పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మార్చి 2014, గురువారం

Sriramoju Haragopal కవిత

తడిరాత మాటలకు భాష కొదువే ఎంత మాట్లాడినా గుండె గొంతుకలో కొట్లాడే మాటలల్లాడుతూనే వుంటయి భాషే అక్కరలేని ముక్తభాషణ కావాలి అపుడీ పలకరింతల కొరకు పలవరింతలుండవు చూపులతోనో, చేతులతోనో మాటలతోనో, ఇంత అన్నంతో కడుపునింపో, దుఃఖాన్ని దుఃఖంతో తుడిచో, బాధల బాటల్లో వెంట నడిచో భుజం మీద చేయేసో, గదువపట్టి బుదగరించో, ఒళ్ళో చేర్చి ఓదార్చో అది ఆత్మీయతాస్పర్శ-- అయితే చాలు కలలనౌకాభంగాలుండవు కలవరింతలుండవు

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j8l2bY

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి