పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sriramoju Haragopal కవిత

లో లోపల... 1. నీవెక్కడున్నా నిన్నెలా వినగలుగుతున్నాను నీవెక్కడున్నా నిన్నెలా కనగలుగుతున్నాను నిన్ను చుట్టివున్న గాలిలా నీ స్పర్శనీ, నీ వాసనల్నీ, నీ కోమలతను నిన్ను చూపించే వెలుగులా నీ సౌందర్యాన్నీ, నీ సహచర్యాన్నీ నేనెలా అనుభూతించగలుగుతున్నాను నేనెలా అనుభవించగలుగుతున్నాను నేను నీకన్నా వేరు కానని నేను నాకన్నా నీకే చేరువని ఎట్లా తెలిసిపోతున్నది ఎట్లా తడి నిండుతున్నది దూరాలు, నిశ్శబ్దాలు, కోపాలు, తాపాలు, అహాలు, అపోహలు, స్వార్థాలు, మోక్షాలు తెలియని ఎడమెరుగని ఇష్ట మోహం చావెరుగని సృష్టి దాహం కొండవాగు చలువల్లో, గోదారి అలల్లో, అడివిపూల కొండల్లో పసివాడిలా నన్ను పాలించే నిన్ను వొదలని నా ప్రేమే కదా నిజమిదే కదమ్మీ 2. అన్ని రుతువులు నువ్వే అన్ని స్వప్నాలు నువ్వే అన్ని సాధనలు నువ్వే నదినై నీలోకి సాగే నా యాత్ర శ్వాసనై నీలో స్పందించే నా కవిత్వం అన్నింట్లో నువ్వేరా ఇంక నేనెట్లా వేరురా

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1op3xXb

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి