20/3/2014 ఎందుకో మరి కవిత్వమై ఒక్కోసారి .... ఎందుకో తెలీదు తొలి కిరణపు ముందటి గాలినై నిద్ర మబ్బులో ఉన్న మొగ్గల్ని లేపుతుంటాను సంజె వెలుగుతో చేరి పక్షుల ముక్కులపై కువ కువలాడుతుంటాను నల్లమబ్బు నుండి జారే తొలి చినుకులా తుళ్లి అలలపై చేరి ఆటలాడుతుంటాను అవమానిత ఎద గాయపు మంటనై ఆగ్రహపు సెగలు కక్కుతుంటాను అబలల ఆక్రందనలు మోసుకు తిరిగే కన్నీటి చుక్కనై నేలకు రాలుతుంటాను దైన్యాన్ని కప్పుకొని నాలోకే ఒదిగి మౌన తపస్వినిగా మారుతుంటాను తలపులను విదిల్చి కలపు రెక్కలు కదిల్చి అక్షరాలను వెదజల్లుతుంటాను అవధుల్లేని ఆకాశాన్ని తాకి నా హద్దులు మరిచి విశ్వానికి ఊపిరులు ఊదుతుంటాను నా ఉనికికి ప్రపంచానికి మధ్య రేఖ ను కానక నేనే అది అదే నేను అయిన విశ్వాత్మగా నిలిచిపోతుంటాను .... కవిత్వమై కదిలిపోతుంటాను .... ఒక్కోసారి .... ఎందుకో తెలీదు .
by Sasi Thanneeru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j9OgCZ
Posted by Katta
by Sasi Thanneeru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j9OgCZ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి