మురిపిస్తావా... చందమామనే చుస్తుంటా.. చెదిరిన చిరునవ్వులను చిలుకరిస్తుందేమోనని చుక్కలనే చుస్తుంటా.. మిణుకు మిణుకున తారల్లో మెరుస్తున్నావేమోనని మనసంతా నీకోసమే .... మరో ప్రపంచంలో కనిపిస్తావేమోనని తినిపించా గోరు ముద్దలు చందమామని చూపిస్తూ.... కల్పించిన కధలు చెప్పి జోలపాడి మైమరిచా... అమ్మగా లాలించి గుండెలపై నిదురపుచ్చిన రోజులే జ్ఞాపకం మధురస్మ్రుతులు గుర్తొస్తే మరల నీకోసం నేనలా.. తపించి తలపించాలని వొస్తావా మళ్ళీ.. మురిపిస్తావా... వాణి కొరటమద్ది 20/3/2014
by Vani Koratamaddi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g4tiqr
Posted by Katta
by Vani Koratamaddi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g4tiqr
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి