వీనస్… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి by NS Murty ఓ వీనస్! పగలు గతించింది మెత్తగా మౌనంగా రాలుతోంది మంచు ఇప్పుడు ప్రతిపువ్వు మీదా కన్నీటిబొట్టే స్వర్గం వేరెక్కడా లేదు, ఉంది నీ చెంతనే! ఓ వీనస్! అందమైన సంధ్య మమ్మల్ని నెమ్మదిగా, తెలియకుండా కమ్ముకుంటోంది దివా రాత్రాల కలయిక వేళ పసిపాప ఊపిరితీస్తున్నట్టు ఉంది. ఓ వీనస్! మంచుకురిసిన నేలమీద రాలిపడిన పువ్వు నిద్రిస్తోంది మంచు సన్నని జల్లుగా కురుస్తుంటే చుట్టూ ప్రకృతి శ్వాసిస్తున్నట్టు ఉంది. ఓ వీనస్! వినీలాకాశంనుండి మిణుకుమంటున్న నీ కాంతికిరణం అలసిన బాటసారికి తోవచూపిస్తూ నేలని మన్నించేలా చేస్తుంది. . జాన్ క్లేర్ 13 జులై 1793 - 20 మే 1864 ఇంగ్లీషు కవి. . John Clare, English Poet . Hesperus Hesperus the day is gone Soft falls the silent dew A tear is now on many a flower And heaven lives in you Hesperus the evening mild Falls round us soft and sweet 'Tis like the breathings of a child When day and evening meet Hesperus the closing flower Sleeps on the dewy ground While dews fall in a silent shower And heaven breathes around Hesperus thy twinkling ray Beams in the blue of heaven And tells the traveller on his way That earth shall be forgiven John Clare 13 July 1793 – 20 May 1864 English Poet [Notes: Hesperus: evening star. Hesperus or Vesper (a planet, usually Venus) seen at sunset in the western sky] NS Murty | March 20, 2014 at 12:30 am | Tags: 19th Century, English, John Clare | Categories: అనువాదాలు, కవితలు | URL: http://wp.me/p12YrL-3hb
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://wp.me/p12YrL-3hb
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://wp.me/p12YrL-3hb
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి