పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మార్చి 2014, గురువారం

Sai Padma కవిత

సాయి పద్మ //రైనా బీతి జాయే ...!! ~~~~~~~~~~~~~~~~~~ ఎందుకొస్తారు ఎవరైనా .. ఆకాంక్షలని అదిమిపెట్టి, జీవితానికి స్తేపిల్ గా గడిపేస్తున్న, వ్యగ్ర మోహ ప్రపంచంలోకి , అనుభూతులని తాకట్టు పెట్టి , ఎంత సంతోషంగా ఉన్నామో అని , దుఃఖంగా మురుసుకునే ముసిరిన మనసుల్లోకి .. ఎందుకు రావాలి ఎవరైనా .. నీ జ్ఞాపకాల నీడల్లో సేదదీరుతూ.. అనుభూతుల్లో నాని , నాని చిరునవ్వుగా కన్నా మేలాంకలిక్ గా మారిన నీ దగ్గుత్తికని నువ్వంత ప్రేమిస్తున్నప్పుడు .. చోటులేని తనంతో ఉక్కిరిబిక్కిరి అవరా .. జ్ఞాపకాలు అవమేమో అని బెంగేట్టుకుంటున్న నీ ప్రస్తుత శకలాలు ..? ఎవరో ఆపే ఉంటారు.. కన్నీరు తోనో, నిస్సహాయత తోనో, కరుణ తోనో... ఇవేవీ కాకుండా ..విడిచిన బట్టల్లా మరచిపోయే మొహంతోనో.. స్వైరత్వం మరణం కన్నా మహాపాపమనే సాంప్రదాయవాదం తోనో.. విషయం ఏదన్నా .. ఆగటం ఖాయం.. నువ్వు రావన్న వార్త మాత్రమే నా వచనానికి వర్తమానం అన్నది కూడా నిశ్చయం .. జ్ఞాపకం కాలేని తెలివైన ప్రియతమా .. నేనిప్పుడు జ్ఞాపకాలు లేని మనిషిని.. విరహాన్ని విరజాజి మల్లే అనుభవించే అస్కలిత రాధను .. నీ ఆభద్రతని మోసే కుబ్జని కానందుకు.. మాసిన జ్ఞాపకాల మంగళ స్నానం చేసినంత సంతోషం .. నీ భవిష్యత్ భయాల అష్టావక్రాలు మోయనందుకు నా మనసు ఉల్లాస విశుద్ధం పంజరమే ఒక ప్రపంచం... చిన్ని పిట్టా.. ఎగరటమే స్వేచ్ఛ కాదు ..!! --సాయి పద్మ

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iH4nJU

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి