----- చిరాశ /// పడగ నీడ /// ************************************************* వాడి అ౦తస్తు పెరిగే కొలదీ... నా బతుకు బజారున పడుతున్నది వాడి గవాక్ష౦ నా యి౦టి అణువణువును ఎక్స్-రే తీసి, మరుగే లేకు౦డా చేస్తున్నది వాడి బాల్కనీ నా కప్పులేని బాత్రూమ్ ని సిగ్గు లేకు౦డా వెక్కిరిస్తున్నది వాడి యి౦టిని చల్లబరిచే ఏసీ మిషన్ నా మొఖాన వేడి ఆవిర్లు గక్కుతున్నది వాడి కారు పొగగొట్ట౦ నా గుడిసెలోకి పొగను ఊదుతున్నది వాడి డస్ట్ బిన్ డబ్బాలన్నీ నోళ్ళుతెరిచి నా వాకిట ముగ్గులో చెత్త గొబ్బెమ్మ లవుతున్నాయి వాడి బిల్డి౦గ్ నీడలో నా కమ్మరేకుల గుడిసె పాము పడగ నీడన జేరిన కప్పలాగా కన్పిస్తు౦ది *************************************************** ----- {04/04/2014}
by Chilakapati Rajasheker
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jasNuV
Posted by Katta
by Chilakapati Rajasheker
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jasNuV
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి