పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Prasad PV లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Prasad PV లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జూన్ 2014, గురువారం

Prasad PV కవిత

|| అమ్మా.. ఇక ఉంటాను || నీ యెద చప్పుడు నాకు వినిపిస్తూనే ఉంది.. నీట్లో బురదమట్టి కింద బండరాయిల్లో ఇరుక్కున్న శరీరం నిన్ను చేరాలని చేసే ప్రయత్నంలో ఓడిపోతూనే ఉంది. ‘బియాస్’ జలాలు నీ కన్నీటితోనే ప్రవాహమై పొంగుతున్నపుడు నన్ను కనుక్కోలేక నిస్సహాయులై వెతుకుతున్నవాళ్ళు, ఒడ్డున నిల్చొని నా కోసం తపిస్తూ..విలపిస్తూ ఒకర్నొకరు ఓదార్చుకుంటున్న నువ్వూ ,నాన్నా నాక్కనపడుతూనే ఉన్నారు.. ఈ రాకాసి రాళ్ళను, బురద మట్టిని విదిలించుకొని మీ దగ్గరకు పరుగెత్తుకురావాలనుందమ్మా.. ఇప్పటికెన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు గడిచిపోయాయో.. నీళ్ళలో నాకు చలేస్తుందమ్మా! ఎప్పటిలాగే ఓ దుప్పటి కప్పవూ నా స్నేహితుల అమ్మానాన్నలు వెళ్ళిపోయారటగా ఇక మీరూ వెళ్ళిపోతారు మిమ్మల్ని కలవలేకపోయాను... క్షమించండి నన్ను మీదగ్గరకు చేర్చని ఆ దేవున్ని నిందిస్తూ ఈ బురద మట్టినే కప్పుకొని జలసమాదవుతాను...

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rbg3Y4

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Prasad PV కవిత

ఈ రోజు మధ్యాహ్నం 12.30 గం:లకు 10 టీవీ లో మన కాశీరాజు "అక్షరం" ప్రోగ్రాం ప్రసారమవుతుంది. Please watch. .

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKDNWJ

Posted by Katta

Prasad PV కవిత

|| నాన్న || అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే వద్దని మారాం చేసినపుడు నీ మమకారాన్ని కలిపి ఒక్కో ముద్దా నా నోటికందిస్తే అప్పటికే నిండిపోయిన నా కడుపు ఎలా వెలితవుతుందో తెలీదు.. రుచి తెలియని నీ మమకారం ఆహారమవుతుంటే అన్నం ముద్ద తింటూ నిన్ను చూసినపుడు ఆకలిని తీర్చే ఆకాశం కనిపించింది చదువు కోసం నీకు దూరంగా ఇల్లెల్లిపోతున్నపుడు ఆడపిల్లను సాగనంపుతున్నట్టు నన్ను తడిమి తడిమి ముద్దెట్టుకుంటుంటే నీ గుండె కన్నీటి చెలమల్లో తానమాడుతూ కనిపించింది. బాధలు,బాధ్యతలంటే ఏంటనడిగినపుడు నీ చిరునవ్వే సమాధానమైంది మాకు. వాటి అర్థాన్ని కూడా మాకు తెలీనివ్వకుండా ఇంటినే కాదు అందర్నీ ఒంటి స్థంభంలా మోస్తూ భారాన్ని భరించే భూమికి నాన్నవయ్యావు

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKysyE

Posted by Katta

12, మే 2014, సోమవారం

Prasad PV కవిత

|| నాన్నతనం || నా చిట్టితల్లి పాదాలు నా గుండెలపై అడుగులు వేస్తున్నప్పుడు నాన్న నా హ్రుదయాన్ని తడిమిన జ్ఞాపకం నా మనసును తాకింది.. తను అల్లరి చేస్తూ నా బుగ్గపైన ముద్దెట్టినపుడు నాన్న ఆత్మీయ స్పర్శ నా చెక్కిలిని నిమిరింది.. నిద్దరొచ్చి నన్ను హత్తుకుని పడుకుంటే నాన్న ఎదపై సేద తీరిన నా బాల్యం గుర్తొచ్చింది.. తడబడుతున్న చిట్టితల్లి అడుగులకు ఆసరాగా చేయి పట్టుకుని నడిపిస్తుంటే నాన్న చేతివేళ్ళ కమ్మదనం కనిపించింది.. నాన్న తనం నేనుతనం ఒక్కటేనేమో ! || ప్రసాద్ పి.వి.|| 12-05-2014

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jk7C6j

Posted by Katta

10, మే 2014, శనివారం

Prasad PV కవిత

అమ్మా నాన్నా తప్ప ఇంకేమీ తెలీదాడికి... పిచ్చోడేమో, ఎప్పుడూ ఆళ్ళ గురించే తప్ప ఇంకో లోకం తెలీదు... ఎర్రెదవ..అనుకున్నా. ఇవ్వాళ నేనూ, ఆడూ కలిసున్నపుడు ఆడికి ఆళ్ళ నాన్న నుంచి పోనొచ్చింది ఈడేదో 'పీకర్' పెట్టి ఇనిపిచ్చినపుడు ఇన్న... ఆళ్ళ నాన్న, అమ్మ, అక్క.. ఎవురు మాటాడినా అన్నం తిన్నవారా .. అని కడుపు నిమిరినోళ్ళే... ఆళ్ళు ఏం మాటాడినా ఈడి గురించే... అసలేముందిరా నీ దగ్గరా.... || ప్రసాద్ పివి ||

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RzMzHf

Posted by Katta

9, మే 2014, శుక్రవారం

Prasad PV కవిత

ప్రసాద్ పి.వి || ఆనవాలు || అమ్మొచ్చి వెళ్లింది పావురాయి పక్షి రూపం తొడుక్కొని. నా చేతిపై వాలి, నా బుజంపైనెక్కి., నుదుటిపైన ఓ ముద్దెట్టి వెళ్ళిపోయింది. నేను వేస్తున్న గింజల్ని అన్ని పావురాళ్ళూ అలవాటుగా తింటుంటే, అమ్మేమో నన్నే గమనిస్తూ నేను తిన్నానో లేనో అని నా కడుపంతా నిమిరింది. పక్షి భాష నాకు తెలుసన్నట్టుగా నా చెవి దగ్గర ఏదో గుసగుసలాడితే ఎలా వున్నావురా అని అడిగినట్లనిపించింది .

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l7cYWT

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Prasad PV కవిత

**//నాన్న జ్ఞాపకం//** వీళ్ళంతా నువ్వు లేవంటారేం నాన్నా.. నా ప్రతి అడుక్కీ దారి నువ్వే అవుతున్నావుగా, ఒకరినొకరు చూసుకోకుండా మనమెప్పుడైనా నిద్ర లేస్తున్నామా..! నీ చిరునవ్వుతో నిద్ర లేచిన ఉదయాన్ని రోజంతా శ్వాసిస్తూ రాత్రి నీ ఒడికి వస్తే నీ జ్ఞాపకాలతో తెల్లవార్లూ నన్ను లాలిస్తున్నావుగా…!! మరి వీళ్ళంతా నువ్వు లేవంటారేంటి..? కాలేజీకెళ్ళేప్పుడు పిల్లలు ‘తాతయ్యా.. బై’ అని ఆఫీసుకెళ్లేప్పుడు నేను ‘బాపూ వస్తా’ అనీ బయటికే చెప్తే మా ఎదురుగానే కూచుని నువ్వు మాకు ‘టాటా’ చెప్పేది వింతగా చూసేవాళ్ళకు కనపడ్డం లేదా..! రోజూ కలలోకొచ్చి నాతో నువ్వు కబుర్లాడుతుంటే అమ్మకు కోపమొచ్చి నాతో మాట్లాడ్డం మానేసింది.. నువ్వు అమ్మకు కలలో కనపడ్డం లేదటగా మరి..! నువ్వెప్పుడూ నన్ను నీ ఒళ్ళో బంధించి నీ ప్రేమను చూపకపోయినా జీవితంలోని ప్రేమంతా నీ కళ్లల్లోనే కనిపించేదిగా.. ఒక్కసారి అమ్మకు కూడా కనపడు నాన్నా..! సుతిమెత్తని నీ చేతివేళ్ల స్పర్శ గుర్తొస్తే కాలం ఎందుకు అక్కడే ఆగిపోలేదనిపిస్తోంది.. అప్పుడూ ఇప్పుడూ అంతే, ఏముంటుంది నాన్నా మన మధ్య..! నువ్వు నా గురించి, నేను నీ గురించి ఆలోచించడం తప్ప..!! నాకుతెలిసి నీ కళ్లల్లో నీళ్లెప్పుడైనా చూసానా.. నువ్వు నీ శ్వాసతో సెలవు తీసుకుంటున్నపుడు నావైపు చేయి చాపి రాల్చిన కన్నీటి బిందువు.. కాలం పేజీపై అలాగే గడ్డకట్టుకుపోయింది.. అప్పట్నుంచీ మనిద్దరం కలుసుకోనిదెప్పుడంటావ్....? రోజూ రాత్రి నా కనురెప్పల వెనక దాగి దోబూచులాడుతూనే ఉన్నావుగా,, మరి ఇంకా నువ్వు లేవంటారేంటి..? నా చిన్నప్పుడు నీ గుండెలపై తచ్చాడి ముద్దాడిన జ్ఞాపకం నాకు లేదు గానీ నాన్నా.. నాదొక్క కోరిక తీరుస్తావా.. నిన్ను నా ఒళ్ళోకి తీసుకొని ఒక్కసారి ముద్దాడాలని ఉంది నాన్నా!! (మా నాన్న స్మృతిలో...) -ప్రసాద్ పి.వి.

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i3T0I9

Posted by Katta

25, మార్చి 2014, మంగళవారం

Prasad PV కవిత

ప్రియమైన ఫేస్ బుక్ మిత్రులకు నా మనవి.. నా పేరుతో కొందరు మిత్రులకు కొన్ని ఇబ్బందికరమైన గ్రూప్ లలో జాయిన్ అవ్వాలని కోరుతూ నేను Invite చేసినట్లు Notifications / Messages వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం నేను కేవలం 5 గ్రూప్ లలో కొనసాగుతున్నాను. అవి " 1. kavi sangamam*కవి సంగమం*(Poetry ), 2. Special group, 3. చీకటి పిలుస్తోంది ... అమావాస్య రాత్రులు, 4. ప్రియతమా అందుకో నా గీతం..నీకోసమే" 5. పూల సోయగాలు. ఇందులో "చీకటి పిలుస్తోంది ... అమావాస్య రాత్రులు" అనే గ్రూప్ లో నేను 9 మంది Admins లో నేనొక Admin మాత్రమే. ఎవరినైనా నేను Invite చేసిందీ అంటే కేవలం "చీకటి పిలుస్తోంది ... అమావాస్య రాత్రులు" Group లో మాత్రమే. అయితే నా మిత్రులు కొందరికి ఈరోజు కొన్ని అసభ్యకరమైన గ్రూప్ లో నేను Invite చేసినట్టుగా మెస్సేజెస్ వచ్చినట్లు నా ద్రుష్టికి వచ్చింది. FB మిత్రులకు నేను తెలియజేసేదేమిటంటే అలాంటి Messages తో నాకెలాంటి సంబంధం లేదు. అలాగే ఇలాంటి Invitataion messages ఎలా వచ్చాయో నాకూ తెలియడం లేదు. FB మిత్రులు దయచేసి నేనేం చెయ్యాలో నాకు తగిన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నా ప్రమేయం లేకుండా ఇలాంటి Messages తో ఇబ్బంది పడుతున్న నా మిత్రులకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలను కోరుతున్నాను. దయచేసి ఈ సమస్యను నేను ఎలా అదిగమించాలో కూడా నా మిత్రులైన మీరు నాకు తెలియజేయాలని కోరుతున్నాను. కృతజ్ఞతలతో...... మీ మిత్రుడు ప్రసాద్ పి.వి.

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmYAoX

Posted by Katta