పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Padma Arpita లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Padma Arpita లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మే 2014, శుక్రవారం

Padma Arpita కవిత

గీతలు-రాతలు గీతలకేం తెలుసని చేస్తాయి గీతోపదేశాలు!! అరచేతి గీతలుచూసి అఖండ సౌభాగ్యమని అర్థంకాక అలికిన గీతల్ని అహా ఓహో అని హస్తరేఖలతో జీవితాన్ని ఏం అంచనా వేస్తావు చేతుల్లేక జీవిచడంలేదాంటే వెర్రిముఖం వేసేవు గజిబిజిగీతలకేం ఎరుక గాడితప్పిన గమ్యాలు!! నుదుటిపై గీతల్లో భవిష్యత్తు అంతా భవ్యమని ఆకతాయిగా తిరిగి అదే అందిన ఆనందం అని కష్టాల్లో కలిసిరాదని నుదుటిరాతనే నింధించేవు ప్రయత్నం ఏం చేయకనే ఫలితాలని ఆశించేవు సరళరేఖలకేం తెలుసని సహజీవన విధానాలు!! నేలపై నిలువు అడ్డంగా గీతలేగీసి సరిహద్దులని స్వార్ధసంస్కరణల చిందులనే విజయమనుకుని విరిగిన మనసులకు మాటల లేపనమే పూసేవు అద్దమంటి మదిని గీతకనబడకుండా అతకలేవు గాట్లుచేసే గీతలకేం ఎరుక గాయాల సలపరాలు!! పట్టింపు పగలతో శరీరంపై గాటుగీతలేసి శిక్షలని రక్తం స్రవిస్తుంటే రంగొకటే అయినా మనం వేరని ఆవేశంతో ఆలోచించకనే తృటిలో పరిష్కరించేవు ఎన్నటికీ ఊపిరాగిపోని గీతలేవీ నీవు గీయలేవు బంధాల మధ్య గీతలకి లేవు సంబంధ విలువలు!! అనురాగాల తులాభారమేసి ఆపలేవు అడ్డుగోడని పైకంతో వారధి కట్టి కాంచలేవు మమతల కోవెలని అనుబంధమే తెగితే ముళ్ళు లేకుండా అతకలేవు అంతరంగపు అడ్డుగోడలతో అందరిలో ఒంటరి నీవు 23rd May 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t2I5ob

Posted by Katta

16, మే 2014, శుక్రవారం

Padma Arpita కవిత

వలపు విశ్లేషణ ప్రేమంటే తెలియకనే ప్రేమించాలనుకుని ఏరికోరి ఎదను చూసి మరీ ఎంచుకుని... దరకాస్తుకై దర్యాప్తులెన్నో చేసుకుని..ప్రేమిస్తే! తెలిసిందది ఒక అసంకల్పిత ప్రతీకార్యచర్యని వాదనలేల వలపు వలలో పడ్డాక అనుకుని చెప్పుకున్నాం ఎన్నో కాలక్షేపపు కబుర్లని... ఇచ్చుకున్నాం బహమతుల ఎరలని..ఇస్తే! తెలిసింది ధనరాసులకది ఒక పరాన్నజీవని కాలగమనంలో ప్రేమయే ప్రతిష్టంగా నిలవాలని నమ్మకాన్ని నమ్మి కట్టాం కష్టాలకంచుగోడలని... ఆకలితో అలమటించి జీవితయానంలో చెమటోడిస్తే! తెలిసింది అదీ ఒక అనిశ్చల ఆకర్షణల పరావర్తనేనని ఏమైనా ప్రేమంటే తెలిసీతెలియక ప్రేమించేసానని చేతులేవో కాల్చుకుని ఆకులు నులుపుకుని... కళ్ళెమేయలేని కోర్కెలతో అందలమెక్క ప్రయత్నస్తే! తెలిసింది విధి చేతిలోన విఫలమయ్యే వక్రీకరణమని 16th May 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RYBsrn

Posted by Katta

26, ఏప్రిల్ 2014, శనివారం

Padma Arpita కవిత

తగునా!! ఏటిగట్టున కూర్చుని ఏరులో నీడను చూసి ఎదసవ్వడి ఎగసెనని చూపులతో గాలమేసి వాల్జడ నయగారమన్నా వలపు విరబూసేయునా! రేయిజామున కలగని రేచీకటిలో మాటువేసి సందెపొద్దు అందాలని వెనకమాటున వాటేసి వంపులని నింధించినా వగల వయ్యారమాగునా! బాహువుల్లో బంధీనని బాహటంగా పలకననేసి చోద్యమేదో చూపుతానని చిత్ర విన్యాసమేదో చేసేసి నేలచూసిన బిడియమౌనా పైటకప్పిన పరువమాగునా! 26th April 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rwrKsS

Posted by Katta

22, ఏప్రిల్ 2014, మంగళవారం

Padma Arpita కవిత

చేజారిన పసితనానికీ పరిపక్వానికీ నడుమ ప్రేమబీజమేసి అంకురించని అనురాగానికి పరిపూర్ణత్వం జోడించి వికసించని పువ్వులోని పుప్పొడంతా మాయంచేసి ఫలం అందించలేదంటూ నిందలుమోపడం ఎందుకో! అదిమిపెట్టిన ఆశలన్నింటినీ ఆలోచనాక్షరమాలల్లి స్వయంవరానికి రానన్న వరునికి వలపుపీఠమిచ్చి కళ్యాణ తోరణం అనుకుని తమలపాకుల పందిరల్లి బంధమేదో బహుగట్టిది అంటూ విందులు ఎందుకో! పతనమైన పరిచయంలో నుండి పుట్టిన భావాన్ని గొంతు నులిమేసి రాగం రంజింపజేసిందంటే నమ్మి కాలిన కాలితో వెర్రిగెంతులేస్తూ చేసిన తాండవాన్ని మెచ్చి చప్పట్లు కొట్టారంటూ తెగసంబరం ఎందుకో! అవనికీ అంబరానికీ నడుమ అంచనాల్లేని నిచ్చెనేసి చలనంలేని చెలిమిలో చంచలమైన నెచ్చెలిని గాంచి మెండైన మైత్రినందీయలేని అల్పాయుష్షుపై బాసచేసి దరహాసంలో దగ్గరైన దుఃఖాన్ని బంధించడం ఎందుకో! 22nd April 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ic8EXs

Posted by Katta

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

Padma Arpita కవిత

నాకు తెలిసినదేదో!! ఈ లోకంలో నటించనివారు ఎవరు?? లేనిది చూపే ప్రయత్నమే నటించడం ప్రేమించలేనివాడు ప్రేమని నటిస్తే నిజం చెప్పలేనివాడు అబధ్ధమాడతాడు! ఆకర్షించలేనివాడు అందాన్ని అరువడితే నిజాయితీలేనోడు అన్యాయాన్ని ఆశ్రయిస్తాడు! ఈ రంగులుమార్చే లోకంలో ఎవరికెవరు?? ఒకరి కోసం ఒకరని మోసగించుకోవడం స్వార్థమెరిగినవాడు ఇతరులని మోసగిస్తే అసూయాపరుడు ఆదర్శాలని వదిలేస్తాడు! తనవద్ద లేనిది ఇతరుల్లో చూసి కొందరేడిస్తే తత్వమెరుగనోడు తర్కించి గెలవాలనుకుంటాడు! ఈ జీవన రణరంగంలో చివరికి మిగిలేదెవరు?? తెలుకోవాలన్న ప్రయాసతో తోలుబొమ్మలై ఆడడం విజయాన్ని కోరువాడు విశ్వప్రయత్నంతో గెలిస్తే దొంగలా దోచుకునేవాడు దొడ్డిదారిలో పరుగిడతాడు! కౄరత్వంతో కఠినంగా మసలువాడు మృగంలా జీవిస్తే మంచిమనుగడ కలవాడు అందరి మదిలో జీవిస్తాడు! 11th April 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd1Bgd

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Padma Arpita కవిత

పెద్దమనిషయ్యా.. ఏంటో ఉండుండి నాలో అనుకోని ఈ మార్పు!? అమాయకత్వం నుండి అంధకారంలోకి వచ్చి అన్నీ స్పష్టంగా చూసేసి అర్థం చేసుకున్నట్లు రాబంధులన్నీ రామచిలకలై రా రామ్మన్నట్లు కుళ్ళుపై పన్నీటి కళ్ళాపి చల్లి శుభ్రపరిచినట్లు.. ఎందుకో నాలో సుడిగుండాల ప్రశ్నల కూర్పు!? జవాబులు తెలిసినా చెప్పకూడదంటూ నొక్కేసి గుంబనంగా బ్రతకాలని పాఠాలు వల్లిస్తున్నట్లు అసభ్యత అర్థం కాకపోతే అంతా సభ్యతన్నట్లు నలుపైతే మచ్చ కనపడదని ఇష్టం అనేసినట్లు.. ఎక్కడిదో నాలో నాకే తెలియని ఇంతటి నేర్పు!? తీరని సమయంలో తీరిగ్గా ఆలోచిస్తే తెలిసింది ఇన్నాళ్ళకి జ్ఞానం పెరిగి పెద్దమనిషి అయినట్లు లేని దర్పం నాకబ్బి కొత్తఛాయ ఏదో పెరిగినట్లు వెసులుబాటుకై వెలగాలని ఎవరో ఉసిగొల్పినట్లు.. పద్మార్పిత.. 3rd March 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k3i2OM

Posted by Katta

3, ఏప్రిల్ 2014, గురువారం

Padma Arpita కవిత

పెద్దమనిషయ్యా.. ఏంటో ఉండుండి నాలో అనుకోని ఈ మార్పు!? అమాయకత్వం నుండి అంధకారంలోకి వచ్చి అన్నీ స్పష్టంగా చూసేసి అర్థం చేసుకున్నట్లు రాబంధులన్నీ రామచిలకలై రా రామ్మన్నట్లు కుళ్ళుపై పన్నీటి కళ్ళాపి చల్లి శుభ్రపరిచినట్లు.. ఎందుకో నాలో సుడిగుండాల ప్రశ్నల కూర్పు!? జవాబులు తెలిసినా చెప్పకూడదంటూ నొక్కేసి గుంబనంగా బ్రతకాలని పాఠాలు వల్లిస్తున్నట్లు అసభ్యత అర్థం కాకపోతే అంతా సభ్యతన్నట్లు నలుపైతే మచ్చ కనపడదని ఇష్టం అనేసినట్లు.. ఎక్కడిదో నాలో నాకే తెలియని ఇంతటి నేర్పు!? తీరని సమయంలో తీరిగ్గా ఆలోచిస్తే తెలిసింది ఇన్నాళ్ళకి జ్ఞానం పెరిగి పెద్దమనిషి అయినట్లు లేని దర్పం నాకబ్బి కొత్తఛాయ ఏదో పెరిగినట్లు వెసులుబాటుకై వెలగాలని ఎవరో ఉసిగొల్పినట్లు.. పద్మార్పిత.. 3rd March 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k3i2OM

Posted by Katta

8, ఫిబ్రవరి 2014, శనివారం

Padma Arpita కవిత

నా అస్త్రాక్షరాలు క, చ, ట, త. ప లు కౌగిలించిన అక్షరాలను డు, ము, వు, లు విభక్తులు ఏవనడిగాయి... వియ్యమొందాలనుకున్న ద్విత్వ అక్షరాలను గుణింతములు గుణగణితము ఎక్కడన్నాయి... సంధికార్యమిది అనుకున్న సంయుక్తాక్షరాలను సమాసాలు సమాధానంగా ఛంధస్సుని కోరాయి... సంస్కృతంటూ సిగ్గుపడుతున్న సంశ్లేషాక్షరాలను ప్రకృతి-వికృతులు పకపకనవ్వుతూ ప్రశ్నించాయి... భాషాభాగాలని బరిలోదింపిన మహాప్రాణాక్షరాలను వత్తులే కాదు లింగములు లేవంటూ విడదీసాయి... అలంకారాలు అందంగా అద్దలేదని నా అస్త్రాక్షరాలను భావవ్యాకరణమేకాదు తెలుగుభాషలేని కవితన్నాయి! 7th Feb 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/My24MV

Posted by Katta