పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Arcube Kavi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Arcube Kavi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Arcube Kavi కవిత

ఎక్కడివో ఆమెకు ఆ చేతులు _________________________ఆర్క్యూబ్ ఆమె ఎట్ల సవరిస్తదో... పబ్బుల మీదికి గునా గునా పాకి పొట్ల తీగ తెల్లగ పూస్తది ఆమే వాటి ఆకులకు పసుపు కుంకుమ పెట్టి దండం బెడ్తది ఈ చెట్టుకు దండం బెట్టే చేతులు ఆమెకెక్కడివి ఏదేమైనా- అనాదిగా ప్రవహించే కానుకలు మనుషులను భలె చిగురింపజేస్తై కదూ !

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T3jILs

Posted by Katta

22, జూన్ 2014, ఆదివారం

Arcube Kavi కవిత

మసి గుడిసెలు _________________ఆర్క్యూబ్ తొంగి చూస్తే ఏముంది ఏళ్ళకేళ్ళుగా ఇంతే ఎప్పుడు కూలుతయో తెల్వది నాలుగు దిక్కుల నాలుగు సలాకలు అవే పునాదులు ఆ గుడారాలకు మీరు మసి గుడిసెలనవచ్చు ఆ పసి వాళ్ళ మొఖాల్లోకి తొంగి చూస్తే అవి అక్కడా కనిపించచ్చు ఇనుప మంచం ఇనుప ఉట్టి ఇనుప పెట్టె అంతా ఇనుం ఇనుం ఇనుమూ బొగ్గూ మండి వాళ్ళు కత్తి కొడవలి గన్నూ బాడిసెలు పట్టుకారు చానం పోగర్ లు చిన్న పెద్దా ఆడామగా తేడా లేమీ లేవు అందరు కొలిమి పురుగులె వృత్తాలు గా తిరుగుతూ బరువుగా పడే గన్ను దెబ్బకు గురికావాల్సిందే బులోర్ గొట్టంలోంచి ఎగపోస్తూగాలి కొలిమి మంటలో కమాన్ పట్టీ ఎక్సెల్ డాకల్ మీద గొడ్డలవ్వాల్సిందే ఎక్కోలమీద తూము జేసుకొని చేతులు మారాల్సిందే కథ ఇంతటితో ఒడిసిపోతే బాగుండు పైకి లేసిన బూడిద మెల్ల మెల్లగా నిశ్శబ్దాల్ని పరుస్తుంటది కొలిమి సెగ కణికెలు ఒంటిమీద పడి పచ్చి పుట్టు మచ్చలై తేలుతై రూపు కెక్కుతున్న గొడ్డలి రవ్వలు తూటాలై వేటాడుతై కూసోని కూసోని పోద్దు కాళ్ళలో కుంగుద్ది పాతికేళ్ళమీద చీకటి పడి చాతిలోంచి తీతువు పాట లేస్తుంది పదితనానికేమెరుక మసి ముఖాల్ని పాడుతుంటది ఎక్కడొ బొగ్గు ముక్కలల్ల అగ్గి కథ రగులుకుంటది _ 31 డిసెంబర్ 2006 జనగామ బస్టాండ్ ఎదురుగా ఉన్న గుడిసెలు

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V1ENIe

Posted by Katta

18, జూన్ 2014, బుధవారం

Arcube Kavi కవిత

యాత్ర ___________________ఆర్క్యూబ్ మొన్న నీ కళ్ళల్లో నువ్వొక దుక్కం నిన్న నీ కళ్ళల్లో మా కన్నీళ్ళు ఇవ్వాల్టి నీ కళ్ళల్లో ఎంతో దయ ఇది నిజం మొన్న మనం కలిసామా అప్పుడు- అన్ని దారులు మూసుకుపోయినై అన్నవు నిన్న ఇట్లనే కలిసినమా అప్పుడు- "ఒక నిర్మాణం -తలమునకలైన ఎంతో మంది "ని చూసానని చెప్పినవు ఇవ్వాల- నీ చేతులు ఎంత సౌందర్యంగా మెరుస్తున్నయో .. నా కళ్ళు చెప్తున్నయి పద పద- నువ్వటు నేనిటు మన కలల్ని ఆ చివరా వెలిగించాలి

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r6CkpP

Posted by Katta

16, జూన్ 2014, సోమవారం

Arcube Kavi కవిత

జీవితానికి శీర్షిక లేదు __________________ఆర్క్యూబ్ రాంగ ఒక స్వప్నంతో పోంగ ఒక సత్యంతో

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n22S7O

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Arcube Kavi కవిత

తుర్క గోవిందం ______________ఆర్క్యూబ్ గలీజ్ పనులు గలీజ్ మనుషులు రోత శివా ..శివా.. తానమే జెయ్యరు సోరుప్పు రాలిన గోడలు గూడలు దెగిన చెప్పులు ఏడికాడ మోరీలు గల్లీ నిండ పందులు మా మాదిగోల్లు నయం బాషా..ఏషం అంతా అలగే ఇంటిపొంటుంటే వాడ కట్టంత కంటే తలుసుకుంటనే ఓకారం ఏండ్లు పూండ్లైనా వీళ్ళ దిమాక్ పన్ జెయ్యది " హిందూ "మహా సముద్రంల మీనార్ పొద్దు పొడుస్తదా అల్లా అంటే ఈ దేశంల అన్నం పుడుతదా నిత్తె నమాజ్ జేత్తే అమీర్ లై పోతరా సారే జహాసే అచ్చా.. అబ్బో..ఈ దేశస్తులమైపోదామనే ?! అదే పాన్ టేలా అదే బీడీ సాటా అరేక్ మాల్ పాంచ్ రుపాయ్ అవే తోపుడు బండ్లు నాటివట్టి అవే మూసలు ఇక్కడ బడెదైనా గుడే మనువు నోట పుట్టిందే అక్షరం చచ్చినట్టు పాడాల్సిందే వందే మాతరం ఔ ఈ చమన్ల కమలమే పూస్తది ఈ దునియ వామన హస్తపు గుప్పిట అసలుకు సమస్యంతా మైనార్టోళ్ళే దేశమంత రామ రథం నడిపినా జెంకుతలేరు గుజరాత్ ల కుంకుమ కల్లాలు దులిపినా రంజాన్ మాసం ఆగుత లేదు మొండి తుర్కలు దేశమిడువరు ఊరోళ్ళంతే - వాళ్ళకు ఉర్సు సంబరం దర్గా గొప్ప నమ్మకం పీర్ల పండుగల వాళ్ళూ వీళ్ళు పాలూ నీల్లు ఉత్త అమాయకులు మేధావులు గొంతెత్తరు హేతు వాదం బొత్లికె నడువది సచార్ కమిటి సత్యం నాసనమైపోతది బాజాప్తా జరుపుదాం ఘర్ వాపస్ కు ప్లాటినం జూబ్లీ కాలమిక్కడ త్రిశూలం పార్లమెంటుకు పచ్చ చెంకీలు పడై ఎర్రకోట మీద నెలవంక నిలువది జమానా నుంచి మన చాందసవాదుల్దే రాజ్యం అటుజూడు- ఆ ఇద్దరు గడ్డం మియ్యలు సెప్టెంబర్ 11 లెక్క గొడుతున్నరు ఉర్దూల ఏం సోంచాయిస్తార్రొ బోర్లవడ్డ చరిత్రను దువాతో నిద్ర లేపుతరా జంబూ ద్వీపం నీ అబ్బదా అంటే ఇజ్జత్ కా సవాల్ _ _ టప టప టప టప .... నేలకు పరిమళమద్దుతున్న ఆ రెక్కల గుంపు ..అవేమిటి లౌకిక విలువలు .. గుడ్లు పెట్టక ముందే గూళ్ళు చెరపాలే అక్కడ జరుగుతున్నది ఇఫ్తార్ విందే గదా జల్ది నడు తిరుమల తిరుపతి దేవస్తానం మాంచి మోకా మీదున్నది తుర్క గోవిందంతో - ఈద్ ముబారక్ చెపుదాం * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1y4Uv4f

Posted by Katta

14, జూన్ 2014, శనివారం

Arcube Kavi కవిత

బడి ________________ఆర్క్యూబ్ నల్ల బల్లకు - నల్లారం పొడే గిట్టదు మట్టి మీద నడవదు ఏ సుద్దముక్క నాలుగ్గోడలు గోడలే ఏ పుస్తకం తిప్పినా మొలలకు యాల్లాడ దీసిన సాంచలే ఇక పిలగాండ్లంటరా అర్రల్లల్ల ఇముడుతరు అలల్లేని సముద్రంల ఆడుకుంటరు పరాయి బాషల ఒంటేలుకు పోత్తరు బరిగే దెబ్బకు మొక్క వంగుద్ది అట్లా శెరీకవుడే ఆలస్యం బట్టి ముట్టిచ్చి పొగవెడుతుంటరు కానోళ్ళతోటి కథ నడుస్తుంటది దబ్బన - ఏ మబ్బన్నా దయగా చినుకు రాల్చిందే అనుకో ఇగజూడు ఆఫీసు రూముల అలజడి అండ్ల పసకొండు గ్రూపులు ఇది బడి సకలం ముకలం దీని పునాది

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SI9mAC

Posted by Katta

13, జూన్ 2014, శుక్రవారం

Arcube Kavi కవిత

.ఎక్ తారా.. ________________ఆర్క్యూబ్ అతడు-తానెంతో మొనగాన్నో చెబుతూ పోతుంటడు మనకర్తమవుతూ ఉంటుంది ఇప్పుడొక గాలిపటాన్ని కూడా మోయలేడు ఒక్క పూవుని కూడా ముద్దాడ సాహసించలేడు గిరికీలు కొడుతున్న పిట్టను చూడ్డానికి గజ గజా వణుకుతుంటడు తన బాల్యంలో - కోతి కొమ్మచ్చి ఆడానంటే మనమొక పట్టాన నమ్మలేం అర్తమవుతూనే ఉంటుంది అతడెక్కడ తెగిపోయాడోనని అతడు- ఏ గాలికో కిందపడి తన కలల సౌధాన్ని తగలబెట్టుకున్న ఒక బంగారు దీపం.

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SGmkPd

Posted by Katta

12, జూన్ 2014, గురువారం

Arcube Kavi కవిత

దరియ్యి ____________ఆర్క్యూబ్ పిడాతనో తాత్పారంగనో ఎనుకసీరి ముచ్చట ముసురే పెడుతవో ముంతలే కుమ్మరిస్తవో అటెనుక సంగతి పత్తి గింజలు వట్టిపోతున్నయి మొక్క జొన్న చేల్లు తాళ్ళు పేనుతున్నై నువ్వుజేండ్లు కుట్టువడి పోతున్నై నారు ముదిరి పోతంది పస్కవడక పశురం ఔగోళిస్తంది ఒక్క దమ్ము పడూ.. " మీదెండంది లోపట నానది ఆకిళ్ళల్ల నాచు అట్టి దుబ్బురు " అనం పేర్నాల పెట్టం సానుపు లెక్కనే పడు దంచి కొడితే మంచిదే ఇత్తనం నిలిస్తే అందరికి మంచిదే కురూ కురిస్తనే పేరు- నీకైనా నాకైనా ___ *___

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TNMXTC

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

Arcube Kavi కవిత

చేతులు _________ఆర్క్యూబ్ వేళ్ళు ఐదే చేతులు రెండే వాటి- తలరాతే పొక్కులు పొక్కులు

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mBCAJz

Posted by Katta

9, జూన్ 2014, సోమవారం

Arcube Kavi కవిత

బుచ్చిరెడ్డి బాపు ( హనుమాండ్ల బాయి - 2 ) ______________________ఆర్క్యూబ్ ఊరిని మోసెటొళ్ళు తరానికొక్కరుంటరు మా " గంగిపల్లి"కి బుచ్చిరెడ్డి బాపు ఆ బాయినే పంచుకొని ఆ బాయి కింది పొలాలనే పారిచ్చి ఆ ఒడ్ల పొంటనే తిరిగి తిరిగి ఆ పొలాల బువ్వనే తిని దానాత్మ పంచుకున్న మోతుబరి రైతు అచ్చగాల్లకు బిచ్చగాల్లకు అన్నం మెతుకు చేతులను గీరెలు జేసి మాటను ముల్లుగర్ర జేసి దున్నపోతులకు నాగలి గట్టి ఊరిని సాగు జేసిన కాపు బడై గుడై బాయి పొలం పెరడై ఇవ్వడమే తెలిసిన నదిలా సాగిపోయిండు ధర్మాత్ముడు ఐతేంది ..ఇది కాని కాలం గుడి మీదా బడి మీదా ఉడుం రాజకీయం బాపుకు పక్షవాతం ఈ ముచ్చట బాయి కెట్ల తెలిసిందో ఎండలకెండి దరుల బొక్కలు తేలి ఆ పిరిసెట్టెడు నీళ్ళల్ల ఎన్నడూ కనబడని బొమ్మ చాపలు నాలుగు - అవిటికెట్ల తెలిసినయో రాయి పెగిలింది అటు ఆఫీసొరిగి ఇటు హనుమాండ్ల గద్దె కూలి నిండా పూడిక పురా ఊటలు మింగి సర్కారు తుమ్మ అది బాయో బొందో ఏదీ గుర్తువట్టకున్నది కొడుకా- అండ్ల నీకు ఈత నేర్పాలనుకున్నగదరా కలిసి -సిమ్ముల మీంచి సొర్రేయాలనుకున్న గదరా ఆ భాగ్యమింకా మనకు లేకపాయే అయ్యలూ జెరంత పిల్లలనటు ఒంటరిగ పోనీయకుర్రి గుండె చెదురుతరు గిట్లనే తాపకొక్కరచ్చి ఆఖరి చూపు చూసి పోతున్నరు పాణమింక పోలేదు ఎవల కోసమో తండ్లాడుతంది కొడుకా-నువ్వు రా సూసి దండం బెట్టుకుందువు గాని * * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ss5X8U

Posted by Katta

7, జూన్ 2014, శనివారం

Arcube Kavi కవిత

హన్మండ్ల బాయి ( 1 ) __________________ఆర్క్యూబ్ చెక్కినట్టు బండ మంచిగ కచ్చు మీద కచ్చు అంతస్తుల్లెక్క నిర్మాణం ఎక్కా దిగా తంతెలు.తేటగ నీళ్ళు కట్టిచ్చిన బుచ్చిరెడ్డి బాపు ఆత్మ ఇప్పుడు పొండిషన్ పొక్క కరెంట్ మోటర ఇప్పటి నమోనల కనిపిస్తది గని అంతకు ముందది మోట బాయే ఇప్పటికి కనిపిస్తయి మోట సిమ్ములు ఏది ఆంచి దుంకి సూడు ఐతెనే పురాగ ఈతచ్చినట్టు ఊరి పేరు మోసే బాయి ఊరికొక్కటే మా "గంగిపల్లి"కి గీ హనుమండ్ల బాయి దాని చెక్కు చెదరని పొందిక తాతల నాటి బరివాత జీవనపు ఆహ్లాదం దిగి లోతులు తెలుసుకొమ్మనే సందేశం ఒక్కరూ చిన్న రాయేసి ఎరుగరు పొద్దున్నే పొలగాండ్లకు తెల్లారుతది ఐందపు లొట్టలకు బుర్ర కాయలకు గిరాకే గిరాకి గడ్డ పారీతకు రెక్కలస్తై ఆ ముచ్చట అవ్వలూ చూసి మురిసి పోతరు వాళ్ళ చుట్టు అప్పుడె కొత్తగ ఈత నేర్చుకున్నోల్లు గిట్ల గోట్టు.. గట్ల గొట్టు పెద్ద పెద్ద పెద్దీర్కాలు ముంచితనే భయం బొతది" జీవిత సత్యాలు .. అచ్చిన విద్యలన్ని అప్పుడే చూపించే ఆత్రాలు పుంజు పెట్టె ఆడుడు .. ఒక్కొక్క తంతె మీంచి ఒక్కొక్క తీరు దూకుడు ఉరికి పోయి సిమ్ముల మీంచి సొర్రేసుడు ఇంకా- అడుగు మట్టి తెచ్చి ఎక్కి పోయేటొల్లకు కొట్టుడు బుడుబుంగ లెక్క మునిగి పొండిషన్ పొక్కల తేలుడు అదొక జల సమాజం అండ్లా పంచాయతులు ,కొట్లాటలు .. తీర్పు కొత్తగ నేర్చుకునేటోల్ల దిక్కే వెలువడుతది పెద్దోలట్ల గాదు 'సప్పుడు జేక పెయ్యి రుద్దుకొని బట్టలు పిండుకొని --' అనుకొనే వస్తరు అండ్ల మునిగి తేలేటాల్లకు పోయిన పాణం లేసస్తది ఇగేంది ..అచ్చిన పని మరిచి పొతరు వీల్లకు సిమ్ములు ఆనై బాయంచుకున్న ఆఫీసెక్కి ఆంచి దుంకుతరు బాయంత దద్దరిల్లుతది ఇద్దరు ముగ్గురు దొంగలచ్చినా కాటు వడేత్తరు ఎంతటోన్నైనా సలాం గొట్టిచ్చుకుంటరు గడ్డ మీద కూసున్నోల్లకు పండుగే పండుగ.. అంగో లుంగో పిండిన వీళ్ళ బట్టలు ఇసిరేస్తే పై నుంచి క్యాచ్ పట్టి ఎండేసుడు పెద్ద గొప్ప బాయి పట్టు బగ్గ తెలిసినోళ్ళు బాయిలుంటె ఎండ గూడా ఒక బండేసుకోని పండుగ జూస్తది కని- వీళ్ళేక్కేటప్పుడు అందరెక్కాల్సిందే బాయికి రికాం ఉండద్దా ? ఎంతసేపు మాల్యమే ఎక్కన్నించో ఒక పెద్ద పటాలం ఉరికచ్చి ఉరికచ్చి బట్టల్తోటే బాయిల దుంకుద్ది ____ఇంకా ఉంది ________

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kLMECJ

Posted by Katta

5, జూన్ 2014, గురువారం

Arcube Kavi కవిత

వసంతాన్ని శపించుకున్న చెట్టు _________________________ఆర్క్యూబ్ ఎక్కడా నీళ్ళ సుక్క దలగక నెత్తికి చమురును నిషేదించుకున్న భాషా సౌలతి దొర్కక ఊహల హంసల రెక్కల్ని తెగ్గొట్టుకున్న కట్ల పువ్వు ఆకాశం కింద రాలిన ఈ నేల మోదుగ సిగల చెంద్రుడు చెదిరి పోయినంక అనాది ఆట పాటల్ని పాతరేసుకున్న చెమట చిందే కోండ్ర పదనకు పాకులాడుతంటే కన్న ఊరినే కాటగలుపుకున్న నువ్వెంత తపసు జెయ్యి నా కన్నీటి పాయల ఏ కగితప్పడవా కదలది ఎంత ఇకమతితో జేసినా - పడావు వడ్డ మొహంల పతంగి ఎగరది నేను- పురా మూలుగుల కంజెరను తరాల బువ్వ రాసుల కల్లాన్ని దూప దీర్చిన దొప్పను ఎర్రెర్రగ విచ్చుకుంటున్న మట్టిని దట్టించిన సోయిని నేను వసంతాన్ని శపించుకున్న చెట్టును గోగు పూత పట్టి మండుతున్న కొండను.

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2jL0Q

Posted by Katta

2, జూన్ 2014, సోమవారం

Arcube Kavi కవిత

అద్దం ముందట నా తల్లి _______________________ఆర్క్యూబ్ సంకెల్లు తెగుతుండే నా తల్లికి ఎక్కడలేని సంతోషం ఏదో ఉన్నంతల భూమి పంచుడు తుర్తిగ తన బిడ్డలకు పాలిచ్చుడు సెర్ల సాపవుడు చెట్టు మీద పిట్టవుడు పాడి మందల పాటవుడు ఊళ్ళల్ల పొద్దు పొడుసుడు మూల మూలకు వీచే స్వేచ్చ అందరిండ్లలల్ల వెలిగే దీపం ఇగురం తళ్ళి ఇంతింతై ఎదిగే తల్లి ఇరాముంటదా చెయ్యి దుగేటట్టు శిక్షణ చిన్న పెద్ద పరిశ్రమలు ఏడీకాడ నీటి పారుదల అన్నిట్ల అడుగు ముందట సదువు ఇసురుక పోవుడు సర్వ రోగాలకు అగ్గి పెట్టుడు ఉద్యమం నడుముకు జెక్కిన కొడవలి చెమట చుక్కే నుదుటి బొట్టు తినేంత తిను ఇడిసి పెట్టద్దు మెతుకు కంచం పొంట పడద్దు -బతుకు సూత్రం నా తల్లి -తీరొక్క పూల పెద్ద బతుకమ్మ తీరు తీరు కళల్ల కొలువైన దేవత రాక పోకల సాగిస్తది రాజీర్కాన్ని వాకిట్ల నిలిపి సలాం గొట్టిస్తది ఏన్నైన నేగులుద్ది దేన్నైనా సాధిస్తది తన బాసల ఎలుగుతది తన బిడ్డల త్యాగం నిలుపుతది (తెలంగాణ ప్రకటనకు ముందు రాసిన కవిత )

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n4sXpM

Posted by Katta

24, మే 2014, శనివారం

Arcube Kavi కవిత

నేను-వాళ్ళు ______________ఆర్క్యూబ్ నేను-నేను వేసుకున్న తొవ్వలో నడుస్తంటే వాళ్ళు-వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నరు నేను-నవ్వుతూ కాలిపోతుంటే వాళ్ళు చరిత్రలో బూడిదయ్యారు

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oqoaPG

Posted by Katta

11, మే 2014, ఆదివారం

Arcube Kavi కవిత

కొడుకా..యుద్దానికి నడు ______________________ఆర్క్యూబ్ కొడుకా-ఊరూరి చెరువు చెదిరిపోతుంది జెరంత గడ్డపార పట్టుకొని పోరాదు నీయవ్వ..తవ్వుకుంట కూసుంటె తెలంగాణ ఎవడు దెస్తడే ? బిడ్డా..గా హాస్టల్ల పురుగులన్నం బెడుతుండ్రట అట్లవొయ్యి అడిగిరాపో అరే ఏందే నీ లొల్లి అటువోతే ఇటువోతే తెలంగాణ ఎవడుదెస్తడే కొడుకా..గా చెట్లను మొదట్లకు కొట్టేయకురా వాటి కొమ్మలనిండా గుత్పలున్నై మీ నాయిన వాటితోనె రణంజేసిండు ముసల్దానా-నా ఇజ్జత్ దీత్తవానే అవిటితోని మనింటికి దర్వాజలు జేయిస్త మనకు పతార కావల్నా వద్దా ? ఒరే వారి ..గా పిట్టల్ని చంపకురా అవి మనింటి పొల్లగాండ్లురా థూ నీయవ్వ ..ఇగ నన్ను బజార్లవడెయ్యి ఇంటికి బొక్కాసకచ్చినోన్ని అట్టిగ పంపిత్తమా ఏంది కొడుకా ఊకే ఏంబంటవురా అట్లదిరిగితే నలుగురు ఏమనుకుంటరో తెల్తది ఎట్ల నడుసుకోవాల్నో తెల్తది అరె ఏందే నీ సణుగుడు నా లెక్కలు నాకుంటై నా వ్యూహాలు నాకుంటై నాకు సిగ్నల్ వస్తంది మంచిగ కలవడుతున్నప్పుడే లేపి కూసుండవెడ్తవు థూ నీయవ్వ ..ఎక్కడిదే నీకీ గుణం కొడుకా..రాత్రిపూట ఒక్కనివి పోతున్నవు ఎటు పోతున్నవో చెప్తలెవ్వు ఏంజేస్తున్నవో తెలుస్తలేదు అగులు బుగులైతందిరా... నీయవ్వ నా మీద నమ్మకం లేదానే ఆంద్రా పార్టీలను బొందవెడ్తనని జెప్పిన గదనే జాగ కోసం ఎతుకుతున్నా నాయినా మరి..అర్రలకెల్లి ఎల్తలెవ్వు పొద్దంత అండ్ల ఏంజేస్తున్నవురా ఏ పోవే..నీకన్ని అనుమానాలే బంగారు పళ్ళెం జెయ్యద్దా అండ్ల నీకు బువ్వ పెట్టద్దా వద్దుర కొడుకా - మట్టిల పుట్టిన మట్టిల పెరిగిన మట్టి సిప్పల్నే దింట గీ మట్టిల్నే కలుస్త నువ్వు గా వంకర వోతన్న నల్లగొండ దిక్కు పొయ్యిరాపో ఎందుకే అమ్మా..ఒక్క నాలుగు రోజులాగు ఐతే ఈ నాలుగు రోజులు మన కరీం నగర్ గుట్టల్ల కావలి వండుపో అమ్మా..ఎందుకే సూదుల్తో పొడుస్తవు ఒక్క రెండు రోజులు ఈడ లెవ్వనుకో ఐతే..ఈ రెండు రోజులు హైదరాబాదుల కబ్జా ఐన భూములల్ల సిపాయి లెక్క కలబడకుంటమాయే అట్టిగ నిలవడి రాపో ఓ అవ్వా..ఎందుకే తిన్న తిండి పెయ్యిన వట్టకుండ సతాయిస్తవు ఒక్క దినం ఓపికవట్టు ఐతే ఈ దినం చచ్చి మన ఆత్మల జీవం బోసుకున్న యాదయ్యింట్ల దీపమై ఎలిగి రాపో అవ్వ నీ పుణ్యముంటది నన్ను సంపుక తినకు నువ్వు మనవనితోని వొయ్యి నాలుగుతీర్ల తీపి వస్తువలు కొన్నుక్క రాపో ఆడ కిందిమీద జేత్తన్న తెలంగాణ వస్తంది కొడుకా..ఆడ నువ్వు కిందిమీద జేసేదేముండది ఈడ ఓయు పోరగాండ్లతోటి పొడుస్తున్న పొద్దు కోసం పపతి వట్టుపో అవ్వా..నువ్వు ఓపికగల్లదానవు ఏండ్లాగినవు పూండ్లాగినవు ఒక్క గంట గడువియ్యి పొయ్యి మనవరాలితొ బతుకమ్మలెత్తుకుంట పోటువలు దిగుపో సరె కొడుకా ఈ గంట అటేటు వొయ్యి మన కవులేమనుకుంటున్నరో విని రాపో అవ్వా..బువ్వ ఉడికేదాంకాగినవు ఉమ్మగిల్లేదాకా ఆగవా ? నువ్వట్ల ఒరుగు..నిమిషంల లేపుత చూడు కొడుకా..గడువులు వాళ్ళ వీళ్ళకు గాదురా నీకిస్తున్న ఈ ఒక్క నిమిషంల నా బొండిగ పిసికి చంపు గప్పుడు గమ్యాన్ని ముద్దాడినోనివైతవు ఏందే గట్లంటవు కొడుకనిజూడకుండ నన్నంటె నిన్నట్లు గాదే సాలుతియి.. గీ లంగ మాటలకు ఏంతక్కువలేదు ఎప్పుడువడితే అప్పుడూద అది అగ్గి బిడ్డా పరాశికాలద్దు తండ్రులు కొడుకులకు కొరివి వెడుతంటే ఉద్యమం కాటికారా పోయేది ఇంట్ల వండి చేసిన యజ్ఞాలు గివ్వేనారా ఒక గుత్ప వట్టవు ఒక్క ఆయుధాన్నైన గురి చూసి స్పందించవు తురుంఖానువు నువ్వొక్కనివే అనుకుంటనే ఈడిదాకచ్చింది గా ఎస్టేట్ల ఎలుక గొద్దెలు పాతినవారా ఊకూకే తవ్వుక సూడ ఆ పండుడేదో పొయ్యి బయ్యారం గనులల్ల వండుపో మన సాలేట్ల నడువదో నేను జూత్త నడువూ పోలవరం కింద పొలికేక వెట్టు అదో లెక్క అట్టిగ వాన్ని కలుపుకోను వీన్ని కలుపుకోను ఏమిటికిరా సభలు ? బిడ్డ నువ్వు మంచిగుంటె నాకు పేరత్తది నువ్వు తప్పులవడితే తల్లి గిదేన చెప్పింది అని తిడుతరు కొడుకా.. ఏదిట్ల పిడికిలి వట్టు ఇదే మీ అమ్మనుకో పట్టు సడలియ్యకు నా ఆట పాట తెచ్చుకుంట దునియంత ఆడుతా మొగులునంత పాడుతా.. ఇగ అను ఒకసారి గట్టిగ జై తెలంగాణా

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lgkXRB

Posted by Katta

8, మే 2014, గురువారం

Arcube Kavi కవిత

ఒక తాబేలు-కొన్ని చీమలు ____________________ఆర్క్యూబ్ సహజంగానే- చిరునవ్వుని కోల్పోనివాడు సాహసి గాక మరేమవుతడు లోకసంచారి సంపన్నుడుగా కాక మరే పేరుతో పిలువబడుతడు కలగని నిలబడ్డవాడు సముద్రంగా కాక ఇంకోల రూపాంతరం చెందడు కదా ! జ్యాలాముఖిలో పచ్చికుండ ప్రాయాలు జలపాతాఖాతాల్లో పట్టుదప్పని ప్రేమగీతాలు దోసిట- ఖండపు మంచులో అఖండంగా పూసిన పూలు అతడి డైరీ కల్లోలాలతో నిండిఉన్నా రెపరెపలాడుతుంది ఆ శబ్దహోరు విను మృత్యువుని జయించే రహస్యమేదో చెబుతుంది వీరుడి అడుగుల్ని పొదిగే అక్షరం పిట్ట ఇలా గాక మరెలా గానం చేస్తుంది అనుకున్న - పుట్టే బిడ్డ యుద్దకళల్ని నేర్చుకునే ఈ చిత్తరువును చూసి అచ్చెరువొందుతవని ఆ దృశ్యం ఈ నేల అద్దం తిరిగి తిరిగి నీ కళ్ళు ఈ చూపుడు వేలు తాబేలునే ముద్దాడుతై కొద్ది శ్రమతో ఇన్ని యోజనాల్ని ఎలా యాత్రించావో తెలుసా ఈ దారి కట్టిన చీమలు ఆ తాబేలు వర్షించిన కన్నీటి నెత్తుటి బొట్లే ఆ పిట్ట యుద్ద గానంలో నీలో తపస్సు చేస్తున్న స్వప్నం నిన్ను మెళకువలోకి ప్రత్యక్షించుకుంటుంది ఆ పిట్ట యుద్దగానం జీవన పోరాట కాంక్షని ఎంతగా మండిస్తుందో నీ చేతికందిన అమృతం నింపిన పాత్ర చెబుతుంది ఇక అడుగుల్ని సంధించు ఆనాది ఈ తోవలో నీ నడకకు అనుమతి లభించింది నీ నుండి సృజింపబడె చీమలు ఈ తొవ్వను వెలిగిస్తై

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jD67EV

Posted by Katta

7, మే 2014, బుధవారం

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట (అఖరి భాగం ) ________________________ఆర్క్యూబ్ ఎక్కడన్నా-పిప్పి పట్టిన పన్ను ప్రశ్నిస్తదా తొర్రి పండ్ల తొండలు శంఖం పూరిస్తయా సిరామిక్ దంతాలకు జనగన మన రుచేదో తెలుస్తదా ఇప్పుడొక్కటని కాదు అన్ని పల్లూ యూరోలోయలో గెవేరాలై పోరాడుతున్న గెరిల్లాలే సిమెంటం చింతపండై ఆఖరి క్షణాన్ని జీవిస్తున్న భగత్ సింగులే సుస్తిర దోపిడితో పంటిని అస్థిరం చెస్తే అది బిర్సాముండై కలెబడుద్ది నొకచో జ్ఞాన దంతం అరాఫత్ ను కలవరిస్తది ఒడంటాలజి కల్వర్ట్ కింద ప్రచండంగా గర్జిస్తది నిలువెత్తు రాక్షస నిర్లక్ష్యంలో సూకీని ముద్రిస్తది తప్పక ఐరోం షర్మీల పంటి భిగియై సామూహికమైతది వద్దు మార్చి ఆరు ఒకరోజు దినోత్సవాలద్దు పంటి కింద రాళ్ళై తగిలే రాజకీయాలద్దు పంటికి సురుకు పెట్టే పాడు ప్రణాళికలద్దు చెవులల్ల మందుపోసి నొట్లెకెల్ల పురుగుల దీసే మ్యానిపేస్టోలద్దు ఎన్నో జమై పంటిని పట్టిచ్చుకోని శిఖరాగ్రాలద్దు అట్లాస్ నిండా డెంటల్ ప్లూలె వద్దు ఇక ఏ ముఖం పిప్పి పన్నుతో పొద్దున పొడవడం నేను చూడలేను _____________________________........____________________________

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fUqoXu

Posted by Katta

6, మే 2014, మంగళవారం

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట -11 __________________ ఆర్క్యూబ్ కొక్కు కొరికే పల్లకు చెద చీల్చే పల్లకు నాశనగాలం నమిలే పల్లకు మేడి పల్లు విసిరే పల్లు పల్లు పావురాలు 'టెక్' నిగ్గా పన్నిన వలలో విలవిలలాడుతున్నై రేషన్లకొద్దీ లేజర్ ట్రీట్ మెంట్లు డ్వాక్రా లల్ల బ్రషింగ్ క్యాంపులు ఓటు ఓటు కొక స్మూత్ టూత్ పిక్ పలాన సిం కార్డ్ వారి ఆఫర్ సూపర్ స్కేలింగ్ స్కీం ఎత్తుపల్ల వాళ్ళకు క్లిప్సు కానుక బోసినోళ్ళకు బంపర్ మిక్సీ వ్రుద్దులకు కట్టుడు పల్ల పెట్టుడు పథకం బోరు తేలు కొనన వరాల కలషం సంక్షేమ కొరల్లో నవ్వుల పౌంటేన్ కబంద హస్తాల్లో పావురాల గుట్ట ఆవిదంగా ముందుకు పోవుడు పంచె గట్టె పల్లికిలిచ్చుడు చర్చ బర్రె పండ్ల మీదకి పోతది మియ్యంటె మియ్యని అసెంబ్లీ నిండా మియ్యావ్ మియ్యవ్ పార్లమెంట్ ల లోనూ ఇదే సొల్యూషన్ అట్టిగ పల్లు నూరుడు వంతుల వారిగ నాలిక కరుసుకునుడు పంటి తుడుపుల బల్ల సరసుడు ఇంకింత గొతెండేందుకే లాలా జలయజ్ఞం వంతపాడుతూ తాయిలాల పత్రికా కథనం పీఠికల నిండా లుకలుకలాడే పురుగులే పురుగులకు చిక్కి దేశపు పల్లు రాలగొట్టుకునుడు అంతా పాయలు పయలుగా వేరుచేసి పంటి నరాన్ని ఒడుపుగా తొక్కిపెట్టే లోపాయకారి ఒప్పందం పంటి నాడిని ఒడిసిపట్టడెవడు ( ఇంకా ఉంది ) * * * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rYYgSM

Posted by Katta

5, మే 2014, సోమవారం

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట- 9 ____________________ఆర్క్యూబ్ అది పీడనకు పాడెలు గట్టిన యౌవన పర్వం ఆంబోతులకు ముకుదాల్లేసిన సాహసకాండ ఒంటిగ మునిగిన మోటారును గడ్డకు గుంజి కరెంటు పెట్టె ఉడుకుడుకు స్కందం కాలం పంటిమీదే జారిపోయే నవ నవోన్మేష సూక్తం అవి ఏ గుగ్గిల్లైన వాతాపి జీర్ణమే ఆ పంటిని తలచుకుంటే సీసాను బిగపట్టుకున్న మూత తాడు విడిచిన బొంగరమైద్ది పట పట పండ్లు కొరికితే ఉక్కే పిడికిలైద్ది తెల్లగుడ్డు నెత్తుటి చిత్తడైద్ది ఎక్కడికక్కడ నరందేలి పెయ్యి ఫిరైంగైద్ది మోరా గీరా అంతా ఇత్తడిత్తడైద్ది పొద్దు పుత్తడైద్ది ఊరంతా వీడుసరె అన్నారా అది పల్లతో కొట్టిన ఫస్ట్ ఇంప్రెషనే అంతెందుకు పగడం నవ్వుకు యుద్దమే చిచ్చు బుడ్డైద్ది పాలిపగ కాకరపుల్లైద్ది నోట్లే పండ్లున్నట్టు అన్నదమ్ములంతా పక్కపక్కనే ఉంటే రోజూ దసరనే మన తాతల పంటి చక్రం చూడు ! బొక్క కంకుతనే ఉంటది ఆ మీసాన్ని చూడు పిల్లనిస్తే ఇంకా చేసుకుందామనే అంటది పటుత్వం పరాచికం నాలుగు పాదాల నడుస్తుంటది నిజం! ముప్పొద్ద్దులా 'బొల్క బొల్క ' అట్టిగ పుక్కలిస్తనే చుచ్చూ పుచ్చూ చెంగోబిల్ల నిమ్మ తొక్కతో రుద్దుకుంటే ప్రియురాలికి పండ్లే చెక్కర బిల్ల పండ్లు అయస్కాంతం ! దుక్కలా ఎద్ద్దులా రంకెవేసే పన్ను ఏనుగుకున్న పన్ను అది ఖడ్గ మౄగం కొమ్ము వేనోళ్ళ పొగడ్తలు పాశ్చాత్యానికి కన్నుకుట్టింది నిమ్మలాన్ని ఆగంజేసి నిలబడి తింటేనే నాగరికతని ఊదరగొట్టింది ఇగేంది ? పొట్టల పేంటకు 'సై' అన్నంక ఇంటివంట 'సై'ఉంటదా? సాయమాను కూలింది ( ఇంకాఉంది )

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iTHqzf

Posted by Katta

4, మే 2014, ఆదివారం

Arcube Kavi కవిత

కుళ్ళినతోట-8 _______________ఆర్క్యూబ్ చూసారా పైనో రెండు కిందో రెండో పసికందు నవ్వితే రెండు కండ్లూ చాలై ఇంటిల్లి పాది ఆ పంటి పారాయణంలనే మునిగిపోతది ఆపాల పల్ల కథలే ఒకిరవై ఆ పల్లకు మెత్తడి తడిగుడ్డే పాలుదాగాక ప్రదక్షిణ చేసే మొదటి భక్తుడు అమ్మమ్మే అయ్యగారు ఆమెకు దంత శాస్త్రం కొట్టిన పిండి మెత్తగ నమిలితే యాప్పుల్ల కానుగ బర్రెంక ఉత్తరేణి అప్పుడంతా బెజ్జమహాదేవులే రావి వాయిలి వనం వనమంంతా పల్లగిరి ఖిల్లె అట్టి తోడ్కే టంగ్ క్లీనర్ ఏ సందులున్నా పుల్ల పసరే పైత్యానికి పాతలగరిగె అప్పుడిల్లే పౌల్ట్రీపాం గుడ్లమీద పల్ల సీకాట పచ్చి పెసర మీద కప్ప దుంకులు పండిన మామిడి పిక్కల మీద పల్లదే పెత్తనం కోతుల్లెక్క కాల్చిన కంకులను కంకుడే కంకుడు గొట్టు ముంజల్తో కుస్తీ పట్టుడు నిత్తే జామచెట్లకు చిలక్కొట్టుడు పందిపొట్టలెక్క జేబునిండా బఠానీలు పర్ర పర్ర కట్టర కట్టర బుక్కుడే బుక్కుడు సో'సంత్రా'లను చెరి సగం పంచుకున్న దావతి 'ఎప్పుడు చల్లరుద్దా' అని చాపలకూర మీద ఆపతి ఎండ్రికిచ్చను కాల్చుకతిన్న చెరువు కట్ట పాచి పట్టని కాకెంగిలి దోస్తాన పన్ను చెరకు గడల నెక్కి ఊరేగిన కాలం దినాం పంటి పరుబ్బండల మీద లేసే ముత్యాల కల్లం తొర్రి పండ్ల తొండ మా ఊరి బండ అప్పుడు ఊషిపోయిన పన్ను జాలారికాడ పెడితే ... ఇప్పుడు పెట్టి చూడు చిన్న తనాల జ్ఞాపకాలు నమ్మకంగా మొలకెత్తుతై అవి పోగా మరో ముప్పైరెండు చిన్న చిగురు తిన్నెలమీద కుదురుకున్న స్పార్టా సైనికుల దండు పెయ్యిని మొత్తం మాంచి కాకామీదుంచే పెరెడ్ నోరే ఒక గ్రౌండ్ ( ఇంకాఉంది )

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ogjYS6

Posted by Katta