పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Radha Manduva లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Radha Manduva లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Radha Manduva కవిత

నిజం కదా.... ----------- రాధ రాజశేఖర్ ______________________________________________________________ ఎదుటి వ్యక్తి మనసులోంచి సూటిగా తాకిన అభినందన 'చేతన' ని కుదుపుతుంది ఎడతెగకుండా మాట్లాడుతున్న విదూషకుడు హఠాత్తుగా మౌనం వహిస్తాడు క్షణాల్లోంచి వింత వింత సుమాలు పూస్తాయి శరీరం ఎవరిదో అన్నట్లుగా ఉంటుంది 'నా' గురించి ఏవో వివరాలు అడుగుతున్న స్వరం ఎప్పుడూ మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ముగించుకుని వెళ్ళాల్సిన దానిని పెంచుకుని వెళుతున్నానన్న ఆశ్చర్యం ఆనందంగా మారుతూ ఉంటుంది ఒక్క మనిషి చూపించిన అభిమానం దిగంతాలు దాటి జగమంతా విస్తరిస్తుంది మనుషుల మీద నమ్మకం మరోసారి మల్లెపువ్వులా గుబాళిస్తుంది ***

by Radha Manduva



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pvn1cU

Posted by Katta

5, ఏప్రిల్ 2014, శనివారం

Radha Manduva కవిత

ఎలా రాయడం? రాధ రాజశేఖర్ ________________________________ లోకాన్ని మరమ్మత్తు చేసే మిషతో కథలు, కవితలు, కవిత్వాలు వాటిల్లో నీతి సూక్తులూ రాసి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలిట. రాస్తుంటే లోపల ఎక్కడో - ఫీబుల్ గా 'నేను' చేసే విమర్శ వినిపించదూ - 'నిన్ను చూసుకోవాయ్' అంటూ!!? వందల వేల సూక్తులు రాసో దానికి విరుద్ధంగా విశృంఖలతలను ప్రోత్సహిస్తూ రాసో ఏం బాపుకుంటాం? - సెల్ఫ్ ఎంక్వయిరీ లేకుండా! మనిషిలోని గందరగోళాలూ సమాలోచనలూ సర్దుబాట్లూ కల్లోలాలు - ఇవన్నీ కళలో ప్రతిఫలించాలనే ప్రయత్నం చాలదూ! నియమాలనీ, ప్రయోజనాలనీ ఇరికిస్తూ ఏదో ఫార్మల్ సైకిల్ లాగా ఎలా రాయడం? రాయకపోతే ఏమవుతుంది? ఏమవుతుందో తేల్చుకో...... చూశారా... 'తేల్చుకోవాలిట' ఇది తేల్చుకో అది తేల్చుకో అంటూ ప్రతి విషయానికీ ఏదో 'ముగింపు' ఉంటుందనీ దాన్ని తెలుసుకోవాలని - ఏమిటిది? వెర్రి ప్రయత్నం అసలు దేనికైనా 'అంతం' ఉంటుందా? పోనీ 'ఆరంభం' ఉంటుందా? 'అది' తెలుసుకోవాలి - తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక కలగాలి కలిగిన తర్వాత 'అది' అంత గాఢంగా నిలిచి ఉండాలి. అప్పుడు రాయాలి - ఆ స్థితిలో రాయాలి రాయడాన్నే కర్మణ్యజీవితంగా చేసుకుని రాయాలి. ******

by Radha Manduva



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oj0jnB

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Radha Manduva కవిత

ఊటబావి మనసు ------------- నిర్జన నదీతీర ఒంటరి కుటీరానికి వెళ్ళాలని ఉంది ఊహాజగత్తులో రమ్యహర్మా్యలను నిర్మించాలని కాదు దూర తీరాలతో నాకు నిమిత్తమూ లేదు నాలోని అస్తవ్యస్త భావాలన్నింటినీ ఒకచోట చేర్చి చూసుకోడానికీ నాలో ఉన్న ఎత్తు పల్లాలను చదును చేసుకోవడానికీ మీద పడుతున్న దాహపు కోరికల అలల తీరాన్ని కనుగొనడానికీ వెళ్ళాలి - ఒక్కసారి ఆగి నన్ను నేను సంభాళించుకోవాలి సాంత్వన పొందాలి కాని అదేమిటో… బంధాల అనుబంధాల చటా్రల్లో భ్రాంతుల వలయాల్లో గతకాలపు జ్ఞాపకాల్లో చిక్కుకుని చేసిన తప్పుల్నే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇక్కడిక్కడే ఊరుతోంది ఊటబావి మనసు ***

by Radha Manduva



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PgHCBW

Posted by Katta

2, ఏప్రిల్ 2014, బుధవారం

Radha Manduva కవిత

ఊటబావి మనసు ------------- నిర్జన నదీతీర ఒంటరి కుటీరానికి వెళ్ళాలని ఉంది ఊహాజగత్తులో రమ్యహర్మా్యలను నిర్మించాలని కాదు దూర తీరాలతో నాకు నిమిత్తమూ లేదు నాలోని అస్తవ్యస్త భావాలన్నింటినీ ఒకచోట చేర్చి చూసుకోడానికీ నాలో ఉన్న ఎత్తు పల్లాలను చదును చేసుకోవడానికీ మీద పడుతున్న దాహపు కోరికల అలల తీరాన్ని కనుగొనడానికీ వెళ్ళాలి - ఒక్కసారి ఆగి నన్ను నేను సంభాళించుకోవాలి సాంత్వన పొందాలి కాని అదేమిటో… బంధాల అనుబంధాల చట్రాల్లో భ్రాంతుల వలయాల్లో గతకాలపు జ్ఞాపకాల్లో చిక్కుకుని చేసిన తప్పుల్నే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇక్కడిక్కడే ఊరుతుంది ఊటబావి మనసు ***

by Radha Manduva



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PgHCBW

Posted by Katta

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Radha Manduva కవిత

అస్థిత్వం - రాధ మండువ 1. శబ్ద కాలుష్యంతో వేడెక్కిన సాయంత్రం నియాన్ లైట్లలో మెరుస్తున్న సిల్కు చీరల డంబం హాయ్! హలో! అంటున్న రంగు పెదవుల వ్యంగ్యం అధికారాలను బట్టి చూపిస్తున్న కపటాభిమానం జీవితం మీద అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. 2. నల్లని కాటుకను మింగిన నిశాంధకారం 'నలుగురితో కలవడం తెలియదం'టూ చేస్తున్న అవమానం ఇష్టం లేకుండా దురాక్రమణం గావింపబడ్డ శరీరం లేడిని చంపి తింటున్న సింహంలా నవ్వుల వెటకారం జీవితాన్ని అంతం చేసుకోమంటున్నాయి. 3. చల్లని ప్రభాత గాలుల ఉదయం బాలభానుడి కౌగిలి వెచ్చదనం ఆశల అడియాశల బేరీజుతనం అంధకారపు ఆలోచనలను విడనాడమంటున్న స్థిరత్వం బిడియపు శృంఖలాలను తెగ్గొట్టుకోమంటున్న ధీరత్వం జీవితం పట్ల నిర్లిప్తతను తొలగిస్తున్నాయి. 4. నిశ్శబ్ద ప్రశాంత మధ్యాహ్నం ఎండలో నిగనిగలాడుతున్న ఆకుల పచ్చదనం రేడియోలో వినబడుతున్న ఆర్ద్ర స్వరం పక్కింటి పిల్లవాని మాటల్లోని అమాయకత్వం వంటింటి నేలపైనున్న చెమ్మదనం జీవితం మీద ఆశను కలిగిస్తున్నాయి 5. దారాన్ని తెంచుకుని ఎగురుతున్న గాలిపటం గూడుని వదిలి స్వేచ్ఛగా విహరిస్తున్న విహంగం గలగలమంటూ దూరతీరాలకు పరిగెడుతున్న ప్రవాహం పురివిప్పి ఆడుతున్న మయూరం జీవిత గమ్యాన్ని తెలియజేస్తున్నాయి. ****

by Radha Manduva



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN88F

Posted by Katta