గజల్ అన్న పదానికి ’’ప్రేయసితో సంభాషణ‘‘ అనే అర్ధమే ప్రచలితమై ఉన్నది అని రాశారు గజల్ సౌందర్య దర్శనంలో పెన్నా శివరామకృష్ణగారు. Traditionally Gazal deals with one subject...love, unattainable love. The love may be divine (Ishq E Haqiqi) or earthly (Ishq E Majazi). సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ఈ స్వభావానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. మొదటి విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. ఈ చీకటి రాత్రంతా సౌందర్యము లాగున్నది నీలికురుల సుతిమెత్తని లావణ్యము లాగున్నది ఈ దారిన ధూళికణాలన్ని మెరిసె తారకలే పాదాలను ముద్దాడిన పరవశము లాగున్నది చిరుగాలిలొ సంతోషం వీస్తున్నది హుషారుగా విన్నదేమొ నీ నవ్వును తాదాత్మ్యము లాగున్నది సూర్యులిద్దరుదయిస్తే చూశారా ఎప్పుడైన కనురెప్పలు తెరచినపుడు చూడలేదు లాగున్నది అమావాస్య రాత్రి కూడా వెన్నెల్లా ఈ వెలుగులు జాబిలిలా నీ నుదుటిదె ప్రకాశమూ లాగున్నది
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d0HQrv
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d0HQrv
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి