EMBEZZLE - EMBITTER అమ్మకాలూ కొనుగోళ్ళ అభివృద్ధి సంతలో కళ్ళుబయర్లుకమ్మి దేవులాడుకొంటూ కేస్ట్రేట్ చేసిన దిశమొలతో కంపెనీకెదురుగా నిలుచొని కాస్త వీర్యవృద్ధి చెయ్యమని అర్ధిస్తూ ఏడుస్తుంటాను . నా పుంసత్వం దొంగిలించిన మత్తులో మైమరచి నవ్వుతుంది వేడుకగా . శవాలు కాలుతున్న పెంపుడువనం ఎదురుగా బాసీపట్టువేసి నా ఒక్కొక్క అంగాన్నీ కరకరా నములుతుంటాను . అది జగన్మోహిని రూపెత్తి నెరజాణలా నవ్వుతూ అమృతభాండం బద్దలుకొడుతుంది వంచిన నా శిరస్సుమీద . నేపధ్యంలోంచి ఓ అసంబద్ధ గీతం . 27/10/2007.
by Krishna Prasad
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hHK2S6
Posted by Katta
by Krishna Prasad
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hHK2S6
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి