విశ్వమాలికలు. . 1.తారలపై అలిగి... మూతి ముడిచిన చంద్రుడు.... నెలవంక.! 2.నీఊహల చిగుళ్ళు ఎన్ని తిన్నదో నామనసు కోయిల.! తనువుకు వసంత శోభతెస్తూ.. తనదైనశైలిలో ఆలపిస్తోంది ప్రేమగీతం.!! 3.దాగుడుమూతలు ఆడుతున్న సూర్యచంద్రులు.! ఒకరికొకరు యుగాలుగా పట్టుబడకుండా.!! 4.వెతుకుతూనే ఉంటాయి నా కళ్ళు.! ఇలలోనో, కలలోనో నువ్వు పట్టుబడేవరకు.!! 5.మగజాతికిది తీరని అన్యాయమే.! కవులు, కవయిత్రులు అందరూ...మగువల గురించే వర్ణిస్తుంటే.!! 6.భారంగా నా కనులు.! నిద్ర కరువై కాదు సుమా..... నీతలపులు కరువయ్యే..!! 7.పచ్చనోటుపై బాపూజీ బోసినవ్వుల తెల్ల'ధనం'.! నల్లధనంగా మిగిలిపోతున్నానని తెలియదు పాపం.!! 8.శాస్త్రవిజ్ఞానం ఇంకా అభివృద్ధి చెందనట్టే.! వస్తుభారాలను కొలవగలిగే సాధనాలే కాదు గుండెభారం కొలవగలిగే సాధనాలు రానంతవరకు.! 9.దైవత్వం నాకు బాగా ఎరుకే.! ప్రతిరోజు నాతల్లికళ్ళలో నాపై చూపే ప్రేమానురాగాల దివ్యత్వపు వెలుగును దర్శిస్తున్నాగా.!! 10.తన గుండెచప్పుడు నేనేనంట.! నేను పరిచయమయ్యేవరకు తను ఎలా బ్రతికిందో మరి.!! 11.నీశీథి మునిగిన శిథిలాలయాలు....కన్నులు.! పట్టుకు వేలాడే గబ్బిలాలు ...కలలు.!! 12.ఐకమత్యం.! కళ్ళు రెండు....చూపు ఒకటే.!! 13.సూర్యచంద్రులు.! ఏకకాలంలో ప్రపంచవీక్షణం గావించే సందర్శకులు.!! 14.పాకుడురాళ్ళు... కళ్ళు..! కన్నీళ్ళు నిలబడవు.!! 15.ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలట.! నాగుండెలో దిగబడిన నీజ్ఞాపకాలను తీసేయాలంటే ఏజ్ఞాపకాలు కావాలో.!! 16.మాసానికోసారిఉప్పొంగే వెన్నెల సంద్రం.! భూమి తీరాన్ని వెలుగులతో తడుపుతూ.!! 17.మనసైనోడికి దగ్గరవ్వాలంటే ఆకర్షించాలన్నారటెవరో.! అయస్కాంతంతో తయారయ్యింది తింగరబుచ్చి.! 18.జీవనది కాలం.! ప్రవహిస్తూనేఉంటుంది సమయం.!! 19.కళ్ళు మాయాదర్పణాలు.! తనను తప్ప అందరిని చూపెడతాయి.! 20.చందమామకో దిష్టిచుక్క.! ఎన్ని తారకల కళ్ళు పడ్డాయో.!! -విశ్వనాథ్ 03APR14
by Viswanath Goud
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ouOtHR
Posted by Katta
by Viswanath Goud
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ouOtHR
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి