta

28, మే 2014, బుధవారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

నాకు మాట్లాడ్డం రాదు-4 ఒక్కోసారెందుకో నాకసలు మాట్లాడ్డమే రాదు. అప్పుడు... ఒక మౌనపు వంతెన కట్టి మెల్లగా కవాతుచేస్తాను. ఒక నవ్వుల నిచ్చెనేసి చిన్నగా దాటివెళ్ళిపోతాను. ఒక నిట్టూర్పుగోపురం కట్టి ఆకాశాన్ని విభజిస్తాను. ఎందుకలా చేస్తానో తెలియదు. తర్వాతేమౌతుందో తెలియదు. తెలుసుకోవాలనే జిజ్ఞాస; తప్పించుకోకూడదనే విజ్ఞత... ఆక్షణాన ఉండదు నాకు. పెదాలు వర్షించలేని పదాలను కోలాహలంతో హలాహలంగా మార్చలేను. అందుకే నేను కొన్ని మట్లాడలేకపోతాను. మాట్లాడ్డం రాదనుకొంటూ నిశ్శభ్ధవక్తనై శూన్యసూక్తిని బోధిస్తాను. 28-05-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Sf4dzZ

Posted by Katta

27, మే 2014, మంగళవారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

ప్రియతమా... అందుకో చెలియా... పరిమళించే ఉఛ్వాసలో ప్రయాణించే నీ విరహ కౌముది నా మదిని కోసినపుడు రాలిపడ్డ రంపప్పొట్టుని... పరిత్యజించే నిఛ్వాసలో పారిపోయే నీ వలపు కోయిల నా ఎదను మీటినపుడు ఊడిపడ్డ వెన్నెలపొడిని... అందుకే సఖియా... నేను నువ్వులేక ఖాళీగా తలచిన నీ క్షణాల్ని అనుక్షణం శిక్షించకు...అందులో నేను లేనని ! నేను నవ్వాగలేక జాలీగా గడిపిన నీ తలపుల్ని ప్రతిక్షణం బాధించకు...అందులో నువ్వున్నావని ! ఏదేమైనా ప్రియతమా... నేను కలై వస్తే మూసిన నీ రెప్పలు కదలనీయకు ! నేను అలై వస్తే వేచిన నీ కనులను మూసివేయకు !! 27-05-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tKdyh5

Posted by Katta

26, మే 2014, సోమవారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

మనం !! నీకు నేనే.. నాకు నువ్వే... సర్వస్వమనుకుంటూ నిన్ను నేను...నన్ను నువ్వు... సంపాదించుకున్నాం !! ఒకరిలో రాలిన ఇంకొకరిని ఒకరినొకరం ఏరుకుంటూ ఒకరిలో ఒకరం మోకరిల్లి...ఒకరింకొకరుగా మారిపోయాం !! నీలోంచి నేను...నాలోంచి నువ్వు ...సమస్తం చేజిక్కించుకుని ఒకరికి ఎలియకుండా ఒకరం ఎవరికివారమే ఖర్చైపోయాం !! ఒక్కరమే అనంతాన్ని నింపుకొని ఇద్దరిగా అంకురించినట్లు నీవు నేనై...నేను నువ్వై... శూన్యమై మిగిలిపోయాం !! 26/05/2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mfbFUR

Posted by Katta

25, మే 2014, ఆదివారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

అక్షరం ఆయువైతే ! అక్షరం ఇష్టమైనపుడు నా అందమైన భావాలను అపురూపంగా మలచి ఆనందపడ్డాను అక్షరం నేస్తమైనపుడు నా అంతరంగ తరంగాన్ని అనురాగం రంగరించి ఆవిశ్కరించాను అక్షరం వ్యసనమైనపుడు నా అమూల్యమైన అనుభవంతో అంతరాత్మను అనువదించి అంతర్మధించాను ఇప్పుడు అక్షరం ఆయువైంది నేనే అక్షరమై అంకురించాను ఇకపై అక్షరం అక్షరమే ఔతుంది... 25-05-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7lB2E

Posted by Katta

18, మే 2014, ఆదివారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఇప్పుడిలా నేను... నేను చూశాను ! ఒక నిస్తేజమైన ఆలోచన మస్తిష్కంలో జనించినపుడు మనోకుడ్యాల్లో ఉత్ఫన్నమయ్యే వెలుగు రేఖలు మసకబారడాన్ని... నేను విన్నాను ! ఒక ఉత్తేజమైన పగటికల ఉవ్వెత్తున ఎగసినపుడు కంటి పొరల్లో అలికిడయ్యే నిశ్శబ్ధ కాంక్షల కోలాహలాన్ని... నేను స్పృశించాను ! ఒక సమ్మోహన వీచిక గంభీరంగా వాలినపుడు బాహ్యాంతరాల్లో భారమయ్యే నిభిడీకృత బహు భావాలని... ఇప్పుడు చూడటానికి ఏ దృశ్యం కనిపించడంలేదు మసక మబ్బులో మెరిసే మిణుగుర్లు తప్ప ! వినడానికి ఏ శబ్ధం కర్ణబేరిని తాడంలేదు గుండెలో అలజడయ్యే నిర్మానుష ఘోష తప్ప ! స్పృశించడానికి ఏ అణువూ మిగలడంలేదు శున్యమైన మనస్సాక్షితో శాస్విత కౌగిలి తప్ప ! 18-5-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jrQkds

Posted by Katta

15, మే 2014, గురువారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఒక్కోసారంతే... దేహం నీరసపడ్డప్పుడే మనసు రెక్కలు తొడుక్కుంటుంది. కళ్ళు కలల్ని కసిరేసినప్పుడే కొత్తలోకం కరచాలనమడుగుతుంది. ఆశలు ఆవిరుతున్నపుడే ఎండమావుల కవాతు మొదలౌతుంది. * * * ఎందుకనో.... పదునైన కోర్కెలను సానపట్టే ఈ హృదయానికి దయే ఉండదు. నిర్దాక్షిణ్యంగా తనను తానే గాయపరచుకుంటుంది. ఉదయసంధ్యలూ ఏదో ఒక అలజడిని సాలేగూల్ళలా మస్తిష్కంలో అలికిడి లేకుండా అల్లేస్తుంది. అమాయకంగా అల్లిన గూడులోనే చిక్కుకుపోతుంది. * * * అయినా ... రగిలే కాంక్షని త్యజించాలనుకునే మనిషిలో యుగాలుగా మార్పే లేదు !! కాలం మిగిల్చిన కన్నీటి చారికలను మాన్పే లేపనమే లేదు !! 15-05-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lzN0eZ

Posted by Katta

5, మే 2014, సోమవారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

సాగిపో.... | విష్వక్సేనుడు వినోద్ కష్టం నష్టం వచ్చాయంటూ ఒంట్లో సత్తువ వదలొద్దు... బాధా ధు:ఖం తరిమాయంటూ కంట్లో నెత్తురు రాల్చొద్దు... ఆవేశం కోపం కలిగాయంటూ శీఘ్రమే కుత్తుక కదపొద్దు... అలుపూ సలుపూ వచ్చాయంటూ గమ్యం తలుపులు మూయొద్దు... వెలుగూ నీడా కలిశాయంటూ వేదన కట్టలు తెంచొద్దు... వానకి వరద తోడైందంటూ తర్కానికి తిలోదకాలొదలొద్దు... చేతులు కట్టుకు కూర్చోకుండా చకచక ఎత్తులు సిద్ధం చెయ్... కాళ్ళకు బుద్ధిని చెప్పేయకుండా కుదురుగా నిలబడి యుద్ధంచేయ్... వెలుగుకు నువ్వే వాహనమయ్యి లోకం మొత్తం ప్రసరించేయ్... చిరునవ్వుకే నువ్వు బానిసవయ్యి చిగురించిన ఆశలను పాలించెయ్... 05/05/2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1saMvuv

Posted by Katta

3, మే 2014, శనివారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

ప్రేతాత్మతో ప్రేమ! కైపెక్కించే నీలికళ్ళ సుందరికి సైటేద్దామంటే సిసలైన సాఫ్ట్వేర్ ఇంజినీరైతేనే వాటేస్తానంది సన్న నడుమున్న చలాకీ పిల్లకి ప్రపోస్ చేస్తే సివిల్ సర్వీస్ లో ఉంటేనే తనకో స్టేటస్ అంది కాలి గజ్జల కొంటె కోమలాంగిని కోరుకుంటే కాంట్రాక్టర్ అయితేనే కోరికలు తీరతాయంది లేత పెదవుల లేటెస్ట్ లేడీకి లవ్ లెటర్ రాస్తే లాయరైతేనే తనపెదాలతో వాదించగలడంది వాలుజడ వయ్యారికి చిరునవ్వును విసిరితే విమానాలు నడిపెవాడివి కాదంటూ కసిరేసింది ఇవన్నీ కాని నేను ప్రేతాత్మను ప్రేమిస్తానంటే ప్ర్రాణంలేని తను నా ప్రాణమై ఉండిపోతానంది

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lKGFhj

Posted by Katta

1, మే 2014, గురువారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

ట్రాన్స్ఫార్మర్ హార్ట్ !! మితిమీరిన ఆశలకు కళ్ళెంవేస్తూ జీవితపు సరిహద్దులు చేరపనీయక సున్నితపు అనుబంధాలకు సన్నని రాగితీగల బంధనాలతో చుట్టబడి ఆలోచనా చలానాలను నియంత్రిస్తూ తార్కికాయస్కాంతత్వానికి లోబడి స్పందించే ట్రాన్స్ఫార్మర్ హృదయం నాది!! మెదడూ మనసుల భావజాల వికేంద్రీకరణకు అనుక్షణం అడ్డుకట్ట వేస్తూ అంతులేని కోర్కెలకు మనోకారాగారంలో నిరాశావాద ఖడ్గంతో శిక్షిస్తూ చిరునవ్వును కవచంగా ధరించి అనంతానంత దూరాలు సంచరిస్తున్నా!! శూన్యాన్ని శరీరంలో దాచుకొని సన్యాసిభావాల ఆత్మకి సహనంతో సమాధి కట్టి సుదూర తారలను చేజిక్కించుకోవాలని నా హృదయ దారాల నిచ్చెన జారవిడుస్తున్నా!!

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rIJoru

Posted by Katta

24, ఏప్రిల్ 2014, గురువారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఓయ్ మామా... | విష్వక్సేనుడు వినోద్ అట్టా చుట్టేయమాకు మొద్దు మామ నాకెట్టో అయిపోతోంది వద్దు మామ కోరికంత అణచుకోరా కొంటె మామ కాలుజారితే కష్టమంట మొండి మామ మీద మీద పడతావు మోటు మామ నెమ్మదైతే రేయంతా స్వీటు మామ ముద్దులంటికి పద్దురాస్తే ఎట్ట మామ సరసంలో లెక్కలేంటి మట్టి మామ వద్దంటే కావాలని ముద్దపప్పు మామా హద్దుదాటితే లొంగిపోనా చురకత్తి మామా 24 - 04 - 2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1idkxvl

Posted by Katta

23, ఏప్రిల్ 2014, బుధవారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

రా ... మళ్ళీ పుట్టేద్దాం!! | Viswaksenudu Vinod మన సుధీర్ఘ ప్రయాణపు నిట్టూర్పు విడిచిన వాయుప్రవాహం వసంత కోయిలకు పోటీగా వెదురువనాల్లో దూరి వేణుగానాలాలపిస్తోంది. వేసవి చిచ్చులు రాల్చిన నీ కొపపు నిప్పు కణికలు తనువంతటినీ తడిమి తగలబెట్టినా మనసు శితలంలో మంచుముక్కలా చల్లబడుతోంది. నా గుబులు గుండె గవిలో మిణుగుర్లా మెరిసిన సందేహానికి సమాధి కట్టిన సంశయమేదో మేధోసంపత్తికి అసంతృప్తిని మిగిల్చింది. చవకబారు తెలివితేటలు వికటించి చిక్కి శల్యమైన నా సందేహ దేహం కాస్తా శిధిలమై శిలాజంగా నిర్వీరమైపోయింది. పవిత్రంగా నిర్మించుకున్న మన ప్రేమవంతెన మాత్రం రామసేతులా కలల అలలపై తేలియడి సజీవంగా మిగిలిపోయింది. ఇవాల్టి ప్రేమను రెట్టించి రేపటికి మరింతపొందడానికని నిన్నను నెట్టేసి కొత్త ప్రభాతమేదో ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. రా... ఎంచక్కా రేపు మళ్ళీ పుట్టేద్దాం!!

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jIWwKi

Posted by Katta

20, ఏప్రిల్ 2014, ఆదివారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

నా ... జగద్విదితం నా భాష్యం మన:త్రిగుణం నా హాస్యం చతుర్భద్రం నా లోకం పంచతత్వం నా శోకం సుమ ప్రవాహం నా రుధిరం భ్రమ ప్రవళ్హికం నా హృదయం చిద్విలాసం నా వస్త్రం తత్వ తార్కికం నా అస్త్రం

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mox1mz

Posted by Katta

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

విష్వక్సేనుడు వినోద్ | నిరీక్షణలో... నిగూఢానికీ నమ్మకానికి నిచ్చెనేసి నడిమధ్యన నిరంతరమూ నలిగిపోతున్నా ! నా నీడే నకిలీదని నంజిలిపడుతున్నా !! నా నగవే నడిరేయి నక్షత్రమని నా నడతే నడిప్రొద్దు నీటిబొట్టని నాకు నేనే నచ్చకున్నా నేటికీ నే నటియిస్తూవున్నా !! నడుమంత్రపు నెయ్యములో నలిమేనిదొరనై నేను నడిజామున నలినముతో నర్తిస్తూవున్నా ! నిచ్చెలువ నైజముతో నూత్నమౌతున్నా !! 18-04-14

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5g9Pe

Posted by Katta

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

ప్రాణం పోక... అన్నం మెతుకులు ఇకచాలని కొన ఊపిరితో భరించలేక చీకట్లో ఉన్నా ప్రభువా! నీదరి చేర తలుపులెందుకు మూసేవు? కట్టుబట్టలు దేహానికొదిలి చావు బ్రతుకుల వంతెనపై కొట్టుమిట్టాడుతున్నా దేవా! కనికరించక ద్వారంలో ఎందుకాపేవు? ధనధాన్యాలను మోసుకెళ్ళలేక బహు బంధాలను వదులుకొని నీ బంధీకై వస్తున్నా భగవాన్! వద్దనుకున్న ప్రాణానికెందుకు కాపుగాసేవు?

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lQGxMu

Posted by Katta

10, ఏప్రిల్ 2014, గురువారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఆమె | విష్వక్సేనుడు వినోద్ ఆమె రోజూ నాముందు నగ్నంగా నిలబడుతుంది. తన హృదయాన్ని పెనవేసుకున్న ప్రేమలతని నాకే బహిర్గతం చేస్తూ మనసు పొరలు విప్పి మరింత నగ్నంగా, అప్పుడే పుట్టిన కాంతి పుంజ్యం లా నా ముందు నిలబడి తధేకంగా చూస్తుంది. నగ్నత్వం తన దేహంలోలేదు, తర్కించే నా మనసులో ఉందంటుంది. కోర్కెలు కాలానికి అతీతం కాదంటూనే కోరి మరీ కళ్ళెం వేస్తానంటుంది. కైపెక్కించే కళ్ళతో నన్ను కవ్విస్తూ కాల్చేసి, మరుక్షణమే తన స్పర్శతో బ్రతికించుకుంటుంది. నా జీవిత దస్త్రంలో మిగిలిపోయిన కాగితాన్ని తీస్కొని మరువలేని జ్ఞాపకాలతో నింపేస్తుంది. నింపేసిన కాగితాన్నీ వెళ్ళిపోతూ వెంటపెట్టుకుని పోతుంది. మనసులో అందంగా ముద్రపడ్డ అందమైన అక్షరాలను తేరిపారా చూస్తూ దస్త్రంలో మరో తెల్లకాగితాన్ని అమాయకంగా అతికించి ఆమె దస్తూరికై రేపటికోసం వేచిచూస్తాను. ఇవాళ మాత్రం ఆమె ఊహల్లో దాగి ఊపిరిగా మారిపోతాను. 10-04-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i2g11S

Posted by Katta

6, ఏప్రిల్ 2014, ఆదివారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఎదురుచూపు... నువ్వు నాకోసం ఎదురు చూసే క్షణాన, నన్ను నేను ఖాళీ చేసి ఉంచుతాను. నా నుండి నేను వీడిపోయి నువ్వెప్పుడు నాలో నిండుకుంటావని శూన్యమై వేచిచూస్తాను. నా హృదయాన్ని అద్దంలా పరచి, నేనైన నిన్ను నాలో ఒంపుకుంటాను. నీ ఎదురుచూపుల్లో నన్ను కౌగిలించుకున్న కాలాన్ని పవిత్రంగా నా జీవితపు గోడలపై లిఖిస్తాను. స్వచ్చమైన నా మనసుని దోసిలిపట్టి నీవైన నన్ను నేనే అభిషేకిస్తాను. 04-04-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mIcruo

Posted by Katta