అనిల్ డ్యాని //రెండు సిద్ధాంతాలు// మబ్బు పట్టిన నింగి క్రింద రాలుతున్న చినుకులకి చిత్తడౌతున్న నేలకు మధ్య పక్క పక్కనే రెండు శరీరాలు కాదు కాదు ఒకరినొకరు ఎదుర్కున్న రెండు సిద్దాంతాలు ఎందుకంత ఆత్రుత కామ్రేడ్ కలిసేవెళదాం కాలానికి ఎదురెళ్ళిన మనం మరణానికి వెళ్ళలేమా? నీ వివేకం లేనితనాన్ని వీర మరణంతో పోల్చుకోకు నేను కామ్రేడ్ ను కాను,నీ సహచరుడ్ని అసలే కాదు నీ విప్లవాన్ని ఎదుర్కొని, ఎదురురొమ్ములో తూటా దింపగల వీర సైనికుడిని ఐనా ఎరుపు కొడవలికి ఇనుపసుత్తికి,తుపాకీ గొట్టానికి ఇప్పుడు మారకపు విలువల్లేవ్ చేతగాని తనంతో పాత పాటెందుకు పాడతావ్ పచ్చని ఆకులమధ్యన మా వెచ్చని నెత్తుటితో మీ నోరు పుక్కిలించడం వీరమా?విడ్డురమా? మా శవాలమీద చిల్లరకోసం, కళ్ళకు గంతలు చేతులు వెనక్కి కట్టి,మా ఒట్టి మొలపై పేలిన నీచచ్చు తూటా చప్పుడు ఇంకా మా చెవుల్లోనే ఉంది కౌంటర్ ఇచ్చే చేవలేక ఎంకౌంటర్ చేస్తావా జవానూ? నిజమా? ఐతే కోర్టు మెట్లెక్కని కోవర్టు ఖాతాలెన్ని? కళ్ళముందే కూలిన కల్వర్టులెన్ని? ఆబగా తింటున్న ఆఖరి అన్నం ముద్దలో నువ్వు కలిపిన విషమెంతా? తప్పొప్పుల తక్కెడేస్తే నీ తప్పులెన్ని , తప్పుకు పొవడాలెన్ని? ఐదారు లక్షల రివార్డ్ కోసం ఆయుధాన్ని అమ్ముకున్న నీ బేలతనమెంత నిబద్దతకి, జీతానికి సరితూకం చేయకు నేను పస్తు పడుకున్న రొజుల్లో నీకు మస్తు పైసలొస్తయి అయినా నీ నెలజీతం నాకొచ్చే ఒక్క లాల్సలాంతోసమానం చచ్చుబడుతున్న శరీరాలు చివరిమాటలకై శక్తి పోగేసుకుంటున్నాయి రాలుతున్న చినుకుల సాక్షిగా నెత్తురంటిన ఈ తడిసిన ఆకులు నా నెత్తురు పారిన సెలయేరు సాక్షిగా నా దేశంకోసంనేనెప్పుడైనా మరణిస్తాను నేనుసైతం నా దేశంకోసం నా ఆశయం కోసం అమరుడనౌతాను కాని నేను మళ్ళీ పుడతాను ఊపిరున్న చోటనే విప్లవముంటుంది ********************************************* ఓ నాల్రోజుల తర్వాత ఓ సిద్దాంతం గంధపు చెక్కల మధ్య వెచ్చగా తగలబడుతుంటే మరో సిద్దాంతం ఎర్రజెండా కప్పుకుని లాల్సలాం అందుకుంటుంది సిద్దాంతాలు ఓడిపోవు..........వాదించుకుంటాయ్అంతే మళ్ళీ కొన్నాళ్ళకి ఓ అడవిలో రెండు సిద్దాంతాలు ఎదురై పలకరించుకుంటున్నాయి... మళ్ళీ అడవంతా ఎర్రబడింది తేది : 20-03-2014
by Anil Dani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iH4qFH
Posted by Katta
by Anil Dani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iH4qFH
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి