పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
RajendraKumar Devarapalli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
RajendraKumar Devarapalli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, ఏప్రిల్ 2014, మంగళవారం

RajendraKumar Devarapalli కవిత

బావికి వెళ్ళే దారి చాలా కష్టమైనది, నా నీటిపాత్రను నింపేదెలా? నీటిని నింపేందుకు నేను వెళ్ళినప్పుడు తొందరలో,నా నీటిపాత్రను పగులగొట్టాను, ఓ నిజమ్ ఖుస్రో నీకు తన నిండుజీవితం ఇచ్చాడు. దయచేసి నీవు నా మేలిముసుగుపై శ్రద్ధ వహించగలవా? బావికి వెళ్ళే దారి చాలా కష్టమైనది, మూలం:అమీర్ ఖుస్రో ఆంగ్లానువాదం:షఫినిన్ ఆలీ ఆంధ్రానువాదం;రాజేంద్రకుమార్ దేవరపల్లి ఏప్రియల్,8,2014

by RajendraKumar Devarapalli

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1isHF63

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

RajendraKumar Devarapalli కవిత

ఎండ మండిపోతుందని చెప్పేందుకు రాజేంద్రకుమార్ దేవరపల్లి,2-4-2014 ఎండ మండిపోతుందని చెప్పేందుకు మొహమాటమెందుకోయ్ కవీ!! తల మాడుతోందనీ కాళ్ళుకాలుతున్నాయని చెప్పేందుకూ సిగ్గేనా? దాహమవుతుందనీ దప్పికతీర్చమని అడిగేందుకు అడ్డంకేమిటోయ్ పిచ్చివాడా? చెప్పులో,గొడుగో,తలగుడ్డో ఇవన్నీ తాత్కాలికమేనోయ్ బాబు పైకప్పు పాడయ్యింది పద తాటితోపులవైపు వెళదాం.

by RajendraKumar Devarapalli

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jY4dB3

Posted by Katta

2, ఏప్రిల్ 2014, బుధవారం

22, మార్చి 2014, శనివారం

RajendraKumar Devarapalli కవిత

మంత్రాలకు చింతకాయలు రాలితే రాజేంద్ర కుమార్ దేవరపల్లి,మార్చి,22,2014 మంత్రాలకు చింతకాయలు రాలితే మౌనాలకు భూకంపాలు రావాల్సిందే. అగ్ని పునీతం చేస్తే జఠరాగ్ని బాధితులంతా పవిత్రులే. మొదటి చూపులోనే ప్రేమంటూ పుడితే చూడలేకపోయేది కామం కాక మరేమిటి? ప్రశ్నించటం తలపొగరయితే సమాధానాలు లేకపోవటం సాధుత్వం అవుతుంది.

by RajendraKumar Devarapalli

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hRIs06

Posted by Katta

16, మార్చి 2014, ఆదివారం

RajendraKumar Devarapalli కవిత

యువ సాహితీ వేత్తలకు ఒక విజ్ఞప్తి/సూచన. ----రాజేంద్ర కుమార్ దేవరపల్లి,మార్చ్,16,2014 యువ సాహితీ వేత్తలకు ఒక విజ్ఞప్తి/సూచన. అన్ని సభలకు వెళ్ళండి.కేవలం సాహితీ సభలకే పరిమితం కాకండి. ముఖ్య అతిధిగానో,ప్రధాన వక్తగానో పిలిస్తే తప్ప ఏ సభకూ,ముఖ్యంగా సాహితీసభలకు వెళ్ళం,ప్రేక్షక/శ్రోతల్లో కూర్చోవటమా అన్న తలబిరుసు తగ్గించుకోండి. పదిమందితో కలిసే ఏ అవకాశాన్ని వీలైనంతవరకూ వదులుకోవద్దు. గుర్తుంచుకోండి-- సాహిత్యం సమాజం నుంచి పుడుతుంది. సారస్వతం పాఠకుల నుంచి,ప్రజల నుంచి వెలికివస్తుంది. దాన్ని అక్షరాల్లోకి బట్వాడా చేసి మరలా పాఠకులైన ప్రజల ముందు ఉంచటమే మీ ప్రధాన కర్తవ్యం. ఈ క్రమంలో కాగితం/కలం ఎంతో కంప్యూటరూ,కీబోర్డూ ఎంతో మీరూ అంతే అంతకంటే ఎక్కువ సమాజాన్నుంచి ఆశించకండి.ఆశాభంగం చెందకండి.

by RajendraKumar Devarapalli

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdW5r

Posted by Katta